-
RCB- Virushka: అనుష్క శర్మ సెలబ్రేషన్స్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024 ఆరంభంలో వరుస ఓటములతో చతికిల పడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో వరుసగా ఐదో గెలుపు నమోదు చేసి.. ప్లే ఆఫ్స్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది.ఇక ఈ మ్యాచ్‌లో47 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకవచ్చింది. కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. ఢిల్లీ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లతో ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇందులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ హైలైట్‌గా నిలిచారు. ఆర్సీబీ గెలుపు ఖరారు కాగానే.. ఆమె పట్టరాని ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు.వావ్.. థాంక్ గాడ్!‘వావ్’ అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్లుగా చేతులు జోడించి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వైరల్‌గా మారాయి. ఇందుకు కోహ్లి కూడా తనదైన శైలిలో మజిల్స్ చూపిస్తూ బదులిచ్చాడు. కాగా ఓ యాడ్ సందర్భంగా అనుష్కను కలిసిన కోహ్లి ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2017లో ఇటలీలో ఆమెను పెళ్లాడాడు.ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించాడు. లండన్‌లో తన ప్రసవం తర్వాత ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన అనుష్క.. ఇలా భర్తను చీర్ చేస్తూ ఆర్సీబీకి మద్దతుగా స్టేడియానికి వస్తున్నారు. ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: ఢిల్లీ.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)👉ఫలితం: 47 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కామెరాన్ గ్రీన్(24 బంతుల్లో 32 నాటౌట్.. ఒక వికెట్ (1/19)). Wrapped up in style ⚡️High fives 🙌 all around as #RCB make it FIVE 🖐️ in a row 🔥A comfortable 4️⃣7️⃣-run win at home 🥳Scorecard ▶️ https://t.co/AFDOfgLefa#TATAIPL | #RCBvDC pic.twitter.com/qhCm0AwUIE— IndianPremierLeague (@IPL) May 12, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Virat Kohli- Akaay: బ్రిటన్ పౌరుడిగా కోహ్లి కుమారుడు?
Virat Kohli And Anushka Sharma Son Akaay: క్రికెట్, సినీ అభిమాన వర్గాల్లో ఇప్పుడంతా ‘అకాయ్’ గురించే చర్చ. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమ ముద్దుల కుమారుడికి అకాయ్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. వామికకు తమ్ముడు పుట్టాడంటూ ఈ సెలబ్రిటీ జంట ప్రకటించగానే బాబు పేరుకు అర్థమేమిటి? చూడటానికి ఎలా ఉంటాడు? లండన్‌లో జన్మించాడు కాబట్టి అతడికి బ్రిటిష్ పౌరసత్వం ఇస్తారా? వంటి అంశాల గురించి ఇటు కింగ్ కోహ్లి అభిమానులు.. అటు అనుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాయ్ అన్న పేరుకు అర్థం టర్కిష్ భాషలో ప్రకాశించే చంద్రుడు అని కొందరు.. హిందీలో అయితే.. ‘భౌతిక శరీరానికి మించి అతీతమైన వ్యక్తి’ అని ఇంకొందరు పేర్కొంటున్నారు. మరోవైపు.. కోహ్లి దంపతులు ఇప్పట్లో అకాయ్ రూపాన్ని చూపించే చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకొందరు కృత్రిమ మేధతో ఫొటోలు సృష్టించి వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. అకాయ్’ బ్రిటిష్ పౌరుడు అవుతాడా? మరి ‘అకాయ్’ బ్రిటిష్ పౌరుడు అవుతాడా? స్పోర్ట్స్ తక్ అందించిన వివరాల ప్రకారం.. కేవలం యునైటైడ్ కింగ్డం ఆస్పత్రిలో జన్మించాడు కాబట్టి జన్మతః అకాయ్‌కు బ్రిటిష్ పౌరసత్వం ఇవ్వరు. తల్లిదండ్రుల్లో ఒక్కరైనా బ్రిటిష్ సిటిజన్ అయి ఉండాలి/ లేదంటే అక్కడ సుదీర్ఘకాలంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటేనే యూకేలో పుట్టిన బిడ్డకు బ్రిటిష్ సిటిజన్‌గా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా.. బ్రిటన్ పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకు యూకే వెలుపల జన్మించిన బిడ్డకు తమ సిటిజన్‌గా గుర్తింపునిస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే, బిడ్డ పుట్టేనాటికి తల్లిదండ్రుల సిటిజన్‌షిప్ స్టేటస్ ఏమిటన్న దానిపైనే ఈ అంశం ఆధారపడి ఉంటుంది. కేవలం అదొక్కటే ఇక అకాయ్ విషయానికొస్తే.. ఈ చిన్నారి లండన్‌లో జన్మించినా అతడి తల్లిదండ్రులు ఇద్దరూ ‘విరుష్క’ భారత పౌరులు అన్న విషయం తెలిసిందే. కాబట్టి అకాయ్ బ్రిటిష్ పౌరసత్వం పొందేందుకు అనర్హుడు. భారత పౌరుడిగానే అతడికి గుర్తింపు ఉంటుంది. అయితే, అకాయ్ పాస్‌పోర్ట్ మాత్రం బ్రిటన్‌లో తయారు చేస్తారు. కాగా 2017లో ఇటలీ వేదికగా పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లి- అనుష్క శర్మలకు తొలుత కుమార్తె వామిక(2021, జనవరి) జన్మించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఈ జంట తమ రెండో సంతానానికి లండన్‌లో జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సంతోష సమయంలో కుటుంబానికే పూర్తి సమయం కేటాయించిన కోహ్లి.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. చదవండి: ఆటలో విఫలం..! ఖరీదైన కారు కొన్న రహానే.. ధర ఎన్ని కోట్లంటే?! -
#Virat Kohli- Akay: కోహ్లి కొడుకు అకాయ్ ఫోటో.. వైరల్!?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ మరోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండింట మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ గుడ్ న్యూస్‌ను కాస్త ఆలస్యంగా మంగళవారం(ఫిబ్రవరి 20) అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడుకి అకాయ్ అని పేరు పెట్టినట్లు విరుష్క జోడీ వెల్లడించింది. అదే విధంగా తమ గోప్యతను గౌరవించాలని విరాట్ సోషల్ మీడియా వేదికగా విజ్ణప్తి చేశాడు. కాగా తన పిల్లల విషయంలో కోహ్లి చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన గారాలపట్టి వామికను పుట్టినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంచుతూ కోహ్లి వస్తున్నాడు. ఇప్పటివరకు విరుష్క దంపతులు ఆమె ఫొటోను సైతం బయటకు రానివ్వలేదు. ఇప్పుడు ఆకాయ్ విషయంలోనూ అదే జాగ్రత్తలను ఈ సూపర్ కపుల్ పాటిస్తోంది. తమ మరోసారి తల్లిదండ్రులమయ్యామని ప్రకటించిన విరుష్క జోడీ.. ఎక్కడ కూడా ఆకాయ్ ఫోటోను షేర్ చేయలేదు. కానీ అభిమానులు మాత్రం జూనియర్ విరాట్ ఎలా ఉంటాడో చూడటానికి తహతహలడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఫ్యాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(ఏఐ) సాయంతో అకాయ్ ఫొటోలను క్రియేట్ చేస్తున్నారు. అకాయ్ టీమిండియా జెర్సీలో.. అనుష్క, విరాట్‌తో కలిసి ఉన్నట్లు ఫోటోను క్రియేట్ చేశారు. అది కూడా కోహ్లి జెర్సీ నెం18తో కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా అకాయ్ పేరు మీద సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సైతం పుట్టుకుట్టుకొచ్చాయి. నాకు జన్మనిచ్చినందుకు నాన్న విరాట్ కోహ్లి, అమ్మ అనుష్క శర్మకు ధన్యవాదాలు అంటూ అకాయ్ పేరిట ఓ పోస్ట్ ఎక్స్‌లో వైరలవుతోంది. కాగా విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. A cute ai generated family photo of Virushka 💖😍#Akaay #akaaykohli #ViratKohli #AnushkaSharma #Vamika pic.twitter.com/zq63tXinNM — ꧁Priyanshu꧁ (@Hey_ImPriyanshu) February 21, 2024 AI images of akaay ❤️🔥#akaaykohli#Akaay#AnushkaSharma #ViratKohli pic.twitter.com/cre7GGmvna — kikuuuuuu (@MemeCreatorrr) February 21, 2024