టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సహనం కోల్పోయాడు. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం జరిగిందంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత స్టార్లు విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా భార్యాపిల్లలతో కలిసి ఆసీస్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్ మ్యాచ్‌లు ముగియగా.. తదుపరి భారత్- ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో తలపడనున్నాయి.
వామిక, అకాయ్‌ల వీడియో తీశారని
ఇందుకోసం కోహ్లి కుటుంబంతో కలిసి మెల్‌బోర్న్ వినామాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, ఆ సమయంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కోహ్లితో పాటు అతడి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌ల వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన కోహ్లి.. సదరు వ్యక్తుల దగ్గరకు వెళ్లి మరీ గట్టిగా హెచ్చరించాడు.
నా పిల్లలు ఉన్నపుడు ఇలా చేస్తారా?
అనంతరం మరోసారి మీడియాను ఉద్దేశించి మాట్లాడిన విరాట్ కోహ్లి.. ‘‘నా పిల్లలు ఉన్నపుడు నాకు కాస్త ప్రైవసీ ఇవ్వాలి కదా? నా అనుమతి లేకుండా వాళ్ల ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తారు?’’ అని ప్రశ్నించాడు. నిజానికి.. కోహ్లి ఫ్యామిలీతో కలిసి వచ్చేసరికి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్‌ను కొంత మంది విలేకరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.
అయితే, అదే సమయంలో కోహ్లి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని కెమెరాలు అతడి వైపు తిరిగాయి. ఇక పిల్లల గురించి హెచ్చరిస్తూ కోహ్లి కాస్త సీరియస్ కావడంతో.. తాము వామిక, అకాయ్‌ల ఫొటోలు, వీడియోలు తీయలేదని వారు సమాధానం ఇచ్చారట. దీంతో శాంతించిన కోహ్లి వారితో కరచాలనం చేసి అక్కడి నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది.
పెర్త్‌లో సెంచరీ మినహా
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో పెర్త్ టెస్టులో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఓడింది. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’గా ముగిసింది.
ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ బాక్సింగ్ డే టెస్టు(డిసెంబరు 26-30) ఇరుజట్లకు మరింత కీలకంగా మారింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో సెంచరీ చేయడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేదు. ఈ క్రమంలో అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.
చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు
Indian cricket superstar Virat Kohli has been involved in a fiery confrontation at Melbourne Airport. @theodrop has the details. https://t.co/5zYfOfGqUb #AUSvIND #7NEWS pic.twitter.com/uXqGzmMAJi
— 7NEWS Melbourne (@7NewsMelbourne) December 19, 2024
Comments
Please login to add a commentAdd a comment