Akaay: కోహ్లి బర్త్‌డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్‌ చేసిన అనుష్క | Virat Kohli Birthday: Anushka Sharma Shares FIRST Photo of Akaay, Vamika | Sakshi
Sakshi News home page

Akaay: కోహ్లి బర్త్‌డే.. తొలిసారి కుమారుడి ఫొటో షేర్‌ చేసిన అనుష్క

Published Tue, Nov 5 2024 3:18 PM | Last Updated on Tue, Nov 5 2024 5:20 PM

Virat Kohli Birthday: Anushka Sharma Shares FIRST Photo of Akaay, Vamika

క్రికెట్‌ కింగ్‌, టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి పుట్టినరోజు నేడు(నవంబరు 5). ఈ సందర్భంగా ఈ రన్‌మెషీన్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సహా యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా తదితరులు కోహ్లికి విషెస్‌ తెలిపారు. అభిమానులు సైతం తమ ఆరాధ్య క్రికెటర్‌ను విష్‌ చేస్తూ కోహ్లి పేరును ట్రెండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలో విరాట్‌ ఫ్యాన్స్‌కు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది అతడి సతీమణి అనుష్క శర్మ. తమ ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్‌లతో కోహ్లి ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో కోహ్లి అకాయ్‌ను ఎత్తుకోవడంతో పాటు తన గారాలపట్టి వామికను ఒంటిచేత్తో మోస్తూ కనిపించాడు. అయితే, అనుష్క ఇక్కడో ట్విస్ట్‌ ఇచ్చారు.

తమ చిన్నారుల ముఖాలు కనిపించకుండా లవ్‌ సింబల్స్‌తో కవర్‌ చేశారు. ఏదేమైనా తొలిసారి వామిక, అకాయ్‌లను ఈమాత్రం చూపించినందుకు ‘థాంక్స్‌ వదినా’ అంటూ కోహ్లి ఫ్యాన్స్‌ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా ఇదివరకు వామిక ఫొటోలను అడపాదడపా షేర్‌ చేసినా.. అకాయ్‌కు సంబంధించి మాత్రం ఇదే తొలి ఫొటో. 

కాగా రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి నవంబరు 5, 1988లో ఢిల్లీలో జన్మించాడు. అతడి తండ్రి ప్రేమ్‌ కోహ్లి క్రిమినల్‌ లాయర్‌. తల్లి సరోజ్‌ గృహిణి. కోహ్లి తోబుట్టువులు అన్న వికాస్‌ కోహ్లి, అక్క భావనా కోహ్లి ధింగ్రా ఉన్నారు.

కెప్టెన్‌గానూ సేవలు
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు కోహ్లి. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగి కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లి వరల్డ్‌ రికార్డు సాధించాడు కోహ్లి. సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఘనతలెన్నో సాధించాడు.

ఇప్పటి వరకు టీమిండియా తరపున 118 టెస్టులు, 295 వన్డేలు, 125 టీ20లు ఆడిన కోహ్లి 27,134 పరుగులు చేశాడు. ఇందులో 80 సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్‌-2011, చాంపియన్స్‌ ట్రోఫీ-2013, టీ20 ప్రపంచకప్‌-2024 గెలిచిన జట్లలో కోహ్లి సభ్యుడు. 

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న కోహ్లి తదుపరి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.

బాలీవుడ్‌ హీరోయిన్‌తో పెళ్లి
ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మను కోహ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలో 2017, డిసెంబరు 11న ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. విరుష్క జోడీకి తొలి సంతానంగా 2021లో కూతురు వామిక జన్మించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడు అకాయ్‌కు ఈ జంట జన్మనిచ్చింది. 

చదవండి: బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌.. ముందుగానే ఆస్ట్రేలియాకు ఆ ఇద్దరు స్టార్‌ ప్లేయర్లు?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement