అనుష్క ఎదురుగా ఉంటే.. అది మరింత ప్రత్యేకం: విరాట్‌ కోహ్లి | IND Vs AUS 1st Test Day 3: Virat Kohli Praises Anushka Sharma For Her Support At Perth After 30th Test Century | Sakshi
Sakshi News home page

Virat Kohli On Anushka Sharma: ముద్దులు విసురుతూ సెలబ్రేషన్స్‌.. అనుష్క ఎదురుగా ఉంటే..

Published Mon, Nov 25 2024 10:18 AM | Last Updated on Mon, Nov 25 2024 7:26 PM

Ind vs Aus: Kohli Praises Anushka Sharma in Perth after 30th Test Hundred

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. తన సతీమణి అనుష్క శర్మపై  ప్రశంసల వర్షం కురిపించాడు. అన్ని వేళలా తన వెన్నంటే ఉండి.. కష్టసుఖాల్లో అండగా ఉంటుందని కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. తమ మదిలో మెదిలే భావాలను కూడా చక్కగా అర్థం చేసుకుని.. అందుకు తగ్గట్లుగా ఉంటుందని ప్రేమ కురిపించాడు. కాగా గత కొంతకాలంగా పేలవఫామ్‌తో విమర్శల పాలైన కోహ్లి ఎట్టకేలకు బ్యాట్‌ ఝులిపించాడు.

అనుష్క వైపు ముద్దులు విసురుతూ
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భాగంగా పెర్త్‌ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి శతకంతో సత్తా చాటాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించి విజయం దిశగా అడుగులువేసేలా చేశాడు. స్టాండ్స్‌లో ఉన్న భార్య అనుష్క వైపు ముద్దులు విసురుతూ సెంచరీ సంబరాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

కాగా స్వదేశంలో బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌తో టెస్టుల్లో బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగా కోహ్లిపై టీమిండియా అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆట పట్ల మునుపటిలా అంకితభావం కనిపించడం లేదని.. భార్యాపిల్లల కోసం తరచూ లండన్‌ ప్రయాణాలు చేయడమే సరిపోతుందంటూ కోహ్లిని ట్రోల్‌ చేశారు. 

అనుష్క ఎదురుగా ఉంటే.. అది మరింత ప్రత్యేకం
ఈ నేపథ్యంలో టెస్టుల్లో తన ముప్పైవ సెంచరీ నమోదు చేసిన అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘మంచి ప్రదర్శన చేయనప్పుడు మైదానంలో పదే పదే తప్పులు చేస్తుంటాం. 

జట్టు విజయాలకు సహకరించాలని ఎప్పుడూ అనుకుంటా. అంతే కానీ ఊరికే అలా కొనసాగడం నాకు ఇష్టం ఉండదు. కష్టసుఖాల్లో అనుష్క శర్మ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. 

నా మదిలో ఏం మెదులుతుందో తను బాగా అర్థం చేసుకుంటుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వంగా భావిస్తా. అదీ అనుష్క ఎదురుగా ఉంటే మరింత ప్రత్యేకంగా ఉంటుంది’’ అని పెర్త్‌ సెంచరీ తనకెంతో ప్రత్యేకమని కోహ్లి పేర్కొన్నాడు.

కాగా కోహ్లి భార్య అనుష్క లండన్‌లో తమ రెండో సంతానం అకాయ్‌కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఎక్కువగా కోహ్లి కుటుంబం అక్కడే ఉంటుంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కోహ్లి తన ఫ్యామిలీని కూడా తీసుకువచ్చాడు. 

ఈ క్రమంలో స్టాండ్స్‌లో అనుష్క భర్తను చీర్‌ చేస్తూ సందడి చేసింది. ఇక విరుష్క జోడీకి కుమారుడు అకాయ్‌ కంటే ముందు కూతురు వామిక జన్మించిన విషయం తెలిసిందే. 

ముద్దులు విసురుతూ విరాట్ సెలబ్రేషన్స్.. అనుష్క ఎదురుగా ఉంటే..!

చదవండి: బెంబేలెత్తించిన బుమ్రా.. విజయం వాకిట్లో టీమిండియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement