RCB- Virushka: అనుష్క శర్మ సెలబ్రేషన్స్‌.. కోహ్లి రియాక్షన్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ విజయం: అనుష్క శర్మ సెలబ్రేషన్స్‌.. కోహ్లి రియాక్షన్‌ వైరల్‌

Published Mon, May 13 2024 11:40 AM

 ఆర్సీబీ విజయం.. అనుష్క సెలబ్రేషన్స్‌(PC: IPL X)

ఐపీఎల్‌-2024 ఆరంభంలో వరుస ఓటములతో చతికిల పడ్డ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో వరుసగా ఐదో గెలుపు నమోదు చేసి.. ప్లే ఆఫ్స్‌ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది.

ఇక ఈ మ్యాచ్‌లో47 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దూసుకవచ్చింది. కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆర్సీబీ సంబరాలు అంబరాన్నంటాయి.

చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు విధించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. ఢిల్లీ 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లతో ఆర్సీబీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇందులో ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ హైలైట్‌గా నిలిచారు. ఆర్సీబీ గెలుపు ఖరారు కాగానే.. ఆమె పట్టరాని ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు.

వావ్‌.. థాంక్‌ గాడ్‌!
‘వావ్’‌ అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పినట్లుగా చేతులు జోడించి ఆర్సీబీ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ వైరల్‌గా మారాయి. ఇందుకు కోహ్లి కూడా తనదైన శైలిలో మజిల్స్‌ చూపిస్తూ బదులిచ్చాడు. కాగా ఓ యాడ్‌ సందర్భంగా అనుష్కను కలిసిన కోహ్లి ఆమెతో ప్రేమలో పడ్డాడు. 2017లో ఇటలీలో ఆమెను పెళ్లాడాడు.

ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌ సంతానం. అకాయ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించాడు. లండన్‌లో తన ప్రసవం తర్వాత ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన అనుష్క.. ఇలా భర్తను చీర్‌ చేస్తూ ఆర్సీబీకి మద్దతుగా స్టేడియానికి వస్తున్నారు. ఇక ఢిల్లీతో మ్యాచ్‌లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ కోహ్లి 13 బంతుల్లో 27 పరుగులు చేశాడు.

ఆర్సీబీ వ‌ర్సెస్ ఢిల్లీ స్కోర్లు
👉వేదిక‌:  చిన్న‌స్వామి స్టేడియం.. బెంగ‌ళూరు
👉టాస్‌:  ఢిల్లీ.. బౌలింగ్‌

👉ఆర్సీబీ స్కోరు: 187/9 (20)
👉ఢిల్లీ స్కోరు: 140 (19.1)
👉ఫ‌లితం: 47 ప‌రుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ‌కామెరాన్‌ గ్రీన్‌(24 బంతుల్లో 32 నాటౌట్‌.. ఒక వికెట్‌ (1/19)).

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement