వరుసగా ఐదో విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవం
47 పరుగులతో ఓడిన ఢిల్లీ
మెరిపించిన పటిదార్, గ్రీన్, జాక్స్
యశ్‌కు 3 వికెట్లు
బెంగళూరు: ‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) వరుసగా ఐదో విజయంతో ఆశలు సజీవం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 47 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్‌సీబీ ఈ టోరీ్నలో ఆరో విజయం నమోదు చేసుకుంది. ముందుగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది.
రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ జాక్స్ (29 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 140 పరుగులకు కుప్పకూలింది. పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం కారణంగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్ (39 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు.
పటిదార్ ఫటాఫట్...
డుప్లెసిస్ (6) విఫలమవగా, కోహ్లి (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఎంతో సేపు నిలువలేదు. ఢిల్లీ ఫీల్డర్లు పదేపదే క్యాచ్‌లు నేలపాలు చేయడంతో బతికిపోయిన జాక్స్, పటిదార్ ధాటిగా పరుగులు రాబట్టారు. దీంతో 9.1 ఓవర్లో బెంగళూరు 100 పరుగులకు చేరగా, పటిదార్ 29 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. కానీ స్వల్పవ్యవధిలో అతనితో పాటు జాక్స్ అవుటయ్యాక స్కోరు మందగించింది. గ్రీన్ (24 బంతుల్లో 32; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మహిపాల్ సిక్స్‌లతో 17 ఓవర్లలో 169/4 స్కోరు చేసిన ఆర్‌సీబీ తర్వాత ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఖరి 3 ఓవర్లలో 18 పరుగులే చేసి 5 వికెట్లను కోల్పోయింది.
అక్షర్ ఒక్కడే!
లక్ష్యఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు చెత్తగా ఆడటంతో ఆరంభం నుంచి ఆలౌట్ దాకా ఏ దశలోనూ గెలిచేలా కని్పంచలేదు. ఫ్రేజర్ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తర్వాత కెపె్టన్ అక్షర్ పటేల్
ఒంటరి పోరాటం చేశాడు. అతనికి షై హోప్ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు) కాసేపు అండగా నిలిచాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) అభిõÙక్ (బి) ఇషాంత్ 27; డుప్లెసిస్ (సి) ఫ్రేజర్ (బి) ముకేశ్ 6; జాక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 41; పటిదార్ (సి) అక్షర్ (బి) రసిఖ్ 52; గ్రీన్ (నాటౌట్) 32; మహిపాల్ (సి) అభిషేక్ (బి) ఖలీల్ 13; దినేశ్ కార్తీక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 0; స్వప్నిల్ (సి) కుషాగ్ర (బి) రసిఖ్ 0; కరణ్ శర్మ (రనౌట్) 6; సిరాజ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–23, 2–36, 3–124, 4–137, 5–174, 6–174, 7–176, 8–185, 9–187. బౌలింగ్: ఇషాంత్ 3–0–31–1, ఖలీల్ 4–0–31–2, ముకేశ్ 3–0–23–1, అక్షర్ 3–0–24–0, కుల్దీప్ 4–0–52–1, రసిఖ్ 3–0–23–2.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) జాక్స్ (బి) స్వప్నిల్ 1; ఫ్రేజర్ (రనౌట్) 21; అభిõÙక్ (సి) ఫెర్గూసన్ (బి) యశ్ 2; షై హోప్ (సి) కరణ్ (బి) ఫెర్గూసన్ 29; కుశాగ్ర (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 2; అక్షర్ (సి) డుప్లెసిస్ (బి) యశ్ 57; స్టబ్స్ (రనౌట్) 3; రసిఖ్ (సి) జాక్స్ (బి) గ్రీన్ 10; కుల్దీప్ (బి) యశ్ 6; ముకేశ్ (సి) మహిపాల్ (బి) ఫెర్గూసన్ 3; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–8, 2–24, 3–24, 4–30, 5–86, 6–90, 7–127, 8–128, 9–135, 10–140. బౌలింగ్: స్వప్నిల్ 1–0–9–1, సిరాజ్ 4–0–28–1, యశ్ దయాళ్ 3.1–0–20–3, కరణ్ శర్మ 2–0–19–0, ఫెర్గూసన్ 4–0–23–2, గ్రీన్ 4–0–19–1, జాక్స్ 1–0–16–0.
Comments
Please login to add a commentAdd a comment