మనసంతా నువ్వే.. నీపై నా ప్రేమ అనంతం.. కోహ్లి పోస్ట్‌ వైరల్‌ | Virat Kohli Shares Adorable PIC With Anushka Sharma 6th Wedding Anniversary | Sakshi
Sakshi News home page

#Virushka: మనసంతా నువ్వే.. నీపై నా ప్రేమ అనంతం! విరుష్క పెళ్లినాటి వీడియో వైరల్‌

Published Tue, Dec 12 2023 11:37 AM | Last Updated on Tue, Dec 12 2023 11:53 AM

Virat Kohli Shares Adorable PIC With Anushka Sharma 6th Wedding Anniversary - Sakshi

అనుష్కపై ప్రేమను చాటుకున్న కోహ్లి (PC: Instagram)

Virat Kohli- Anushka Sharma Cut Cake On Their 6th Wedding Anniversary: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన సతీమణి అనుష్క శర్మపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘నా మనసంతా నువ్వే... నీపై నా ప్రేమ అనంతం’’ అన్న చందంగా ఎమోజీలతో భార్య పట్ల తన భావాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తమ పెళ్లిరోజు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడీ రన్‌మెషీన్‌.

కాగా రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ 2017లో వివాహ బంధంలో అడుగుపెట్టారు. చాలా ఏళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో పెళ్లితో ఒక్కటయ్యారు. నాడు.. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇరు కుటుంబాల అంగీకారంతో అగ్ని సాక్షిగా.. అనుష్క నుదిటిన సింధూరం దిద్ది భార్యగా ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడు కోహ్లి.

పబ్లిసిటీకి దూరంగా
అప్పటి నుంచి విరుష్క జోడీ మరింత పాపులర్‌ అయింది. ఇక పెళ్లినాటికే విరాట్‌ టీమిండియా కెప్టెన్‌గా.. అనుష్క కూడా బీ-టౌన్‌లో హీరోయిన్‌గా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ పబ్లిసిటీకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను సీక్రెట్‌గా ప్లాన్‌ చేసుకున్నారు. 

ఇక వివాహ సమయంలో విరుష్క సవ్యసాచి డిజైన్‌ చేసిన పేస్టల్‌ కలర్‌ సంప్రదాయ దుస్తులు ధరించారు. పంజాబీ సంప్రదాయ పద్ధతిలో విరాట్‌ అనుష్కను పెళ్లాడాడు. వీరి పరిణయం సందర్భంగా పంజాబీ సింగర్‌ హర్ష్‌దీప్‌ కౌర్‌ తన గాత్రంతో అద్భుతమైన పాటను ఆలపించింది.

‘పీర్‌ వి తూ’(పవిత్రమైన ప్రేమ అన్న అర్థంలో) అంటూ సాగే ఈ గీతం విరుష్క జోడీకి చక్కగా సరిపోయిందంటూ అప్పట్లో ప్రశంసలు కురిశాయి. ఇక విరాట్‌ -అనుష్క ఆరో పెళ్లి రోజు సందర్భంగా హర్ష్‌దీప్‌ కౌర్‌ మరోసారి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. 

ఇదిలా ఉంటే.. అనుష్క సైతం తమ వెడ్డింగ్‌ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. కాగా విరుష్క జంటకు కుమార్తె వామిక సంతానం. 

సౌతాఫ్రికా టూర్‌తో రీఎంట్రీ
ఇక వన్డే వరల్డ్‌కప్‌-2023 టాప్‌ రన్‌ స్కోరర్‌ విరాట్‌ కోహ్లి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. డిసెంబరు 26 నుంచి టీమిండియా- సౌతాఫ్రికా ఆడబోయే తొలి టెస్టులో అతడు భాగం కానున్నాడు. మరోవైపు అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని.. విరుష్క జోడీ రెండోసారి తల్లిదండ్రులు కానున్నానరే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement