
టస్కనీ: ఇటలీలో అత్యంత వైభవంగా జరిగిన విరాట్ కోహ్లి, అనుష్క శర్మల వివాహం హాట్ టాపిక్‌గా మారడంతో వివాహానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ ఆసక్తిగా గమనిస్తున్నారు. కన్నుల పండువగా జరిగిన విరుష్క వివాహ ఫోటోలు పలువురిని ఆకర్షిస్తుండగా, తాజాగా వారి ఎంగేజ్‌మెంట్ రింగ్‌పై ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది.
అనుష్కకు చక్కగా సరిపోయే వెడ్డింగ్ రింగ్ కోసం విరాట్ మూడు నెలలు అన్వేషించాడని చెబుతున్నారు. ఆస్ర్టియాకు చెందిన ప్రఖ్యాత డిజైనర్‌చే అరుదైన డైమండ్ రింగ్‌ను అనుష్క కోసం స్వయంగా విరాట్ చేయించాడని కోహ్లి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రింగ్ అత్యంత అద్భుతంగా ఉండటంతో పాటు భిన్న కోణాల్లో చూసిన ప్రతిసారి ఆశ్యర్యానికి లోను చేసే విధంగా ఉంటుందని తెలిపాయి.
ఈ స్పెషల్ డైమండ్ రింగ్ ఖరీదు రూ కోటి ఉంటుందని దీని ప్రత్యేకతలకు ఆ ధర ఎక్కువేమీ కాదని చెబుతున్నారు. ఎవరైనా ఈ రింగ్‌ను చూస్తే దాన్నుంచి చూపు మరల్చుకోని విధంగా ఉంటుందని సమాచారం. రింగ్ ఖరీదు చూస్తే విరుష్క వివాహానికి వేదికైన ఇటలీలోని ప్రఖ్యాత రిసార్ట్స్ రెంట్ కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఎన్నో ఊహాగానాల నడుమ చిరకాల స్నేహితులైన విరాట్, అనుష్కల వివాహం ఇటలీలోని టస్కనీలో అత్యంత సన్నిహితుల నడుమ జరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment