
ముంబై: క్రికెట్–బాలీవుడ్ జోడీ కోహ్లి–అనుష్క ఏమాత్రం విరామం దొరికినా... విహారంలో మునిగిపోతారు. సఫారీని క్లీన్‌స్వీప్ చేసిన ఆనందంలో ఉన్న భారత కెప్టెన్ కోహ్లికి బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. నిత్యం పర్యటనలు, నెట్స్‌లో ప్రాక్టీసుతో నిమగ్నమయ్యే విరాట్ తన సతీమణి అనుష్కతో కలిసి కలిసొచ్చిన ఈ సమయాన్ని అహ్లాదకరంగా మలచుకుంటున్నాడు. అన్నట్లు తమ విహారాన్ని ఎంజాయ్ చేసే విరుష్క జోడీ ఈ ఆనందాన్ని తమ అభిమానులతో ఎంచక్కా పంచుకుంటుంది.
సోషల్‌నెట్‌వర్క్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ సంతోషక్షణాల్ని పంచుకోవడంలో విరాట్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. తనకు నచ్చిన ఓ పర్యాటక ప్రదేశం వద్ద ఇద్దరు చెట్టాపట్టాలేసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తన గుండెనిండా అనుష్కే అన్న అర్థం వచ్చేలా ఆ ఫోటో కింద హృదయాకారపు ఎమోజీలను జతచేశాడు. తద్వారా అనుష్క పరువాలలో తడిసిముద్దయ్యే కోహ్లి... తనపై ఉండే ఒత్తిడిని ఎప్పటికప్పుడు జయిస్తున్నాడు. సారథిగా సిరీస్ విజయాల్నీ అస్వాదిస్తున్నాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరిగే మూడు టి20ల సిరీస్‌లో అతనికి విశ్రాంతినివ్వగా టీమిండియా పగ్గాలను రోహిత్ శర్మ చేపడతాడు.