విరుష్క రిసెప్షన్‌కు అతిథిగా మోదీ | Narendra Modi attends Virat, Anushka wedding reception | Sakshi
Sakshi News home page

విరుష్క రిసెప్షన్‌కు అతిథిగా మోదీ

Published Fri, Dec 22 2017 8:47 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Narendra Modi attends Virat, Anushka wedding reception - Sakshi

న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మల వివాహ విందు గురువారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.  ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో విరాట్ కోహ్లి-అనుష్కలు ఈ నెల 11న హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులే ఈ పెళ్లికి విచ్చేశారు.

దీంతో తమ కుటుంబసభ్యులు, బంధువులు,  మరికొందరు సెలబ్రిటీల కోసం నిన్న (శుక్రవారం రాత్రి) గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది విరుష్క జోడీ. కాగా ఈ నూతన జంట  బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిసి, రిసెప్షన్‌ రావాలని ఆహ్వానించారు.  మరోవైపు ఈ నెల 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు కోహ్లి రిసెప్షన్‌ ఇవ్వనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement