
సాక్షి, హైదరాబాద్ : పెళ్లితో ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మలపై అటు బాలీవుడ్, ఇటు క్రికెట్ వర్గాల నుంచి అభినందనల వెల్లువ కురుస్తోంది. కోహ్లి అత్యంతగా అభిమానించే బౌలర్, అతన్ని ఆరాధ్యంగా చూసే పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్ హృదయం ద్రవించే శుభాకాంక్షలు తెలిపాడు.
పాక్ ఖలీజ్ టైమ్స్ తో మాట్లాడుతూ.. విరాట్ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. అతని కొత్త జీవితం బాగుండాలని ఇప్పటికే ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలియజేశా. క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నట్లే వివాహ జీవితంలో విజయవంతం కావాలని, వారి ఇరువురూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నా. అంతేకాకుండా దిష్టి కళ్ల నుంచి రక్షించాలని కోరుకుంటున్నా. చాలా మంది దృష్టి వారి మీద ఉన్నట్లే దిష్టి కళ్లూ వారిపై ఉంటాయి. అందుకే వారి నూతన జీవితం బాగుండేలా ఆ అల్లాను వేడుకుంటున్నా’ అని అమిర్ వ్యాఖ్యానించాడు.
పలు సందర్భాల్లో అమిర్ బౌలింగ్‌ను కోహ్లి ప్రశంసించడమే కాకుండా తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ అమిర్‌దేనని కోహ్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గతంలో కోహ్లిని సైతం అమిర్ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment