Mohammad Amir
-
కోహ్లితో పోలికా?.. నవ్వకుండా ఉండలేను: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్, క్రికెట్ రారాజు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునికతరం ఆటగాళ్లలో కోహ్లికి సాటి వచ్చే క్రికెటర్ మరొకరు లేడన్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ రన్‌మెషీన్ అరుదైన ఘనతలు సాధించాడని పేర్కొన్నాడు.81 సెంచరీలుఅలాంటి గొప్ప ఆటగాడితో వేరే వాళ్లను పోలిస్తే తాను నవ్వకుండా ఉండలేనని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ తర్వాత వంద శతకాలకు చేరువైన ఏకైక ఆటగాడిగా కోహ్లి వెలుగొందుతున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్న కోహ్లి.. టెస్టుల్లో 30, అంతర్జాతీయ టీ20లలో ఒక శతకం బాదాడు.మొత్తంగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 81 సెంచరీలు చేసిన కోహ్లి ఖాతాలో మరెన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కోహ్లి సాధించిన పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో చాలా మంది పాక్ మాజీ ఆటగాళ్లు బాబర్‌ను కోహ్లితో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమేఈ విషయంపై స్పందించిన మహ్మద్ ఆమిర్.. కోహ్లికి మరెవరూ సాటిరారని.. ఇలాంటి పోలికలు హాస్యాస్పదంగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘నవతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యంత గొప్ప ఆటగాడు. అతడిని బాబర్ ఆజం.. లేదంటే స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పోలిస్తే నాకు నవ్వు వస్తుంది.కోహ్లిని ఎవరితో పోల్చలేము. అతడికి మరెవరూ సాటిరారు. ఎందుకంటే.. ఒంటిచేత్తో అతడు టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు. అది కూడా కేవలం ఏ ఒక్క ఫార్మాట్లోనూ కాదు.. మూడు ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు.మిగతా ప్లేయర్లలో ఇలాంటి ఘనత వేరెవరికీ సాధ్యం కాదు. ఈ జనరేషన్లో గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమే’’ అని మహ్మద్ ఆమిర్ కోహ్లి నైపుణ్యాలను కొనియాడాడు. కోహ్లికి కఠిన పరిస్థితుల ఎలా బయటపడాలో బాగా తెలుసునని.. ప్రత్యర్థి జట్ల పట్ల అతడొక సింహస్వప్నం అని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రెడిక్టా షోలో ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగాకాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో శతకం బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో మాత్రం తేలిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. మహ్మద్ ఆమిర్ మాత్రం కఠిన దశ నుంచి వేగంగా కోలుకోవడం కోహ్లికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న కోహ్లి.. ఆ తర్వాత పదేళ్ల పాటు రాణించిన తీరే ఇందుకు నిదర్శనం అని తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
పాక్ క్రికెట్‌కు భారీ షాక్.. 24 గంటల్లోనే ఇద్దరి స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్
పాకిస్తాన్ క్రికెట్‌కు 24 గంటలు తిరగకముందే మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ శనివారం (డిసెంబర్ 14) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అమీర్ వెల్లండిచాడు."అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించిన తర్వాత ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. రాబోయో తరానికి అవకాశమిచ్చేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్‌కు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం.తన ప్రయాణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు"అని రిటైర్మెంట్ నోట్లో అమీర్ పేర్కొన్నాడు.కాగా అమీర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం ఇది రెండో సారి. బోర్డుతో విబేధాలు కారణంగా 2020లో రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. మళ్లీ ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. పాక్ తరపున అమీర్ తన కెరీర్లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఓవరాల్‌గా 158 మ్యాచ్‌లు ఆడిన అమీర్.. 271 వికెట్ల పాటు 1,179 పరుగులు చేశాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున అమీర్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2017లో పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అమీర్ కీలక పాత్ర పోషించాడు. కాగా మరో పాక్ ఆటగాడు ఇమాద్ వసీం రిటైర్మెంట్ ప్రకటించిన 24 గంటల తర్వాత అమీర్ తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిద్దరూ ఫ్రాంచైజీ క్రికెట్లో బిజీబిజీగా ఉన్నారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా -
టీ20 వరల్డ్‌కప్-2024కు పాకిస్తాన్ జట్టు ప్రకటన..
అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. అయితే ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు జట్టు నుంచి రిలీజ్ అయిన పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. అదే విధంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లో పాక్ జట్టులో భాగమైన ఆల్ రౌండర్ సల్మాన్ అలీ అఘా,ఫాస్ట్ బౌలర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్‌లను సైతం ఈ పొట్టి ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదు. అంతేకాకుండా ఈ మెగా టోర్నీకి పాక్ సెలక్షన్ కమిటీ రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం గమనార్హం. ఇక ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.టీ20 వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, ఉస్మాన్ ఖాన్ -
పాకిస్తాన్ జట్టు ప్రకటన! 4 ఏళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ
స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్న పేసర్ మహ్మద్ అమీర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంకు ఈ జట్టులో చోటు దక్కింది. వీరిద్దరితో పాటు యువ ఆటగాడు ఉస్మాన్ ఖాన్, అన్క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా ఈ సిరీస్‌తో బాబర్ ఆజం మళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ ఓపెనర్ సైమ్ అయూబ్‌ను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక మహ్మద్ అమీర్ పాకిస్తాన్ తరపున చివరగా 2020లో ఆడాడు. ఆ తర్వాత బోర్డుతో విభేదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు బోర్డు కొత్త చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ సూచనల మెరకు అమీర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం కూడా గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. కానీ పీసీబీ అధికారులతో చర్చలు జరిపి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వహాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఏప్రిల్ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కివీస్‌తో టీ20లకు పాక్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: హసీబుల్లా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు సల్మాన్ అలీ అఘా -
టీమిండియాకు సిరీస్ దూరం చేసి.. హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కింగ్
విండీస్ ఓపెనింగ్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభానికి ముందు టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఫామ్‌ను అందుకున్న కింగ్.. ఆ సిరీస్‌లో నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 85 పరుగులు (5 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి, తన జట్టు సిరీస్ కైవసం (3-2) చేసుకునేలా చేశాడు. తాజాగా సీపీఎల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్న కింగ్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి (81, 67), ఇక్కడ కూడా తన జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. Brandon King’s 22 ball FIFTY takes our Republic Bank play of the day! #CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/7TeGR8xevA — CPL T20 (@CPL) August 24, 2023 సీపీఎల్‌లో జమైకా తల్లావాస్‌కు సారధ్యం వహిస్తున్న కింగ్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియట్స్‌తో నిన్న (ఆగస్ట్ 23) జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసి, తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. జాషువ డిసిల్వ (36), డోమినిక్ డ్రేక్స్ (29 నాటౌట్), ఆండ్రీ ఫ్లెచర్ (23) ఓ మోస్తరు స్కోర్లు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. Super Salman 🇵🇰 Salman Irshad takes the wickets of Ambati Rayudu, Andre Fletcher and Corbin Bosch in the same over 🤯 #CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/eNS4sS2Kib — CPL T20 (@CPL) August 23, 2023 జాషువ, డ్రేక్స్, ఫ్లెచర్ మినహా మిగతా వారెవ్వరూ రాణించలేకపోయారు. కెప్టెన్ ఎవిన్ లెవిస్ 9 పరుగులు చేయగా, ఈ మ్యాచ్‌తో సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు డకౌటయ్యాడు. జమైకా బౌలర్లలో సల్మాన్ ఇర్షాద్ 4 వికెట్లతో విజృంభించగా.. మహ్మద్ అమిర్ 3 వికెట్లతో చెలరేగాడు. ఇమాద్ వసీం, నికోల్సన్ గోర్డన్ తలో వికెట్ దక్కించుకున్నారు. Tonight's @BetBarteronline magic moment sees @iamamirofficial in the wickets yet again! #CPL23 #SLKvBR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/NEX8k9HfN1 — CPL T20 (@CPL) August 24, 2023 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తల్లావాస్.. బ్రాండన్ కింగ్, షామారా బ్రూక్స్ (28 నాటౌట్), కిర్క్ మెకెన్జీ (23) రాణించడంతో 16.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సెయింట్ కిట్స్ బౌలర్లలో డ్రేక్స్, ఒషేన్ థామస్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్‌లో భారత్ నుంచి ఒక్క అంబటి రాయుడు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. A dominant 8-wicket win for the Tallawahs!!!🐊#CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/0O6sdesLty — CPL T20 (@CPL) August 24, 2023 Salman Irshad's T20 stock continues to rise 📈. He turns out a Man of the Match performance tonight 💫#CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #iflycaribbean pic.twitter.com/KDeYuIWtdi — CPL T20 (@CPL) August 24, 2023 -
విండీస్ బ్యాటర్ భారీ సిక్సర్.. దెబ్బకు పాక్ బౌలర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్ ఆగస్టు 16 నుంచి ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం(ఆగస్టు17) ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌పై జమైకా తల్లావాస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తల్లావాస్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. జమైకా బ్యాట్లరలో కెప్టెన్ బ్రాండన్ కింగ్(81) పరుగులతో అదరగొట్టాడు. సెయింట్ లూసియా బౌలర్లలో ఛేజ్ మూడు వికెట్లతో మెరిశాడు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేయగల్గింది. సెయింట్ లూసియా బ్యాటర్లలో రోస్టన్ ఛేజ్(53), రోషన్ ప్రైమస్(37) పరుగులతో రాణించారు. జమైకా బౌలర్లలో ఇమాడ్ వసీం మూడు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్, సల్మాన్ ఇర్షద్ తలా రెండు వికెట్లు సాధించారు. అమీర్‌కు ఫ్యూజ్‌లు ఔట్.. ఈ మ్యాచ్‌లో జమైకా తల్లావాస్ బౌలర్, పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ పడగొట్టకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా సెయింట్ లూసియా బ్యాటర్ షన్ ప్రైమస్.. అమీర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. తన బౌలింగ్‌లో ప్రైమస్ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు అమీర్ ఆశ్చర్యపోయాడు. సెయింట్ లూసియా ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అమీర్ బౌలింగ్‌లో తొలి బంతికే ప్రైమస్ 96 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. అది చూసిన అమీర్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND vs WI: ఐర్లాండ్‌తో తొలి టీ20.. సంజూ శాంసన్‌పై వేటు! సిక్సర్ల కింగ్ ఎంట్రీ Primus SMASHES Mohammed Amir with a 96 meter six for our @republicbanktt play of the day! #CPL23 #SLKvJT #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/nPhn1RBI6Q — CPL T20 (@CPL) August 17, 2023 -
ఐపీఎల్-2024లో ఆడనున్న పాకిస్తాన్ బౌలర్.. అది ఎలా అంటే?
పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ బౌలర్లలో మహ్మద్ అమీర్ ఒక్కడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా 2020 డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి అనూహ్యంగా అమీర్ తప్పుకున్నాడు. అయితే పీసీబీ చైర్మెన్ రమీజ్ రజా తప్పకోవడంతో అమీర్ మళ్లీ పాకిస్తాన్ తరపున క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని నెలల కిందట వార్తలు వినిపించాయి. కానీ అమీర్ పాకిస్తాన్‌కు కాకుండా ఐపీఎల్లో ఆడేందుకు అస్త్రాలను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా 2008 ఐపీఎల్ సీజన్ తర్వాత ఏ ఒక్క పాక్ ఆటగాడు కూడా క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆడటంలేదు. ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తల కారణంగా పాక్ ప్లేయర్లపై ఐపీఎల్లో నిషేధం విధించారు. అయితే అమీర్ మరి ఎలా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడని మీకు సందేహం కలగవచ్చు. యూకే పౌరసత్వం పొందనున్న అమీర్ అమీర్ 2016లో బ్రిటిష్ యువతి, లాయర్ నర్జీస్ ఖాన్ని వివాహం చేసుకున్నాడు. అమీర్ ప్రస్తుతం ఆమెతో కలిసి ఇంగ్లండ్‌లోనే ఉంటున్నాడు. అతడు 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత పూర్తిగా పాకిస్తాన్ నుంచి ఇంగ్లండ్‌కు మకాం మార్చాడు. ఈ క్రమంలో 2024లో బ్రిటీష్ పాస్‌పోర్ట్‌తో పాటు, యూకే పౌరసత్వం పొందనున్నట్లు సమాచారం. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ తన ఐపీఎల్ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇచ్చాడు. "నేను ముందుగా ఇంగ్లండ్‌కు ఆడాలనుకోవడంలేదు. ఎందుకంటే ఇప్పటికే నేను పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ స్ధాయిలో ప్రాతినిధ్యం వహించాను. ఐపీఎల్ గురించి ఇంకా ఆలోచించలేదు. నేను బ్రిటన్ నుంచి నా పాస్‌పోర్ట్ పొందడానికి ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది. ఇప్పటికైతే ఒక్కో అడుగు వేయాలని అనుకుంటున్నా" అని అమీర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్ -
మళ్లీ పాకిస్తాన్ తరపున ఆడాలనుకుంటున్నాను: మహ్మద్ అమీర్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్.. మళ్లీ జాతీయ జట్టు తరపున రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజాతో విభేదాల కారణంగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు పీసీబీ కొత్త చైర్మన్‌గా రమీజ్ రాజా స్థానంలో నజం సేథీ బాధ్యతలు చేపట్టడంతో అమీర్ జట్టులోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు. కాగా సేథీ కూడా అమీర్‌ను మళ్లీ తమ జట్టులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో లాహోర్‌లోని నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో శిక్షణ పొందేందుకు అమీర్ పీసీబీ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమీర్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. మళ్లీ పాకిస్తాన్ జెర్సీ ధరించేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు అమీర్ తెలిపాడు. ఈ మేరకు.. "అల్లా దయ వుంటే మళ్లీ నేను పాకిస్తాన్ తరపున ఆడతాను. నేను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అద్భుతంగా రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి రావడమే నా లక్ష్యం" అని అమీర్ పేర్కొన్నాడు. ఇక అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20ల్లో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: Shahid Afridi: పీసీబీ చీఫ్ సెలెక్టర్‌గా అఫ్రిది మంగమ్మ శపథం -
పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ రీ ఎంట్రీ!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్.. మళ్లీ జాతీయ జట్టు తరుపున ఆడేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత.. అమీర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పీసీబీ కొత్త చైర్మన్‌గా రమీజ్ రాజా స్థానంలో నజం సేథీ రావచ్చని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అవిశ్వాస తీర్మానంలో ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఓడిపోవడంతో తన పదవిని కోల్పోయారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్ స్థానంలో నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్లో కూడా కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20ల్లో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: IPL 2022: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన చాహల్.. వీడియో వైరల్! -
వార్న్ లెజెండ్, గొప్ప వ్యక్తి అని విని షాకయ్యా: పాక్ క్రికెటర్
తొందరపాటు చర్యల వల్ల ఒక్కోసారి విమర్శలపాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లో చిన్న తప్పు దొర్లితే చాలు ట్రోలింగ్ బారిన పడాల్సి వస్తుంది. పాకిస్తాన్ వివాదాస్పద క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే. మార్చి 4న థాయ్‌లాండ్‌లోని విల్లాలో తుది శ్వాస విడిచాడు. ఈ క్రమంలో లెజెండ్ మృతి పట్ల దిగ్భ్రాంతి చెందిన సహచర ఆటగాళ్లు, ఇతర క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఆమిర్ సైతం వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించాడు. అయితే, ఇందుకు సంబంధించి అతడు చేసిన ట్వీట్లో అన్వయ దోషం వల్ల పూర్తిగా అర్థమే మారిపోయింది. ‘‘అతడు క్రికెట్ లెజెండ్, గొప్ప వ్యక్తి అనడం విని షాకయ్యాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్’’ అంటూ ఆమిర్ ట్వీట్ చేశాడు. ఒక్క ఫుల్స్టాప్ పెట్టి ఉంటే... ‘‘ఈ విషయం విని షాకయ్యాను. ఆయన లెజెండ్. మంచి మనసున్న వ్యక్తి’’ అనే అర్థం వచ్చేది. కానీ ఆమిర్ ఇది మిస్ కావడంతో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘నీ ఇంగ్లిష్ వింటే వార్న్ ఏడ్చేసేవాడు. చచ్చిపోయి బతికిపోయాడు’ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్‌లో భాగమయ్యాడన్న కారణంగా ఆమిర్ కొంతకాలం పాటు నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు! Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! shocked to hear that he was legend of the game and equally a good person . RIP LEGEND 🙏 😔 pic.twitter.com/bv9z0RojyT — Mohammad Amir (@iamamirofficial) March 4, 2022 -
ఆమిర్.. ఎక్కడున్నా ఇవే కవ్వింపు చర్యలా!
లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)లో పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. ఆదివారం గాలే గ్లాడియేటర్స్, జఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జఫ్నా కింగ్స్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను ఆమిర్ వేశాడు. అయితే ఓపెనర్ అవిష్క ఫెర్నాండో ఆమిర్ వేసిన తొలి బంతినే సిక్స్ బాదాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమిర్ తన తర్వాతి బంతికి ఫెర్నాండోను క్లీన్ బౌల్డ్ చేసి దెబ్బకు దెబ్బ తీశాడు. ఈ సమయంలో ఆమిర్ కోపంతో అవిష్క ఫెర్నాండోవైపే చూస్తూ ''గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్'' అంటూ ఇచ్చిన హావభావాలు కెమెరా కంటికి చిక్కాయి. దీంతో ఆమిర్‌ను ట్రోల్ చేస్తూ అభిమానులు కామెంట్ చేశారు. ''ఆమిర్ ఎక్కడున్నా సరే.. నీ కవ్వింపు చర్యలు అలాగే ఉంటాయి.. ఇక నువ్వు మారవా'' అంటూ పేర్కొన్నారు. మ్యాచ్‌లో విజయం సాధించిన గాలే గ్లాడియేటర్స్ ఎల్పీఎల్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించినంతకాలం వివాదాలతో పేరు పొందిన ఆమిర్ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా అంతే అగ్రెసివ్‌గా ఉన్నాడు. పాకిస్తాన్ తరపున 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లు తీశాడు. చదవండి: BBL 2021: మ్యాచ్ మధ్యలో బ్రొమాన్స్ ఏంటి.. తట్టుకోలేకపోతున్నాం?! First ball hit for Six then 👑 Clean bowled with an Inswinger @iamamirofficial Aggression 🔥 pic.twitter.com/6p2LmWyy6r — Mustafa Abid (@mmustafa_abid) December 19, 2021 -
మాజీ పేసర్‌కు కరోనా.. లీగ్ నుంచి ఔట్
Abu Dhabi T10 League 2021: Mohammad Amir infected with Covid-19: పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ కరోనా బారిన పడ్డాడు. అమీర్ ప్రస్తుతం అబుదాబి టీ10 లీగ్‌లో బంగ్లా టైగర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్ శుక్రవారం( నవంబర్19) నుంచి ప్రారంభంకానుంది. అయితే కరోనా బారిన పడడంతో ఈ టోర్నమెంట్లో తను పాల్గొనడం లేదని అమీర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, తను త్వరగా కోలుకోవడానికి అభిమానుల ఆశీస్సులు అవసరమని అతడు తెలిపాడు. " నేను ఈ ఏడాది అబుదాబి టీ10 లీగ్ ఆడటం లేదు. ఎందుకంటే నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణైంది. కానీ ఇప్పుడు నేను బాగున్నాను. త్వరగా కోలుకోవడానికి మీ అందరి ప్రార్థనలు కావాలి" అని మహమ్మద్ అమీర్ ట్వీట్ చేశాడు. కాగా ఈ టోర్నమెంట్లో క్రిస్ గేల్, ఫాఫ్ డు ప్లెసిస్,రస్సెల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు పాల్గొంటున్నారు. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది.. కానీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేదు! -
ఇజ్జత్ లేదు.. ఏం లేదు.. కేవలం డబ్బే కావాలి.. ఛీ యాక్: భజ్జీ
Harbhajan Singh- Mohammad Amir Twitter War: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మధ్య ట్విటర్ యుద్ధం తారస్థాయికి చేరింది. సరదాగా మొదలైన మాటల యుద్ధం కాస్తా.. సీరియస్‌గా మారింది. వివాదాలకు కేరాఫ్‌గా నిలిచే ఆమిర్.. ఒకానొక టెస్టు మ్యాచ్‌లో షాహిద్ ఆఫ్రిది.. హర్భజన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన వీడియో క్లిప్‌ను షేర్ చేశాడు. భజ్జీ బౌలింగ్‌లో ఆఫ్రిది సిక్సర్లు బాదిన దృశ్యాలు అవి. అయితే, ఈ వీడియో హర్భజన్‌కు ఆగ్రహం తెప్పించింది. Lords mai no ball kaise ho gya tha ?? Kitna liya kisne diya ? Test cricket hai no ball kaise ho sakta hai ? Shame on u and ur other supporters for disgracing this beautiful game https://t.co/nbv6SWMvQl — Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021 ఆమిర్‌కు కౌంటర్ ఇచ్చే క్రమంలో... 2010 నాటి లార్డ్స్ టెస్టుకు సంబంధించిన నో- బాల్ స్కాండల్‌ను భజ్జీ ప్రస్తావించాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన సదరు టెస్టు మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్, ఆమిర్‌లు తప్పు చేశారని నిరూపితం కావడంతో కొంతకాలం నిషేధం ఎదుర్కొన్నారు. ఈ వివాదాన్ని గుర్తుచేస్తూ భజ్జీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు చదవండి: Shoaib Malik: సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడు: జహీర్ ఖాన్ ‘‘లార్డ్స్‌లో నో బాల్ ఎలా అయ్యిందో?? ఎంత ఇచ్చారు.. ఎవరు ఇచ్చారు? టెస్టు క్రికెట్... అది నో బాల్ ఎలా అవుతుంది? సిగ్గుపడు.. ఆటను అగౌరపరిచినందుకు నువ్వు, నీ మద్దతు దారులు సిగ్గుపడాలి’’ అని ట్విటర్ వేదికగా ఆమిర్‌కు కౌంటర్ ఇచ్చాడు. For people like you @iamamirofficial only Paisa paisa paisa paisa .. na izzat na kuch aur sirf paisa..bataoge nahi apne desh walo ko aur supporters ko k kitna mila tha .. get lost I feel yuk talking to people like you for insulting this game and making people fool with ur acts https://t.co/5aPmXtYKqm pic.twitter.com/PhveqewN6h— Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021 అదే విధంగా వరుస ట్వీట్లలో... ‘‘ఆమిర్ లాంటి వాళ్లకు పైసా.. పైసా.. పైసా.. పైసా... ఇజ్జత్ లేదు.. ఏం లేదు.. కేవలం డబ్బే కావాలి.. నీకు, నీ మద్దతుదారులకు ఎంత డబ్బు దొరికిందో చెప్పగలవా.. ఛీ యాక్.. నీలా ఆటకు కళంకం తెచ్చి.. ప్రేక్షకులను పిచ్చివాళ్లుగా భావించే వాళ్లతో నేను మాట్లాడను. గెట్ లాస్ట్’’ అంటూ భజ్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఫిక్సర్ బౌలింగ్‌లో సిక్సర్ అంటూ సిక్సర్ బాదిన ఓ వీడియో క్లిప్ షేర్ చేసి ఆమిర్‌ను తూర్పారబట్టాడు. హర్భజన్ ట్వీట్లు నెట్టింట చర్చకు దారితీశాయి. Fixer ko sixer.. out of the park @iamamirofficial chal daffa ho ja pic.twitter.com/UiUp8cAc0g — Harbhajan Turbanator (@harbhajan_singh) October 26, 2021 Pakistan Vs England 2010 Match Fixing: 2010లో ఏం జరిగింది? ఇంగ్లండ్- పాకిస్తాన్.. 2010లో లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ ఆడాయి. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. మూడు నోబాల్స్ పడ్డాయి. అయితే ఇందుకు సంబంధించిన అసలు నిజాలు రెండు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ భట్, బౌలర్లు మహ్మద్ ఆమిర్, మహ్మద్ ఆసిఫ్ అసలు స్వరూపాన్ని బయటపెట్టాయి. తనను తాను బుకీగా సల్మాన్ భట్‌తో పరిచయం చేసుకున్న జర్నలిస్టు మజర్ మజీద్.. అతడికి డబ్బు ఆశ చూపించాడు. ఇంగ్లండ్‌కు మేలు చేకూరేలా వ్యవహరించాలని కోరాడు. ఇందుకు అంగీకరించిన సల్మాన్... మొదటి రోజు ఆటలో ఆమిర్‌తో రెండు, ఆసిఫ్‌తో ఒక నో బాల్ వేయించాడు. బ్రిటన్‌కు చెందిన వార్తా సంస్థ... న్యూస్ ఆఫ్ ది వరల్డ్(ఇప్పుడు ఉనికిలో లేదు)చేపట్టిన ఈ స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను తమ టాబ్లాయిడ్లో బహిర్గతం చేసింది. క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసిన ఈ ఉదంతం పాకిస్తాన్ ప్రతిష్టను దిగజార్చింది. పాక్ ముగ్గురు క్రికెటర్లు దోషులుగా తేలారు. నిషేధం ఎదుర్కొన్నారు. జైలు పాలయ్యారు. అంతేకాదు.. ఈ వివాదం కారణంగా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి నిషేధించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. క్రికెట్ పుట్టిన గడ్డ మీదే ఇంతటి నీచమైన పనిచేస్తారా అంటూ ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. ఈ ఘటన నేపథ్యంలో కొంతకాలం పాటు నిషేధం ఎదుర్కొన్న ఆమిర్ 2016లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు అనుమతి పొందాడు. ఇక ఆసిఫ్ ఏడేళ్ల పాటు నిషేధం, ఏడాది జైలు శిక్ష అనుభవించాడు. సల్మాన్ భట్ ఇంతవరకు ఈ వివాదం తాలుకు మచ్చ చెరిపేసుకోలేకపోయాడు. చదవండి: T20 World Cup: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. అతడు టోర్నీ నుంచి అవుట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ మాజీ ఆటగాడు
Mohammad Amir Comments on Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్ 2021లో దాయాదుల పోరు కోసం సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. టీమిండియా, పాకిస్తాన్ మధ్య సమరానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో హై వొల్టేజ్ మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే భారత్‌తో తలపడే జట్టును పాక్ ప్రకటించింది. అయితే ప్రపంచకప్ లో ఇప్పటి వరకు భారత్ పై పాక్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు. ఈ సారి ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పాక్ భావిస్తుంటే.. మరో సారి దాయాది దేశంపై విజయం సాధించి టోర్నమెంట్లో శుభారంభం చేయాలని భారత్ ఉర్రూతలూగుతుంది. కాగా.. ఈ మ్యాచ్ నేపథ్యంలో భారత్ పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రాను పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రిదితో పోల్చడం అవివేకం అని అమీర్ తెలిపాడు. బుమ్రాకు ఉన్న అనుభవం అఫ్రిదికు ఇంకా లేదని.. షహీన్ ఇంకా చాలా నేర్చుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు. బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ అని కొనియాడాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల విషయానికి వస్తే.. ప్రత్యర్ధి బ్యాటర్లకు చెమటలు పట్టించడం బుమ్రా స్పెషల్ అని అమీర్ వెల్లడించాడు. చదవండి: T20 Worldcup 2021: భారత్‌తో తలపడే జట్టును ప్రకటించిన పాక్.. -
‘రోహిత్ శర్మను రెండు రకాలుగా బౌల్డ్ చేస్తా’
పరిమిత ఓవర్లలో లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో భారత జట్టు ఓపనర్ రోహిత్ శర్మ ఇబ్బంది పడతాడని పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమిర్ అన్నాడు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు బౌలింగ్ చేయడాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతానని అమిర్ పేర్కొన్నాడు. ఆ ఇద్దరితో కలిసి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాని పేర్కొన్న అమిర్.. వారిద్దరూ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడితే ఆ మజానే వేరుగా ఉంటుందన్నాడు. కోహ్లితో పోలిస్తే రోహిత్‌కు బౌలింగ్ చేయడం సులభమని పేర్కొన్నాడు. కోహ్లి ఒత్తిడిలో మెరుగ్గా రాణిస్తాడని తెలిపాడు. అయితే ఈ క్రమంలో వారిద్దరికి బౌలింగ్ చేయడం ఎప్పుడూ కఠినంగా అనిపించలేదని చెప్పుకొచ్చాడు. రోహిత్‌ను తాను ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్‌తో ఔట్ చేయగలనని తెలిపాడు ఈ మాజీ పాకిస్తానీ బౌలర్. ఇక 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అమిర్ పాకిస్తాన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్‌లో రోహిత్, ధావన్, కోహ్లిలనే ఆరంభంలోనే ఔట్ చేసి అమిర్ దెబ్బ కొట్టాడు. దాంతో ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం పాలైన కోహ్లి సేన.. రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. ఇటీవల జట్టు యాజమాన్యం తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ హైదరాబాదీ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు.. -
పీసీబీని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పాక్ క్రికెట్ బోర్డు పెద్దల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా విమర్శించాడు.అంతర్జాతీయ క్రికెట్‌కి గత ఏడాది గుడ్‌బై చెప్పిన అతను ఐపీఎల్లో ఆడేందుకు బ్రిటీష్ సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా అమీర్ వ్యవహారంపై కనేరియా స్పందిస్తూ.. '' ప్రతి ఒక్కరూ వాళ్ల అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఇక్కడ మహ్మద్ అమీర్‌ని నేనేమీ తప్పుబట్టడం లేదు. కానీ.. అతను తన స్టేట్మెంట్స్ ద్వారా ఇతరుల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ వెళ్లి.. అక్కడ బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ని తీసుకుని ఐపీఎల్లో ఆడతానని చెప్తున్నాడు. దీనిబట్టి అతని ఆలోచన తీరుని అర్థం చేసుకోవచ్చు'' అని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా ఇలానే బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ తరఫున గతంలో మ్యాచ్‌లు ఆడాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాది వ్యవధిలోనే స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతూ ఫిక్సింగ్‌కి పాల్పడటంతో అక్కడే జైల్లో కూడా కొన్ని రోజులు గడిపాడు. నిషేధం తర్వాత మళ్లీ పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. అంచనాలకి మించి రాణించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని పాక్ ఓడించి టోర్నీ విజేతగా నిలవడంలో అమీర్ క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. గత ఏడాది పీసీబీ తనని మెంటల్ టార్చర్‌కి గురిచేస్తోందని వాపోయిన అమీర్.. ఎవరూ ఊహించని రీతిలో 29 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. కాగా పాక్ తరపున అమీర్ 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు తీశాడు. చదవండి: ‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్ జరగలేదు’ టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష! -
మెంటల్ టార్చర్.. అందుకే ఇలా: క్రికెటర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. జట్టు యాజమాన్యం తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. ‘‘ఇకపై ఇంటర్నేనషనల్ క్రికెట్ ఆడటం నాకు ఇష్టం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు నేను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నాను. కానీ మేనేజ్మెంట్ నన్ను మానసిక వేధింపులకు గురిచేసింది. అది అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని 28 ఏళ్ల ఆమిర్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. (చదవండి: ‘కోహ్లికి కాదు.. మా బ్యాట్స్‌మన్‌కే కష్టం’) ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆమిర్ రిటైర్మెంట్ను ధ్రువీకరించింది. ఈ మేరకు... ‘‘ఈరోజు మధ్యాహ్నం పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ ఆమిర్‌తో మాట్లాడారు. తనకు ఇకపై ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఉద్దేశం లేదని అతడు చెప్పాడు. కాబట్టి ఇకపై సెలక్షన్ సమయంలో తనను పరిగణనలోకి తీసుకోం. రిటైర్మెంట్ అనేది ఆమిర్ పూర్తి వ్యక్తిగత నిర్ణయం. దానిని మేం గౌరవిస్తాం’’ అని పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ తరఫున 147 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆమిర్.. మొత్తంగా 259 వికెట్లు తీశాడు. 2009 టీ20 వరల్డ్ కప్, 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఆది నుంచి వివాదాస్పదమే 2010లో వెలుగులోకి వచ్చిన మహ్మద్ ఆమిర్ లెఫ్టార్మ్ పేసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి బౌలింగ్ శైలికి ఫిదా అయిన పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రం.. తాను చూసిన అత్యంత ప్రతిభావంతమైన ఫాస్ట్‌బౌలర్ అతడేనంటూ కొనియాడాడు. అలా ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఐదేళ్లపాటు సాఫీగా సాగిపోయిన ఆమిర్ ప్రయాణానికి స్పాట్ ఫిక్సింగ్ కేసు బ్రేక్ వేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అప్పటి కెప్టెన్ సల్మాన్‌బట్, మహ్మద్ ఆసిఫ్‌తో కలిసి ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడి నిషేధం ఎదుర్కొన్నాడు. అనేక పరిణామాల అనంతరం 2016లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో తిరిగి అడుగుపెట్టిన ఆమిర్.. చాంపియన్స్ ట్రోఫీ(2017)లో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. కాగా గతేడాది వన్డే ప్రపంచకప్‌లో మొత్తంగా 17 వికెట్లు తీసి పాక్ జట్టు బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఇక సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం.. లీగ్ క్రికెట్ ద్వారా డబ్బు సంపాదించేందుకే ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ పాక్ జట్టు బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ అతడిని విమర్శించాడు. అయితే తన శరీరం, ఆరోగ్య పరిస్థితి గురించి తనకు మాత్రమే తెలుసునని, తన నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ క్రమంలో జట్టు యాజమన్యంతో అతడికి విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే జట్టుతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో అతడికి చోటు లభించలేదు. అదే విధంగా న్యూజిలాండ్ పర్యటనకు కూడా ఆమిర్‌ను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో తాను ఆట నుంచి వైదొలుగుతున్నట్లు అతడు ప్రకటించడం గమనార్హం. -
‘కోహ్లికి కాదు.. మా బ్యాట్స్‌మన్‌కే కష్టం’
కరాచీ: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు బౌలింగ్ చేయడాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతానని పాకిస్తాన్ పేసర్ మహ్మద్ అమిర్ పేర్కొన్నాడు. ఆ ఇద్దరితో కలిసి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాని పేర్కొన్న అమిర్.. వారిద్దరూ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడితే ఆ మజానే వేరుగా ఉంటుందన్నాడు. సుదీర్ఘ కాలంగా భారత్-పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడం అమిర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. చాలాకాలంగా ఇరుజట్ల మధ్య సిరీస్‌లు జరగకపోవడం బాధాకరమన్నాడు. కాగా, కోహ్లిని ఔట్ చేయడం తనకు ఈజీ అని అంటున్నాడు అమిర్. ఒక ఇంటర్వ్యూలో కోహ్లి బౌలింగ్ చేయడం కష్టంగా అనిపిస్తోందా.. అనే ప్రశ్నకు కాదు అనే సమాధానమిచ్చాడు ఈ లెఫ్టార్మ్ పేసర్. కోహ్లి కంటే తమ దేశానికే చెందిన బాబర్ అజామ్‌కే బౌలింగ్ చేయడం కష్టమన్నాడు. ‘ టెక్నిక్ పరంగా చూస్తే కోహ్లి కంటే బాబర్ అజామ్ మేటి. అజామ్‌ను ఔట్ చేయాలంటే చాలా శ్రమించాలి. అజామ్‌కు ఔట్ సైడ్ వేస్తే దాన్ని డ్రైవ్ షాట్ ఆడతాడు. (లీగ్ ఆరంభమే కాలేదు.. అప్పుడే ఫిక్సింగ్ కలకలం) స్వింగ్ చేస్తే దాన్ని ఫ్లిక్ చేస్తాడు. నిజాయితీగా చెప్పాలంటే నేను నెట్స్‌లో అజామ్‌కు బౌలింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. నా బౌలింగ్‌లో ఔట్ అవ్వడం అనేది దాదాపు ఉండదు. నాకైతే టెక్నిక్ పరంగా కోహ్లి కంటే అజామ్ మెరుగ్గా కనిపిస్తాడు’ అని అమిర్ తెలిపాడు. గతంలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ టీ20లో కానీ, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ల్లో కానీ కోహ్లి-అమిర్‌ల మధ్య ఆసక్తికర పోరు నడిచిన సంగతి తెలిసిందే. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్‌లో రోహిత్‌ను అమిర్ ఆదిలోనే ఔట్ చేయగా, కోహ్లి అజేయంగా హాఫ్ సెంచరీ చేసి ఆదుకున్నాడు. అప్పుడు ఇరువురి మధ్యపోరులో కోహ్లినే పైచేయి సాధించాడు. ఆ తర్వాత ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లిపై అమిర్దే పైచేయి అయ్యింది. పాకిస్తాన్ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్‌లో రోహిత్, ధావన్, కోహ్లిలనే ఆరంభంలోనే ఔట్ చేసి అమిర్ దెబ్బ కొట్టాడు. దాంతో ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం పాలైన కోహ్లి గ్యాంగ్..రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. (ఐసీసీ అవార్డుల నామినేషన్లో కోహ్లి డామినేషన్) -
పాక్ సీనియర్ ఆటగాళ్లపై వేటు
కరాచీ: కొంత కాలంగా పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా తయారైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథులు షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లతోపాటు పేసర్ మొహ్మమ్మద్ అమీర్‌పై వేటు పడింది. జింబాబ్వేతో ఆరంభమయ్యే వన్డే, టి20 సిరీస్‌ల కోసం 22 మందితో కూడిన ప్రాబబుల్స్ జట్టులో వీరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చోటు కల్పించలేదు. అయితే ఇటీవల ముగిసిన దేశవాళీ టి20 లీగ్ నేషనల్ టి20 కప్‌లో రాణించిన సెంట్రల్ పంజాబ్ జట్టు యువ ఆటగాడు అబ్దుల్లా షఫీక్‌కు మొదటిసారి సీనియర్ జట్టులో స్థానం లభించింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని పేస్ ద్వయం హసన్ అలీ, నసీమ్ షా పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ను నియమించిన పీసీబీ... వైస్ కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను నియమించింది. పాక్, జింబాబ్వే మధ్య తొలి వన్డే ఈనెల 30న జరగనుండగా... నవంబర్ 1, 3వ తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం నవంబర్ 7, 8, 10వ తేదీల్లో మూడు టి20లు జరుగుతాయి. మా వీసాల అంశాన్ని ఐసీసీ చూస్తుంది భారత్‌లో ఆడేందుకు తలెత్తే వీసా ఇబ్బందులను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చూసుకుంటుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో టి20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది వీసాల బాధ్యత పూర్తిగా ఐసీసీదేనని పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ తెలిపారు. ఐసీసీ ఈ అంశంపై తమకు హామీ ఇవ్వాలని ఆయన చెప్పారు. అయితే దేనికైనా నిర్దిష్ట గడువు అంటూ ఉండాలని వచ్చే జనవరిదాకా ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు చెప్పారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమీప భవిష్యత్తులో ముఖాముఖి టోర్నీలు జరుగుతాయన్న ఆశలేవీ లేవని ఆయన చెప్పారు. -
వారిద్దరూ ఇంగ్లండ్ టూర్‌కు డుమ్మా
కరాచీ: ఒకవైపు కరోనా సంక్షోభం కొనసాగుతుండగానే క్రికెట్ టోర్నీలు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ పర్యటనకు వెస్టిండీస్ వెళ్లింది. గత మంగళవారం ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన వెస్టిండీస్..మూడు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది. జూలై 8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కాగా, వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌కు పాకిస్తాన్ పయనం కానుంది. అయితే ఇద్దరు పాక్ స్టార్ ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనకు డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాలను చూపిన పేసర్ మొహ్మద్ అమిర్, బ్యాట్స్‌మన్ హారిస్ సొహైల్‌లు ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యారు. ఆగస్టు నెలలో అమిర్ భార్య ప్రసవించే సమయం. దాంతో తాను ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం కుదరదని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు. (ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు...) ఇక సొహైల్ కుటుంబంతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో అతను కూడా ఆ పర్యటనకు సుముఖత వ్యక్తం చేయలేదు. కరోనా వైరస్ కారణంగా ఎవరైనా ఆటగాడు మహమ్మారి బారిన పడితే వేరే వాళ్లు అందుబాటులో ఉంచడం కోసం 28 మందిని ఇంగ్లండ్‌కు పంపించనుంది. అదే సమయంలో 14 మంది సపోర్టింగ్ స్టాఫ్‌ను ఇంగ్లండ్‌కు పంపించడానికి పీసీబీ సన్నద్ధమైంది. ఇదిలా ఉంచితే, ఈ నెల చివర్లో శ్రీలంక వేదికగా జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ను టీమిండియా రద్దు చేసుకుంది. ఇంకా కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో ఆ పర్యటనను రద్దు చేసుకుంది. శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళుతుందనే తొలుత వార్తలు వచ్చినా వాటిలో వాస్తవం లేదని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. భవిష్యత్తులో రద్దు చేసుకున్న టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లను ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసింది. (‘కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్.. కానీ ఐదేళ్లలో’) -
టీవీ సిరీస్‌లో నటించింది కోహ్లీనా!
కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలతోపాటూ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఇంట్లోని చిన్నా చితకా పనులు చేస్తూ, మిగిలిన సమయంలో ఎక్కువ శాతం టీవీలకే అతుక్కు పోతున్నారు. ఇక పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ తాను చూసే టీవీ సీరీస్‌లోని నటులను కూడా క్రికెటర్లతోనే పోల్చుకుంటున్నాడు. ప్రపంచంలోనే ఉత్తమ బ్యాట్స్‌మెన్ అంటూ ఇంతకు ముందు భారత కెప్టెన్‌ని ఆకాశానికెత్తిన ఈ ఫాస్ట్ బౌలర్ మరోమారు కోహ్లీని తలుచుకున్నాడు. ఇంట్లో ఓ టీవీ సిరీస్ చూస్తున్న సమయంలో కొద్దిగా కోహ్లీ పోలికలున్న నటుడు కనిపించడంతో వెంటనే ఓ ఫోటో తీసి తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. అన్నా నువ్వేనా ఇందులో ఉంది, కాస్త అయోమయంలో ఉన్నా అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. @imVkohli brother is it you m confused 😂 pic.twitter.com/kbwn31yjT6 — Mohammad Amir (@iamamirofficial) May 15, 2020 ఇక కోహ్లీలా కనిపించిన నటుడిపేరు కావిట్ సెటిన్ గోనర్. టర్కీష్కి చెందిన ‘దిరిలిస్ ఎర్టుగ్రుల్ ఘజ్’ సిరీస్‌లోనిది ఈ ఫోటో. మరోవైపు ఇస్లామిక్ చరిత్ర, అందులోని విలువలను చూపించే ‘దిరిలిస్ ఎర్టుగ్రుల్ ఘజ్’ సిరీస్‌ని చూడాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యువతకు ఇంతకు ముందే పిలుపునిచ్చారు. Prime Minister Imran Khan shares his views over PTV telecast of famous Turkish drama serial Diriliş: Ertuğrul; it will make our youth learn about Islamic history and ethics pic.twitter.com/pymAPbJFLr — Prime Minister's Office, Pakistan (@PakPMO) April 24, 2020 సరదాగా మహ్మద్ అమీర్ చేసిన కామెంట్‌కు నెటిజన్లు పెద్దఎత్తున తమ క్రియేటివిటీ జోడిస్తున్నారు. విరాట్ కోహ్లీలా కనిపించే మిగతావారిని పోల్చుతూ పోస్టులు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు సరదాగా పోస్ట్ చేసిన ఫోటోలు, వారి కామెంట్లు మీకోసం. లోవర్, మిడిల్, అప్పర్, ఎన్ఆర్ఐ, బీపీఎల్ విరాట్ కోహ్లీ నన్ను కోహ్లీతో పోల్చడం మిస్సయ్యారా? స్పెయిన్ కోహ్లీ(ఎడమ), విరాట్ కోహ్లీని కలవండి... పోల్చినందకు తిట్టొద్దు (కుడి) -
‘నేనే చివరి ఫిక్సర్‌ను కాదు కదా’
కరాచీ: ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారని అందులో తాను ఒకడినని అంటున్నాడు పాకిస్తాన వెటరన్ పేసర్ మహ్మద్ అసిఫ్. 2010లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఆపై ఏడేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న అసిఫ్.. మళ్లీ పాకిస్తాన్ జట్టులో కనిపించలేదు. అప్పట్లో అసిఫ్‌పై ఉన్న నిషేధాన్ని ఐదేళ్లకు తగ్గించినా ఆ తర్వాత అతనికి పాక్ జట్టులో పునరాగమనం చేసే అవకాశం రాలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లలో కొంతమందికి తిరిగి జాతీయ జట్టులో ఆడే అవకాశం ఇచ్చినా తనకు మాత్రం రెండో చాన్స్ ఇవ్వలేదని అంటున్నాడు అసిఫ్. తన సహచర బౌలర్, మహ్మద్ అమిర్ కూడా ఫిక్సింగ్‌లో ఇరుక్కొన్నప్పటికీ మళ్లీ రీఎంట్రీ చేయడాన్ని అసిఫ్ పరోక్షంగా ప్రస్తావించాడు. (‘నో డౌట్.. ఆ సామర్థ్యం కోహ్లిలో ఉంది’) ‘నా కంటే ముందు ఫిక్సింగ్ చేసిన వాళ్లు కావొచ్చు.. నాతో పాటు ఫిక్సింగ్ చేసిన వారు కావొచ్చు. నా తర్వాత ఫిక్సింగ్స్ చేసిన వాళ్లు కావొచ్చు.. ఎవరికైనా రెండో అవకాశం అనేది ఉంటుంది. ప్రతీ ఒక్కరిలాగా నేను కూడా తప్పు చేశా. ఇక్కడ ఫిక్సింగ్ చేసిన వేరే వాళ్లకి ఆడే అవకాశం ఇచ్చి నాకు ఎందుకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికీ ఒక్కో తీరుగా ఉంటుందా పీసీబీ విధానం. ఫిక్సింగ్‌కు పాల్పడిన కొంతమంది క్రికెటర్లను పీసీబీ కాపాడింది. పీసీబీ మనుషులు కాబట్టి వారిని రక్షించుకుంది. నన్ను ఏ విషయంలోనూ పట్టించుకోలేదు.పాకిస్తాన్ క్రికెట్లో నేనే చివరి ఫిక్సర్‌ను అన్నట్లు ట్రీట్ చేస్తున్నారు. నా తర్వాత కూడా చాలా మంది ఫిక్సింగ్ చేశారు. వారికి కూడా పీసీబీ అవకాశం ఇచ్చింది. కొంతమంది ఏకంగా పీసీబీలోనే ఉన్నారు’ అంటూ అసిఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడితో తన ప్రపంచం ఏమీ అయిపోలేదని, జరిగిపోయిందేదో జరిగిందని, ఇక జరగాల్సింది మాత్రమే ఉందన్నాడు. తన కెరీర్లో చాలా క్రికెట్‌ను ఆడేశానని అసిఫ్ పేర్కొన్నాడు. తాను క్రికెట్ ఆడే సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు లభించిందన్నాడు. తానెప్పుడు స్వార్థ పరుడిలా ఉండేవాడినని చాలా మంది అంటారనీ, అది వికెట్లు తీసి జట్టును గెలిపించాలనే స్వార్థం మాత్రమేనన్నాడు. జట్టు విజయం కోసం ఎప్పుడూ శ్రమించేవాడినని, ఒకవేళ అదే స్వార్థమైతే తాను ఏమీ చేయలేనని అసిఫ్ పేర్కొన్నాడు.(కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు..) -
కోహ్లికి ఫిదా అయిన పాక్ స్టార్ పేసర్..
ముంబై: ఐసీసీ వన్డేల్లో స్పిరిట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ స్టార్ పేసర్ మొహమ్మద్ ఆమీర్ ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లోనే విరాట్ కోహ్లి అత్యుత్తమ ఆటగాడని.. ఏ బౌలర్‌కైనా కోహ్లి వికెట్ లభిస్తే గొప్ప బహుమతిగా భావిస్తారని ఆమీర్ అన్నాడు. ఈ ట్వీట్‌పై ఆమీర్, కోహ్లి అభిమానులు స్పందించారు. అభిమానులు స్పందిస్తూ..ఇద్దరు అత్యన్నత నైపుణ్యాలున్న క్రికెటర్లంటూ తమ క్రికెటర్ల పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆమీర్ అత్యుత్తుమ బౌలరంటూ గతంలో కోహ్లి కితాబిచ్చిన విషయం తెలిసిందే. 2019సంవత్సరానికి గాను ఐసీసీ బుధవారం అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను ట్విటర్లో ఆమీర్ పోస్ట్ చేశారు. 2019 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లో కోహ్లి, ఆమీర్ చివరిసారిగా తలపడ్డారు. పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లో భారత్ 89పరుగులతో విజయం సాధించింది. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించి.. వీరోచిత ఫామ్‌లో ఉన్న కోహ్లికి ఐసీసీ స్పిరిట్ క్రికెటర్ అవార్డును ప్రకటించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. A lovely moment in a special year of cricket.@imVkohli discusses the importance of playing cricket in the right way 👏 #ICCAwards pic.twitter.com/u3x44GFqQQ — ICC (@ICC) January 15, 2020 -
వహాబ్ రియాజ్ గుడ్ బై?
కరాచీ: కొన్నిరోజుల క్రితం పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. ఇక తాను టెస్టు క్రికెట్ ఆడనంటూ ఉన్నపళంగా ప్రకటన చేయడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో అలజడి రేపింది. దీనిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తుపోశారు కూడా. 27 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుని పాక్ క్రికెట్‌కు ద్రోహం చేశావంటూ షోయబ్ అక్తర్ ఘాటుగా విమర్శించాడు. అదే సమయంలో ఆమిర్ తర్వాత రియాజ్ టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నాడా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశాడు అక్తర్. ఇప్పుడు అదే నిజమైనట్లు కనబడుతోంది. తాజాగా 34 ఏళ్ల వహాబ్ రియాబ్ టెస్టులకు వీడ్కోలు చెప్పాడట. ఇప్పటికే ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడని, ఇక కేవలం సాధారణ ప్రకటన మాత్రమే చేయాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ 27 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రియాజ్ 83 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 5/63గా ఉంది. చివరిసారి 2018 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ ఆడాడు రియాజ్. -
నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా?
కరాచీ: ఇటీవల టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్‌పై ఆ దేశ మాజీలు విమర్శనాస్త్రాలు సంధించారు. టెస్టు ఫార్మాట్‌ను వదిలి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమిర్ పేర్కొనడం పలువురు దిగ్గజ క్రికెటర్లను విస్మయానికి గురి చేసింది. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పి పాక్ క్రికెట్‌కు ద్రోహం చేశాడంటూ షోయబ్ అక్తర్ ఘాటుగా స్పందించాడు. ఇది ఆమిర్ తొందరపాటు నిర్ణయమని వసీం అక్రమ్ సైతం పేర్కొన్నాడు. ఆమిర్ ఇంగ్లండ్‌కు మకాం మార్చనున్నాడని వార్తలు కూడా వ్యాపించాయి. ఇలా ఆమిర్‌పై వరుస పెట్టి విమర్శలు రావడంతో అతని భార్య నర్గీస్ మాలిక్ వాటిని తిప్పికొట్టే యత్నం చేశారు. ‘ నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘ పాకిస్తాన్ క్రికెటర్‌గా ఆమిర్ ఎంతో గర్విస్తాడు. అతని నిజాయితీని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఆమిర్ టెస్టు రిటైర్మెంట్పై ఎవ్వరికీ సమాధానం చెప్పాల్పిన పనిలేదు. ప్రజలంతా ఆమిర్‌కు మద్దతుగా ఉన్నారు. ఇంగ్లండ్‌కు ఆడాల్సిన అవసరం ఆమిర్‌కు లేదు. పాకిస్తాన్‌కు తప్ప మరే దేశానికి ఆమిర్ ప్రాతినిథ్యం వహించడు. పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడటాన్ని ఆమిర్ ఎంతగానో ఆస్వాదిస్తాడు. ఒకవేళ మా కూతురు క్రికెట్ ఆడాలనుకుంటే పాక్‌కే ఆడుతుంది కానీ ఇంగ్లండ్‌కు కాదు. ఆమిర్ రిటైర్ అయ్యింది కేవలం టెస్టు క్రికెట్ నుంచే కానీ ఓవరాల్ క్రికెట్ నుంచి కాదనే విషయం తెలుసుకోవాలి. వన్డేలు, టీ20ల్లో దేశం గర్వించేలా ఆమిర్ ఆడతాడు’ అని బ్రిటీష్ సంతతికి చెందిన నర్గీస్ పేర్కొన్నారు. -
ఇంగ్లండ్‌కు ఆమిర్ మకాం!
కరాచీ: రెండు రోజుల క్రితం టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాకిస్తాన్ స్టార్ పేసర్ మహ్మద్ ఆమిర్.. ఇంగ్లండ్‌కు మకాం మార్చనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్లో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్న ఆమిర్ తన కెరీర్‌ను ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో కొనసాగించాలనే యోచనలో ఉన్నాడట. ఆ క్రమంలోనే ముందుగా టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి షాకిచ్చాడు. దాంతో ఆమిర్‌పై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కే గుడ్ బై చెప్పి పాక్ క్రికెట్‌ను మరింత కష్టాల్లోకి నెట్టావంటూ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విమర్శించాడు. అసలు నీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్ క్రికెట్ ఆడకుండా చేయాలంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంచితే, మొత్తంగా దేశమే మారిపోతే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఆమిర్ ఉన్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటీష్ పౌరసత్వం కల్గిన నర్గీస్ మాలిక్‌ను ఆమిర్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకోవడంతో అతనికి ఇంగ్లండ్‌లో సెటిల్ కావడానికి అవకాశం ఉంది. భార్య వీసా మీద ఆమిర్ ఇంగ్లండ్‌లో స్థిరపడే అవకాశం ఉన్నందను ఇప్పుడు ఆ ప్లానింగ్‌లోనే ఉన్నాడట. అక్కడే ఇల్లు కొనడానికి ఆమిర్ సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంకా తన క్రికెట్ కెరీర్ ఎంతో నేపథ్యంలో దాన్ని ఇంగ్లండ్ తరఫున పరీక్షించుకోవాలనేది ఆమిర్ ప్రధాన ఉద్దేశంగా కనబడుతోందనేది వార్తల సారాంశం. ప్రస్తుతం ఇంగ్లండ్ ప్రధాన జట్టును పరిశీలిస్తే స్వదేశీ క్రికెటర్ల కంటే విదేశీ క్రికెటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(ఐర్లాండ్), బెన్ స్టోక్స్(న్యూజిలాండ్), జోఫ్రా ఆర్చర్(వెస్టిండీస్)తదితరులు ఇలా ఇంగ్లండ్‌కు దిగుమతి అయినవారే. ఇప్పటికే పాకిస్తాన్ తరఫున తానేంటో నిరూపించుకున్న ఆమిర్.. ఇంగ్లండ్ జట్టు తరఫున ఆడటం ఏ మాత్రం కష్టం కాదు. దాంతోనే తన ఇంగ్లండ్ మకాం ప్రణాళికల్లో ఆమిర్ ఉన్నట్లు సమాచారం. గత ఏడాది కాలంగా ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. (ఇక్కడ చదవండి: మీలాంటి వాళ్లను క్రికెట్ ఆడకుండా చేసేవాడ్ని!) -
మీలాంటి వాళ్లను క్రికెట్ ఆడకుండా చేసేవాడ్ని!
కరాచీ: టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్‌పై ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నిప్పులు చెరిగాడు. టెస్టు ఫార్మాట్‌ను వదిలి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమిర్ పేర్కొనడం అక్తర్‌కు తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. అసలు మీలాంటి వాళ్లను ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడకుండా చేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఒకవేళ తానే సెలక్షన్ కమిటీలో ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే క్రికెటర్లను ఏ ఫార్మాట్లో ఎంపిక కాకుండా చేసేవాడినని అక్తర్ విమర్శించాడు. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం అసలు న్యాయంగా అనిపిస్తోందా అంటూ మండిపడ్డాడు. (ఇక్కడ చదవండి: మహ్మద్ ఆమిర్ సంచలన నిర్ణయం) ‘నీకు ఇంకా బోలెడు క్రికెట్ ఉంది. ఈ సమయంలో టెస్టు క్రికెట్ నుంచి వైదొలుగుతావా. ఇప్పటికే పాకిస్తాన్ టెస్టు క్రికెట్ అంతంతమాత్రంగా ఉంది. అటువంటి తరుణంలో దేశానికి ఇచ్చేది ఇదేనా. నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకున్నప్పుడు పాకిస్తాన్ క్రికెట్ చాలా ఖర్చు పెట్టింది. నీకు ఎన్నో చాన్స్‌లు ఇచ్చి రాటుదేలేలా చేసింది. ఫామ్‌లో ఉన్న సమయంలో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటావా. నీలాగే మిగతా క్రికెటర్లకు కూడా ఆలోచిస్తే పరిస్థితి ఏమవుతుంది. నీ తర్వాత హసన్ అలీ, వహాబ్ రియాజ్‌లు లైన్లో ఉన్నారా. మేము మీలాగే క్రికెట్ ఆడామా. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల్లో పాకిస్తాన్ సిరీస్‌లు గెలిచిన సమయంలో నేను గాయంతోనే బరిలోకి దిగా. అసలు పాక్ క్రికెట్లో ఏమి జరుగుతుంది. దీనిపై పీసీబీ సీరియస్‌గా దృష్టి సారించాలి. 27 ఏళ్లకే రిటైర్మెంట్ చెబితే, అది మిగతా ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక పాకిస్తాన్ క్రికెట్‌ను ప్రధాని ఇమ్రాన్ ఖానే బతికించాలి. పాక్ క్రికెట్లో పూర్వ వైభవం రావాలంటే గట్టి చర్యలకు శ్రీకారం చుట్టాలి’ అని అక్తర్ పేర్కొన్నాడు. శుక్రవారం ఆమిర్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇది పాక్ క్రికెట్లో అలజడి రేపింది. ప్రధానంగా పాక్ మాజీ క్రికెటర్లు.. ఆమిర్ నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇదొక బాధ్యతారాహిత్య నిర్ణయమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.( ఇక్కడ చదవండి: ఆమిర్ తొందరపడ్డాడు : వసీం అక్రం) -
ఆమిర్ తొందరపడ్డాడు : వసీం అక్రం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తెలిపాడు. టెస్టు ఫార్మాట్లో పాక్ జట్టుకు ఆమిర్ అవసరం చాలా ఉందన్నాడు. ‘మహ్మద్ ఆమిర్ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే 28 ఏళ్ల వయసులోనే క్రికెట్లో గొప్ప ఫార్మాట్ అయిన టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పడం. పైగా పాకిస్తాన్ జట్టుకు అతని అవసరం ఎంతో ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలోని రెండు టెస్ట్‌లు, ఇంగ్లండ్‌లో మూడు టెస్ట్‌లకు జట్టులో అతను ఉండటం ముఖ్యం’ అని వసీం ట్వీట్ చేశాడు. ఇక షోయబ్ అక్తర్ సైతం ఆమిర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. To me Mohammad Amir retiring from Test cricket is a bit surprising because you peak at 27-28 and Test cricket is where you are judged against the best, it’s the ultimate format. Pakistan will need him in two Tests in Australia and then three in England. — Wasim Akram (@wasimakramlive) July 26, 2019 ప్రధానంగా వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న తరుణంలో అందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భావించే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. ‘ పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడాలనేది నా ఏకైక కోరిక. పాకిస్తాన్ క్రికెట్‌కు సాధ్యమైనంత వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే నేను దృష్టి సారించా. రాబోవు పరిమిత ఓవర్ల సిరీస్‌లను నేను చాలెంజ్‌గా తీసుకుంటున్నా. కేవలం వైట్ బాల్ క్రికెట్‌పైనే ఫోకస్ చేయాలనుకుంటున్నా’ అని ఆమిర్ తెలిపాడు. ఆమిర్ 17 ఏళ్ల వయసులోనే 2009లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా టెస్ట్ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆమిర్ 119 వికెట్లు సాధించాడు. నాలుగేసి వికెట్లను ఆరు సార్లు తీసిన ఆమిర్.. ఐదు వికెట్లను నాలుగు సందర్బాల్లో సాధించాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో ఆమిర్ 44 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇదే అతని అత్యుత్తమ టెస్టు ప్రదర్శన. -
మహ్మద్ ఆమిర్ సంచలన నిర్ణయం
కరాచీ: పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉన్నపళంగా టెస్టు ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగాలనుకుంటున్న ఆమిర్.. తాజాగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. ప్రధానంగా వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనున్న తరుణంలో అందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భావించే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమిర్ పేర్కొన్నాడు. ‘ పాకిస్తాన్ తరఫున క్రికెట్ ఆడాలనేది నా ఏకైక కోరిక. పాకిస్తాన్ క్రికెట్‌కు సాధ్యమైనంత వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే నేను దృష్టి సారించా. రాబోవు పరిమిత ఓవర్ల సిరీస్‌లను నేను చాలెంజ్‌గా తీసుకుంటున్నా. కేవలం వైట్ బాల్ క్రికెట్‌పైనే ఫోకస్ చేయాలనుకుంటున్నా’ అని ఆమిర్ తెలిపాడు. ఆమిర్ 17 ఏళ్ల వయసులోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2009లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లోకి రంగ ప్రవేశం చేశాడు. ఇప్పటివరకూ 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆమిర్ 119 వికెట్లు సాధించాడు. నాలుగేసి వికెట్లను ఆరు సార్లు తీసిన ఆమిర్.. ఐదు వికెట్లను నాలుగు సందర్బాల్లో సాధించాడు. పాట్ ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నమొహమద్ ఆమిర్.. 2016లో పునరాగమనం చేశాడు. అయితే ఆమిర్ జాతీయ జట్టులోకి పునరాగమనం తర్వాత మరింత రాటుదేలాడు. 2016 నుంచి ఇప్పటివరకూ 22 టెస్టులు ఆడిన ఆమిర్ 68 టెస్టు వికెట్లు సాధించాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో ఆమిర్ 44 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఇదే అతని అత్యుత్తమ టెస్టు ప్రదర్శన. -
విజృంభించిన ఆఫ్రిది.. విలవిల్లాడుతున్న కివీస్
బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు పాక్ బౌలర్లు అసలైన పేస్ రుచి చూపించారు. దీంతో బ్లాక్ క్యాప్స్ 46 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4)ను తన తొలి ఓవర్ తొలి బంతికే వెనక్కి పంపించిన అమిర్ కివీస్ వికెట్ల పతనం ప్రారంభించాడు. అనంతరం మరో లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ ఆఫ్రిది.. కోలిన్ మున్రో(12), రాస్ టేలర్(3), లాథమ్(1)లను పెవిలియనకు పంపించి కివీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక ప్రస్తుతం కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించాలంటే సారథి కేన్ విలియమ్సన్ చేతిలోనే ఉంది. ఇప్పటికే ఈ సీజన్లో రెండు శతకాలతో జట్టును ఆదుకున్న అతడు పాక్ మ్యాచ్‌లో ఏ మేరకు రాణాస్తాడో చూడాలి. ఇక ఈ మ్యాచ్ పాక్‌కు చావోరేవో లాంటిదే. కివీస్‌పై ఓడిపోతే సెమీస్ అవకాశాలు పాక్‌కు సన్నగిల్లుతాయి. దీంతో గెలుపే లక్ష్యంగా పాక్ ఆటగాళ్లు బరిలోకి దిగారు. -
సర్ఫరాజ్ సీటుకు ఎసరు.. ఆడియో క్లిప్ సంచలనం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ జట్టులో గ్రూప్ రాజకీయాలు చోటుచేసుకున్నాయా? ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారా? కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాటను ఆటగాళ్లెవరు ఖాతరు చేయడం లేదా? అంటే అవుననే అంటున్నాయి.. పాక్ మీడియా వర్గాలు. పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్, ఆల్‌రౌండర్ ఇమాద్ వసీంల నేతృత్వంలో ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారని, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాటలను ఖాతరు చేయడం లేదని ఆ దేశ మీడియా కథనాలు వడ్డిస్తోంది. ఈ గ్రూప్ రాజకీయాల వ్యవహారంలో పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ హస్తం కూడా ఉందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్ఫరాజ్ మైదానంలో వ్యూహాలు రచించలేకపోయాడని, ఆటగాళ్ల వర్గపోరుతో అతను ప్రశాంతత కోల్పోయాడని తెలుపుతున్నాయి. ముఖ్యంగా ఇమామ్ ఉల్ హక్, ఇమాద్ వసీం, షోయబ్ మాలిక్‌లు సర్ఫరాజ్‌ను ఏమాత్రం లెక్కచేయడం లేదంటున్నాయి. ఇక భారత్‌తో ఘోర ఓటమి అనంతరం సర్ఫరాజ్ జట్టు ఆటగాళ్లను మందలించాడని, గ్రూప్ రాజకీయాలు విడిచిపెట్టి కనీసం టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా బాగా ఆడాలని సూచించినట్లు పేర్కొంటున్నాయి.. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే..? తనతో పాటు స్వదేశంలో ఒంటరిగా ఎవరూ అడుగు పెట్టలేరని సర్ఫరాజ్ హెచ్చరించినట్లు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియోక్లిప్ ఆ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ అధికారి, నటుడు రాజు జమిలి మాట్లాడినట్లుగా ఉన్న ఆ ఆడియోక్లిప్.. ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో దుమరాన్ని రేపుతోంది. ఆ ఆడియోలో పాక్ జట్టులో ఇమామ్ , ఇమాద్, షోయబ్ మాలిక్‌లు సర్ఫరాజ్‌ను ఖాతరు చేయడం లేదని, ఆటగాళ్లు మహ్మద్ ఆమిర్, ఇమాద్ గ్రూప్‌లుగా విడిపోయారన్న రాజు జమిలి.. ఈ గ్రూప్ రాజకీయాల్లో చీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ పాత్ర కూడా ఉందన్నారు. సర్ఫరాజ్‌ను జట్టు నుంచి దూరం చేయడానికి కొంత మంది ఆటగాళ్లు కుట్రపన్నుతున్నారని తెలిపారు. ఓ యాడ్ షూటింగ్లో భాగంగా తనకు షోయబ్ మాలిక్ తారాసపడ్డాడని, సర్ఫరాజ్ అహ్మద్ ఆధిపత్యాన్ని అణగదొక్కడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడని రాజు జమిలి అన్నట్లు ఆ ఆడియోక్లిప్‌లో ఉంది. రాజు జమిలి ఆరోపణలపై స్పందించిన పీసీబీ.. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. అతనిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొంది. Raju Jamil claimed that there is an on-going rift between Sarfaraz Ahmed and Shoaib Malik. The astonishing claims made by Raju Jamil indicated that chief selector Inzamam-ul-Haq is also involved in the matter. pic.twitter.com/wDF0zl70fl — ĪbráhīmOvíç (@connectwithibbi) June 15, 2019 -
శతక్కొట్టిన వార్నర్.. పాక్ లక్ష్యం 308
టాంటన్: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రపంచకప్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తునే ఉన్నాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అర్దసెంచరీతో రాణించిన వార్నర్ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. దీంతో బుధవారం స్థానిక మైదానంలో జరగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు 308 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. ఆసీస్ ఆటగాళ్లలో వార్నర్(107; 111 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్సర్) శతకం సాధించగా.. ఫించ్(82; 84 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. పాక్ బౌలర్లలో అమిర్(5/30), షాహిన్ ఆఫ్రిది(2/70)లు రాణించారు. అమిర్ ఆగయా.. ఆసీస్‌ను భారీ స్కోర్ చేయకుండా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమిర్ అడ్డుకున్నాడు . ప్రమాదకరంగా మారుతున్న ఓపెనింగ్ జోడిని ఔట్ చేసి తన వికెట్ల వేటను ప్రారంభించాడు. అనంతరం షాన్ మార్స్(23), ఉస్మాన్ ఖవాజా(18), అలెక్స్ కేరీ(20)లను ఔట్ చేసి మిడిలార్డర్‌ను కూలగొట్టి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వరుస విరామంలో వికెట్లు తీస్తూ డిఫెండింగ్ చాంపియన్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో పరుగుల విషయం పక్కకు పెట్టి వికెట్లను కాపాడుకోవడానికే ఆసీస్ బ్యాట్స్‌మెన్ నానా తంటాలు పడ్డారు. వార్నర్, ఫించ్‌లు రాణించడంతో ఫస్ట్ హాఫ్‌లో ఆసీస్‌దే పై చేయి. కానీ అమిర్ ఎంట్రీ అయ్యాక సెకండ్ హాఫ్‌లో ఆసీస్ చతికలపడింది. ఓపెనర్లు మినహా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. తొలుత ఇద్దరు ఓపెనర్లు ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురుకున్న అనంతరం గేర్ మార్చి పరుగుల వరద పారించారు. ముఖ్యంగా సారథి ఫించ్ పాక్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. అయితే తొలి వికెట్‌కు 146 పరుగులు జోడించిన అనంతర పించ్‌ను అమిర్ పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా వార్నర్ తనదైన రీతిలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే శతకం పూర్తి చేసిన వార్నర్‌ను ఆఫ్రిది ఔట్ చేస్తాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మన్ ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో 350 పరుగులకి పైగా స్కోర్ సాధిస్తుందనుకున్న ఆసీస్ చివరికి 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. చదవండి: పాక్‌తో మ్యాచ్: ఆసీస్ ఓపెనర్ల అరుదైన ఘనత కోహ్లిని తప్పుబట్టిన మాజీ క్రికెటర్ -
పాక్ ప్రపంచకప్ జట్టులో భారీ మార్పులు!
ఇస్లామాబాద్: మరో 10 రోజుల్లో మెగాటోర్నీ ‘ప్రపంచకప్’ ఆరంభంకానుండగా పాకిస్తాన్ జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు ఖాయమని ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో ముగ్గురి ఆటగాళ్లపై వేటు వేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరో ముగ్గురి ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో పాకిస్తాన్ స్పీడ్‌స్టార్ మహ్మద్ అమిర్‌కు పీసీబీ అవకాశం కల్పించింది. అమిర్‌తో పాటు వాహబ్ రియాజ్, అసిఫ్ అలీలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. ఇక ఈ ముగ్గురి ఎంట్రీతో అబిద్ అలీ, ఫహీమ్ ఆష్రఫ్, జునైద్ ఖాన్లు ఉద్వాసనకు గురయ్యారు. ప్రపంచకప్ ఆడటం ఖాయమనుకున్న ఈ ఆటగాళ్లు పీసీబీ తాజా నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు. ఈ మార్పుల విషయాన్ని పాక్ ఛీఫ్ సెలక్టర్ ఇంజుమామ్ ఉల్ హక్ సోమవారం మీడియాకు తెలిపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తమ ఆటగాళ్లు ఆశించినస్థాయిలో రాణించలేకూపోయారని, అందుకే జట్టు కూర్పుపై మరోసారి కసరత్తు చేసినట్లు ఇంజుమామ్ చెప్పుకొచ్చాడు. రివర్స్ స్వింగ్ ప్రత్యేకతనే వాహబ్‌ను జట్టులోకి ఎంపిక చేసేలా చేసిందన్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 5 వన్డేల సిరీస్‌లో పాక్ 0-4తో చిత్తుగా సిరీస్ కోల్పోయింది. ఇక మే 23 వరకు ఆయా జట్లు తమ ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఐసీసీ కల్పించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న అసీఫ్ అలీ ఇంట తీవ్ర విషాదం నెలకుంది. క్యాన్సర్‌తో పోరాడుతూ అతడి రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా ఆదివారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రపంచకప్ జట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజమ్, హ్యారిస్ సోహైల్, అసీఫ్ అలీ, షోయబ్‌మాలిక్, మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహిన్ అఫ్రిదీ, మహ్మద్ అమిర్, వాహబ్ రియాజ్, మహ్మద్ హస్నైన్ -
పాక్ వరల్డ్‌కప్ జట్టులోకి ఆమిర్ ఆగయా..
కరాచీ: పాకిస్తాన్ లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఆమిర్ వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లే జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. ముందుగా ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకోని ఆమిర్.. వరల్డ్‌కప్ కొద్ది రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో జట్టులోకి వచ్చాడు. గురువారం పీసీబీ సెలక్టర్లు ఆమిర్‌ను పాక్ క్రికెట్ జట్టులో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆమిర్ ఫామ్‌లో లేకపోవడంతో తొలుత ప్రకటించిన జాబితాలో అతనిపై పీసీబీ సెలక్టర్లు నమ్మకం ఉంచలేదు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న పాక్ జట్టు అక్కడి పిచ్‌లపై అంతగా ఆకట్టుకోవడం లేదు. పాక్ బౌలర్లను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చీల్చి చెండాడటంతో ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగం ఆందోళనకరంగా మారింది. దాంతో చీఫ్ సెలెక్టర్ ఇంజమాముల్ హక్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తమ తప్పును దిద్దుకునే పనిలో పడింది. ముఖ్యంగా పేస్ బౌలర్లు తేలిపోతుండటంతో పునరాలోచనలో పడ్డ సెలెక్షన్ కమిటీ సీనియర్ పేసర్ ఆమిర్‌కు జట్టులో చోటు కల్పించింది. ఇక వేరే ప్రత్యామ్నయ మార్గం లేకపోవడంతో ఆమిర్‌ను ఉన్నపళంగా వరల్డ్‌కప్ జట్టులో చేర్చింది. అయితే. ప్రస్తుతం చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్న ఆమిర్ ఈ నెల 30 వరకు కోలుకుంటాడా లేదా అన్నది సందేహంగా మారింది. -
అమిర్‌ను పక్కన పెట్టేశారు..
కరాచీ: గత కొన్ని నెలలుగా బౌలింగ్‌లో విఫలమవుతున్న పాకిస్తాన్ లెఫ్మార్మ్ పేసర్ మహ్మద్ అమిర్‌కు మరోసారి ఉద్వాసన తప్పలేదు. యూఏఈ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20 సిరీస్‌లో అమిర్‌కు చోటు దక్కలేదు. స్పాట్ ఫిక్సింగ్ నిషేధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ జట్టులో పునరాగమనం చేసి కీలక బౌలర్‌గా మారిపోయిన అమిర్.. కొంత కాలంగా ఆశించిన మేర రాణించడం లేదు. దాంతో ఇటీవల ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్ కూడా అమిర్‌ను ఎంపిక చేయలేదు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు చోటు దక్కుతుందని భావించిన అమిర్‌ను ఈసాకి కూడా పాక్ సెలక్టర్లు పట్టించుకోలేదు. ఆసీస్‌పై సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన జట్టునే కొనసాగించేందుకు మొగ్గుచూపారు. ఆ క్రమంలోనే అమిర్‌పై వేటు తప్పలేదు. కాగా, గత నెలలో న్యూజిలాండ్ ‘ఎ’తో సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ ‘ఎ’ తరపున ఆడిన వకాస్ మజ్జూద్‌ను మరోసారి ఎంపిక చేశారు. ఆసీస్‌తో సిరీస్‌కు మజ్జూద్‌ను ఎంపిక చేసినప్పటికీ అతనికి ఆడే అవకాశం లభించలేదు. -
కోహ్లిని అప్పుడు అలా ఔట్ చేశా: పాక్ బౌలర్
ఇస్లామాబాద్ : చాంపియన్స్ ట్రోఫీ-2017 టోర్నీలో ఆసాంతం ఆకట్టుకున్న టీమిండియా ఫైనల్లో దాయదీ పాకిస్తాన్ చేతి ఖంగుతిన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌కు చేర్చి పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ భారత పతానాన్ని శాసించాడు. తాజాగా వాయిస్ ఆఫ్ క్రికెట్ షోలో ఈ పేస్ బౌలర్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ తీయడం వెనుకున్న తన వ్యూహం ఎంటో తెలియజేశాడు. ‘రోహిత్ శర్మను ఔట్ చేయడానికి ఉపయోగించిన ఇన్ స్వింగ్ బంతినే కోహ్లికి ప్రయోగించా. కానీ అతను నా వ్యూహాన్ని పసిగట్టి చక్కగా ఆడాడు. అనంతరం కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను మా ఫీల్డర్ చేజార్చాడు. దీంతో ఈ అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకోని చెలరేగుతాడని భావించాను. కానీ ఎలాగైన అతని వికెట్ పడగొట్టాలని దేవున్ని ప్రార్థించాను. మరుసటి బంతికే షాదాబ్‌ఖాన్ అద్భుత క్యాచ్‌తో కోహ్లి వికెట్ దక్కింది.’ అని నాటి రోజును ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. సచిన్ టెండూలర్క్, కోహ్లిలలో తనకు ప్రత్యేకమైన వికెట్ ఏది అన్న ప్రశ్నకు సచిన్‌దేనని అభిప్రాయపడ్డాడు. ‘ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మెన్. కానీ సచిన్ వికెటే నాకు ప్రత్యేకం. ఎందుకంటే సచిన్‌కు ప్రత్యర్థిగా నేను ఆడితే. అప్పుడు నేను జట్టుకు కొత్త. కాబట్టి నాకు సచిన్ వికెట్ ప్రత్యేకం అవుతోంది.’ అని తెలిపాడు. ఈ ఫైనల్లో ఆమిర్ భారత టాపార్డర్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పెవిలియన్ చేర్చి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఓవర్లోనే తన ఇన్‌స్వింగ్ బంతితో వికెట్లు ముందు రోహిత్‌ను బోల్తాకొట్టించాడు. హర్దిక్ పాండ్యా(76) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమవడంతో భారత్ 180 పరుగుల ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: కోహ్లి, నేను అందుకే నవ్వుకున్నాం -
కోహ్లి కాదు.. మాట మార్చాడు!
హరారే: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి-పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అమిర్‌ల సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తనకు ఎదురైన అత్యంత క్లిషమైన బౌలర్ అమిర్ అని కోహ్లి అంటే.. అందుకు బదులుగా తాను ఎదుర్కొన్న కఠినమైన బ్యాట్స్‌మన్ కోహ్లి అని అమిర్ కూడా పలుసార్లు స్పష్టం చేశాడు. అయితే తాజాగా అమిర్ మాట మార్చాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కే బౌలింగ్ చేయడం కష్టమని తాజాగా పేర్కొన్నాడు. స్మిత్‌కు బౌలింగ్ చేయడమంటే ఒక సవాల్‌తో కూడున్నదని అమిర్ పేర్కొన్నాడు. ఒక వార్తా సంస్థకు ఇంటర్య్వూ ఇచ్చే క్రమంలో ‘ మీకు ఎదురైన కఠినమైన బ్యాట్స్‌మన్ ఎవరు’ అని దానికి అమిర్ పైవిధంగా స్పందించాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న స్మిత్ 12 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. తన కెరీర్లో స్మిత్ 64 టెస్టులకు గాను 6,199 పరుగులు సాధించాడు. ఇందులో 61.38 సగటుతో 23 సెంచరీలు స్మిత్ నమోదు చేశాడు. ఇక ఇప్పటివరకూ 66 టెస్టులు ఆడిన కోహ్లి 5, 554 పరుగులు సాధించాడు. 53కు పైగా సగటుతో 21 సెంచరీలు కోహ్లి సొంతం. మరొకవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో స్మిత్‌పై కోహ్లిదే పైచేయి. 208 వన్డేల్లో 58.11 సగటుతో 9,588 పరుగుల్ని కోహ్లి సాధించాడు. ఇందులో 35 సెంచరీలున్నాయి. అంతర్జాతీయ టీ 20ల్లో 60 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 49.07 సగటుతో 2,012 పరుగులు చేశాడు. ఇక స్మిత్ విషయానికొస్తే.. 108 వన్డేలు ఆడి 44పైగా సగటుతో 3,431 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 8 సెంచరీలను స్మిత్ సాధించాడు. టీ20 ఫార్మాట్లో 30 మ్యాచ్‌లు ఆడి 21.55 యావరేజ్‌తో 431 పరుగుల్ని మాత్రమే స్మిత్ నమోదు చేశాడు. -
‘విరుష్క’ కోసం అల్లాను ప్రార్థిస్తున్నా.!
సాక్షి, హైదరాబాద్ : పెళ్లితో ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మలపై అటు బాలీవుడ్, ఇటు క్రికెట్ వర్గాల నుంచి అభినందనల వెల్లువ కురుస్తోంది. కోహ్లి అత్యంతగా అభిమానించే బౌలర్, అతన్ని ఆరాధ్యంగా చూసే పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్ హృదయం ద్రవించే శుభాకాంక్షలు తెలిపాడు. పాక్ ఖలీజ్ టైమ్స్ తో మాట్లాడుతూ.. విరాట్ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. అతని కొత్త జీవితం బాగుండాలని ఇప్పటికే ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలియజేశా. క్రికెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నట్లే వివాహ జీవితంలో విజయవంతం కావాలని, వారి ఇరువురూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నా. అంతేకాకుండా దిష్టి కళ్ల నుంచి రక్షించాలని కోరుకుంటున్నా. చాలా మంది దృష్టి వారి మీద ఉన్నట్లే దిష్టి కళ్లూ వారిపై ఉంటాయి. అందుకే వారి నూతన జీవితం బాగుండేలా ఆ అల్లాను వేడుకుంటున్నా’ అని అమిర్ వ్యాఖ్యానించాడు. పలు సందర్భాల్లో అమిర్ బౌలింగ్‌ను కోహ్లి ప్రశంసించడమే కాకుండా తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ అమిర్దేనని కోహ్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గతంలో కోహ్లిని సైతం అమిర్ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని కొనియాడాడు. -
'నా గేమ్ ప్లాన్ కు కోహ్లి దొరికిపోయాడు'
కరాచీ: ఈ ఏడాది జూన్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను పాకిస్తాన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ తో జరిగిన తుది పోరులో పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ సేన 158 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం కావడంతో పాకిస్తాన్ టైటిల్ ను సునాయాసంగా చేజిక్కించుకుంది. అయితే ఆ ఫైనల్ మ్యాచ్ జరిగిన దాదాపు ఐదు నెలల తరువాత కోహ్లి అవుట్ చేయడానికి రచించిన 'బాల్ ప్లాన్ ' ను పాకిస్తాన్ స్పీడ్ స్టార్ మొహ్మద్ ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్ లో భాగంగా మూడో ఓవర్ నాల్గో బంతికి కోహ్లిని ఓ చక్కటి వ్యూహంతో పెవిలియన్ కు పంపినట్లు ఆమిర్ తెలిపాడు. కాగా, అదే ఓవర్ మూడో బంతికి విరాట్ ఇచ్చిన క్యాచ్ ను అజహర్ అలీ వదిలేయడంతో తదుపరి బంతిని కూడా అదే తరహాలో వేసి సక్సెస్ అయినట్లు ఆమిర్ పేర్కొన్నాడు. 'విరాట్ ఒక విలువైన ఆటగాడు. ఒక్కసారి అతనికి ఛాన్స్ ఇచ్చేమంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు. విరాట్ కోహ్లికి లైఫ్ ఇస్తే ఇక మ్యాచ్ ను వదులుకోవాల్సింది. అతనికి ఎప్పుడు లైఫ్ లభించినా దాన్ని సెంచరీ వరకూ తీసుకెళతాడు. గత మ్యాచ్ ల్లో విరాట్ అదే తరహాలో చేసి చూపించాడు కూడా. దాన్ని నేను దృష్టిలో పెట్టుకున్నా. కోహ్లికి వేసే ప్రతీ బంతిని ఒళ్లు దగ్గర పెట్టుకుని వేయాలనుకున్నా. అయితే కోహ్లికి మేము అప్పటికే ఒక ఛాన్స్ ఇచ్చాం. నా బౌలింగ్ లో కోహ్లి ఒకసారి అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కానీ నేను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అంతముందు నేను సంధించిన బంతి అవుట్ స్వింగర్ కావడంతో ఆపై ఇన్ స్వింగర్ ను ఆడటానికి కోహ్లి సంసిద్ధమవుతాడని తెలుసు. కోహ్లి ఒకటి తలస్తే.. నేను మరో విధంగా ఆలోచించా. అందుకే ఆ మరుసటి బంతిని కూడా ముందు బంతి తరహాలోనే వేయాలనుకున్నా. అక్కడ నా వ్యూహం ఫలించింది. ఆ బంతికి కోహ్లి తడబడ్డాడు. బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్ లో కి వెళ్లింది. ఈసారి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న షాదబ్ తప్పిదం చేయలేదు. కోహ్లి ఇచ్చిన క్యాచ్ ను ఒడిసిపట్టుకున్నాడు. దాంతో కోహ్లి ఆదిలోనే పెవిలియన్ కు వెళ్లడంతో నా లక్ష్యం నెరవేరింది' అని ఆమిర్ తెలిపాడు. -
'అందుకే కోహ్లిపై ప్రత్యేక దృష్టి'
కరాచీ:టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ అమిర్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మన్ కోహ్లి అనడంలో ఎటువంటి సందేహం లేదని, అతని వికెట్ తీయాలంటే శక్తిమేర బౌలింగ్ చేయక తప్పదని కొనియాడాడు. 'విరాట్ అత్యుత్తమ ఆటగాడని ప్రపంచం మొత్తానికి తెలుసు. అతనికి బౌలింగ్ చేసేటప్పుడు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని చేయాలి. ఒకవేళ కోహ్లికి కనుక ఛాన్స్ ఇచ్చారా.. అంతే సంగతులు. మ్యాచ్ ను మొత్తం తమవైపు తిప్పేసుకుంటాడు. కోహ్లికి అత్యుత్తమ స్ట్రైక్ రేట్ ఉంది. లక్ష్య ఛేదనలోని కోహ్లికి అతనే సాటి. అందుకే అతనిపై ప్రత్యేక దృష్టి పెడతా'అని అమిర్ పేర్కొన్నాడు. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన కోహ్లి.. అమిర్ బౌలింగ్ ను ప్రత్యేకంగా కొనియాడాడు. 'పాకిస్తాన్ బౌలర్ మహ్మద్ అమిర్ బాగా రాణిస్తున్నాడు. నా కెరీర్ లో ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో అతనొకడు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో అమిర్ టాప్-3లో కచ్చితంగా ఉంటాడు. అమిర్ బౌలింగ్ ను ఆడాలంటే 'ఎ' క్లాస్ ఆటను ఆడాలి. ఒక అసాధారణ బౌలర్ అమిర్'అని కోహ్లి ప్రశంసించాడు. -
కోహ్లీని టార్గెట్ చేస్తా: పాక్ బౌలర్
నిషేధం అనంతరం మళ్లీ జట్టులోకొచ్చిన పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ ఆమీర్ పునరాగమనం సాఫీగా సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్లలో ఆమీర్ ఒకడని ప్రశంసించడంపై ఆ పాక్ బౌలర్ స్పందించాడు. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో కోహ్లీ ఒకడని కితాబిచ్చాడు. ఛేజింగ్‌లో అతడు మరింత ప్రమాదకారి అని, అందుకే కోహ్లీ క్రీజులో ఉన్నప్పుడు కట్టుదిట్టంగా బంతులు సంధిస్తానని తెలిపాడు. ‘ప్రస్తుత క్రికెట్లో కోహ్లీ ఓ అద్భుత ఆటగాడు. ఒక్కసారి ఫామ్లోకొచ్చాడంటే అతడిని ఔట్ చేయడం అంత తేలిక కాదు. అందుకే కోహ్లీ క్రీజులో ఉన్నాడంటే బౌలర్లు క్రమశిక్షణతో లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్ చేస్తారు. కోహ్లీ క్రీజులో కుదురుకున్నాడంటే ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను అవలీలగా లాగేసుకుంటాడు. ప్రపంచ అత్యుత్తుమ బౌలర్లకే కోహ్లీ ఓ బిగ్ ఛాలెంజ్‌గా కనిపిస్తాడు. అందుకే సాధ్యమైనంత త్వరగా కోహ్లీని పెవిలియన్ పంపాలని ఓ బౌలర్‌గా ఆలోచిస్తానంటూ’ కోహ్లీ గురించి తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆమీర్ ఐదేళ్ల నిషేధం అనంతరం మళ్లీ పాక్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది జరిగిన ట్వంటీ వరల్డ్ కప్పు ప్రారంభానికి ముందు ఆమీర్ కోరిక మేరకు అతడికి తాను సంతకం చేసిన ఓ బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు కోహ్లీ. తాను ఎదుర్కొన్న బౌలర్లలో పాక్ బౌలర్ చాలా టఫ్ అని, అతడి బౌలింగ్‌లో ఆడటం కాస్త ఇబ్బందిగా ఉంటుందని కోహ్లీ ప్రశంసల జల్లులు కురిపించిన విషయం తెలిసిందే. -
‘అతని బౌలింగ్ అత్యంత కఠినం’
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటి వరుకు ఎదుర్కొన్న బౌలర్లలో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్ బౌలింగ్ అత్యంత కఠినమైనదని టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లి అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ..దీపావళి సందర్భంగా జీటీవీ రూపోందించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆదివారం ప్రసారమైన ఈ ప్రోగ్రామ్‌లో అమీర్.. కోహ్లీని మీరు ఎదుర్కొన్న అత్యంత బెస్ట్ బౌలర్ ఎవరని ప్రశ్నించగా.. బెస్ట్ బౌలర్లు ఇద్దరు ముగ్గురున్నారని, కానీ నాకెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలింగ్ మాత్రం మహ్మద్ అమీర్దేనని చెప్పుకొచ్చాడు. అతనో గొప్ప బౌలర్ అని కొనియాడారు. ఇక ఆసియాకప్ సందర్భంగా విరాట్ అమీర్‌ను కొనియాడుతూ.. తన బ్యాట్‌ను బహుమతిగా అందజేసిన విషయం తెలిసిందే. అమీర్ కూడా నాబెస్ట్ బ్యాట్స్‌మన్ కోహ్లినేని పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. ఇక అమీర్ చాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో భారత టాప్ ఆర్డర్ కుప్పకూల్చిన విషయం విదితమే. -
పాకిస్తాన్ కు మరో ఎదురుదెబ్బ
కరాచీ:ఇప్పటికే శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ను కోల్పోయి రెండో టెస్టులో కూడా ఎదురీదుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ నుంచి పాకిస్తాన్ ప్రధాన పేసర్ మొహ్మద్ ఆమిర్ దూరమయ్యాడు. కుడికాలి పిక్క గాయంతో బాధపడుతున్న ఆమిర్ కు లంకేయులతో జరిగే ఐదు వన్డేల సిరీస్ నుంచి విశ్రాంతినిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండో టెస్టుకు దూరమైన ఆమిర్.. ఇక వన్డే సిరీస్ నుంచి కూడా తప్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా, అతని స్థానంలో ఇంకా ఎవర్నీ ఎంపిక చేయలేదు. తొలి టెస్టులో పాకిస్తాన్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 136 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. మరొకవైపు రెండో టెస్టులో కూడా పాక్ పై లంక ఆధిక్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 482 పరుగులు చేయగా, పాకిస్తాన్ 262 పరుగులు చేసి రెండొందలకు పైగా పరుగులు వెనుకబడి ఉంది. -
కోహ్లీని కవ్విస్తున్న పాక్ బౌలర్
లండన్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య పోరు ఎప్పటికీ ఆసక్తికరమే. అందులోనూ ఐసీసీ ఓ మేజర్ టోర్నీలో దాయాదులు ఫైనల్లో తలపడనుండటంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ బౌలర్ మొహమ్మద్ ఆమీర్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని కవ్వించే యత్నాలు మొదలుపెట్టాడు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది మేజర్ టోర్నీ తొలి ఫైనల్ అని.. అందుకే అతడిపైనే ఒత్తిడి ఉంటుందన్నాడు. పాక్ జట్టు ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ రాణిస్తుందని, అందుకే విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశాడు ఆమీర్. 'కోహ్లీ వికెట్ త్వరగా తీస్తే పాక్‌కు లాభదాయకమే. కానీ అతడు మా టార్గెట్ కానే కాదు. కేవలం అతడి వికెట్‌పై దృష్టిపెట్టడం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు పరుగుల వేట కొనసాగిస్తున్నారు. యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీతో పాటు హార్దిక్ పాండ్యాలతో భారత్ బ్యాటింగ్ లైనఫ్ దుర్భేద్యంగా ఉంది. తప్పిదాలకు తావివ్వకుండ పూర్తి స్థాయిలో రాణించి భారత్‌పై విజయాన్ని సాధిస్తామని' ఆమీర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో తలపడే ప్రతి ప్రత్యర్ధి కోహ్లీని టార్గెట్ చేయడం సహజమే. కానీ ఆమీర్ మాత్రం కోహ్లీ వికెట్ మాకు అవసరమే కానీ, కీలకమే కాదని.. కెప్టెన్‌గా అతడిపైనే ఒత్తిడి ఉందని మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో వెన్నునొప్పి కారణంగా విశ్రాంతి తీసుకున్న ఆమీర్ ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఆమీర్ రావడంతో ఇంగ్లండ్‌పై రెండు వికెట్లు తీసిన రుమాన్ రాయిస్‌ను ఫైనల్ ఆడే తుది జట్టునుంచి తప్పించారు. రేపు (ఆదివారం) జరిగే ఫైనల్లో ఇక్కడి ఓవల్ మైదానంలో భారత్-పాక్‌లు తలపడనున్న విషయం తెలిసిందే. -
గాల్లోకి ఎగిరి.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు
-
గాల్లోకి ఎగిరి.. అద్భుతమైన క్యాచ్ పట్టాడు
పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ 19 టెస్టులు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏడేళ్ల కెరీర్ ఉంది. అయితే టెస్టు ఫార్మాట్లో ఇంతకుముందు ఒక్క క్యాచ్ కూడా పట్టుకోలేకపోయాడు. షార్జాలో వెస్టిండీస్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆమిర్ కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఆమిర్ అందుకున్నది తొలి క్యాచే అయినా అద్భుతం చేశాడు. పాక్ బౌలర్ జుల్ఫికర్ బాబర్ బౌలింగ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రావో షాట్ ఆడబోయాడు. సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న ఆమిర్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆమిర్ బంతి పట్టుకున్న సమయంలో పూర్తిగా గాల్లో ఉన్నాడు. అతని శరీరం ఎక్కడా గ్రౌండ్‌కు టచ్ కాలేదు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. టెస్టు క్రికెట్లో ఇంత ఆలస్యంగా తొలి క్యాచ్ పట్టిన క్రికెటర్ ఆమిరే. షార్జా టెస్టులో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేయగా, వెస్టిండీస్ 337 పరుగులు చేసింది. 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆమిర్‌తో పాటు పాక్ క్రికెటర్లు సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లపై ఐదేళ్లు నిషేధం విధించారు. ఈ ఏడాది జనవరిలో ఆమిర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. -
అమ్మకు తీవ్ర అస్వస్థత.. క్రికెటర్ ఆందోళన
అబుధాబి: వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ మూడో వన్డేకు పాకిస్తాన్ పేస్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ దూరం కానున్నాడు. తన తల్లికి తీవ్ర ఆనారోగ్యంగా ఉందన్న వార్త తెలియగానే ఆమిర్ పాక్ కు బయలుదేరాడని పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం ఆమిర్ తల్లి ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో బుధవారం వెస్టిండీస్ తో జరగనున్న చివరిదైన మూడో వన్డేకు అతడు దూరం అవుతున్నాడు. ఆమిర్ స్థానంలో రహత్ అలీ, సోహైల్ ఖాన్ లలో ఒకరికి మూడో వన్డేలో ఆడే అవకాశం దక్కనుంది. ఈ సిరీస్ లో రెండు వన్డేల్లో కలిపి పాక్ పేసర్ ఆమీర్ రెండు వికెట్లు తీశాడు. పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ రెండు వన్డేల్లోనూ విజృంభించి సెంచరీలు చేయడంతో మరో వన్డే మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నామమాత్రమైన మూడో వన్డే బుధవారం అబుదాభిలో జరగనుంది. పరిస్థితులు చక్కబడితే.. అక్టోబర్ 13నుంచి మొదలుకానున్ను టెస్ట్ సిరీస్ సమయానికి ఆమిర్ జట్టులో చేరే అవకాశం ఉందని బోర్డు సభ్యులు చెప్పారు. -
ఆమిర్ పై పీటర్సన్ తీవ్ర వ్యాఖ్యలు
లండన్:గత ఆరు సంవత్సరాల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్‌పై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ క్రికెటర్‌పై జీవితకాలం నిషేధం విధించకుండా, మరో ఛాన్స్ ఎందుకు ఇచ్చిరంటూ విమర్శించాడు. అసలు మ్యాచ్ ల్లో ఫిక్సింగ్ పాల్పడిన వారిని మరోసారి ఆహ్వానిస్తే అది ఆటకు మచ్చగానే మిగిలిపోతుందని పీటర్సన్ స్పష్టం చేశాడు. క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడితే జీవిత కాలం నిషేధం విధించడమే సరైన మార్గమన్నాడు. దాంతో పాటు డ్రగ్స్ తీసుకుని డోపింగ్ టెస్టుల్లో పట్టుబడిన మహిళా క్రికెటర్లపై కూడా జీవితకాల నిషేధం వేయాలన్నాడు. ఎవరైనా తప్పు చేస్తే వారి జీవితంలో రెండో ఛాన్స్ కోరడం సహజమే. కానీ క్రీడల్లో రెండో అవకాశమనేదే ఉండకూడదని పీటర్సన్ ధ్వజమెత్తాడు. ఈ ప్రకారం చూస్తే ఆమిర్ రెండోసారి క్రికెట్ ఆడటానికి అనర్హుడన్నాడు. ఇప్పటికే ఆమిర్ రాకను ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఒకవైపు పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆమిర్ కు మద్దతుగా నిలుస్తుంటే, మాజీలు మాత్రం అతని పునరాగమనంపై మండిపడుతున్నారు. -
స్టార్ బౌలర్‌పై స్వాన్ సంచలన వ్యాఖ్యలు!
లండన్: గత ఆరు సంవత్సరాల క్రితం తమతో టెస్టు మ్యాచ్ సందర్బంగా స్పాట్ ఫిక్సింగ్ పాల్పడిన పాకిస్తాన్ స్టార్ పేసర్ మొహ్మద్ ఆమిర్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఆమిర్‌ను తిరిగి క్రికెట్లో ఎందుకు ఆహ్వానించారంటూ తీవ్రంగా మండిపడ్డాడు. జీవిత కాలం నిషేధం విధించాల్సిన బౌలర్‌కు పునరాగమనం ద్వారా ఆడే అవకాశం కల్పించడం కచ్చితంగా పెద్ద తప్పిదమేనని పేర్కొన్నాడు. '2010లో నో బాల్స్ వేయడం ద్వారా ఫిక్సింగ్ కు పాల్పడిన ఆమిర్ పై జీవితం కాలం నిషేధం విధించి ఉండాల్సింది. ఆటలో పారదర్శకతను కోరితే అటువంటి వారిని తిరిగి జట్టులో ఆడే అవకాశం ఎందుకు కల్పిస్తారు. ఆమిర్ లాంటి వాళ్లను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లేకుండా చేస్తే అది క్రికెట్ ఎదుగుదలకు దోహద పడుతుంది. దాంతో పాటు యువ క్రికెటర్లకు కూడా అదొక ఆదర్శవంతంగా నిలుస్తుంది. అవినీతికి పాల్పడే వారికి జట్టులో స్థానం అనేది ఉండకూడదు 'అని స్వాన్ ధ్వజమెత్తాడు. అయితే అంతకుముందు ఆమిర్ పై తమకు ఎటువంటి ద్వేషం లేదని ఇంగ్లండ్ క్రికెట్ జట్టులోని సభ్యులు కొందరు మద్దుతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్ అలెస్టర్ కుక్ తో పాటు, స్టువర్ట్ బ్రాడ్ లు ఆమిర్ ను స్వాగతిస్తున్న తరుణంలో ఆ దేశానికే చెందిన స్వాన్ భిన్నమైన వైఖరి వ్యక్తం చేయడం గమనార్హం. -
'ఆమిర్‌పై సానుభూతి ఉంటుంది'
కరాచీ: మ్యాచ్ ఫిక్సింగ్ అనంతరం దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఇంగ్లండ్‌తో పర్యటనకు సిద్ధమయ్యే పాకిస్తాన్ ప్రధాన పేసర్ మొహ్మద్ ఆమిర్‌కు అక్కడ ఎటువంటి ప్రతికూల వాతావారణ ఎదురవ్వదని దిగ్గజ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. ఆనాడు ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆమిర్ ఫిక్సింగ్‌కు పాల్పడినా, ఆ ప్రభావం అతనిపై ఎంతమాత్రం ఉండదన్నాడు. 'ఆమిర్‌కు ఇంగ్లండ్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేదు. ఆనాటి ఘటనపై ఆమిర్‌ను అక్కడి వారు చిన్నచూపు చూసే అవకాశమే లేదు. నా అనుభవం మేరకు ఆమిర్ పై అమితమైన సానుభూతి ఉంటుంది. ఇది రాబోవు సిరీస్‌ల్లో ఆమిర్ మెరుగ్గా రాణించడానికి కచ్చితంగా ఉపయోగపడుతుంది. సుమారు 18-19 సంవత్సరాల వయసులోనే ఆమిర్ ఫిక్సింగ్ చేసినా, ఆ తప్పును ఒప్పుకున్నాడు. అందరికీ క్షమాపణలు చెప్పాడు. అందుకు ప్రతిఫలం కూడా అనుభవించాడు'అని 1992 వరల్డ్ కప్ గెలిచిన పాక్ కెప్టెన్ ఇమ్రాన్ అన్నాడు. -
జీవిత కాల నిషేధం విధించాల్సిందే:ఆమిర్
కరాచీ: మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిన క్రికెటర్లకు జీవిత కాల నిషేధం విధించడమే సబబని గతంలో ఫిక్సింగ్ కు పాల్పడిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ ఫిక్సర్లకు జీవిత కాల నిషేధమే తగిన శిక్షని ఇటీవల ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ చేసిన వ్యాఖ్యలకు ఆమిర్ మద్దతు తెలిపాడు. క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే వారిపై జీవిత కాలం నిషేధం విధించడం ఒకటే సరైన మార్గమన్నాడు. తాను కూడా ఫిక్సింగ్ కు పాల్పడిన తరువాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేస్తానని అస్సలు అనుకోలేదని తన చేదు జ్ఞాపకాల్ని ఆమిర్ గుర్తు చేసుకున్నాడు. మళ్లీ తాను టెస్టు క్రికెట్ ఆడటం నిజంగా అదృష్టమేనన్నాడు. ఇంకా ఇప్పటికే తన పునరాగమనం నమ్మశక్యంగా లేదన్నాడు. తన టెస్టు క్రికెట్ జీవితం తిరిగి ఇంగ్లండ్‌లోని ప్రారంభం కావడంపై ఆమిర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ తో సిరీస్‌కు ఆతృతగా ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. 2010లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిన ఆమిర్ ఐదు సంవత్సరాల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. ఇటీవల పాక్ జట్టులో పునరాగమనం చేసిన ఈ స్టార్ పేసర్ ఆసియా కప్‌లో రాణించి అందర్నీ ఆకట్టుకున్నాడు. దీంతో అతని ఇంగ్లండ్ వెళ్లే పాక్ జట్టులో స్థానం కల్పించారు. -
'విరాట్ కోహ్లినే బెస్ట్ బ్యాట్స్‌మన్'
లాహోర్: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లినే అని కొనియాడాడు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌లో కోహ్లి రాణించిన తీరే ఇందుకు ఉదాహరణ అన్నాడు. ఆ టోర్నమెంట్లో పిచ్ బౌలర్లకు అనుకూలించినా అతను కచ్చితమైన షాట్లతో అలరించాడన్నాడు. ప్రస్తుతం తనదైన దూకుడును ప్రదర్శిస్తూ కోహ్లి పరుగులు రాబడుతున్నాడని ప్రశంసించాడు. కఠినమైన పరిస్థితులను కూడా కోహ్లి తనకు అనుకూలంగా మార్చుకుని చెలరేగిపోతుండమే అతన్ని ఉన్నతస్థానంలో నిలిపిందన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాకిస్తాన్ జట్టులో ఉన్న ఆమిర్ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో విరాట్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. గత ఆసియా పర్యటన సందర్భంగా ఆమిర్‌ను విరాట్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో ఆమిర్ ఒకడని విరాట్ అభినందించాడు. -
ఆమిర్‌పై పీసీబీ ఆగ్రహం!
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం అనంతరం ఇటీవలే జాతీయ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ క్రికెట్ బోర్డు పెద్దలకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓ టీవీ షోకు ఆమిర్ ఇంటర్య్వూ ఇవ్వడమే వారి ఆగ్రహానికి కారణమైంది. గత కొన్నిరోజుల క్రితం పాక్ లోని ఓ టీవీ ఛానెల్‌కు ఆమిర్ ఇంటర్య్వూ ఇచ్చి ఇరకాటంలో పడ్డాడు. ఆటగాళ్లు మీడియాకు దూరంగా ఉండాలనే నిబంధనలు ఉన్నా, ఆమిర్ ఏమి ఆశించి అలా చేశాడో? అనే దానిపై పాక్ బోర్డులో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్‌తో పాటు నజీమ్ సేథీలు అతన్ని పిలిపించి వివరణ అడిగారు. ఇక నుంచి మీడియాకు దూరంగా ఉండాలని , ఒకవేళ మీడియా ఎదురుపడినప్పుడు ఊహించిన ప్రశ్నలు ఎదురైనా కాస్త సంయమనం పాటించి సమాధానం చెప్పాలని ఆమిర్ కు సూచించారు. మరోసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆమిర్ ను మందలించారు. -
పాక్ బౌలర్ కు భారీ ఊరట!
ఇస్లామాబాద్: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి నిషేధం ముగిసిన తర్వాత మళ్లీ పాకిస్తాన్ జాతీయ జట్టులో ఆడేందుకు మహమ్మద్ ఆమీర్ కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆమీర్ కు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. నిషేధం తర్వాత అతడు ఆడనున్న తొలి సిరీస్ కావడంతో అడ్డంకులు తొలగి పోవడంతో కెరీర్ ను పునర్ ప్రారంభించబోతున్నాడు. ఆమీర్ కు గురువారం యూకే వీసా అందించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. దీంతో త్వరలో ఇంగ్లండ్ లో ఆ దేశంతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు ఆమీర్ కు దారులు తెరుచుకున్నాయి. 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదేళ్ల నిషేధం వేటు పడింది. ఆరు నెలల జైలు శిక్ష విధించగా మూడు నెలలు జైలు జీవితం గడిపాడు. ఈ కారణంగా అతడికి యూకే వీసా నిరాకరిస్తుందని పలు కథనాలు వచ్చాయి. వీటితో పాటు ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ వ్యాఖ్యలు చేశాడు. ఏ స్థాయి క్రికెటరైనా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే జీవిత కాలం నిషేధం ఒక్కటే తగిన పరిష్కారమని సూచించాడు. సరిగ్గా అదేరోజు ఆమీర్ కు యూకే అధికారులు వీసా ఇచ్చారు. జూన్ 18 నుంచి పాకిస్తాన్- ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే పాక్ స్పీడ్ స్టార్ ఆమీర్ ఆరేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ లోనే గతంలో జైలు శిక్ష అనుభవించడంతో యూకే వీసా అతడికి అసాధ్యమని అందరూ భావించారు. వీసా రావడంతో పాక్ జట్టులో ఉన్న ఆమీర్ కు ఇంగ్లండ్ టూర్ కు లైన్ క్లియర్ అయింది. -
ఎవర్నీ ఉపేక్షించకూడదు: కుక్
లండన్: క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించకూడదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ స్పష్టం చేశాడు. ఏ స్థాయి క్రికెటరైనా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే జీవిత కాలం నిషేధం ఒక్కటే తగిన పరిష్కారమని సూచించాడు. ఎవరైనా ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడినట్లైతే ఆ క్రికెటర్‌కు వేసే శిక్ష చాలా కఠినంగా ఉండాలనేది తన అభిప్రాయంగా కుక్ తెలిపాడు. ఆ రకంగా చేసినప్పుడు క్రికెటర్లు నిజాయితీతో గేమ్‌ను ఆస్వాదిస్తారన్నాడు. అయితే ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న తరువాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు రాబోతున్న మొహ్మద్ ఆమిర్ కు, తాను మాట్లాడే దానికి ఎటువంటి సంబంధం లేదన్నాడు. అప్పటి నిబంధనలు భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఆమిర్ పునరాగమనం గురించి మాట్లాడటం సబబు కాదని కుక్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తాము ఆమిర్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కుక్ తెలిపాడు. అతనితో ఆడటానికి ఇంగ్లండ్ జట్టుకు ఎటువంటి ఇబ్బందులు లేవన్నాడు. ఇక నుంచి ఎవరైనా మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లైతే జీవిత కాల నిషేధం ఒక్కటే సరైన మార్గమన్నాడు. -
'బౌలింగ్ మా బలం.. భారత్‌తో ఫైట్‌కు రెడీ'
ఆమిర్ బెస్ట్ బౌలర్ అని వ్యాఖ్య కోల్‌కతా: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఐదేళ్ల నిషేధం ఎదుర్కొని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్‌పై షాహిద్ ఆఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. అతను ఉత్తమ బౌలర్ అని, టాప్ అంతర్జాతీయ పేసర్లలో అతడు ఇప్పటికే చోటు సంపాదించాడని పేర్కొన్నాడు. ఆమిర్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఇటీవల భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రోహిత్ వ్యాఖ్యల గురించి అతన్నే అడుగాలని, తమకు మాత్రం ఆమిర్ బెస్ట్ బౌలర్ అని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ అఫ్రిది పేర్కొన్నాడు. వన్డేల్లోనైనా, ట్వంటీ-20ల్లోనైనా వరల్డ్ కప్‌లో ఇంతవరకు భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించలేదు. ఇది తమకు నెగిటివ్ అంశమే అయినా, సానుకూల దృక్పథంలో ముందుకుసాగుతామని, ఇటీవలికాలంలో భారత జట్టు మంచి ఆటతీరును కనబరుస్తున్నదని అతను పేర్కొన్నాడు. ఈ నెల 19న ఈడెన్ గార్డెన్స్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట పాక్ జట్టు 16వతేదీన క్వాలిఫైయింగ్‌లో అర్హత సాధించిన జట్టు (బంగ్లాదేశ్ కావొచ్చు)తో ఆడనుంది. ఆ తర్వాత భారత్‌తో పోరు ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచుతోపాటు, రెండో మ్యాచును అత్యంత కీలకంగా భావిస్తున్నామని, ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ ఇరుజట్లకూ అనుకూలించేవిధంగా ఉందని పేర్కొన్నాడు. దాయాది భారత్‌తో మ్యాచు కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే లాహోర్‌లో తగినంత శిక్షణ తీసుకున్న నేపథ్యంలో తమ జట్టు భారత్‌కు రావడం ఆలస్యమైనా.. ఇది తమ ఆటతీరుపై ప్రభావం చూపబోదని, డెఫినెట్‌గా తాము బాగా ఆడుతామని చెప్పాడు. భారత బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య ప్రధానంగా పోరు ఉండనుందని, ఆమిర్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ షమీతో తమ బౌలింగ్ ఆటాక్ పటిష్టంగా ఉందని, తమ బ్యాట్స్‌మెన్ బాగా ఆడి.. చక్కని స్కోరు చేస్తే.. దానిని కాపాడుకునే బౌలింగ్ సామర్థ్యం జట్టులో ఉందని అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు. -
ఆమిర్ ను ఫీల్డ్ లోనే అభినందించా: కోహ్లీ
మిర్పూర్: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో మూడేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై, క్లీన్ చిట్ తో రీ ఎంట్రీ ఇచ్చి సత్తాచాటుతోన్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ కు ఎల్లడలా అభినందనలు లభిస్తున్నాయి. భారత్ తో శనివారం నాటి మ్యాచ్ లో అద్భుత మైన బౌలింగ్ చేసిన ఈ యువ సంచలనం.. కొద్దిసేపు భారత అభిమానులను కంగారు పెట్టాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో భారత బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా ఆమిర్ పై ప్రశంసల జల్లు కురుపించాడు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకునేందుకు వేదికపైకొచ్చిన కోహ్లీ.. వ్యాఖ్యాతతో మాట్లాడుతూ 'అద్భుతంగా బౌలింగ్ చేసిన మొహమ్మద్ ఆమిర్ కు నా అభినందనలు. ఇవాళ అతను బాల్ విసిరిన తీరు నిజంగా అద్భుతం. నిజానికి ఫీల్డ్ లో ఉన్నప్పుడే నేనతన్ని అభినందించా' అని చెప్పాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలం కావటం బాధనిపించిందని, అందుకే ఈ మ్యాచ్ లో కసితీరా ఆడానని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై పరుగులు రాబట్టడం అంత సులువేమీకాదని, అయితే కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నించానని వివరించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. పాకిస్థాన్ ను 83 పరుగులకే ఆలౌట్ చేయగా, 15.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసిన భారత్.. పాక్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 51 బంతుల్లో 49 పరుగులు చేసిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. నాలుగు ఓవర్లు వేసిన ఆమిర్ కేవలం 18 పరుగులిచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. -
ఆమిర్ కు థ్రిల్.. గుల్ కు షాక్
కరాచీ: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బుధవారం జాతీయ జట్టు ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై జైలు శిక్ష పడటంతో ఐదేళ్లు నిషేధానికి గురై, అటుపై నిరపరాధిగా తేలి తిరిగి జట్టులోకి వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మొహమ్మద్ ఆమిర్.. జట్టులో స్థానం పొంది మళ్లీ వార్తల్లో నిలిచాడు. సీనియర్ పేసర్ ఉమర్ గుల్, ఓపెనర్ అహ్మద్ షెహజాద్ లపై వేటు పడింది. సీనియర్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ నేతృత్వంలోని పాక్ జట్టు ఈ నెల 24 నుంచి బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న ఆసియాకప్ లో పాల్గొంటుంది. మార్చి 8 నుంచి భారత గడ్డపై జరుగనున్న టీ20 ప్రపంచకప్ లో పాక్ ఆడాల్సిన మ్యాచ్ ల వేదికలపై ఇంకా స్పష్టత రాలేదు. భద్రతాకారణాల దృష్ట్యా ఇండియాలో ఆడబోమని పీసీబీ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లకు పాక్ జట్టు: షాహిద్ అఫ్రిది(కెప్టెన్), ఖుర్రం మంజూర్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్(వికెట్ కీపర్), సర్ఫరాజ్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఇఫ్తికార్ అహ్మద్, ఎమద్ వసీమ్, అన్వర్ అలీ, మొహమ్మద్ ఇర్ఫాన్, వాహబ్ రియాజ్, మొహమ్మద్ ఆమిర్, మొహమ్మద్ నవాజ్, రుమన్ రయీజ్. -
ఆమిర్‌కు లైన్‌క్లియర్
వెల్లింగ్టన్:స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నమొహమద్ ఆమిర్ న్యూజిలాండ్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. ఇటీవల పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న ఆమిర్ కు న్యూజిలాండ్ దేశం నుంచి వీసా లభించే విషయంలో తొలుత కొంత సందిగ్థత ఏర్పడింది. అయితే న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎట్టకేలకు అతనికి వీసా మంజూరు చేశారు. దీంతో 23 ఏళ్ల ఆమిర్ న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరే పాక్ జట్టుతో కలిసి విమానం ఎక్కనున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్ తలపడే వన్డే, టి20 పాకిస్తాన్ జట్లలో ఆమిర్ కు స్థానం లభించిన సంగతి తెలిసిందే. ఆమిర్ పునరాగమనంపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చినా... అతనికి గట్టిగా మద్దతు పలికిన పాక్ బోర్డు, ఇటీవలి ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని ఎంపికపై తమ వాదనను సమర్థించుకుంది. 2010లో లార్డ్స్ టెస్టులో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆమిర్ ఐదేళ్ల నిషేధం ఎదుర్కొనడంతో పాటు ఆరు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇటీవల సెప్టెంబర్‌లో అతడిపై నిషేధం ముగియడంతో పాక్ దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టి మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లోనూ రాణించాడు. -
'వారి ప్రేమను గెలుస్తా'
లాహోర్:స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ తన పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తనపై వస్తున్న విమర్శలకు త్వరలో న్యూజిలాండ్ లో జరిగే సిరీ్‌స్ లో వికెట్లతోనే సమాధానమిస్తానని స్పష్టం చేశాడు. 24 ఏళ్ల ఆమిర్ పునరాగమనంపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చినా... అతనికి గట్టిగా మద్దతు పలికిన పాక్ బోర్డు మాత్రం అతని దేశవాళీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని జాతీయ జట్టులో స్థానం కల్పించింది. దీనిపై తాజాగా స్పందించిన ఆమిర్.. న్యూజిలాండ్ పర్యటనలో సత్తా చాటి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెడతానన్నాడు. ' కివీస్ పర్యటన నాకు ఎంతో కీలకం. అక్కడ వికెట్లు తీసి నన్ను విమర్శించే వారి ప్రేమను సంపాదిస్తా. దాంతో పాటు ప్రేక్షకులు నాపై పెట్టుకున్న ఆశలను కూడా నెరవేరుస్తా. నా శాయశక్తులా శ్రమించి పాక్ జట్టు విజయానికి కృషి చేస్తా. జట్టులోని మిగతా సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నా. వారి నుంచి ఎటువంటి ప్రతికూలత వస్తుందని అనుకోవడం లేదు' అని ఆమిర్ తెలిపాడు. ఇటీవల పాక్ జట్టు సన్నాహక శిబిరంలో ఆమిర్ చేరడంపై వన్డే కెప్టెన్ అజహర్ అలీ, హఫీజ్ లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. చివరకు రాజీనామా చేసేందుకు కూడా అలీ సిద్దమయ్యాడు. అయితే పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ జోక్యంతో అజహర్ అలీ వెనక్కితగ్గాడు. ఈ క్రమంలోనే వారిద్దర్ని ఆమిర్ క్షమించమని వేడుకున్నాడు. 2010 వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించడంతో పాటు ఐదేళ్లు జట్టుకు దూరంగా ఉన్న ఆమిర్.. న్యూజిలాండ్ పర్యటన ద్వారా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నాడు. -
'మళ్లీ అతన్నిక్రికెట్ ఫీల్డ్ లోకి రానివ్వొద్దు'
లండన్: క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు , స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన వారిని తిరిగి జట్టులోకి స్వాగతించకూడదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి ఫిక్సింగ్ కు పాల్పడినా అది క్షమించరాని నేరమన్నాడు. గతంలో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్ కు పాల్పడి ఐదేళ్లు నిషేధాన్ని పూర్తి చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ అమిర్ ను ఉద్దేశించి పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2010 లో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ముగ్గురు పాకిస్థాన్ ఆటగాళ్లు (మహ్మద్ అమిర్, మహ్మద్ అసిఫ్, అప్పటి కెప్టెన్ సల్మాన్ భట్)లు ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. అయితే అమిర్ పై నిషేధం తొలగి ప్రస్తుతం పోటీ క్రికెట్ లో పాల్గొంటున్నాడు. ఏదో ఆశతో తప్పు చేసినా.. మన కుటుంబం ఆర్థికంగా వెనుక బడిన కారణంగా తప్పు చేసినా అది ఓ క్రీడను పూర్తిగా విచ్ఛిన్నపరచటానికి చేసేందేనని పీటర్సన్ తెలిపాడు. 'మహ్మద్ అమిర్, అసిఫ్ ల గురించి నాకు తెలుసు. ఆ ఇద్దరూ పేద కుటుంబం నుంచి వచ్చిన క్రీడాకారులు. పైగా టాలెంట్ ఉన్న ఆటగాళ్లు. వారి జీవితాలు ఎలా ఉన్నా నేను స్వాగతిస్తా. కొద్ది సెకండ్లు పాటు తప్పు చేస్తే భారీగా డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక క్రీడలో ఉన్న హక్కును దోచుకోవాలనుకోవడం ముమ్మాటికీ పెద్ద నేరమే. అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టే అవకాశం ఇవ్వకూడదు. అమిర్ ను క్రికెట్ లోకి అనుమతించొద్దు' అని పీటర్సన్ తెలిపాడు. -
క్రికెటర్ ను ' దొంగ' అన్న మరో క్రికెటర్
కరాచీ: ఓ దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ క్రికెటర్లు తీవ్ర దూషణలకు దిగారు. ఖ్వైదా-ఈ-అజామ్ ట్రోఫీలో భాగంగా గురువారం సుయి సౌత్రన్ గ్యాస్-పీఐఏల మధ్య మ్యాచ్ జరుగుతుండగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లైన ఫైజల్ ఇక్బాల్, మహ్మద్ అమిర్ లు ఒకరి నొకరు దూషించుకున్నారు. క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది భాగంగా మారిపోయినప్పటికీ అమిర్ ను దొంగ (చోర్) అంటూ ఇక్బాల్ దూషించాడు. మ్యాచ్ జరుగుతుండగా తొలుత అమిర్ ను ఇక్బాల్ రెచ్చగొట్టారు. దీంతో అమిర్ కూడా ఘాటుగా స్పందించడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక నియంత్రణ కోల్పోయిన ఫైజల్.. నువ్వు దొంగ అంటూ అమిర్ పై వ్యక్తిగత దూషణలకు దిగాడు. తీవ్ర వివాదాన్ని రేపిన ఈ ఘటనలో ఆ క్రికెటర్లకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. 2010లో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా అమిర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల అమిర్ పై ఉన్న నిషేధాన్ని ఐసీసీతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు ఎత్తివేయడంతో అతను దేశవాళీ పోటీల్లో పాల్గొనడానికి క్లియరెన్స్ వచ్చింది. దీనిలో భాగంగానే అమిర్ సుయి సౌత్రన్ గ్యాస్ జట్టు తరపున బరిలోకి దిగాడు. క్రికెట్ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అమిర్ 2016 వరకూ దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది. -
'ఆ బౌలర్ గురించి మాకు బెంగలేదు'
లండన్ : తమ జట్టు పాక్ పేసర్ మహమ్మద్ అమీర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఇంగ్లండ్ పేసర్, టాప్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ అన్నాడు. ప్రత్యర్ధి జట్టులో అతడు కూడా సభ్యుడు, అంతే కానీ అతడిని గురించి మా ఆటగాళ్లు అంతగా ఆలోచించడం లేదని వ్యాఖ్యానించాడు. 2010లో జరిగిన లార్డ్స్ టెస్టు సమయంలో ఫిక్సింగ్ ఆరోపణలతో పాక్ బౌలర్‌పై ఐదేళ్ల నిషేధం పడింది. వచ్చే ఏడాది పాక్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఓ సిరీస్ జరగనుంది. 18 ఏళ్లకే 50 వికెట్లు తీసిన ఘనత అమీర్‌కు దక్కింది. కానీ అదే వయసులో ఫిక్సింగ్ కుభకోణంలో చిక్కుకున్నాడు. ఐదేళ్ల నిషేధంతో పాటు అతడికి ఆరు నెలల జైలు శిక్ష పడగా మూడు నెలల తర్వాత విడుదలైన విషయం విదితమే. ఈ తరుణంలో ఇంగ్లండ్ జట్టుతో సిరీస్‌లో పేసర్ అమీర్ చోటుదక్కించుకుంటాడా లేదా అనే విషయంపై అందరూ చాలా ఆసక్తిగా ఉన్నారని బ్రాడ్ తెలిపాడు. మా లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్లే ప్రయత్నంలో యాషెష్ సిరీస్‌లో విజయాన్ని సాధించామని వివరించాడు. -
మళ్లీ బరిలోకి 'స్పాట్ ఫిక్సింగ్' క్రికెటర్
లాహోర్ :స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో నిషేధానికి గురైన పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఐసీసీ సవరించిన కొత్త నిబంధనల ప్రకారం వచ్చేనెల నుంచి పోటీ క్రికెట్లోకి అడుగు పెట్టనున్నాడు. ఇందులో భాగంగానే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత నవంబర్ లో ఐసీసీకి లేఖ రాసింది. ఆమిర్ స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి సమీక్ష నిర్వహించి అతనికి తక్షణ ఉపశమనం కల్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. 2015 సెప్టెంబర్ నెలతో అతని ఐదు సంవత్సరాల నిషేధ గడువు ముగుస్తుండటంతో ముందుగా దేశవాళీ క్రికెట్ లో అవకాశం కల్పించాలని పీసీబీ విజ్ఞప్తి చేసింది. దీనిపై శుక్రవారం ఐసీసీ సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమిర్ వచ్చే నెల నుంచి మళ్లీ గుర్తింపు పొందిన పోటీ క్రికెట్ లో ఆడే అవకాశం దక్కింది. ప్రపంచకప్ తరువాత పాక్ లో జరిగే సూపర్-8 ట్వంటీ మ్యాచ్ ల్లో ఆమిర్ పాల్గొనే అవకాశం ఉంది. 2010 లో లార్డ్స్ లో జరిగిన టెస్ట్ లో ఆమిర్ ఫిక్సింగ్ కు పాల్పడటంతో అతనిపై ఐదు సంవత్సరాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమిర్ ఆరు నెలల జైలు జీవితాన్ని కూడా గడిపాడు. అయితే ఐసీసీ కొత్త నిబంధనలతో ఆమిర్ ఊరట చెందాడు. ఫిక్సింగ్ ఆరోపణల కేసులో ఏడాది లోపు జైలు జీవితం అనుభవించే క్రికెటర్లు తిరిగి క్రికెట్ ఆడే అవకాశాన్ని ఇస్తూ ఐసీసీ నిబంధనలను సవరించింది.