తొందరపాటు చర్యల వల్ల ఒక్కోసారి విమర్శలపాలు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లో చిన్న తప్పు దొర్లితే చాలు ట్రోలింగ్ బారిన పడాల్సి వస్తుంది. పాకిస్తాన్ వివాదాస్పద క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మరణం చెందిన విషయం విదితమే.
మార్చి 4న థాయ్‌లాండ్‌లోని విల్లాలో తుది శ్వాస విడిచాడు. ఈ క్రమంలో లెజెండ్ మృతి పట్ల దిగ్భ్రాంతి చెందిన సహచర ఆటగాళ్లు, ఇతర క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఆమిర్ సైతం వార్న్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థించాడు.
అయితే, ఇందుకు సంబంధించి అతడు చేసిన ట్వీట్లో అన్వయ దోషం వల్ల పూర్తిగా అర్థమే మారిపోయింది. ‘‘అతడు క్రికెట్ లెజెండ్, గొప్ప వ్యక్తి అనడం విని షాకయ్యాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి లెజెండ్’’ అంటూ ఆమిర్ ట్వీట్ చేశాడు. ఒక్క ఫుల్‌స్టాప్ పెట్టి ఉంటే... ‘‘ఈ విషయం విని షాకయ్యాను. ఆయన లెజెండ్. మంచి మనసున్న వ్యక్తి’’ అనే అర్థం వచ్చేది.
కానీ ఆమిర్ ఇది మిస్ కావడంతో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ‘నీ ఇంగ్లిష్ వింటే వార్న్ ఏడ్చేసేవాడు. చచ్చిపోయి బతికిపోయాడు’ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్‌లో భాగమయ్యాడన్న కారణంగా ఆమిర్ కొంతకాలం పాటు నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు!
Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..!
shocked to hear that he was legend of the game and equally a good person .
— Mohammad Amir (@iamamirofficial) March 4, 2022
RIP LEGEND 🙏 😔 pic.twitter.com/bv9z0RojyT
Comments
Please login to add a commentAdd a comment