తండ్రి మృతదేహంతో విమానాశ్రయం నుంచి ఇంటికి వెళుతున్న వార్న్ కుమారుడు జాక్సన్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ స్పిన్ లెజెండ్ షేన్‌వార్న్ పార్థివ దేహం మెల్‌బోర్న్‌కు చేరుకుంది. బ్యాంకాక్‌లో గత శుక్రవారం గుండెపోటుతో 52 ఏళ్ల వార్న్ హఠాన్మరణం చెందాడు. అతని భౌతిక కాయంపై ఆస్ట్రేలియా జాతీయ పతాకాన్ని ఉంచారు.
థాయ్‌లాండ్ నుంచి ప్రైవేటు జెట్ విమానంలో అతని పార్థివ దేహాన్ని సన్నిహితులు, వ్యక్తిగత సహాయకుడు స్వదేశానికి తీసుకొచ్చారు. తన కెరీర్‌కే వన్నె తెచ్చిన ఎంసీజీలో ఈ నెల 30న ప్రభుత్వ లాంఛనాలతో వార్న్ అంత్యక్రియలు చేసేందుకు ఆస్ట్రేలియా నిర్ణయించింది. సుమారు లక్ష మంది ఇందులో పాల్గొనే అవకాశముంది.
చదవండి: Jofra Archer: ఖుషీలో ముంబై ఇండియన్స్.. రాడనుకున్న ఆర్చర్ వచ్చేస్తున్నాడు..!
వీడియో: చరిత్రలో నిలిచిపోయిన వార్న్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'
Comments
Please login to add a commentAdd a comment