షేన్‌ వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు | Sachin Tendulkar-Glenn McGrath-Ian Botham Pay Tribute Shane Warne Last Time | Sakshi
Sakshi News home page

Shane Warne: షేన్‌ వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు

Mar 30 2022 8:54 PM | Updated on Mar 30 2022 10:08 PM

Sachin Tendulkar-Glenn McGrath-Ian Botham Pay Tribute Shane Warne Last Time - Sakshi

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్‌ ఆటగాడు షేన్‌ వార్న్‌కు లెజెండరీ క్రికెటర్లు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. బుధవారం మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్‌ అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులతో పాటు పలువురు ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, మైకెల్‌ క్లార్క్‌, డేవిడ్‌ వార్నర్‌ తదితర క్రికెటర్లంతా వార్న్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సహా ఇయాన్‌ బోథమ్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌లు వార్న్‌ సేవలను గుర్తుచేసుకుంటూ కడసారి వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను స్కై స్పోర్ట్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఆ వీడియోలో సచిన్‌ మాట్లాడుతూ.. ''గతేడాది ఐపీఎల్‌ ముగిసిన తర్వాత నేను లండన్‌కు వెళ్లాను. అక్కడ అనుకోకుండా నా చిరకాల మిత్రుడు షేన్‌ వార్న్‌ ఎదురుపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇద్దరం కలవడంతో చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఈ సందర్భంలోనే ఇద్దరం కలిసి లండన్‌లో గోల్ఫ్‌ క్రీడను ప్రారంభించాలనుకున్నాం. కానీ ఈరోజు వార్న్‌ అది నెరవేరకుండానే దూరమయ్యాడు. మా ఇద్దరి బంధానికి గుర్తుగా లండన్‌లో త్వరలోనే గోల్ఫ్‌ కోర్సును ప్రారంభిస్తాను. కడసారి నా మిత్రునికి వీడ్కోలు పలుకుతున్నా.. భౌతికంగా దూరమైనా  మా గుండెల్లో చిరకాలం నిలిచిపోతావు'' అంటూ తెలిపాడు. సచిన్‌తో పాటు మెక్‌గ్రాత్‌, ఇయాన్‌ బోథమ్‌లు వార్న్‌తో తమకున్న అనుబంధాన్ని ఫోటోల రూపంలో వీడియోలో పంచుకున్నారు.

చదవండి: Symonds-Shane Warne: 'వార్న్‌.. సాక్సుల్లో నోట్ల కట్టలు దాచేవాడు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement