ian botham
-
'భారత్‌లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశలో ఉంది'
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశకు చేరుకుందని.. ఐపీఎల్ మోజు వల్లే ఇదంతా జరుగుతుందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇయాన్ బోథం వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. మిర్రర్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇయాన్ బోథం మాట్లాడాడు. ఇప్పుడు ఇండియాకి వెళ్లి చూడండి.. అక్కడ ఎవరు టెస్టు క్రికెట్ చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇదంతా ఐపీఎల్ వల్లే. ఐపీఎల్ ద్వారా బోర్డుకు కోట్ల ఆదాయం వస్తుంది. ఆ మోజులో పడి అక్కడి జనాలు టెస్టు క్రికెట్‌ను చూడడం మానేశారు. ఇది ఎక్కడివరకు వెళ్తుందో తెలియదు. అయితే టెస్టు క్రికెట్ మొదలై ఇప్పటికే వందేళ్లు పూర్తయింది. టెస్టు క్రికెట్ ఎక్కడికి వెళ్లదు. ఎన్ని ఫార్మాట్లు వచ్చిన సంప్రదాయ క్రికెట్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఒకవేళ టెస్టు క్రికెట్ చచ్చిపోయే పరిస్థితి వస్తే మనం క్రికెట్‌నే కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇదంతా మీనింగ్‌లెస్‌గా కనిపిస్తున్నా.. ప్రతీ ఆటగాడు ఒక సందర్భంలో టెస్టు మ్యాచ్ తప్పనిసరిగా ఆడాల్సిందే. ఇక యాషెస్ టూర్ గురించి మాట్లాడుకుంటే.. ఈసారి ఇంగ్లండ్ మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. బజ్‌బాల్ త్రీ లయన్స్(ఇంగ్లండ్)కు చాలా ఉపయోగపడుతుంది. పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించడం మాములు విషయం కాదు. పాక్ గడ్డపై ఈ ఫీట్‌ను అందుకోవడం ఇంగ్లండ్ క్రికెట్‌కు మంచి తరుణం అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: మాయ చేసే మెస్సీనే బోల్తా కొట్టించాడు.. వాళ్లిద్దరు నిజంగా కలిశారా..? -
షేన్ వార్న్‌కు కడసారి వీడ్కోలు పలికిన దిగ్గజ క్రికెటర్లు
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్ ఆటగాడు షేన్ వార్న్‌కు లెజెండరీ క్రికెటర్లు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. బుధవారం మెల్బోర్న్లోని ఎంసీజీ గ్రౌండ్లో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులతో పాటు పలువురు ఆసీస్ దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. గ్లెన్ మెక్‌గ్రాత్, మైకెల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ తదితర క్రికెటర్లంతా వార్న్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా ఇయాన్ బోథమ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లు వార్న్ సేవలను గుర్తుచేసుకుంటూ కడసారి వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను స్కై స్పోర్ట్స్ ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో సచిన్ మాట్లాడుతూ.. ''గతేడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత నేను లండన్‌కు వెళ్లాను. అక్కడ అనుకోకుండా నా చిరకాల మిత్రుడు షేన్ వార్న్ ఎదురుపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇద్దరం కలవడంతో చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఈ సందర్భంలోనే ఇద్దరం కలిసి లండన్‌లో గోల్ఫ్ క్రీడను ప్రారంభించాలనుకున్నాం. కానీ ఈరోజు వార్న్ అది నెరవేరకుండానే దూరమయ్యాడు. మా ఇద్దరి బంధానికి గుర్తుగా లండన్‌లో త్వరలోనే గోల్ఫ్ కోర్సును ప్రారంభిస్తాను. కడసారి నా మిత్రునికి వీడ్కోలు పలుకుతున్నా.. భౌతికంగా దూరమైనా మా గుండెల్లో చిరకాలం నిలిచిపోతావు'' అంటూ తెలిపాడు. సచిన్‌తో పాటు మెక్‌గ్రాత్, ఇయాన్ బోథమ్‌లు వార్న్‌తో తమకున్న అనుబంధాన్ని ఫోటోల రూపంలో వీడియోలో పంచుకున్నారు. చదవండి: Symonds-Shane Warne: 'వార్న్.. సాక్సుల్లో నోట్ల కట్టలు దాచేవాడు' Sachin Tendulkar, Glenn McGrath and Ian Botham pay their tributes to Shane Warne at the memorial service at the MCG. pic.twitter.com/2PJo9hYMFe — Sky Sports Cricket (@SkyCricket) March 30, 2022 Shane Warne's father Keith pays tribute to his son at the memorial service at the MCG as the world remembers the legendary Australian cricketer. pic.twitter.com/07TFQHPxTW — Sky Sports Cricket (@SkyCricket) March 30, 2022 -
Ben Stokes: టెస్టుల్లో స్టోక్స్ అరుదైన ఘనత.. క్రికెట్ దిగ్గజాలతో పాటుగా..
England Tour Of West Indies 2022- Ben Stokes Century: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 114 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 120 పరుగులు సాధించిన స్టోక్స్.. టెస్టుల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ బాది ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో బెన్ స్టోక్స్ తన పేరిట ఓ రికార్డు లిఖించుకున్నాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. క్రికెట్ దిగ్గజాలు సర్ గ్యారీ సోబర్స్, సర్ ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, జాక్వెస్ కలిస్ తర్వాతి స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో 5 వేలకు పైగా పరుగులు.. 150కి పైగా వికెట్లు సాధించిన టాప్-5 ఆల్‌రౌండర్లు ►గ్యారీ సోబర్స్ – 8032 పరుగులు, 235 వికెట్లు- 93 టెస్టుల్లో ►ఇయాన్ బోథమ్– 5200 పరుగులు, 383 వికెట్లు- 102 టెస్టుల్లో ►కపిల్ దేవ్– 5248 పరుగులు, 434 వికెట్లు- 131 టెస్టుల్లో ►జాక్వస్ కలిస్– 13289 పరుగులు, 292 వికెట్లు- 166 టెస్టుల్లో ►బెన్ స్టోక్స్- 5005* పరుగులు, 170 వికెట్లు, 78 టెస్టుల్లో Ben Stokes completing 5,000 Test runs landmark in style. pic.twitter.com/AuKZ72dCwU — Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2022 చదవండి: Sehwag-Akhtar: ఏదో ఒకరోజు సెహ్వాగ్ చెంప చెల్లుమనిపిస్తా: అక్తర్ -
'నాకు ఆరు నెలల ముందే కరోనా వచ్చింది'
లండన్ : కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో చైనాలో మొదలైన కరోనా వైరస్ ఖండాంతరాలను దాటి విజృంభిస్తోంది. కరోనాతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య లక్షల్లో ఉంది. ఈ సంద్భంగా ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తనకు ఆరు నెలల ముందే కరోనా సోకిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం గుడ్ మార్నింగ్ బ్రిటన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో బోథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఆరు నెలలు ముందే.. అంటే జనవరి మొదట్లోనో లేక డిసెంబర్ చివరిలోనో సరిగ్గా గుర్తులేదు కానీ.. నాకు కరోనా వైరస్ సోకింది. అయితే అప్పట్లో దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడంతో బ్యాడ్ ఫ్లూ అని తప్పుగా అర్థం చేసుకున్నా. అసలు అవి కరోనా లక్షణాలని నాకు అప్పట్లో తెలియదు. సాధారణంగా ఫ్లూ జ్వరం వచ్చినా కూడా లక్షణాలు ఇలాగే ఉంటాయిలే అనుకొని తప్పుగా అర్థం చేసుకొన్నా. దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో చాలా రోజులు బాధపడ్డా. కానీ తర్వాత తగ్గిపోయింది. చూద్దాం కరోనా ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో. జనాలు మరికొన్ని రోజులు ఓపికపడితే రాబోయే రెండు వారాల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. (టిక్‌టాక్ బ్యాన్: వార్నర్‌ను ట్రోల్ చేసిన అశ్విన్) ఇప్పటికే కరోనా నుంచి తప్పించుకోవడానికి ప్రజలంతా తమ వంతుగా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగించాలని నేను కోరుతున్నా. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్యా క్రీడలు జరగకపోవడమే మంచిది. మరికొద్ది రోజులు ఓపికపడితే త్వరలోనే క్రీడలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఆటగాళ్లు భౌతికదూరం పాటిస్తూ ఆటను కొనసాగిస్తే మంచిదని కోరుతున్నా. ప్రస్తుతం కరోనా సోకిన క్రీడాకారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. మళ్లీ మాములు పరిస్థితి చేరుకుంటారు.' అంటూ చెప్పుకొచ్చాడు. ఇయాన్ బోథమ్ ఇంగ్లండ్ తరఫున 102 టెస్టుల్లో 5200 పరుగులు , 116 వన్డేల్లో 2113 రన్స్ చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఈ ఇంగ్లండ్ ఆటగాడు టెస్ట్‌ల్లో 383, వన్డేల్లో 145 వికెట్లు పడగొట్టాడు. -
ఏ ఒక్కరూ ఊహించలేదు
న్యూఢిల్లీ: టీమిండియాతో రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ రాణిస్తుందని ఎవరూ ఊహించలేదని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో కుక్ సేన అద్భుతంగా ఆడిందని ప్రశంసించాడు. రాజ్‌కోట్ స్టేడియంలో పిచ్ బాగుందని, తమ జట్టు విజయం అంచు వరకు వెళ్లిందని బోథమ్ అన్నాడు. ఇంగ్లీష్ మెన్ అన్ని విభాగాల్లో సత్తాచాటారని చెప్పాడు. కాగా టీమిండియా ప్రస్తుత బలాన్ని చూస్తే ఆ జట్టును దాదాపు ఆపలేరన్నాడు. అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ సేన అగ్రస్థానంలో ఉంది. అంతేగాక ఇటీవల సొంతగడ్డపై మెరుగైన రికార్డు ఉంది. అయినా రాజ్‌కోట్ టెస్టులో భారత జట్టుతో పోలిస్తే ఇంగ్లండ్ జట్టు మెరుగ్గా ఆడింది. ఓ దశలో కుక్ సేన విజయం దిశగా వెళ్లినా కోహ్లీ పోరాటపటిమతో ఈ మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించింది. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో చెత్తప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్.. రాజ్‌కోట్ టెస్టులో రాణించడం అభిమానులను కూడా ఆశ్చర్యం కలిగించింది. ఇరు దేశాల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి విశాఖపట్నంలో జరగనుంది. -
భారత క్రికెట్ చూస్తే బాధేస్తోంది
ఆయన ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి క్రికెటర్లలో ఒకరు. అలాంటి పెద్దమనిషికి ప్రస్తుతం భారత క్రికెట్ తీరును చూస్తే చాలా బాధ, నిరాశగా ఉందట. ఆయనే ఇయాన్ బోథమ్. ఇంగ్లండ్ జట్టుకు ఒకప్పుడు తిరుగులేని కెప్టెన్. 1992లో పాకిస్థాన్ పర్యటనతో రిటైర్మెంట్ ప్రకటించిన బోథమ్.. ఇప్పుడు భారత జట్టు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్న తీరును తప్పుబట్టారు. క్రికెట్ అంటే కేవలం 20 ఓవర్ల గేమ్ మాత్రమే కాదని, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. ఒకప్పుడు భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయంటే తనకు ఎంతో ఉద్వేగంగా అనిపించేదని, కానీ ఇప్పుడు మాత్రం అలా లేదని చెప్పారు. గడిచిన రెండు టెస్ట్ సిరీస్‌లలో ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు 0-4, 1-3 తేడాతో ఓడిపోయింది. 2012లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కూడా టీమిండియా ఓటమి చవిచూసింది. భారత్‌లో టెస్ట్ క్రికెట్ ఏమైపోతోందని, అసలు ఈ జట్టుకు ఏమైందని బోథమ్ ప్రశ్నించారు. ఈ విషయంలో భారత్ ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగులలో భారత్ మూడో ర్యాంకులో ఉన్నా, ప్రస్తుత పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు ఈ ర్యాంకులు ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లేదని.. నిజానికి ఇప్పుడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మంచి క్రికెట్ ఆడుతున్నా అవి ఎందుకు ముందు లేవని అన్నారు. ఈ సంవత్సరం నవంబర్ - డిసెంబర్ నెలల్లో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనలో ఐదు టెస్టులు ఆడతారు. -
గత 50 ఏళ్లలో లక్ష్మణ్‌దే ఉత్తమ ఇన్నింగ్స్
-
గత 50 ఏళ్లలో లక్ష్మణ్‌దే ఉత్తమ ఇన్నింగ్స్
ముంబై: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈడెన్ గార్డెన్స్ (2001)లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తను ఈ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న తీరు ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. అందుకే గత 50 ఏళ్లలో అత్యుత్తమ ప్రదర్శనగా లక్ష్మణ్ ఆడిన ఈడెన్ ఇన్నింగ్స్‌కు గుర్తింపు దక్కింది. ఈఎస్పీఎన్ డిజిటల్ క్రికెట్ మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్‌లో ఈ ఇన్నింగ్స్‌కే మెజారిటీ సభ్యులు ఓటేశారు. పలువురు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్స్, జర్నలిస్ట్‌లు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. గత ఐదు దశాబ్దాలలో 50 అత్యుత్తమ ప్రదర్శనలను ఓట్ల ద్వారా ఎంపిక చేశారు. 1981లో ఆస్ట్రేలియాపై ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్) ప్రదర్శన రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా 50 ఉత్తమ ప్రదర్శనలలో బ్రియాన్ లారా (వెస్టిండీస్) ఆడిన ఇన్నింగ్స్ నాలుగు ఉన్నాయి. బోథమ్, రిచర్డ్స్ (వెస్టిండీస్)లవి మూడు ప్రదర్శనలు ఉన్నాయి. గవాస్కర్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌కు కూడా ఈ టాప్-50 ప్రదర్శన జాబితాలో చోటు దక్కింది. -
బోథమ్‌పై బీసీసీఐ ఆగ్రహం
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్‌ను నాశనం చేస్తోందన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ వ్యాఖ్యలపై బీసీసీఐ మండిపడింది. ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితబోధ చేసింది. అన్ని జట్ల క్రికెటర్లు ఐపీఎల్‌కు బానిసలవుతున్నారని, ఆయా క్రికెట్ బోర్డులు కూడా లీగ్‌కు మద్దతు పలుకుతున్నాయని బోథమ్ ఆరోపించారు. ‘ఐపీఎల్లో ఆడేందుకు ఇతర బోర్డులు ఎందుకు అంగీకరించాయని ఆయన అడిగారు. ముందు బోథమ్ నిజాలు తెలుసుకోవాలి. విదేశీ ఆటగాళ్లను లీగ్‌లో ఆడేందుకు అనుమతించినందుకు మేం ఆయా బోర్డులకు పది వేల యూఎస్ డాలర్ల చొప్పున నష్టపరిహారం కింద చెల్లించాం. మాకు సూచనలు ఇచ్చేందుకు దిగ్గజ ఆటగాళ్లున్నారు. బోథమ్లాంటి వ్యక్తుల సలహాలు మాకు అక్కరలేదు’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ స్పష్టం చేశారు. -
ఇంగ్లండ్ ఆటతీరుపై ఇయాన్ బోథమ్ ఆగ్రహం!
లండన్: ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన వన్డేల్లో ఇంగ్లండ్ క్రికెటర్ల ఆటతీరు ఓ జోక్ తలపించిందని ఆదేశ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ అన్నారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన తీరు ఆగ్రహం తెప్పించిందని ఆయన అన్నారు. ప్రపంచ కప్ కు ఆరునెలల ముందు ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉందని బోథమ్ మండిపడ్డారు. ఇలా దారుణమైన ఆటను ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్ కు బదులు 'ఎగ్ కప్' గెలుచుకుంటే అదృష్టమే అని వ్యాఖ్యలు చేశారు. పరాజయాల నుంచి ఇంగ్లాండ్ గుణపాఠం నేర్చుకోవడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చేసిన తప్పులే మళ్లీ.. మళ్లీ చేస్తుండటం తనను నిరాశకు గురిచేస్తోందని బోథమ్ అన్నారు. -
ఛారిటీ మ్యాచ్‌లో లారా, బోథమ్
అలనాటి వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రయాన్ లారా, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఇయన్ బోథమ్.. వీళ్లంతా మళ్లీ వచ్చి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? త్వరలో జరగబోయే ఆల్ స్టార్ ఛారిటీ ట్వంటీ 20 పోటీలకు వీళ్లిద్దరినీ కెప్టెన్లుగా ఎంపిక చేశారు. ఆగస్టు 12న వార్నర్ పార్కులో జరిగే ఈ మ్యాచ్‌లో అలనాటి సెలబ్రిటీలు, నేటి క్రికెట్ తారలు అందరూ పాల్గొంటారని భావిస్తున్నారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) పేరుతో వెస్టిండీస్ దీవుల్లోని వివిధ జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్రిటిష్ మీడియా కింగ్ పియర్స్ మోర్గాన్ ఇప్పటికే బోథమ్ జట్టులో ఆడతానని తెలిపారు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఈ ప్రాంతంలో ఉండే క్రికెట్ అభిమానులకు షడ్రసోపేతమైన విందులాంటిదని బోథమ్ చెప్పారు. 2007లో క్రికెట్ నుంచి రిటైరైన లారా వెస్టిండీస్ తరఫున టెస్టుల్లోను, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోను అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.