ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో టెస్టు క్రికెట్ చచ్చిపోయే దశకు చేరుకుందని.. ఐపీఎల్ మోజు వల్లే ఇదంతా జరుగుతుందంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇయాన్ బోథం వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. మిర్రర్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇయాన్ బోథం మాట్లాడాడు.
ఇప్పుడు ఇండియాకి వెళ్లి చూడండి.. అక్కడ ఎవరు టెస్టు క్రికెట్ చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇదంతా ఐపీఎల్ వల్లే. ఐపీఎల్ ద్వారా బోర్డుకు కోట్ల ఆదాయం వస్తుంది. ఆ మోజులో పడి అక్కడి జనాలు టెస్టు క్రికెట్‌ను చూడడం మానేశారు. ఇది ఎక్కడివరకు వెళ్తుందో తెలియదు. అయితే టెస్టు క్రికెట్ మొదలై ఇప్పటికే వందేళ్లు పూర్తయింది. టెస్టు క్రికెట్ ఎక్కడికి వెళ్లదు. ఎన్ని ఫార్మాట్‌లు వచ్చిన సంప్రదాయ క్రికెట్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఒకవేళ టెస్టు క్రికెట్ చచ్చిపోయే పరిస్థితి వస్తే మనం క్రికెట్‌నే కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇదంతా మీనింగ్‌లెస్‌గా కనిపిస్తున్నా.. ప్రతీ ఆటగాడు ఒక సందర్భంలో టెస్టు మ్యాచ్ తప్పనిసరిగా ఆడాల్సిందే.
ఇక యాషెస్ టూర్ గురించి మాట్లాడుకుంటే.. ఈసారి ఇంగ్లండ్ మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. బజ్‌బాల్ త్రీ లయన్స్(ఇంగ్లండ్)కు చాలా ఉపయోగపడుతుంది. పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై 3-0 తేడాతో ఓడించడం మాములు విషయం కాదు. పాక్ గడ్డపై ఈ ఫీట్‌ను అందుకోవడం ఇంగ్లండ్ క్రికెట్‌కు మంచి తరుణం అంటూ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment