WI Vs Eng 2nd Test: Ben Stokes Completes 5000 Test Runs, Joins In Elite List - Sakshi
Sakshi News home page

Ben Stokes Test Runs: టెస్టు‍ల్లో స్టోక్స్‌ అరుదైన ఘనత.. గ్యారీ సోబర్స్‌, కపిల్‌ దేవ్‌ వంటి క్రికెట్‌ దిగ్గజాలతో పాటుగా..

Published Fri, Mar 18 2022 11:01 AM | Last Updated on Fri, Mar 18 2022 11:31 AM

WI Vs Eng 2nd Test: Ben Stokes Completes 5000 Test Runs Joins Elite Group - Sakshi

ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌(PC: ECB)

England Tour Of West Indies 2022- Ben Stokes Century: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 114 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. తద్వారా తన టెస్టు కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 120 పరుగులు సాధించిన స్టోక్స్‌.. టెస్టుల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సిక్సర్‌ బాది ఈ ఫీట్‌ నమోదు చేయడం విశేషం.

ఈ క్రమంలో బెన్‌ స్టోక్స్‌ తన పేరిట ఓ రికార్డు లిఖించుకున్నాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. క్రికెట్‌ దిగ్గజాలు సర్‌  గ్యారీ సోబర్స్‌, సర్‌ ఇయాన్‌ బోథమ్‌, కపిల్‌ దేవ్‌, జాక్వెస్‌ కలిస్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

టెస్టుల్లో 5 వేలకు పైగా పరుగులు.. 150కి పైగా వికెట్లు సాధించిన టాప్‌-5 ఆల్‌రౌండర్లు
గ్యారీ సోబర్స్‌ – 8032 పరుగులు, 235 వికెట్లు- 93 టెస్టుల్లో
ఇయాన్‌ బోథమ్‌– 5200 పరుగులు, 383 వికెట్లు- 102 టెస్టుల్లో
కపిల్‌ దేవ్‌– 5248 పరుగులు, 434 వికెట్లు- 131 టెస్టుల్లో
జాక్వస్‌ కలిస్‌– 13289 పరుగులు, 292 వికెట్లు- 166 టెస్టుల్లో
బెన్‌ స్టోక్స్‌- 5005* పరుగులు, 170 వికెట్లు, 78 టెస్టుల్లో

చదవండి: Sehwag-Akhtar: ఏదో ఒకరోజు సెహ్వాగ్‌ చెంప చెల్లుమనిపిస్తా: అక్తర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement