యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టు రసవత్తరంగా మారుతుంది. రెండో రోజు రెండో సెషన్‌లోనే ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో ఆసీస్‌కు 26 పరుగులు స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది. అయితే తాను మొదటినుంచి చెప్పుకుంటున్న బజ్‌బాల్ ఆటను మరోసారి ఆస్ట్రేలియాకు రుచి చూపించాడు. ఫలితం సంగతి ఎలా ఉన్నా స్టోక్స్ మాత్రం తాను ఉన్నంతసేపు దాటిగా ఆడాడు.
మొదట క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న స్టోక్స్ ఆ తర్వాత ఫాస్ట్‌గా ఆడాడు. అయితే ఏ జట్టైనా వికెట్లు కోల్పోతుంటే బ్యాటర్ కూడా స్లో ఆడడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్టోక్స్ మాత్రం ఎదురుదాడి చేశాడు.ఇంగ్లండ్ 168 పరుగుల వద్ద మార్క్‌వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది.
క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 106 బంతుల్లో 80 పరుగులు చేసిన స్టోక్స్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.
ఈ క్రమంలోనే స్టోక్స్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఆరువేల పరుగులు, వంద వికెట్లు సాధించిన మూడో ఆల్‌రౌండర్‌గా స్టోక్స్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6008 పరుగులు చేయడంతో పాటు 197 వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్(13289 పరుగులు, 292 వికెట్లు), రెండో స్థానంలో విండీస్ దిగ్గజం సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్(8032 పరుగులు, 235 వికెట్లు) ఉన్నాడు.
చదవండి: #TamimIqbal: దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్
#Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం
Comments
Please login to add a commentAdd a comment