all rounder
-
IPL 2025: ఐపీఎల్లో విలువ పెరిగింది
భారత క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలనేది ప్రతీ యువ క్రికెటర్ కల. ప్రతిభకు తోడు శ్రమ, పట్టుదల, పోరాటంతో సత్తా చాటి గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కుర్రాళ్లకు ఆదివారం అలాంటి గొప్ప అవకాశం వచి్చంది. ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఢిల్లీ పేస్ బౌలర్ మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్‌తో తొలి టి20 మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల టీమిండియా తరఫున ‘బ్లూ జెర్సీ’లో ఆడటం మాత్రమే కాదు... వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా తమ విలువను అమాంతం పెంచుకున్నారు. వీరిద్దరిని వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి ఆయా ఫ్రాంచైజీలు కొనసాగిస్తాయా అనేది ఆసక్తికరం. ఐపీఎల్–2025 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము కొనసాగించే ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ఈ నెల 31 వరకు గడువు విధించారు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. ఈ సిరీస్‌కు ముందు వరకు వీరిద్దరు ‘అన్క్యాప్డ్’ ప్లేయర్లే. ఇప్పుడు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంతో ‘క్యాప్డ్’ ప్లేయర్లుగా మారిపోయారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్‌కు ఆడితే ‘క్యాప్డ్ ప్లేయర్’గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు. నిబంధనలు ఇలా... ఐపీఎల్–2025 కోసం గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను టీమ్‌కు కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇందులో కనీసం ఒకరైనా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే రూ. 18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు కచి్చతంగా ‘అన్క్యాప్డ్’ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి. ఐదుగురుని అట్టి పెట్టుకోకుండా ముగ్గురు చాలు అని భావించే ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా రెండు దశలుగా ఈ మొత్తాలను నిర్ణయించారు. వీరికి అవకాశం ఉందా... నితీశ్ రెడ్డి గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 142.92 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతను ఏకంగా 21 సిక్సర్లు బాదాడు. దీని ప్రకారం చూస్తే ‘అన్క్యాప్డ్’గా అతడిని కనీసం రూ. 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిõÙక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్‌ను కనీసం ఐదో ఆటగాడిగా రూ. 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది సందేహమే! అతడిని విడుదల చేసి వేలంలో ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశం ఉంటుంది. మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు. కేవలం 12.14 సగటుతో 7 వికెట్లు తీశాడు. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తర్వాత అలాంటి ఆటగాడిని వదులుకునేందుకు సూపర్ జెయింట్స్ ఇష్టపడకపోవచ్చు. లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్‌గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. ఇద్దరిలో ఎవరినీ ఇరు జట్లు కొనసాగించకపోయినా...వేలంలోకి వెళితే భారీ మొత్తం లభించేందుకు కూడా ఆస్కారం ఉంది. కల నిజమైంది: నితీశ్ రెడ్డి గ్వాలియర్: భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ సంతోషం వెలిబుచ్చారు. తమ కెరీర్లో ఇది అత్యుత్తమ క్షణంగా అభివర్ణించారు. తమపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించినట్లు ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు వెల్లడించారు. ‘భారత్‌లో క్రికెట్ ఆడే ఎవరికైనా ఇది అద్భుతంలాగే అనిపిస్తుంది. టీమిండియా తరఫున ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైనట్లుగా భావించాను. సహజంగానే కొంత ఉత్కంఠ, ఆందోళన ఉన్నా ఆ తర్వాత మెల్లగా ఆటను ఆస్వాదించాను. నాకూ, నా కుటుంబానికి ఇది గర్వకారణమైన క్షణం. టీమ్‌లో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ బృందం నుంచి మంచి మద్దతు లభించింది. బౌలింగ్‌లోనూ నాకు మంచి సూచనలు లభించాయి. కెపె్టన్ సూర్య నాపై ఎలాంటి ఒత్తిడి దరి చేరకుండా ప్రశాంతంగా బౌలింగ్ చేసే అవకాశం కలి్పంచాడు. తొలి మ్యాచ్ అనిపించకుండా స్వేచ్ఛగా ఆడమని చెప్పాడు’ అని నితీశ్ రెడ్డి వివరించాడు. తొలి మ్యాచ్‌లో మయాంక్ కూడా భావోద్వేగభరితమయ్యాడు. ‘నేను మ్యాచ్ ఆడుతున్నానని తెలియగానే గత నాలుగు నెలలు నా కళ్ల ముందు మెదిలాయి. పైగా గాయం నుంచి కోలుకొని వస్తున్నాను కాబట్టి అదనపు ఒత్తిడి నాపై ఉంది. అయితే కెప్టెన్ సూర్య నేను రనప్ తీసుకుంటున్న సమయంలో నా వద్దకు వచ్చి నువ్వు ఎలా బౌలింగ్ చేయగలనని భావిస్తోవో అలాగే చేయి అతని ధైర్యం నింపాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో గతంలో పని చేసిన అనుభవం కూడా పనికొచి్చంది’ అని మయాంక్ చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
వరల్డ్ నంబర్ వన్‌గా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు
ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్‌స్టోన్ ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించాడు. ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో సత్తా చాటి.. ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి.. నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. తన కెరీర్లోనే అత్యుత్తమంగా 253 రేటింగ్ పాయింట్లతో లివింగ్‌స్టోన్ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా స్టార్ మార్కస్ స్టొయినిస్(211 రేటింగ్ పాయింట్లు)ను అగ్రస్థానం నుంచి వెనక్కి నెట్టి.. అతడికి అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లివింగ్‌స్టోన్ అదరగొట్టాడు.ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిసౌతాంప్టన్లో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటర్‌గా 37 పరుగులు చేయడంతో పాటు.. 22 పరుగులు మాత్రమే ఇచ్చి.. మూడు వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. కార్డిఫ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 87 పరుగులు చేసిన లివింగ్‌స్టోన్.. కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నంబర్ వన్ బ్యాటర్ అతడేతద్వారా ఇంగ్లండ్‌ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌లో ఆసీస్- ఇంగ్లండ్ చెరో మ్యాచ్ గెలవగా.. మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. కాగా 2017లో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 31 ఏళ్ల లివింగ్‌స్టోన్.. ఇప్పటి వరకు ఒక టెస్టు, 25 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 16, 558, 815 పరుగులు చేయడంతో పాటు.. వన్డేల్లో 17, టీ20లలో 29 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐసీసీ టీ20 బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ తన టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకోగా.. లివింగ్‌స్టోన్ 17 స్థానాలు మెరుగుపరచుకుని 33వ ర్యాంకు సంపాదించాడు. బౌలర్ల టాప్-5 యథాతథంఇక బౌలర్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్ పేసర్ అకీల్ హొసేన్, అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ, శ్రీలంక వనిందు హసరంగ టాప్-5లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ అన్రిచ్ నోర్జేను వెనక్కినెట్టి ఆరోస్థానానికి చేరుకున్నాడు. కాగా టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి హార్దిక్ పాండ్యా ఒక్కడే టాప్-10(ఏడో స్థానం)లో ఉన్నాడు.ఐసీసీ తాజా టీ20 ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్- టాప్ 51. లియామ్ లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్)- 252 రేటింగ్ పాయింట్లు2. మార్కస్ స్టొయినిస్(ఆస్ట్రేలియా)- 211 రేటింగ్ పాయింట్లు3. సికందర్ రజా(జింబాబ్వే)- 208 రేటింగ్ పాయింట్లు4. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- 206 రేటింగ్ పాయింట్లు5. వనిందు హసరంగ(శ్రీలంక)- 206 రేటింగ్ పాయింట్లు.చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్! -
భారత్‌తో సిరీస్.. ఆ ఇద్దరు కీలకం: కమిన్స్
మెల్బోర్న్: ఈ ఏడాది చివర్లో భారత్‌తో స్వదేశంలో జరగనున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పేస్ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, మిషెల్ మార్ష్ కీలకమవుతారని ఆ్రస్టేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వీరిద్దరూ అందుబాటులో ఉంటే ప్రధాన పేసర్లపై భారం తగ్గడంతో పాటు... బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ‘పేస్ ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల అదనపు ప్రయోజనమే. వేసవిలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో గ్రీన్, మార్ష్ కీలకం అవుతారు. గతంలో వారిని పెద్దగా వినియోగించుకోలేదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నం. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ బౌలర్‌గానే కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు తగినంత అనుభవం కూడా సాధించాడు. వీరిద్దరి వల్ల జట్టు సమతుల్యం పెరుగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది. నాథన్ లయన్ వంటి సీనియర్ స్పిన్నర్ ఉండటం మా అదృష్టం’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన గత రెండు బోర్డర్–గవాస్కర్ ట్రోఫీల్లో పరాజయం పాలైన ఆసీస్... ఈసారి సిరీస్ ఎలాగైనా సిరీస్ చేజిక్కించుకోవాలని ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. -
మూడో స్థానానికి ఎగబాకిన హార్దిక్ పాండ్యా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారీ జంప్ కొట్టాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం హార్దిక్ ఖాతాలో 213 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో లంక కెప్టెన్ వనిందు హసరంగ మొదటి స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ రెండో స్థానంలో ఉన్నాడు. హసరంగ ఖాతాలో 222 రేటింగ్ పాయింట్లు ఉండగా.. నబీ ఖాతాలో 214 పాయింట్లు ఉన్నాయి. వరల్డ్‌కప్ ప్రదర్శనల ఆధారంగా తాజా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో చాలా మంది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. హసరంగ ఒక స్థానాన్ని, నబీ రెండు స్థానాలను, మార్క్రమ్ రెండు స్థానాలను (8వ ర్యాంక్), మ్యాక్స్‌వెల్ మూడు స్థానాలను (15వ ర్యాంక్), రసెల్ ఆరు స్థానాలను (16వ ర్యాంక్) మెరుగుపర్చుకున్నారు. టాప్-20 భారత్ నుంచి హార్దిక్‌తో పాటు అక్షర్ పటేల్ ఉన్నారు. అక్షర్ 130 రేటింగ్ పాయింట్లతో 19వ స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్ అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడు రోస్టన్ ఛేజ్. ఈ విండీస్ ఆల్‌రౌండర్ ఏకంగా 17 స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి చేరుకున్నాడు.టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే..ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. హాజిల్‌వుడ్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి.. ఆడమ్ జంపా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి.. అక్షర్ పటేల్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి ఎగబాకారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ వారం అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది బుమ్రా, కుల్దీప్ యాదవ్. బుమ్రా ఏకంగా 44 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి జంప్ కొట్టాడు. అలాగే కేశవ్ మహారాజ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 14 స్థానానికి ఎగబాకాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 17, రవి బిష్ణోయ్ 19 స్థానాల్లో ఉన్నారు. -
దూసుకుపోతున్న రవీంద్ర జడేజా
టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాఇటీవలికాలంలో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బౌలర్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్ట్‌లో ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసిన జడ్డూ భాయ్.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో కదంతొక్కిన జడ్డూ.. అనంతరం బంతితో విజృంభించాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టిన జడేజా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించి ఐదు వికెట్లు పడగొట్టాడు. జడేజా ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 122 పరుగులకే కుప్పకూలి 434 పరుగులు భారీ తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్ట్ మిస్ అయిన జడేజా తొలి మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లోనూ అతను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బౌలింగ్ తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన జడేజా.. బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్‌లో 87, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా రాటుదేలిన జడేజా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందుకు అతని గణాంకాలే సాక్ష్యం. డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడిన జడేజా బ్యాటింగ్‌లో 49.95 సగటున 1520 పరుగులు చేసి బౌలింగ్‌లో 25.08 సగటున 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ఈ టోర్నీలో జడ్డూ మూడు సెంచరీలు, 10 అర్దసెంచరీలు బాదాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2023-25) విషయానికొస్తే.. జడేజా ఇప్పటివరకు (ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్) 5 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, రెండు అర్దసెంచరీల సాయంతో 299 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో 19 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుంది. -
ఐసీసీ అగ్రపీఠంపై కొత్త ఆటగాడు.. ఐదేళ్ల తర్వాత..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఈ స్థానంలో దాదాపు ఐదేళ్ల పాటు కొనసాగిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానానికి పడిపోయాడు. గాయం కారణంగా షకీబ్ వన్డేలకు దూరంగా ఉండటం.. ఈ మధ్యలో నబీ సత్తా చాటడంతో వీరిద్దరి ర్యాంక్‌లు తారుమారయ్యాయి. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డేలో సెంచరీతో పాటు వికెట్ తీయడంతో నబీ అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగం టాప్-10లో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన లంక ఆటగాడు పథుమ్ నిస్సంక 10 స్థానాలు మెరుగుపర్చుకుని 18వ స్థానానికి చేరగా.. మూడో వన్డేలో 97 పరుగులతో అజేయంగా నిలిచిన నిస్సంక సహచరుడు అసలంక 5 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరుసగా 2, 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. కేశవ్ మహారాజ్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు సిరాజ్, బుమ్రా, కుల్దీప్ నాలుగు, ఐదు, తొమ్మిది స్థానాల్లో నిలిచారు. టెస్ట్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు చేసిన కేన్ విలియమ్సన్ టాప్ ప్లేస్‌ను మరింత పదిలం చేసుకోగా.. భారత ఆటగాళ్లు విరాట్ ఏడులో, పంత్, రోహిత్ శర్మ 12, 13 స్థానాల్లో నిలిచారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో బుమ్రా టాప్‌లో కొనసాగుతుండగా.. అశ్విన్ 3, రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచారు. సిరాజ్, షమీ 19, 20 స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ విభాగంలో జడేజా, అశ్విన్, అక్షర్ 1, 2, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ టాప్‌లో కొనసాగుతుండగా.. యశస్వి జైస్వాల్ ఆరో ప్లేస్‌లో నిలిచాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. భారత బౌలర్లు అక్షర్ పటేల్, రవి భిష్ణోయ్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. -
అమ్మానాన్న వద్దన్నారు! ఇప్పుడు.. ఏకంగా టీమిండియాకు! ఆ జంక్షన్‌కు ఆమె పేరు
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్న మాటను అక్షరాలా నిజం చేసి చూపించింది మిన్ను మణి. కష్టపడితే ఫలితం తప్పక దక్కుతుందడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గిరిజన గూడెంలో పుట్టి.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను మనోబలంతో జయించి.. టీమిండియా క్రికెటర్ స్థాయికి ఎదిగింది. ఆడపిల్లలకు క్రికెట్ ఎందుకని వారించిన అమ్మానాన్నలతో పాటు.. తమ ఊరు మొత్తాన్ని గర్వపడేలా చేస్తోంది. విమర్శించిన నోళ్లే తనను కొనియాడేలా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు-2023కి సన్నద్ధమవుతున్న ఈ ‘మట్టిలో మాణిక్యం’ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం! మగవాళ్ల ఆట మనకెందుకు? కేరళలోని వయనాడ్ జిల్లాలో బ్రహ్మగిరి కొండల అంచున ఉన్న గిరిజన గూడెం మిన్ను స్వస్థలం. ‘కరూచియా’ తెగకు చెందిన ఆమె తండ్రి మణి రోజువారీ కూలీ. ఆయన తెచ్చిన డబ్బుతో ఇంటిని చక్కదిద్దే బాధ్యతలు తలకెత్తుకున్న వసంత మిన్ను తల్లి. చిన్ననాటి నుంచే మిన్నుకు క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. మగపిల్లలతో కలిసి క్రికెట్ ఆడేది. కానీ మిన్నును అథ్లెట్‌గా చూడాలనుకున్న ఆమె తల్లిదండ్రులకు ఇది ఎంతమాత్రం నచ్చలేదు. మగవాళ్ల ఆట మనకెందుకని కూతుర్ని వారించారు. పురుషాధిక్య ప్రపంచంలో మిన్నుకు ఇంటి నుంచే ఇలాంటి పోరు మొదలైంది. పట్టువీడలేదు.. బంగారు భవిష్యత్తుకు బాటలు పడ్డాయలా! కానీ ఆమె పట్టువీడలేదు. ఎల్సమ్మ బేబీ అనే స్కూల్ పీఈటీ టీచర్‌తో పరిచయం మిన్ను రాతను మార్చింది. ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఎల్సమ్మ.. తల్లిదండ్రులను ఒప్పించి మరీ మిన్ను బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది. దగ్గరుండి మరీ మిన్నును కేరళ క్రికెట్ అసోసియేషన్‌కు తీసుకెళ్లింది. అంచెలంచెలుగా ఎదిగి ప్రతిభావంతురాలైన మిన్ను తన ఆటతో అక్కడున్న వాళ్లను మంత్రముగ్ధులను చేసి.. తొలుత జిల్లా స్థాయి, ఆపై అండర్ 16.. అండర్ 23లో కేరళకు ఆడింది. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత మహిళా అండర్-23, అనంతరం ఇండియా- ఏ జట్టుకు ఎంపికైంది. అయితే, ఆటలో దూసుకుపోతున్నా ‘ఆర్థిక కష్టాల కడలి’ని మాత్రం అంత తేలికగా దాటలేకపోయింది మిన్ను. దశ తిరిగింది.. అదృష్టం వరించింది అలాంటి సమయంలో మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో మిన్నును ‘అదృష్టం’ వరించింది. ఆమె అద్భుత ఆట తీరుకు ప్రతిఫలంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రూ. 30 లక్షలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. దీంతో మిన్ను కుటుంబానికి కాస్త సాంత్వన లభించింది. అయితే, ఆర్థికంగా కష్టాలు తీరినా.. తనకు ఈ డబ్బు ముఖ్యం కాదని.. ఏదో ఒకరోజు టీమిండియాకు ఆడటమే తన ప్రధాన లక్ష్యమని చెప్పడం.. మిన్నుకు ఆట పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం. ఆమె ఆశయం గొప్పది.. అందుకే బంగ్లాదేశ్ పర్యటన రూపంలో అవకాశం కలిసివచ్చింది. అరంగేట్రంలోనే సత్తా చాటి.. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో భారత మహిళా క్రికెట్ జట్టు ఆడిన టీ20 సిరీస్ సందర్భంగా ఆమెకు అవకాశం వచ్చింది. బంగ్లాతో మొదటి టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో మిన్న మణి అరంగేట్రం చేసింది. మొదటి మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసిన ఈ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే, ఈ సిరీస్‌లో మొత్తంగా ఐదు వికెట్లతో మెరిసిన మిన్ను.. తనదైన ముద్ర వేయగలిగింది. ఆరంభంలోనే అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుని వారం తిరిగే లోపే 19వ ఆసియా గేమ్స్ జట్టులో చోటు సంపాదించింది. చైనా వేదికగా సెప్టెంబరు 23 నుంచి ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక క్రీడల్లో భాగం కానుంది. సమాజం నుంచి ఎన్నో విమర్శలు ‘‘క్రికెట్‌పై నాకు ఆసక్తి ఉందన్న విషయం తెలిసి నా తల్లిదండ్రులతో పాటు సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొన్నా. ఎనిమిదో తరగతికి వచ్చే దాకా నేను లోకల్ మ్యాచ్‌లు ఆడుతున్న విషయం మా అమ్మానాన్నలకు కూడా తెలియదు. చదువుకుంటూ.. వరి పొలాల్లో పనిచేసుకుంటూ.. నా తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయం చేసేదాన్ని. స్థలం కావాలి అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. వయనాడ్ నుంచి ఓ అమ్మాయి టీమిండియాకు ఆడుతోందని చుట్టుపక్కల వాళ్లు గర్వపడుతున్నారు. నాలాగే వాళ్ల కుమార్తెలు కూడా క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు’’ అని 24 ఏళ్ల మిన్ను మణి సంతోషం వ్యక్తం చేసింది. తనలాంటి అమ్మాయిలను ప్రోత్సహించేందుకు క్రికెట్ నర్సరీ నిర్మించేలా స్థలం మంజూరు చేయాలని స్థానిక పాలనా అధికారులను కోరినట్లు జాతీయ మీడియాతో తమ మనసులోని మాట బయటపెట్టింది. అరుదైన గౌరవం.. ఆ జంక్షన్‌కు పేరు ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో గల మనంతవాడీ మున్సిపాలిటి మిన్ను మణిని అరుదైన గౌరవంతో సత్కరించింది. మైసూర్ రోడ్డు జంక్షన్‌కు మిన్ను మణి జంక్షన్‌గా నామకరణం చేసింది. మిన్ను ఇంటి నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ జంక్షన్ ఉంటుంది. ఊహించని బహుమతి సినీ, రాజకీయ ప్రముఖులకు మాత్రమే సాధారణంగా ఇలాంటి గౌరవాలు దక్కుతాయని తాను భావించానని.. అయితే, స్థానిక మున్సిపాలిటీ అధికారులు ఇలా తనకు ఊహించని బహుమతి ఇచ్చారని మిన్ను ఆనందంతో ఉప్పొంగిపోయింది. తమ ఇంటి నుంచి ఈ జంక్షన్ వరకు త్వరలోనే రోడ్డు కూడా నిర్మిస్తామని అధికారులు చెప్పారని హర్షం వ్యక్తం చేసింది. మట్టి సువాసనలు పరిమళించగా.. ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుండటం గర్వంగా ఉందన్న మిన్ను.. ఆల్‌రౌండర్‌గా మెగా ఈవెంట్లో సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. బౌలర్‌గా తనకు ప్రాధాన్యం ఉంటుందన్న మిన్ను.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రావొచ్చని చెప్పుకొచ్చింది. మరి లెఫ్టాండ్ బ్యాటర్.. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ అయిన మిన్ను మణి ఆసియా క్రీడల్లో టీమిండియా జెర్సీ ధరించి బరిలోకి దిగితే.. ఆమె తల్లిదండ్రులతో కేరళ మొత్తం గర్విస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మట్టి సువాసనలతో పరిమళించిన తమ ఆడబిడ్డను దేశం కూడా విజయోస్తు అని దీవిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా! హ్యాట్సాఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ మిన్ను ‘మణి’!! -సాక్షి వెబ్‌డెస్క్ చదవండి: Ind Vs WI: టీమిండియాను అవమానించిన విండీస్ హిట్టర్! -
బజ్‌బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టు రసవత్తరంగా మారుతుంది. రెండో రోజు రెండో సెషన్లోనే ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో ఆసీస్‌కు 26 పరుగులు స్వల్ప ఆధిక్యం లభించినట్లయింది. అయితే తాను మొదటినుంచి చెప్పుకుంటున్న బజ్‌బాల్ ఆటను మరోసారి ఆస్ట్రేలియాకు రుచి చూపించాడు. ఫలితం సంగతి ఎలా ఉన్నా స్టోక్స్ మాత్రం తాను ఉన్నంతసేపు దాటిగా ఆడాడు. మొదట క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న స్టోక్స్ ఆ తర్వాత ఫాస్ట్‌గా ఆడాడు. అయితే ఏ జట్టైనా వికెట్లు కోల్పోతుంటే బ్యాటర్ కూడా స్లో ఆడడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్టోక్స్ మాత్రం ఎదురుదాడి చేశాడు.ఇంగ్లండ్ 168 పరుగుల వద్ద మార్క్‌వుడ్(24 పరుగులు) ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరగ్గానే స్టోక్స్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. అప్పటికి ఇంగ్లండ్ ఇంకా 95 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కుదురుకున్న స్టోక్స్ 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 పరుగులు చేయడం విశేషం. మర్ఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన స్టోక్స్ ఆ తర్వాత కమిన్స్, స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 106 బంతుల్లో 80 పరుగులు చేసిన స్టోక్స్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే స్టోక్స్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఆరువేల పరుగులు, వంద వికెట్లు సాధించిన మూడో ఆల్‌రౌండర్‌గా స్టోక్స్ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6008 పరుగులు చేయడంతో పాటు 197 వికెట్లు పడగొట్టాడు. ఇక తొలి స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్ కలిస్(13289 పరుగులు, 292 వికెట్లు), రెండో స్థానంలో విండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్(8032 పరుగులు, 235 వికెట్లు) ఉన్నాడు. చదవండి: #TamimIqbal: దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్ #Ashes2023: హద్దు మీరిన ఇంగ్లండ్ ఫ్యాన్స్.. అలెక్స్ కేరీకి చేదు అనుభవం -
రవీంద్ర జడేజాను ఇలా ఎప్పుడైనా చూశారా?.. అరుదైన ఫోటోలపై ఓ లుక్కేయండి
-
150 వికెట్లు.. 2వేలకు పైగా పరుగులు; తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్ర
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కేను విజేతగా నిలిపేందుకు జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన వంతు కృషి చేస్తున్నాడు. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 పోరులో జడ్డూ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 22 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన జడ్డూ ఆ తర్వాత బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 18 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జడేజా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో దాసున్ షనకను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఐపీఎల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అయితే ఐపీఎల్లో రెండువేలకు పైగా పరుగులు, 150 వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా జడేజా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు డ్వేన్ బ్రావో 1560 పరుగులు, 183 వికెట్లు తీయగా.. ఆ తర్వాత సునీల్ నరైన్ 1046 పరుగులు చేయడంతో పాటు 163 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఇద్దరు జడ్డూ కంటే ఎక్కువ వికెట్లు తీసినప్పటికి బ్యాటింగ్‌లో మాత్రం రెండు వేల పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయారు. Jaddu-giri 🤘 Ravindra Jadeja is once again spinning trouble for batters at #Anbuden 🤩#IPL2023 #IPLonJioCinema #GTvCSK #Qualifier1 #Yellove pic.twitter.com/OROqcccAVh — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: జడ్డూ చిరుత పులిలా.. మొయిన్ అలీ ముసలోడిలా! -
గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఖాతాలో అరుదైన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఐపీఎల్లో 2వేల పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా చోటు సంపాదించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పాండ్యా ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా 111 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 2012 పరుగులు సాధించాడు. 29 ఏళ్ల 187 రోజుల్లో 2వేల మార్క్‌తో పాటు 50 వికెట్లు తీసుకున్న పాండ్యా.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇక పాండ్యా కంటే ముందు షేన్ వాట్సన్(3874 పరుగులు, 92 వికెట్లు, 32 ఏళ్ల 330 రోజులు), కీరన్ పొలార్డ్(3412 పరుగులు, 69 వికెట్లు, 29 ఏళ్ల 332 రోజులు), రవీంద్ర జడేజా(2531 పరుగులు, 138 వికెట్లు, 31 ఏళ్ల 301 రోజులు), జాక్ కలిస్(2427 పరుగులు, 65 వికెట్లు, 37 ఏళ్ల 177 రోజులు), ఆండ్రీ రసెల్(2074 పరుగులు, 92 వికెట్లు, 34 ఏళ్ల 15 రోజులు) ఈ ఫీట్ అందుకున్నారు. Just another day of Hardik bhai achieving milestones 💪🥳 Congratulations, Captain Pandya 💙#GT - 65/2 (7.4 overs)#AavaDe | #GTvRR | #TATAIPL 2023 pic.twitter.com/NElSiUYt4Y — Gujarat Titans (@gujarat_titans) April 16, 2023 -
లార్డ్ శార్దూల్ ఠాకూర్.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్‌లు ఇలా..?
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 18) జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాభవం గేట్ల వరకు వెళ్లి తిరిగి వచ్చింది. భారీ ఛేదనలో విధ్వంసకర శతకంతో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించిన మైఖేల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) ఆఖరి ఓవర్లో ఔట్ కాకపోయుంటే పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా బౌలర్లను అందరూ ఆడిపోసుకునే వారు. 349 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేకపోయారని దుమ్మెత్తి పోసేవారు. ముఖ్యంగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న శార్దూల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లను అందరూ టార్గెట్ చేసేవారు. వీరిలో మరి ముఖ్యంగా లార్డ్ శార్దూల్ భారత అభిమానుల ఆగ్రహావేశాలకు గురయ్యేవాడు. కీలక దశలో వరుస వైడ్ బాల్స్ (39వ ఓవర్లో 4 వైడ్లు, 3 ఫోర్లు) వేయడంతో పాటు బేసిక్స్ మరిచి బౌలింగ్ చేసినందుకు గానూ శార్దూల్‌ను ఓ రేంజ్లో ఆటాడుకునేవారు. అయితే ఆఖరి ఓవర్లో విరాట్ కోహ్లి సలహా మేరకు, చాకచక్యంగా యార్కర్ బాల్ వేయడంతో బ్రేస్‌వెల్ ఔటయ్యాడు. అప్పుడు శార్దూల్ సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ బ్రేస్‌వెల్ ఔట్ కాకుండా.. న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచి ఉండి ఉంటే, లార్డ్ శార్దూల్‌కు సీన్ సితార అయ్యేది. భారత్ మ్యాచ్ గెలిచినా ఫ్యాన్స్ మాత్రం శార్దూల్‌పై ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు. అసలు ఇతన్ని ఆల్‌రౌండర్‌గా ఎలా పరిగణిస్తారు.. అటు బ్యాటింగ్‌కు న్యాయం చేయడం లేదు, ఇటు బౌలింగ్‌లోనూ తేలిపోతున్నాడు.. ఇతనికి ఎందుకు వరుస అవకాశాలు ఇస్తున్నారని సెలక్టర్లను నిలదీస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ ఏమో.. లార్డ్ శార్దూల్.. ఇలా అయితే ఎలా అమ్మా.. నిన్ను నీవు నిరూపించుకోవడానికి ఇంకెన్ని మ్యాచ్‌లు కావాలమ్మా.. జట్టులో చోటు కోసం చాలా మంది వెయిటింగ్ అక్కడ అంటూ సోషల్‌మీడియా వేదికగా సున్నితంగా చురకలంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో శార్దూల్.. 7.2 ఓవర్లు వేసి 54 పరుగులిచ్చాడు. అయితే కీలకమైన ఫిన్ అలెన్ (40), బ్రేస్‌వెల్ వికెట్లు పడగొట్టాడు. కాగా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో చోటు సంపాదిస్తున్న లార్డ్ శార్దూల్.. కెరీర్ ఆరంభం నుంచే తన ప్రాతకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడపాదడపా రాణించినప్పటికీ.. అవి చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ కాదు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా బ్యాట్‌తో పాటు బంతిలోనూ రాణించాలని మేనేజ్మెంట్ అతని నుంచి ఆశిస్తుంది. శార్దూల్ దగ్గర ఆ సామర్థ్యం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడనే టాక్ నడుస్తుంది. మరో వైపు హార్ధిక్ మినహా టీమిండియాకు మరో ప్రత్యామ్నాయ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడంతో శార్దూల్ పప్పులు ఉడుకుతున్నాయి. వెంకటేశ్ అయ్యర్, విజయ్ శంకర్, శివమ్ దూబేలకు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. టీమిండియా ఫ్యాన్స్ అయితే అండర్19 జట్టు యువ ఆల్‌రౌండర్ రాజ్ అంగడ్ బవా, శివమ్ మావీలకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. త్వరలో ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలో టీమిండియా ఏమైనా ప్రయోగాలు చేస్తుందేమో వేచి చూడాలి. -
అంతర్జాతీయ క్రికెట్‌కు సీనియర్ ఆల్‌రౌండర్ గుడ్‌బై
దక్షిణాఫ్రికా సీనియర్ ఆల్‌రౌండర్ ఫర్హాన్ బెహర్దీన్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008 నుంచి 2018 వరకు వైట్‌బాల్ క్రికెట్(వన్డే, టి20లు)లో సేవలందించిన బెహర్దీన్ 39 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పాడు. 2004లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన బెహర్దీన్.. సౌతాఫ్రికా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఎనిమిదేళ్లు నిరీక్షించాడు. అయితే 2012లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బెహర్దీన్ ఆ తర్వాత ఆరేళ్ల పాటు దక్షిణాఫ్రికా జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగాడు. పరిమిత ఓవర్లో స్పెషలిస్ట్ క్రికెటర్‌గా ముద్రపడిన బెహర్దీన్ ప్రొటీస్ తరపున 59 వన్డేలు, 38 టి20 మ్యాచ్‌లు ఆడాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన బెహర్దీన్ వన్డేల్లో 1074 పరుగులతో పాటు 14 వికెట్లు, టి20ల్లో 518 పరుగులతో పాటు మూడు వికెట్లు తీశాడు. ఇక సౌతాఫ్రికా తరపున బెహర్దీన్ నాలుగు మేజర్ ఐసీసీ టోర్నీలు ఆడడం విశేషం. అందులో మూడు టి20 వరల్డ్‌కప్‌లు(2012, 2014,2016).. 2015 వన్డే వరల్డ్‌కప్ ఉన్నాయి. 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్ బెహర్దీన్ కెరీర్లో చివరిది. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన బెహర్దీన్.. అవకాశాలు లేక తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెహర్దీన్ తన ట్విటర్ వేదికగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''18 ఏళ్ల లాంగ్ కెరీర్ ముగిసింది. అన్ని ఫార్మాట్లు కలిపి 560కి పైగా మ్యాచ్‌లు ఆడాను. దేశం తరపున 97 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నా. నా కేబినెట్లో 17 ట్రోఫీలు ఉన్నాయి. ఇక సౌతాఫ్రికా తరపున నాలుగు మేజర్ ఐసీసీ టోర్నీలు ఆడడం అదృష్టం. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా'' అంటూ పేర్కొన్నాడు. pic.twitter.com/PN0PCWzAKA — Farhaan Behardien (@fudgie11) December 27, 2022 చదవండి: ఒలింపిక్ మాజీ స్విమ్మర్‌కు 12 ఏళ్ల జైలుశిక్ష Virat Kohli: కోహ్లి తప్పుకున్నాడు సరే.. రోహిత్, రాహుల్ సంగతేంటి? -
టీమిండియా ఫాస్ట్ బౌలర్లంతా వన్ మ్యాచ్ వండర్లేనా.. లోపం ఎక్కడుంది..?
క్రికెట్ అంటే ఇండియా.. ఇండియా అంటే వరల్డ్ క్లాస్ బ్యాటర్స్, స్పిన్నర్స్.. క్రికెట్ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఈ నానుడుతో ఏకీభవించాల్సిందే. ఈ నానుడు ఎంత సత్యమో, మ్యాచ్‌లు గెలవాలంటే బ్యాటర్లు, స్సిన్నర్లు మాత్రమే రాణిస్తే సరిపోదన్నది కూడా అంతే కాదనలేని సత్యం. భారత క్రికెట్ చరిత్రలో బ్యాటర్లు, స్పిన్నర్లు రాణించడం మనం చూశాం. అయితే నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, నిఖార్సైన ఆల్‌రౌండర్లు కనీసం ఓ దశకం పాటు రాణించడం మనమెప్పుడు కనీవినీ ఎరుగం. 80వ దశకంలో కపిల్ దేవ్ (ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్), 90ల్లో జవగల్ శ్రీనాథ్, ఆతర్వాత జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, ఇటీవలి కాలంలో బుమ్రా, షమీ, హార్ధిక్ పాండ్యా (ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్) లాంటి వారు అడపాదడపా మెరుపులు మెరిపించినా.. నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, నిఖార్సైన ఆల్‌రౌండర్లు అన్న ట్యాగ్‌లకు వీరు న్యాయం చేశారంటే సగటు భారత క్రికెట్ అభిమాని మనసు ఒప్పుకోదు. గతంతో పోలిస్తే, ఇటీవలి కాలంలో దేశవాలీ క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల సంఖ్య కాస్త పెరిగినా.. జాతీయ జట్టుకు వచ్చే సరికి వారు వన్ మ్యాచ్ వండర్లుగా మిగిలిపోతున్నారు. బుమ్రా, షమీ, భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా మినహాయించి, ఈ మధ్యకాలంలో వచ్చిన ఫాస్ట్ బౌలర్లు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు నిలకడగా రాణించింది లేదు. ఉమేశ్ యాదవ్, నటరాజన్, అవేశ్ ఖాన్, నవ్‌దీప్ సైనీ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి ఫాస్ట్ బౌలర్లు.. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఒక్క మ్యాచ్ ఆడితే రెండో మ్యాచ్‌లో గాయమో లేక తేలిపోవడమో జరుగుతుంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. టీ20 వరల్డ్‌కప్‌లో, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించి, భవిష్యత్ ఆశాకిరణంలా కనిపించిన అర్షదీప్ సింగ్ ఇవాల్టి మ్యాచ్‌లో పూర్తి తేలిపోయాడు. లార్డ్‌గా, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా చెప్పుకునే శార్దూల్ ఠాకూర్ అయితే మరీ అధ్వానంగా తయారయ్యాడు. అతను ఆల్‌రౌండర్ పాత్రకు ఎన్నడూ న్యాయం చేసింది లేదు. అయినా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో జట్టులో స్థానం సంపాదిస్తున్నాడు. ఈ కేటగిరికి చెందిన మరో ఆటగాడు దీపక్ చాహర్ విషయానికొస్తే.. అతను ఆడేది తక్కువ, గాయాలపాలై నేషనల్ క్రికెట్ అకాడమీలో గడిపేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిని నమ్ముకుని టీమిండియా మేనేజ్మెంట్ మెగా టోర్నీల బరిలోకి దిగితే.. ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్‌లలో ఎదురైన పరాభవాలే మున్ముందు పలకరిస్తాయి. భారత దేశంలో 130 కోట్లకు పైగా జనాభా ఉన్నా, వేల సంఖ్యలో ప్రొఫెషనల్ ఆటగాళ్లు దేశవాలీ క్రికెట్ ఆడుతున్నా.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, నిఖార్సైన ఆల్‌రౌండర్లు కరువయ్యారంటే సగటు భారత క్రికెట్ అభిమాని సిగ్గుతో తల దించుకోవాల్సిందే. పరిస్థితి ఇలా తయారవ్వడానికి కారణాలేంటి.. లోపం ఎక్కడుంది..? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకోకపోతే, సమీప భవిష్యత్తులో వెస్టిండీస్‌కు పట్టిన గతే టీమిండియాకు కూడా పట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
టీమిండియా ఆల్‌రౌండర్‌కు గాయం.. టోర్నీ నుంచి ఔట్!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 నుంచి తప్పుకున్నాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్.. ప్రాక్టీస్ చేస్తుండగా అతడి చీలమండకి తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల మొత్తానికి అయ్యర్ దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రైల్వేస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అయ్యర్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తొలుత 62 పరుగులతో ఆజేయంగా నిలిచిన వెంకటేశ్.. బౌలింగ్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక తన గాయానికి సంబంధించిన అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా అయ్యర్ అందించాడు. "చీలమండ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాను. త్వరలో మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని ఆశిస్తున్నాను. నేను జట్టుకు దూరమైన్పటికీ.. మా బాయ్స్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నాను" అని సోషల్ మీడియాలో అయ్యర్ పోస్ట్ చేశాడు. కాగా ఐపీఎల్-2021లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అయ్యర్‌కు భారత జట్టులో చోటు దక్కింది. అయితే జట్టులో మాత్రం తన స్థానాన్ని అయ్యర్ సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, రెండు వన్డేల్లో అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. View this post on Instagram A post shared by Venkatesh R Iyer (@venkatesh -
ప్రైవేట్ లీగ్స్ మోజులో సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నాడు
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు. న్యూజిలాండ్ జట్టులోని టాప్ ఆటగాళ్లకు బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తుంది. విదేశీ లీగ్స్‌తో జరిగిన ముందస్తుగా ఒప్పందం జరగడంతోనే కివీస్ బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్ట్‌ను వదులుకున్నట్లు నీషమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాడు. అయితే నీషమ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్నప్పటికి బ్లాక్‌క్యాప్స్ సెలెక్షన్‌కు మాత్రం అందుబాటులో ఉంటాడని బోర్డు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని జేమ్స్ నీషమ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా చెప్పుకొచ్చాడు. ''సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకొని దేశం తరపున కాకుండా డబ్బు కోసం విదేశీ లీగ్స్ ఆడడంపై అందరూ నన్ను తప్పుబడతారని ఊహించగలను. కానీ జూలై వరకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా వదులుకునేవాడిని కాదు. అదే సమయంలో విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం నాకు శాపంగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలన్న నిర్ణయంతో బోర్డు అందించే సెంట్రల్ కాంట్రాక్టు వదులుకోవాల్సి వచ్చింది. బ్లాక్‌క్యాప్స్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా. అయితే భవిష్యత్తులో మాత్రం తోటి ఆటగాళ్లతో కలిసి దేశం తరపున ఆడేందుకు సిద్ధంగా ఉన్నా'' అంటూ తెలిపాడు. ఇక జేమ్స్ నీషమ్ న్యూజిలాండ్ తరపున 12 టెస్టుల్లో 709 పరుగులు.. 14 వికెట్లు, 71 వన్డేల్లో 1409 పరుగులు.. 69 వికెట్లు, 48 టి20ల్లో 607 పరుగులు.. 25 వికెట్లు పడగొట్టాడు. నీషమ్ ఖాతాలో రెండు టెస్టు సెంచరీలు ఉండడం విశేషం. చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు -
అంతర్జాతీయ క్రికెట్‌కు కివీస్ ఆల్‌రౌండర్ గుడ్‌బై
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జింబాబ్వేలో పుట్టి పెరిగిన 36 ఏళ్ల గ్రాండ్‌హోమ్ 2004 వరకు జింబాబ్వే తరపున క్రికెట్ ఆడాడు. 2004లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లోనూ గ్రాండ్‌హోమ్ జింబాబ్వే తరపునే పాల్గొన్నాడు. ఆ తర్వాత 2006లో కుటుంబంతో కలిసి ఆక్లాండ్‌కు వలస వచ్చిన గ్రాండ్‌హోమ్ 2012లో న్యూజిలాండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. దాదాపు దశాబ్దం పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్రాండ్‌హోమ్ మంచి ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించాడు. 29 టెస్టుల్లో 1432 పరుగులు.. 49 వికెట్లు, 45 వన్డేల్లో 742 పరుగులు.. 30 వికెట్లు, 41 టి20ల్లో 505 పరుగులు.. 12 వికెట్లు తీశాడు. గ్రాండ్‌హోమ్ ఖాతాలో టెస్టుల్లో రెండు సెంచరీలు, 8 అర్థసెంచరీలు ఉండగా.. వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలు అందుకున్నాడు. కాగా తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన న్యూజిలాండ్ జట్టులో కొలిన్ డి గ్రాండ్‌హోమ్ సభ్యుడు. ఇక 2019లో వన్డే ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన కివీస్ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇక తన రిటైర్మెంట్పై గ్రాండ్‌హోమ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ''రిటైర్మెంట్ నిర్ణయం బాధిస్తున్నప్పటికి తప్పడం లేదు. గాయాల కారణంగా సరైన క్రికెట్ ఆడలేకపోతున్నానే ఫీలింగ్ కలుగుతుంది. ఫామ్‌లో లేను.. ఇలాంటి సమయంలో నేను రిటైర్ అయితే కనీసం కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. 2012లో కివీస్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బ్లాక్‌క్యాప్స్‌కు ఆడడం అదృష్టంగా భావిస్తున్నా. ఇన్నేళ్ల అంతర్జాతీయ కెరీర్ సాఫీగా సాగినందుకు గర్వపడుతున్నా. నా ఆట ముగింపుకు ఇదే సరైన సమయమని.. అందుకే ఈ నిర్ణయం'' అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లోనూ 2017 నుంచి 2019 మధ్య కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్‌కు ఆడిన గ్రాండ్‌హోమ్ 25 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేశాడు. చదవండి: AUS Vs ZIM: జింబాబ్వేతో రెండో వన్డే.. మూడు గంటల్లో ముగించిన ఆసీస్ Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్ -
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు భారీ కుదుపు! స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు. తాను వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు స్టోక్స్ సోమవారం ప్రకటించాడు. దక్షిణాప్రికాతో డర్హమ్‌లో మంగళవారం జరిగే వన్డే మ్యాచ్ తన చివరిదని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. ఇప్పటివరకు 104 వన్డేలు ఆడిన స్టోక్స్ 2919 పరుగులు చేశాడు. వాటిలో 3 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇటీవలే స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. స్టార్ ప్లేయర్ జోరూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో పగ్గాలు చేపట్టిన అతను.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో జట్టును ముందుండి నడిపించాడు. అతని సారథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. 9 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ నియామకం కూడా ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది. ❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j — Ben Stokes (@benstokes38) July 18, 2022 -
వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌కు మరో షాక్
ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టుకు మరో షాక్ తగిలింది. రెండో టెస్ట్‌లో ఆడిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ కరోనా బారిన పడినట్లు న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో బ్రేస్‌వెల్ చివరిదైన మూడో టెస్ట్ (జూన్ 23) ఆడటం ఆనుమానంగా మారింది.బ్రేస్‌వెల్‌ను వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండేందుకు తరలించినట్లు న్యూజిలాండ్ క్రికెట్ అధికారులు ప్రకటించారు. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన కొలిన్ గ్రాండ్‌హోమ్‌కు బ్రేస్‌వెల్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు. BREAKING 🚨: New Zealand's Michael Bracewell has tested positive for Covid-19 following the second Test against England. pic.twitter.com/tZ3V4G57RC — Sky Sports News (@SkySportsNews) June 15, 2022 కాగా, రెండో టెస్ట్‌కు కొన్ని గంటల ముందు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా కోవిడ్ బారిన పడ్డ విషయం తెలిసిందే. విలియమ్సన్కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ నిర్థాదరణ కావడంతో ఆఖరి నిమిషంలో రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు.మరోవైపు రెండో టెస్ట్ సందర్భంగా మరో ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది. రెండో టెస్టు ఆఖరి రోజు బౌలింగ్ చేస్తూ జేమీసన్ గాయపడ్డాడని.. అతని గాయం చాలా తీవ్రమైందని సమాచారం. దీంతో జేమీసన్ కూడా మూడో టెస్ట్ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ట్రెంట్ బ్రిడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో ఇంగ్లండ్ బ్యాటర్లు జూలు విదిల్చి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. బెయిర్‌స్టో సూపర్ శతకంతో (92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 136), బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 75) అజేయమైన అర్ధశతకంతో చెలరేగి క్రికెట్ ప్రేమికులకు టీ20 క్రికెట్ మజాను అందించారు. చదవండి: బెయిర్‌స్టో విధ్వంసకర శతకం.. కివీస్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం -
రాజకీయ పిచ్‌పై రాణించని క్రికెటర్
క్రికెటర్‌గా 21 ఏళ్ల పాటు అనమానమైన ఆల్‌రౌండ్ ప్రతిభ చూపడమే గాక పాకిస్థాన్‌కు ప్రపంచ కప్ కూడా అందించిన ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజీ కీలకమైన రాజకీయ పిచ్‌పై మాత్రం చేతులెత్తేశారు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా ప్రయత్నించి ప్రధాని పీఠమెక్కినా ఏ మాత్రం మెరుపులు మెరిపించలేకపోయారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమై అపకీర్తి మూటగట్టుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పాకిస్థాన్‌లోని మియావలీలో పష్తూన్ తెగకు చెందిన ఇక్రాముల్లా ఖాన్ నియాజీ, షౌకత్ ఖానుమ్ దంపతులకు 1952లో ఇమ్రాన్ జన్మించారు. లాహోర్‌తో పాటు ఇంగ్లడ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత చదువులు చదివారు. 21 ఏళ్లు క్రికెటర్‌గా ఓ వెలుగు వెలిగారు. 1992లో తన సారథ్యంలో పాక్‌కు ఏకైక వన్డే ప్రపంచ కప్ సాధించి పెట్టారు. 43 ఏళ్లొచ్చేదాకా అవివాహితునిగానే ఉండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పాక్ ప్రజల మనసు దోచుకున్నారు. 1996లో పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీని స్థాపించారు. 20 ఏళ్లకు గానీ నవాజ్ షరీఫ్ కుటుంబానికి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), భుట్టోలకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల హవాను అధిగమించలేకపోయారు. 2002లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2013లో పీటీఐని రెండో అతి పెద్ద పార్టీగా నిలిపారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని, పేదరికాన్ని నిర్మూలించి పాక్‌ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా రూపుదిద్దుతాననే హామీలతో 2018 సాధారణ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపారు. సొంతంగా మెజారిటీ రాకున్నా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని కల నెరవేర్చుకున్నారు. కానీ ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమవుతూ వచ్చారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి దేశాన్ని దివాలా అంచుకు నెట్టేశాయి. విదేశాంగ విధానంలో కూడా ఇమ్రాన్ తేలిపోయారు. భారత్‌తో కయ్యం కొనసాగించడమే గాక రష్యాకు దగ్గరయ్యే క్రమంలో అర్థం లేని దూకుడు ప్రదర్శించి చిరకాల మిత్రుడు అమెరికాకూ దూరమయ్యారు. ఆర్మీ చీఫ్ బజ్వా పదవీకాలం పొడిగింపును అడ్డుకునేందుకు విఫలయత్నం చేసి కీలకమైన సైన్యం ఆశీస్సులు కోల్పోయారు. వ్యక్తిగతంగానూ ఒడిదుడుకులే ఇమ్రాన్ వ్యక్తిగత జీవితమూ ఒడిదుడుకులమయమే. ఆయన మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1995లో ఇంగ్లండ్‌కు చెందిన బిలియనీర్ కూతురు జెమీమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడారు. ఇద్దరు కొడుకులు పుట్టాక విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్ రెహాం ఖాన్‌ను పెళ్లాడి 10 నెలలకే విడిపోయా రు. 2018లో తన ఆధ్యాత్మిక గురువు బుష్రా మనేకాను ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. -
టీమిండియాకు ఆల్ రౌండర్ దొరికేశాడు..దుమ్ము రేపుతున్నాడుగా!
స్వదేశంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియాకు ఆల్‌రౌండర్ లోటును వెంకటేశ్ అయ్యర్ తీర్చాడు. ఈ సిరీస్‌లో వెంకటేశ్ అయ్యర్ బ్యాట్‌తోను, బంతితోను అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 92 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆదివారంజరిగిన అఖరి టీ20లో 19 బంతుల్లో 35 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు కూడా పడగొట్టాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ తన పవర్ హిట్టింగ్తో అకట్టుకుంటున్నాడు. తొలి టీ20లో ఇన్నింగ్స్ అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్.. 13 బంతుల్లో 24 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అదే విధంగా రెండో టీ20లో కూడా 18 బంతుల్లో 33 పరుగులు కూడా సాధించాడు. అయ్యర్ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. టీమిండియాకు సరైన ఆల్‌రౌండర్ దొరికినట్టే. అంతే కాకుండా జట్టులో హార్ధిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికేశాడని క్రికెట్ నిపుణులు, మాజీలు అభిపప్రాయపడుతున్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌పై టీ20ల్లో భారత తరుపున అయ్యర్ అరంగేట్రం చేశాడు. చదవండి: Ind Vs Wi T20 Series- Pollard: అతడు వరల్డ్ క్లాస్ ప్లేయర్.. అందరూ తనను చూసి నేర్చుకోవాలి: పొలార్డ్ -
హైదరాబాదీ ఆల్‌రౌండర్‌కి బంపర్ ఆఫర్.. భారత జట్టులో చోటు!
హైదరాబాదీ ఆల్‌రౌండర్ రిషిత్ రెడ్డికి బంఫర్ ఆఫర్ తగిలింది. వెస్టిండీస్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా రిషిత్ రెడ్డిను బీసీసీఐ ఎంపిక చేసింది. రిషిత్ రెడ్డితో పాటు ఉదయ్ సహారన్, అభిషేక్ పోరెల్, రిషిత్ రెడ్డి, అన్ష్ గోసాయి, పుష్పేంద్ర సింగ్ రాథోడ్‌ను వెస్టిండీస్‌కు బీసీసీఐ పంపనుంది. కాగా భారత శిబిరంలో ఆరుగురు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. భారత కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఐర్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌కు దూరమయ్యారు. అంతేకాకుండా శనివారం ఉగాండతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు వీరు దూరం కానున్నారు. కాగా రిజర్వ్ ఆటగాళ్లు విండీస్‌కు చేరుకున్నాక.. అక్కడ 6 రోజులు పాటు క్వారంటైన్లో ఉండునున్నారు. అనంతరం క్వార్టర్ ఫైనల్ సమయానికి జట్టులో చేరునున్నారు. -
హార్దిక్ పాండ్యాను ఆల్‌రౌండర్‌గా పిలవడం వ్యర్థం
Kapil Dev Dismisses All-rounder Tag For Hardik Pandya.. టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాపై మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. '' హార్దిక్ పాండ్యాను ఆల్‌రౌండర్ అని పిలవడం ఆపేయండి.. బౌలింగ్ చేయనప్పుడు అతనికి ఆ ట్యాగ్ వ్యర్థం.. వెంటనే తొలగించండి. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన హార్దిక్ బౌలింగ్ చేయడం ఒక్కసారి కూడా చూడలేదు. ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతను బౌలింగ్ చేయాలి. కానీ అలా చేయడం లేదు. ఇది ఇలాగే ఉంటే బౌలింగ్ పూర్తిగా చేయడం మరిచిపోతాడు. ఇకముందు హార్దిక్ బౌలింగ్ చేయాలంటే చాలా మ్యాచ్‌ల్లో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ 1st Test: 'పాకిస్తాన్ ముర్దాబాద్'.. స్టేడియంలో ఫ్యాన్స్ అరుపులు ఇక కొంతకాలంగా ఫామ్ లేక తంటాలు పడుతున్న హార్దిక్ ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న హార్దిక్ దానిని నిలుపుకోలేకపోయాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం బ్యాటింగ్‌కే పరిమితమైన హార్దిక్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆల్‌రౌండర్ అంటేనే అన్ని విభాగాల్లో తన వంతు సాయం అందించాలి. కానీ ఇవేమీ చేయకపోగా జట్టుకు భారంగా మారాడు. దీంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమైన పాండ్యా ప్రస్తుతం రీహాబిటేషన్ కోసం ఎన్సీఏకు వెళ్లాడు. చదవండి: Shreyas Iyer: దిగ్గజాల సరసన శ్రేయాస్ అయ్యర్.. 16వ ఆటగాడిగా -
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ కన్నుమూత...
Alan Davidson: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ అలాన్ డేవిడ్సన్(92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిడ్నీలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో వెల్లడించింది. 44 టెస్టుల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్సన్ 186 వికెట్లు సాధించాడు. 1959లో కాన్పూర్ టెస్టులో భారత్‌పై 7 వికెట్లు పడగొట్టి తన కెరీర్లో అత్యుత్తమ గణాంకాలును నమోదు చేశారు. 193 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతడు 6804 పరుగులు, 672 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: టిక్కెట్లు లేకుండానే.. ఫ్యాన్స్ రచ్చ.. ఐసీసీ క్షమాపణలు -
అసలైన టీ20 క్రికెటర్ అతడే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Michael Vaughan comments on Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జడేజా అసలు సిసలైన టీ20 ఆటగాడని అతడు కితాబు ఇచ్చాడు. "రవీంద్ర జడేజా అత్యుత్తమమైన ఆటగాడు. మూడు విభాగాల్లో రాణించే సత్తాఉంది.అతడు అద్భుతమైన ఫీల్డర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌల్ చేయగలడు. ఎటువంటి పిచ్‌పై అయిన బాల్‌తో మ్యాచ్ తిప్పగలడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో జట్టు వికెట్లు కోల్పోయినట్లయితే అతడు కీలక పాత్రను పోషించగలడు. అందుకే అతడు టీ20 క్రికెటర్లలో అధ్బుతమైన ఆటగాడు. మీరు ఒక టీ 20 క్రికెటర్ని తయారు చేస్తే.. క్రిస్ గేల్‌ను, విరాట్ కోహ్లిలను ఆదర్శంగా చూపిస్తారు. కానీ ఇప్పటినుంచి రవీంద్ర జడేజాను ఆదర్శంగా తీసుకోవాలి" అని మైఖల్ వాన్ క్రిక్ బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్లో రవీంద్ర జడేజా అధ్బుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2021 లో జడేజా ఇప్పటి వరకు 212 పరుగులు,10 వికెట్లు సాధించాడు. జడేజా అనేక సందర్భాల్లో బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా చెన్నైకు విజయాలను అందించాడు. టోర్నమెంట్ తొలి దశలో హర్షల్ పటేల్ ఓవర్లో జడేజా ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. సెకెండ్ఫేజ్లో కెకెఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా కేవలం 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 22 పరుగులు చేసి మ్యాచ్ ఫినిషర్‌గా నిలిచాడు. చదవండి: Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్ గెలుస్తాడులే! -
అతడి లాంటి ఆల్ రౌండర్ టీమిండియాకు కావాలి...
Sunil Gavaskar Comments On Venkatesh Iyer: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆదుగొడుతన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌పై భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వెంకటేశ్ అయ్యర్ ఆల్ రౌండర్‌గా టీమిండియాలో దృష్టిలో పడవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం క్రమంగా బౌలింగ్ చేయకపోవడంతో ఆల్‌రౌండర్ జాబితాలో అయ్యర్ పైన అందరి దృష్టి మళ్ళిందిని గవాస్కర్ తెలిపాడు. "టీమిండియా ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్ లాంటి ఆల్ రౌండర్ కోసమే ఎదురు చూస్తుంది. అతడు బౌలింగ్‌లో యార్కర్లని బాగా వేస్తున్నాడు. అతడు బ్యాట్స్మన్లకు భారీ షాట్లు ఆడే అవకాశం ఇ్వడంలేదు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే షార్ట్ బాల్‌ను బాగా పుల్ చేస్తున్నాడు. కవర్ డ్రైవ్ షాట్లు ఆడగలడని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.ప్లేఆఫ్‌కు అర్హత సాధించేందుకు అవకాశాలను కోల్‌కతా సద్వినియోగ పరుచుకుందని అతడు చెప్పాడు. కాగా ఐపీఎల్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్126 పరుగులు, 2 వికెట్లు సాధించాడు. చదవండి: Virender Sehwag: అతడు సరిగ్గా ఆడకపోయినా.. ధోనీ తుదిజట్టు నుంచి తప్పించడు! -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన రవీంద్ర జడేజా, షకీబ్
దుబాయ్: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టగా.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ టీ 20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. ముందుగా జడేజా విషయానికి వస్తే.. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ విభాగంలో జడేజా(377 పాయింట్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న బెన్‌స్టోక్స్(370)ను ఏడు పాయింట్లతో అధిగమించాడు. ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి టెస్టులో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించిన జడేజా నెంబర్ వన్ స్థానానికి మరింత చేరువయ్యాడు. ఇక విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ 384 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో మరో నాలుగు టెస్టులు మిగిలి ఉండడంతో జడేజా మంచి ప్రదర్శన కనబరిస్తే త్వరలోనే నెంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఇక టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్(901), స్టీవ్ స్మిత్(891), మార్నస్ లబుషేన్(878) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 846 పాయింట్లతో నాలుగో స్థానం.. 791 పాయింట్లతో కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పాట్ కమిన్స్(908) తొలిస్థానం, రవిచంద్రన్ అశ్విన్(856) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్‌లో షకీబ్ ఆల్ హసన్ దుమ్మురేపాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన షకీబ్ ఆసీస్‌తో జరిగిన చివరి టీ20లో నాలుగు వికెట్లతో కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. 286 పాయింట్లతో షకీబ్ టాప్‌లో ఉండగా.. ఒక పాయింట్ తేడాతో మహ్మద్ నబీ (285) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీ 20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తబ్రెయిజ్ షంసీ 792 పాయింట్లతో తొలి స్థానం.. వహిందు హసరంగ 764 పాయింట్లతో రెండో స్థానం.. 719 పాయింట్లతో రషీద్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 841 పాయింట్లతో డేవిడ్ మలాన్ తొలి స్థానం.. 819 పాయింట్లతో బాబర్ అజమ్ రెండో స్థానంలో ఉన్నాడు. Sir JADEJA claimed one position in ICC men's test all-rounder ranking And now he's at no 2 🔥#ravindrajadeja @imjadeja #IndvsEng #ENGvIND pic.twitter.com/ZqoqKsZl5s — ⚔️Sir JADEJA FC ™ ⚔️ (@FCofSirJadeja) August 11, 2021 In the latest @MRFWorldwide ICC Men's T20I Player Rankings: 🥇 Shakib Al Hasan reclaims the No.1 all-rounder spot 📈 Fast bowler Mustafizur Rahman storms into the top 10 ↗️ Australia spinner Ashton Agar moves up to No.7 Full list: https://t.co/uR3Jx2jJ5V pic.twitter.com/sWFrtWDY5Z — ICC (@ICC) August 11, 2021 -
సెహ్వాగ్ టీ20 జట్టు.. ఆ యువ ఆల్‌రౌండర్‌కు అనూహ్యంగా చోటు
న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్లు తుది జట్టు ఆటగాళ్ల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు విశ్లేషకులు, మాజీలు సైతం తుది జట్టులో ఉండబోయే ఆటగాళ్లపై తమతమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ప్రపంచకప్ బరిలో దిగే భారత తుది జట్టును అంచనా వేశాడు. శ్రీలంక పర్యటనలో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించిన వీరూ.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్‌లను విస్మరించాడు. తన జట్టులో ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన వీరేంద్రుడు.. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్‌కు అవకాశమిచ్చారు. నాలుగో స్థానంలో విధ్వంసకర వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను.. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశాడు. అయితే ఆల్‌రౌండర్ల ఎంపిక విషయంలో వీరూ తన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఈ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను స్థానం కల్పించిన ఆయన.. అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఎంపిక చేశాడు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా నిరాశపరుస్తున్నా.. అతని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం కారణంగానే తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని తెలిపాడు. ఇక జడ్డూ అసలుసిసలైన ఆల్‌రౌండరని, సుందర్ కారణంగా బౌలింగ్ డెప్త్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాడు. కాగా, స్పెషెలిస్ట్ స్పిన్నర్ కోటాలో వీరూ.. కేవలం చహల్‌కు మాత్రమే చోటు దక్కుతుందన్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు ప్రధాన పేసర్లుగా ఉంటారని అంచనా వేశాడు. ఇటీవలకాలంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న దీపక్ చాహర్‌ను సైతం వీరేంద్రుడు విస్మరించడం విశేషం. సెహ్వాగ్ టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్ -
పాక్‌లో పుట్టాడు.. భారత్‌లో ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు
న్యూఢిల్లీ: 33 టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి తరం మేటి ఆల్‌రౌండర్ లేట్ జి.ఎస్. రాంచంద్ గురించి బహుశా నేటి తరంలో ఎవ్వరికీ తెలిసుండకపోవచ్చు. కమర్షియల్ బ్రాండ్ల ఎండార్స్మెంట్లకు ఆధ్యుడైన ఈ భారత మాజీ క్రికెటర్.. అంతర్జాతీయ వేదికపైనే కాకుండా భారత దేశవాళీ క్రికెట్లోనూ అద్భుతంగా రాణించాడు. ఇవాళ(జులై 26) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్‌లోని విశేషాలపై ఓ లుక్కేద్దాం. రాంచంద్ పుట్టింది దాయాది దేశం పాక్‌లోనే అయినా భారత్ తరఫున క్రికెట్ ఆడాడు. 1927 జూలై 26న కరాచీలో జన్మించిన రాంచంద్.. ఇంగ్లండ్‌పై తన కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే తాను ఆడిన తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ 1952లో లీడ్స్ వేదికగా జరిగింది. ఇలా తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరగడంతో అతని కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే, రాంచంద్ మాత్రం ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సత్తా చాటి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ఆ తర్వాత కాలంలో వెనక్కు తిరగి చూసుకోని రాంచంద్.. 1952 నుంచి 1960 వరకు దాదాపు ఎనిమిదేళ్లపాటు భారత్ జట్టులో కొనసాగాడు. ఈ మధ్యలో అతను భారత జట్టుకు సారధ్యం వహించాడు. ఇతని నాయకత్వంలోనే భారత్.. ఆసీస్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇక రాంచంద్ కెరీర్ గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. 33 టెస్ట్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2 శతకాలు, 5 అర్ధశతకాల సాయంతో 1180 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 41 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బాంబే జట్టుకు ప్రాతినధ్యం వహించిన రాంచంద్.. 16 శతకాలు, 28 అర్ధశతకాల సాయంతో 6026 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో రాంచంద్ 9సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి మొత్తంగా 255 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హాజారే, విజయ్ మంజ్రేకర్ లాంటి దిగ్గజ క్రికటర్ల సమాకాలీకుడైన రాంచంద్.. 50వ దశకంలో భారత మేటి ఆల్‌రౌండర్‌గా కొనసాగాడు. సెప్టెంబర్ 8 2003లో 76 ఏళ్ల వయసులో రాంచంద్ మరణించాడు. -
నాలుగు ఓవర్లకే అల్లాడిపోతున్నారు..వీళ్లేం బౌలర్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియా ఓటమికి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేకపోవడమే ప్రధాన కారణమని దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఆరోపించారు. పేసర్లకు అనుకూలించే సౌథాంప్టన్ పిచ్‌పై పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కాదని ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగడం కోహ్లీసేన కొంపముంచిందని పేర్కొన్నాడు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా చెప్పుకునే కొందరు కనీసం నాలుగు ఓవర్లు వేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి వారిని ఆల్రౌండర్లుగా ఎలా పరిగణించాలని హార్ధిక్ ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యాలు చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ మాట్లాడుతూ.. ప్రస్తుత తరం ఆల్రౌండర్లుగా చెప్పుకునే ఆటగాళ్లు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి అలిసిపోవడం చూస్తే బాధగా ఉంటుందని, అతిగా బ్యాటింగ్‌పై దృష్టి సారించడం వల్లే వాళ్లంతా ఇలా తయారవుతున్నారని విమర్శించాడు. ఈ తరం ఆటగాళ్లు మల్టిపుల్ రోల్ పోషించేందుకు ఆసక్తి చూపించడం లేదని, తమ జమానాలో అదనపు బాధ్యతలు తీసుకునేందుకు ఆటగాళ్లంతా సిద్దంగా ఉండేవారని, స్పెషలిస్ట్బ్యాట్స్మెన్కు కూడా 10 ఓవర్లు బౌలింగ్ చేసే సత్తా ఉండేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన 20 మంది టీమిండియా సభ్యుల్లో ఒక్క నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. కాగా, గత కొన్నేళ్లుగా హార్దిక్ పాండ్యా జట్టులో పేస్ ఆల్‌రౌండర్ రోల్ పోషించినప్పటికీ వెన్నుగాయం తర్వాత అతను బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం పేస్ ఆల్‌రౌండర్లతో కలిపి మొత్తం ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అసాధారణ ప్రదర్శనతో 8 వికెట్లతో కోహ్లీ సేనను చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. -
ICC Rankings: టాప్ ర్యాంక్‌కు దూసుకెళ్లిన జడేజా
దుబాయ్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల జాబితాలో నంబర్‌వన్ స్థానానికి దూసుకెళ్లాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్(384 రేటింగ్ పాయింట్లు), ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(377)లను వెనక్కు నెట్టి అతను అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 386 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా, 2017 ఆగస్ట్ తర్వాత ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ జాబితాలో టీమిండియా ఆల్‌రౌండర్ అశ్విన్ 353 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఐసీసీ టాప్ 10 ప్లేయర్స్ జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు కొనసాగుతున్నారు. టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని 814 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలువగా, రిషబ్ పంత్(747), రోహిత్ శర్మ(747) వరుసగా 6, 7 ర్యాంకుల్లో ఉన్నారు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్(891) టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, కేన్ విలియమ్సన్(886), మార్నస్ లబూషేన్(878) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ.. మూడు స్థానాలు మెరుగుపరచుకుని 3వ ర్యాంక్‌లోకి దూసుకురాగా, ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ 850 పాయింట్లతో రెండులో, ఆసీస్ సీమర్ జోష్ హేజిల్‌వుడ్ 816 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక జట్ల విభాగంలో 123 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్(121), ఆస్ట్రేలియా(108), ఇంగ్లండ్(107)లు వరుసగా 2, 3, 4 ర్యాంక్‌ల్లో నిలిచాయి. చదవండి: నెటిజన్లకు దొరికిపోయిన బుమ్రా.. ఇలా ఐతే ఎలా? -
నేటి తరంలో అతనే బెస్ట్ ఆల్‌రౌండర్..
వెల్లింగ్టన్: అల్ టైమ్ గ్రేట్ అల్ రౌండర్లలో ముఖ్యుడుగా చెప్పుకునే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రిచర్డ్ హ్యాడ్లీ.. ప్రస్తుత తరంలో అల్ రౌండర్లపై తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. జెంటిల్మెన్ గేమ్‌లో బ్యాట్‌తో పాటు బంతితో రాణించే ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారని, నేటి ఆధునిక క్రికెట్లో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ తన దృష్టిలో ఉత్తమ అల్ రౌండర్ అని పేర్కొన్నాడు. ఇందుకు అతని గణాంకాలే నిదర్శనమన్నాడు. అలాగే అతను ఒంటి చేత్తో జట్టును గెలిపించిన అనేక సందర్భాలను పరిగణలోకి తీసుకొనే తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపాడు. ఇందుకు 2019 వన్డే ప్రపంచ కప్, హెడింగ్లే టెస్టులను(ఆసీస్ ఫై 135 నాటౌట్) ఉదహరించాడు. చరిత్రలో గ్రేట్ అల్ రౌండర్లుగా చెప్పుకునే గ్యారీఫీల్డ్ సోబర్స్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, జాక్ కలిస్ లాంటి ఆటగాళ్లకు ఉండిన లక్షణాలన్నీస్టోక్స్ లో పుష్కలంగా ఉన్నాయని, అతను మరికొంత కాలం రెండు విభాగాల్లో(బ్యాటింగ్, బౌలింగ్) రాణించగలిగితే, దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే ఇది అతనికి అంత సులువు కాకపోవచ్చని, ఫాస్ట్ బౌలింగ్ అల్ రౌండర్‌కు ఫిట్నెస్ తో పాటు గాయాల బారిన పడకుండా నిలకడ రాణించడం చాలా ముఖ్యమని, ఈ రెండు అంశాలపై అతను దృష్టి కేంద్రీకరించగలిగితే, ఈ తరంలోనే కాదు.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ అల్ రౌండర్ గా నిలిచిపోతాడని సూచించాడు. నేటి తరం అల్ రౌండర్లైన షకీబ్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ స్పిన్ బౌలింగ్ అల్ రౌండర్లు కావడంతో వారిని పరిగణలోకి తీసుకోలేమని, ఏదిఏమైనప్పటికే వారు కూడా అల్ రౌండర్లేనని వివరించాడు. జేసన్ హోల్డర్, హార్దిక్ పాండ్యా , క్రిస్ వోక్స్, కోలిన్ గ్రాండ్ హోమ్ తదితరులకు ఫాస్ట్ బౌలింగ్ అల్ రౌండర్లుగా రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా, 70 80 దశకాల్లో మేటి అల్ రౌండర్ గా నిలిచిన హ్యాడ్లీ.. న్యూజిలాండ్ తరఫున 3124 పరుగులతో పాటు 431 వికెట్లు పడగొట్టి టెస్టు క్రికెట్లో సుదీర్ఘకాలం పాటు అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చాలాకాలం తర్వాత అతని రికార్డును కపిల్ తిరగరాసాడు. చదవండి: ఆ దిగ్గజ ఆటగాడు గ్రౌండ్లోకి వచ్చే ముందు సిగరెట్ కాల్చేవాడు.. -
కపిల్, ధోని, గవాస్కర్లతో వాళ్లను పోల్చకండి..
హైదరాబాద్: టీమిండియా యువ ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజాలతో పోల్చకండని విజ్ఞప్తి చేశాడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్. భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను కపిల్‌తో పోలుస్తూ.. విశ్లేషకులు చేసే రచ్చను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. చరిత్రలో ఒకే కపిల్, ఒకే ధోని, ఒకే గవాస్కర్ ఉంటారని, అలాంటి దిగ్గజాలను యువ ఆటగాళ్లను పోల్చడం వల్ల యువకులపై ఒత్తిడి పెరిగిపోతుందని అభిప్రాయపడ్డాడు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. కపిల్, తన జమానాలో వికెట్లు తీస్తూ... భారీగా పరుగుల చేస్తూ నిఖార్సైన ఆల్‌రౌండర్ పాత్రను పోషించాడని... ఈ జనరేషన్లో హార్ధిక్ కూడా అసలుసిసలైన ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయగల సమర్ధుడని అంటూనే ఇద్దరిని పోల్చడం సరికాదని పేర్కొన్నాడు. కపిల్ క్రికెట్ ఆడిన రోజుల్లో ప్రస్తుతం ఉన్నంత పని భారం ఉండేది కాదని, ఆ పని భారం కారణంగానే నేటి తరంలో అసలుసిసలైన ఆల్‌రౌండర్లు తయారు కాలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కపిల్ మేటి ఆల్‌రౌండర్‌గా కొనసాగాడని, ప్రస్తుత తరంలో ఆల్‌రౌండర్‌గా కొనసాగడం చాలా కష్టమని ఆయన వెల్లడించాడు. భారత జట్టు మూడు ఫార్మాట్లలో నిర్విరామంగా క్రికెట్ ఆడటాన్ని ఆయన తప్పుపట్టాడు. అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా ఎదిగే శక్తి సామర్థ్యాలున్న ఓ ఆటగాడు గాయంబారిన పడటంతో అతడు బ్యాటింగ్ లేదా బౌలింగ్ మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చిందని హార్ధిక్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేరాడు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్‌ను ఆడించాలని ఆయన సూచించాడు. సంజూ సామ్సన్, కేఎల్ రాహుల్ లాంటి ఆటగాళ్లు కీపింగ్ చేస్తూ ఎంత బాగా ఆడినా ప్రపంచకప్‌లో మాత్రం పంత్‌నే ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: ఒక్క ఓవర్ పొదుపుగా బౌల్ చేయాల్సింది.. కేకేఆర్ ఓటమికి నేనే కారణం -
ఆ విషయంలో సుందర్ నాకంటే సమర్ధుడు: టీమిండియా కోచ్
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 96 పరుగులు సాధించడంతో అతనిపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు అతను ప్రదర్శించిన పరిణితిని టీమిండియా మాజీలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి అయితే సుందర్‌ను తనతోనే పోల్చుకుంటూ ఆకాశానికెత్తేశాడు. సుందర్ తనకంటే బాగా రాణించగల సమర్ధుడని, ఆ సత్తా సుందర్ వద్ద ఉందని ఇదివరకే నిరూపితమైందని పేర్కొన్నాడు. సుందర్ తన బౌలింగ్‌పై ఇంకా దృష్టి సారించాల్సి ఉందని ఆయన సూచించాడు. అతను బౌలర్‌గా కూడా రాణించగలిగితే ఆల్‌రౌండర్ ఖాతాలో జట్టులో స్థానానికి ఢోకా ఉండదని పేర్కొన్నాడు. జట్టు ఓ ఆల్‌రౌండర్ నుంచి కనీసం 50 పరుగులను, 20కు పైబడి ఓవర్లు వేయాలని ఆశిస్తుంది. ప్రస్తుత ఆల్రౌండర్లలో సుందర్ ఆ పాత్రను సమర్ధవంతంగా పోశిస్తున్నాడని కితాబునిచ్చాడు. ఎడమ చేతి బ్యాటింగ్, కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలింగ్ వేసే సుందర్.. ఇటీవల జరిగిన నాలుగు టెస్ట్‌ల్లో మూడు అర్ధశతకాలు, 6 వికెట్లు పడగొట్టాడు. కీలకమైన ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న సుందర్ అప్పట్లో రవిశాస్త్రి తరహాలోనే బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. కాగా, 80 దశకంలో భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టేవాడు. భారత్ తరఫున 80 టెస్ట్‌లకు ప్రాతినిధ్యం వహించిన రవిశాస్త్రి.. 11 శతకాలు, 12 అర్ధ శతకాల సాయంతో 3830 పరుగులు, 151 వికెట్లు సాధించాడు. -
తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి కాబోతున్నాడు. తన కాబోయే భార్య నటాషా స్టాన్కోవిచ్ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పాండ్యా ప్రకటించాడు. జనవరి 1న దుబాయ్‌లో సెర్బియా నటి, మోడల్ అయిన నటాషా, పాండ్యా నిశ్చితార్థం జరిగింది. అయితే ఆదివారమే విడుదల చేసిన మరో ఫొటోలో పాండ్యా, నటాషా పూలదండలతో కనిపిస్తున్నారు. అయితే ఇది పెళ్లికి సంబంధించిన ఫొటోనా కాదా అనే విషయంపై స్పష్టత లేదు. ‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది’ అని నటాషాతో కలిసి దిగిన ఫొటోలను పాండ్యా పోస్ట్ చేశాడు. గుజరాత్‌కు చెందిన 26 ఏళ్ల హార్దిక్ పాండ్యా 2016లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టి20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
మా దగ్గర సరిపడా డబ్బు ఉంది!
న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్–19)పై పోరాడటానికి అవసరమైన డబ్బును విరాళాల రూపంలో సేకరించడానికి భారత్, పాకిస్తాన్ మధ్య ప్రేక్షకులు లేకుండా మూడు వన్డే మ్యాచ్‌లు నిర్వహిస్తే బాగుంటుందని సూచించిన పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్‌కు భారత దిగ్గజ ఆల్‌రౌండర్, కపిల్‌దేవ్ కౌంటర్ ఇచ్చాడు. ‘భారత్ దగ్గర తగినంత డబ్బు ఉంది. దాని కోసం క్రికెట్ ఆడుతూ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం భారత క్రికెటర్లకు లేదు. ఇప్పటికే కరోనాపై పోరడటానికి తమ వంతుగా రూ.51 కోట్లను భారత ప్రభుత్వానికి బీసీసీఐ అందజేసింది. ఒకవేళ అవసరం అయితే మరింత డబ్బును కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు డబ్బు కోసం మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇటువంటి సమయంలో క్రికెటర్లతో రిస్క్ చేయాలని బీసీసీఐ భావిస్తుందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం మేమంతా ఈ సంక్షోభం నుంచి ఎలా భయటపడాలనే దాని గురించి ఆలోచిస్తున్నాం. అయినా మూడు మ్యాచ్‌లతో నువ్వు ఎంత డబ్బు సేకరిస్తావు’ అక్తర్‌కు చురకంటించాడు. -
విషమంగా క్రికెటర్ తండ్రి ఆరోగ్యం
జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆడే అవకాశాలు కనబడటం లేదు. తీవ్ర అనారోగ్యంతో అతడి తండ్రి గెడ్ స్టోక్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయనకు జోహెన్నెస్‌బర్గ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీంతో బెన్ స్టోక్ మంగళవారం తండ్రి దగ్గరే ఆస్పత్రిలో ఉండిపోయాడని, ప్రాక్టీసుకు కూడా రాలేదని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది. న్యూజిలాండ్ రగ్బీ మాజీ ఆటగాడైన గెడ్ స్టోక్స్ తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో సోమవారం ఆస్పత్రిలో చేర్చినట్టు వెల్లడించింది. ఇటువంటి సమయంలో బెన్ స్టోక్స్, అతడి కుటుంబానికి అండదండలు అందిస్తామని ఈసీబీ ప్రకటించింది. బెన్ స్టోక్స్, అతడి కుటుంబ సభ్యుల ఏకాంతాన్ని భంగపరచవద్దని మీడియా, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్రిటోరియా సమీపంలోని సెంచూరియన్‌లో ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్ గురువారం ప్రారంభం కానుంది. బెన్ స్టోక్స్ బరిలోకి దిగకపోతే ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగలినట్టే. బీబీసీ ‘స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’ గా ఎంపికైన స్టోక్స్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. జ్వరంతో బాధపడుతున్న ప్రధాన బౌలర్లు జోఫ్రా ఆర్చర్, స్టువర్ట్ బ్రాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌కు దూరమయ్యారు. తొలి టెస్ట్ నాటికి వారిద్దరూ కోలుకుంటారని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్ కూడా జట్టుకు దూరమైతే ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పవు. -
గౌతమ్ భీకర ఇన్నింగ్స్, 134 నాటౌట్
బెంగళూరు: కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మేటి ప్రతిభ చూపి అదరహో అనిపించాడు. బళ్లారి టస్కర్స్ జట్టు తరపున బరిలోకి దిగిన గౌతమ్ ఈ టోర్నమెంట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 39 బంతుల్లో శతకం నమోదు చేశాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 134 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గౌతమ్ భీకర ఇన్నింగ్స్‌తో టస్కర్ నిర్ణీత 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన షిమోగా లయన్స్ టీమ్‌ను బంతితో గౌతమ్ వణికించాడు. అతడి ధాటికి లయన్స్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. ఏకంగా 8 వికెట్లు పడగొట్టి లయన్స్‌ను మట్టికరిపించాడు. కేపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గౌతమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 70 పరుగుల తేడాతో లయన్స్ పరాజయం పాలైంది. 16.3 ఓవర్లలో 133 పరుగులు చేసి ఆలౌటైంది. బలాల్(40), దేశ్‌పాండే(46) మినహా మిగతా ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. ఒంటిచేత్తో టస్కర్స్ను గెలిపించిన కృష్ణప్ప గౌతమ్ ‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. -
‘ఛీ.. రజాక్ ఇలాంటోడా?’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మరొకసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పటికే టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ మతాన్ని ప్రస్తావించి విమర్శలపాలైన రజాక్.. తాజాగా పాక్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, ముఖ్యంగా మహిళలు మండిపడుతున్నారు. ఇంటర్వ్యూలో రజాక్ మాట్లాడుతూ.. ‘నేను సంప్రాదయబద్దంగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సుమారు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలను పెట్టుకున్నాను. అది కూడా ఏడాదిన్నర కాలంలోనే ఇదంతా జరిగింది. నాకు ఇది తప్పనిపించడం లేదు’ అని పేర్కొన్నాడు. ఇక అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారమే రేగుతోంది. రజాక్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘గొప్ప ఆటగాడివనే గౌరవం ఉండేది.. ఈ రోజుతో అది పోయింది’, ‘ఛీ.. రజాక్ ఇలాంటోడా?’అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యాను తనకు రెండు వారాలు అప్పగిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానని, షమీ ముస్లిం కాబట్టే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని రజాక్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఆడే రోజుల్లో వివాదాల జోలికి వెళ్లకుండా మిస్టర్ పర్ఫెక్ట్గా పేరుతెచ్చుకున్న రజాక్ గత కొద్ది రోజులగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు. -
అర్జున్ టెండూల్కర్ ఆల్‌రౌండ్ షో
ముంబై: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ మంగళవారం జరిగిన టీ20 ముంబై లీగ్ మ్యాచ్‌లో రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రతిభ(23 పరుగులు, ఒక వికెట్)తో తమ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్ట్రన్, ట్రింఫ్ నైట్ ముంబై నార్త్ ఈస్ట్ జట్లు తలపడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ట్రింఫ్ నైట్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 56 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 90 పరుగులు సాధించాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆకాశ్ టైగర్స్‌కు ఆకర్షిత్ గోమల్(41), కౌస్తుభ్ పవార్(34) శుభారంభాన్ని అందించారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఆకాశ్ టైగర్స్ 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. ట్రింఫ్ నైట్ జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లోనూ రాణించిన అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. -
పాండ్యా కుటుంబంలోకి కొత్త మెంబర్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ హిమాన్షు పాండ్యా నేడు 25వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పాండ్యాకు సహచర ఆటగాళ్లతో పాటు బీసీసీఐ, ముంబై ఇండియన్స్ యాజమాన్యం బర్త్‌డే విషెస్ చెప్పింది. అయితే పాండ్యా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ‘ నా బర్త్ డే సందర్భంగా మా కుటుంబంలోకి కొత్త మెంబర్ కలవబోతున్నారు. స్థిరమైన, పర్యావరణానికి అనుకూలమైన బెంట్లే పాండ్యాకు స్వాగతం. ఇక ప్రతీ సారీ పుట్టిన రోజు వేడుకలు మేం కలిసి జరుపుకుంటాం’అంటూ తను పెంచుకోబోతున్న కుక్కకు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఇక ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నెముక గాయంతో భాదపడుతున్న పాండ్యా చికిత్స తీసుకుంటున్నాడు. త్వరగానే కోలుకొని ఫిట్నెస్ సాధించి జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాండ్యాకు విషెస్‌లో కూడా త్వరగా కోలుకోవాలని సహచర ఆటగాళ్లు కోరుకున్నారు. 2016లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్బంగా ఆరంగేట్రం చేసిన పాండ్యా, తక్కువ కాలంలోనే ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. పాండ్యా టీమిండియా తరుపున 35 టీ20లు, 42 వన్డేలు, 11 టెస్టులు ప్రాతినిథ్యం వహించాడు. My new Bentley.. Sustainable, environmentally friendly, runs only on love.. Welcome to the family Bentley Pandya. We shall share our birthday now ❤️ pic.twitter.com/SyL3sbGVP7 — hardik pandya (@hardikpandya7) 11 October 2018 Here's wishing #TeamIndia all-rounder @hardikpandya7 a very happy 25th birthday 🕺🎂🤙 #HappyBirthdayRockstar pic.twitter.com/NroYuDerZv — BCCI (@BCCI) 11 October 2018 Happy birthday Hardik Pandya! Wishing you a speedy recovery and back on the field soon! @hardikpandya7 pic.twitter.com/a3DAlkFkQ4 — Harbhajan Turbanator (@harbhajan_singh) 11 October 2018 -
‘హమ్మయ్య ఎట్టకేలకు సెంచరీ సాధించా’
రాజ్‌కోట్: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఏ భారత ఆటగాడికి సాధ్యంకాని మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఘనత అతడి సొంతం. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి తొమ్మిదేళ్లయినా ఒక్క శతకం నమోదు కాలేదు.. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. ఆల్‌రౌండర్‌గా డొమెస్టిక్ క్రికెట్లో అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో ఒంటి చేత్తో విజయాలను అందించాడు రవీంద్ర జడేజా. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా రాణించలేకపోయాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జడేజా.. కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ ఆటగాడిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన జడ్డూ బౌలర్‌గానే స్థిర పడ్డాడు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించింది చాలా తక్కువ. ఇక తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకోడానికి తొమ్మిదేళ్లు పట్టింది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో జడేజా తొలి శతకం సాధించి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం జడేజా మీడియా ముందు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. (ఓయ్ జడ్డూ.. ఏంటిది?) ఇంగ్లండ్ సిరీస్‌లో విశ్వాసం ఏర్పడింది.. ‘ఈ రోజు సెంచరీ చేసిన ఆ మధురాతి క్షణం ఎప్పటికీ మరచిపోలేను. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తొమ్మిదేళ్లకు తొలి సెంచరీ సాధించాను అందుకే చాలా స్పెషల్. అందులోనూ సొంత మైదానంలో కాబట్టి ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతీసారి 70-80 స్కోర్ చేయగానే సెంచరీ చేయాలనే ఆరాటంలో వికెట్ పారేసుకునేవాడిని. కానీ ఈ రోజు సెంచరీ మార్క్ చేరాలని కసిగా ఆడాను. డొమెస్టిక్ క్రికెట్లో భారీ శతకాలు సాధించిన నేను.. ఇక్కడ కూడా సెంచరీలు సాధించగలననే నమ్మకం ఏర్పడింది. ఇంగ్లండ్‌లో నా బ్యాటింగ్ తీరుతో మరింత విశ్వాసం పెరిగింది. 15 నెలల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడాను. ఆసియాకప్‌లోనూ రాణించాను. ఫార్మట్ ఏదైనా నా శైలిలో రాణించేందుకు కష్టపడతా’ అంటూ జడేజా పేర్కొన్నాడు. అలా ఊహించలేదు ఈ రోజు మ్యాచ్‌లో జరిగిన రనౌట్ సంఘటన గురించి స్పందించాడు. ‘ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకే ఎండ్‌లో ఉండటంతో సులువుగా ఔట్ చేయొచ్చని అనుకున్నాను. అందుకే నేరుగా బంతితో వికెట్లను గిరటేద్దామనుకుని.. వికెట్ల వైపు నడుచుకుంటూ వస్తున్నాను. కానీ అవతలి ఎండ్ నుంచి హెట్మెయిర్ పరిగెత్తుకొస్తున్న విషయాన్ని గమనించలేదు. సహచరులు అలర్ట్ చేయడంతో బంతిని వికెట్లుకు నేరుగా విసిరాను. అదృష్టం బాగుండి బంతి వికెట్లను తాకింది. లేకుంటే భారీ తప్పిదం జరిగి ఉండేది. థ్యాంక్ గాడ్’ అంటూ జడేజా వివరణ ఇచ్చాడు. చదవండి: తొలి టెస్టు.. విండీస్ విలవిల జడేజా సెంచరీ.. కోహ్లి సేన డిక్లేర్ -
కావాలొక ఫినిషర్!
‘ఫలితం 1–3గా కనిపిస్తూ మేం సిరీస్ కోల్పోయి ఉండొచ్చు. కానీ, ఈ గణాంకాలు టీమిండియా 3–1తో గెలవాల్సిందని, లేదా 2–2తో సమం కావాల్సిందని చెప్పలేవు. జట్టు సభ్యులకు మాత్రం ఈ సంగతి తెలుసు!’... నాలుగో టెస్టు పరాజయం అనంతరం కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలివి.సిరీస్‌లో తామెంతగానో పోరాడామని, గెలుపే మొహం చాటేసిందనిసర్దిచెప్పుకొనేందుకు అతడు చేసిన ప్రయత్నం ఇది. ఇప్పుడు ఐదో టెస్టూముగిసింది. కోహ్లి సేన ఓటమి అంతరం 1–4గా మారింది. శాస్త్రి చెప్పినట్లు...టీమిండియా నిజంగానే పోరాడి ఓడిందా? మరి ఆ పోరాటానికి ‘ముగింపు’గావిజయాలు ఎందుకు దక్కలేదు? అనేది విశ్లేషించుకోవాల్సిన సమయం. సాక్షి క్రీడా విభాగం :తమది విదేశాల్లో గెలుపు రుచి తెలిసిన జట్టని, గత జట్ల కంటే భిన్నమైనదని గొప్పలకు పోయి ఇంగ్లండ్ గడ్డపై అడుగిడిన కోహ్లి సేన... ఫలితాల్లో మాత్రం దానిని చూపలేకపోయింది. టి20 సిరీస్‌ను కైవసం చేసుకుని, వన్డే సిరీస్‌లో ప్రతిఘటన చూపి ఆత్మవిశ్వాసంతో కనిపించిన టీమిండియా, అసలు సమరమైన టెస్టులకు వచ్చేసరికి సగటు జట్టులా మారిపోయింది. తుది జట్టు ఎంపికలో పొరపాట్లు, కీలక సందర్భాల్లో నిలకడ లేమి, గెలుపు మెట్టుపై చేతులెత్తేయడం... ఇలా సిరీస్ సాగుతున్నకొద్దీ ఒక్కొక్క లోపం బయటపడసాగాయి. కీలక పేసర్లు భువనేశ్వర్, బుమ్రా గాయాల బారినపడటంలో వారి పాత్ర కంటే జట్టు మేనేజ్మెంట్ ముందుచూపు కొరవడటమే ఎక్కువ. ఇది ప్రణాళిక లోపాన్ని కూడా చాటింది. బుమ్రా అందుబాటులోకి వచ్చినా, ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతి ముఖ్యమైన భువీ సేవలు పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది. అతడే ఉండి ఉంటే ప్రత్యర్థి లోయర్ ఆర్డర్‌ను పడగొట్టడంతో పాటు మన లోయర్ ఆర్డర్లో బ్యాట్‌తోనూ ఓ చేయి వేసేవాడు. తద్వారా రెండు జట్ల మధ్య తేడా పెద్దగా ఉండకపోయేది. మొత్తంగా చూస్తే జట్టు ప్రదర్శన పర్వాలేకున్నా, విజయ తీరాలకు చేర్చే మొనగాడు లేక ఓటమి భారం మోయాల్సి వస్తోంది. టెస్టులకూ అలాంటివాడొకరు.... ధోని రూపంలో మ్యాచ్‌లను ముగించగల ఆటగాడు ఉండటంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టు ప్రబలంగా తయారైంది. అలాంటివాడు ఇప్పుడు టెస్టులకూ అవసరం అని స్పష్టమైంది. ఈ సిరీస్‌లో టీమిండియా బర్మింగ్‌హామ్‌లో 31 పరుగులతో, సౌతాంప్టన్‌లో 60 పరుగులతో, ఓవల్‌లో 118 పరుగులతో ఓడింది. కొద్దిగా ప్రయత్నిస్తే ఈ మ్యాచ్‌ల్లో విజయం సాధించగలిగేది. కానీ, 6, 7 స్థానాల్లో నిలదొక్కుకుని తర్వాత వచ్చేవారిని కాపాడుకుంటూ గట్టెక్కించే నాథుడు లేక తక్కువ తేడాతోనే రెండు టెస్టులను కోల్పోవాల్సి వచ్చింది. వీటిలో గెలిచి ఉంటే... శాస్త్రి చెప్పినట్లు సిరీస్ స్వరూపం మరోలా ఉండేది. ఆల్‌రౌండర్‌కు తప్పని వెదుకులాట ఇంగ్లండ్‌కు కరన్, వోక్స్, స్టోక్స్, మొయిన్ అలీ వంటి ఒకరికి నలుగురు నమ్మదగ్గ ఆల్‌రౌండర్లు ఉంటే మనకు హార్డిక్ పాండ్యా ఒక్కడే దిక్కయ్యాడు. నాటింగ్‌హామ్‌లో మెరిసినా, మిగతా మూడు టెస్టుల్లో చెప్పుకోదగ్గ ఆట కనబర్చలేదు. దీంతో ఐదో టెస్టుకు బౌలింగ్ వనరులను తగ్గించుకుని మరీ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హనుమ విహారికి చోటివ్వాల్సి వచ్చింది. బ్యాట్స్‌మెన్ బాధ్యత ఇంతేనా? ఓపెనర్ల వైఫల్యాల ‘కుర్చీలాట’ అటుంచితే... 593 పరుగులతో బ్యాట్స్‌మన్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లి సిరీస్‌లో వందకు వంద మార్కులు సాధించాడు. వైస్ కెప్టెన్ రహానే మాత్రం పాస్ మార్కులు కూడా పొందలేకపోయాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు సాధించినవి రెండే అర్ధ శతకాలు. అవి కూడా మూడు, నాలుగు టెస్టుల్లోనే! ఈ స్థాయి ఆటతో ఏవిధంగానూ న్యాయం చేయలేకపోయాడు. తన మీద జట్టు మేనేజ్మెంట్కు నమ్మకం లేకపోవడంతో పాటు, అభిమానులు పెట్టుకున్న ‘మిస్టర్ డిపెండబుల్’ నమ్మకం బీటలు వారుతున్న చతేశ్వర్ పుజారాది చిత్రమైన పరిస్థితి. అతడి ఏకాగ్రత తరచూ చెదురుతోంది. నాలుగో టెస్టులో అజేయ శతకం చేసినా, ఓవల్‌లో కీలక సమయంలో విఫలమై నిరాశ పర్చాడు. దీంతో కోహ్లి మినహా... ఎవరినీ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా పరిగణించలేని పరిస్థితి. బౌలర్లు భళా... కానీ! అలిస్టర్ కుక్ ఉన్నపళంగా రిటైరయ్యాడన్నా, తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అర్ధ శతకం, శతకం మాత్రమే చేయగలిగాడన్నా అది భారత పేసర్ల ఘనతే. ఆతిథ్య జట్టు టాప్ ఆర్డర్‌ను పదేపదే కుప్పకూల్చిన వారి శ్రమను ఎంత పొగిడినా తక్కువే. కుక్‌ను వరుసగా మూడుసార్లు ఔట్ చేసిన ఇషాంత్ ప్రధాన బౌలర్ హోదాకు, విశేష అనుభవానికి సార్థకత చేకూర్చాడు. ఇదే సమయంలో లోయర్ ఆర్డర్‌ను పెవిలియన్ చేర్చడంలో పేసర్లు విఫలమయ్యారు. ఇందులో వారి ప్రయత్న లోపం కంటే ప్రత్యర్థి ఆటగాళ్ల పట్టుదలే ఎక్కువ. తరచి చూస్తే బౌలింగ్‌లోనూ మెరుపు స్పెల్‌తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను ‘ఫినిష్’ చేసే బౌలర్ అవసరం ఉందనిపిస్తోంది. మధురమే... 2014 పర్యటనలో తీవ్ర వైఫల్యాలతో అవమాన భారం మూటగట్టుకున్న విరాట్ కోహ్లి ఈసారి వందల కొద్దీ పరుగులతో ప్రపంచ నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌నని చాటుకున్నాడు. సమకాలికుడైన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ తనకెంతో దూరంలో ఉన్నాడని స్పష్టం చేశాడు. సిరీస్ కోల్పోవడం ఒక్కటే కోహ్లి గొప్పదనాన్ని తక్కువ చేసి చూపుతోంది. ఎవరూ ఊహించని విధంగా రిటైర్మెంట్ ప్రకటించిన కుక్... ఆఖరి ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో కెరీర్‌ను సంతృప్తికరంగా ముగించాడు. ఇక ఐదు టెస్టుల్లోనూ ఆటలో అరటిపండుగా మిగిలిపోయిన ఆదిల్ రషీద్... ద్విశతక భాగస్వామ్యంతో దూసుకెళ్తున్న రాహుల్, పంత్‌లను ఔట్ చేసి చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేజారిపోకుండా చేశాడు. -
పాండ్యాను ఆల్‌రౌండర్ అనలేం
లండన్: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా టెస్టుల్లో ఆల్‌రౌండర్ కాదని వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు. ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసే నైపుణ్యం అతనిలో లేదన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుత భారత టెస్టు జట్టు సమతూకంగా లేదు. పాండ్యాను ఆల్‌రౌండర్ స్థానంతో భర్తీ చేస్తున్నారు. కానీ అతని బౌలింగ్‌లో పసలేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేదు. మొత్తానికి టెస్టుల్లో అతను ప్రభావవంతమైన ఆటగాడేమీ కాదు. పాండ్యా ఆల్‌రౌండరే అయితే సెంచరీలు సాధించకపోయినా... కనీసం 60, 70 పరుగులైనా చేయాలి. బౌలింగ్‌లో వికెట్లు తీయాలి. అలా కాకుండా ఎపుడో ఒకసారి 2, 3 వికెట్లు తీస్తే సరిపోతుందా? ఇది ఆల్‌రౌండర్ ప్రదర్శన కానే కాదు’ అని తెలిపారు. -
పెళ్లితో ఒక్కటైన మహిళా క్రికెటర్లు!
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు అగ్రశ్రేణి క్రీడాకారిణిలిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జట్టు కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్ శనివారం పెళ్లి చేసుకున్నారు. సఫారీ దేశంలో ఇద్దరు మహిళల వివాహంపై ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. 2009 వరల్డ్ కప్ టోర్నీలో వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. 2017–18 సంవత్సరానికి దక్షిణాఫ్రికా అత్యుత్తమ క్రికెటర్ అవార్డు అందుకున్న నికెర్క్, ఇప్పుడు ఆ దేశం తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతోంది. కాప్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. వీరిద్దరు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా టాప్–10లో ఉన్నారు. బిగ్‌బాష్ లీగ్‌లో కూడా సిడ్నీ సిక్సర్స్ తరఫున కలిసి ఆడిన నికెర్క్, కాప్... దక్షిణాఫ్రికాలో బాలుర అకాడమీలో శిక్షణ పొందిన తొలి ఇద్దరు అమ్మాయిలుగా కూడా గుర్తింపు పొందారు. ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌ను సహచరి లియా తహుహు పెళ్లాడింది. -
ఐపీఎల్‌కు ముందే ధోని జట్టుకు షాక్!
సాక్షి, స్పోర్ట్స్ : రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత ఐపీఎల్లో అడుగుపెడుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టిదెబ్బ తగిలింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు న్యూజిలాండ్ స్టార్ ఆలౌరౌండర్ మిచెల్ సాంట్నర్ దూరమయ్యాడు. ఐపీఎల్ వేలంలో సీఎస్కే 50 లక్షలు వెచ్చించి మరీ ఈ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. అయితే మిచెల్ సాంట్నర్ గాయంతో ఐపీఎల్‌కు దూరం అయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సాంట్నర్ మోకాలికి తీవ్ర గాయమైంది. స్కానింగ్‌లో మోకాలి ఎముకలో లోపం ఉన్నట్లు తేలడంతో సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కారణంగా కివీస్ ఆటగాడు ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌తోపాటు, ఐపీఎల్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. ఏప్రిల్ 7న ప్రారంభంకానున్న ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్‌కు ముంబై ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది. -
ఆయనో ఆల్‌రౌండర్..
సాక్షి: మనం ఏదైనా ఒక విషయాన్ని కచ్చితంగా తెలుసుకుని దాన్ని ఇతరులకు చెప్పినప్పుడు.. వారు దాన్ని అంగీకరించక పోయినా, లేక మనం చెప్పింది తప్పని హేలన చేసినా మనకు పట్టరానంత కోపం వస్తుంది కదా! ఎన్నో ఏళ్లు శోధించి సృష్టి రహస్యాలను కనిపెట్టి వాటిని ప్రపంచానికి తెలియ చేస్తే ఆయనకు సమాజం ఇచ్చిన బహుమతి మూర్ఖుడు, పిచ్చివాడు అనే బిరుదులు. అయినా ఆయన నిరాశ చెందలేదు. ఏదో ఒక రోజు తను కనుగొన్న నిజాలను ప్రజలు గుర్తించక పోతారా అన్న ఆశతో వాటిని భద్రపరిచి తనువు చాలించారు. ఆ తర్వాత గానీ ఆయన గొప్ప తనం ప్రపంచానికి తెలియలేదు. ఆయన చెప్పినవన్నీ అక్షర సత్యాలని తర్వాత నిరూపితమయ్యాయి. ఆయనే ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కోపర్నికస్. ఈరోజు ఆయన చేసిన పరిశోధనలు, జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం..! బాల్యం- విద్యాభ్యాసం: నికోలస్ కోపర్నికస్ (1473-1543) మొట్టమొదటి సారిగా సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా ధ్రువపర్చిన శాస్త్రవేత్త. 1473లో జర్మనీలోని ధార్న్ అనే పట్టణంలో జన్మించారు. 1492లో క్రాకోవ్ విశ్వ విద్యాలయంలో చేరారు. ఆల్బర్ట్ బ్రుడ్జ్ దగ్గర శిష్యుడిగా పనిచేశారు. ఇటలీలోని బొలోగ్నా యూనివర్సిటీలో న్యాయ, గణిత, ఖగోళ శాస్త్రాలను అధ్యయనం చేశారు. కొన్ని ప్రఖ్యాత గ్రంథాలను కంఠస్థం చేయడం కోసం గ్రీకు భాష నేర్చుకున్నారు. సందిగ్ధం ఏర్పడింది అక్కడే: రోమ్ విశ్వ విద్యాలయంలో 29 ఏళ్ల వయసులో 1502లో ఖగోళ శాస్త్ర నిపుణుడిగా చేరారు. అక్కడ ఆయనకు భూమి, సూర్యుడు.. వీటిలో భూమికి కేంద్రకం ఏది అనే సందిగ్ధం ఏర్పడింది. టాలెమీ భూ కేంద్రక సిద్ధాంతాన్ని అరిస్టాటిల్ బలపర్చారు. పైథాగరస్ సూర్య కేంద్రక సిద్ధాంతమే సరైందని నమ్మారు. వీటిలో ఏది నిజమని విశ్వసించాలో కోపర్నికస్‌కు అర్థం కాలేదు. ఈ విషయంపై ఆలోచిస్తూ చేస్తున్న వృత్తికి రాజీనామా చేసి తన పరిశోధనలు కొనసాగించారు. సేవలు: వైద్యునిగా, న్యాయమూర్తిగా కూడా ఎంతగానో రాణించారు. క్లిష్ట సమయాల్లో పోలెండ్‌కు అద్భుత సలహాలనిచ్చి ఆర్థిక దుస్థితి నుంచి బయటపడేశారు. పోప్ అభ్యర్థన మేరకు పంచాంగాన్ని సరిచేసి తిరుగులేని ఖగోళ శాస్త్రవేత్తగా పేరు గాంచారు. క్రీ.శ 1520లో అల్లెన్ స్టెయిన్ కాసిల్‌కు గవర్నర్‌గా పనిచేసి ట్యూటానిక్ యుద్ధ వీరులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ విధంగా ప్రజా సేవ, మత సంబంధ విషయాలు, శాస్త్రాలపై అధ్యయనం.. అన్ని రంగాల్లోనూ విశేషంగా రాణించారు. సూర్య కేంద్రక సిద్ధాంతం: సూర్య కేంద్రక సిద్ధాంతాల నమూనాలు, సిద్ధాంతాలను ఇతని కంటే ఎన్నో వందల ఏళ్ల ముందే ఆర్యభట్ట, ఒమర్ ఖయ్యంలు ప్రతిపాదించారు. కానీ గ్రహాల కదలికల ఆధారంగా వీటిని తొలిసారిగా కోపర్నికస్ నిరూపించారు. భూమి తన అక్షంపై తిరగడం వల్ల రేయింబవళ్లు ఏర్పడుతున్నాయని తెలిపారు. భూ భ్రమణం, పరిభ్రమణం వల్ల రుతువులు ఏర్పడుతున్నాయని వెల్లడించారు. ఈ విషయాలన్నీ నిజమే అని కోపర్నికస్ విశ్వసించినా వాటిని బయటకు వెల్లడించడానికి ఆయనకు ధైర్యం చాలలేదు. అప్పట్లో ఎవరూ ఇతని సిద్ధాంతాలను విశ్వసించక పోవడమే దీనికి కారణం. జ్యోతిష్క గ్రంథాల్లో సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని రాసుండటం వల్ల అప్పట్లో ఎవరూ కోపర్నికస్‌ను నమ్మలేదు. ‘ఖగోళ శాస్త్రాన్నే తలక్రిందులుగా చేయడానికి ప్రయత్నిస్తున్న మూర్ఖుడు కోపర్నికస్’ అని మార్టిన్ లూథర్ దూషించారు. అయినప్పటికీ తాను తెలుసుకున్న, సేకరించిన వివరాలన్నింటినీ కోపర్నికస్ చివరి దశలో గ్రంథంగా అచ్చువేయించి పోప్‌గా ఉన్న మూడో పాల్‌కు అంకితం చేశారు. ఇది జర్మనీలోని న్యూవెంబర్గ్లో ప్రచురితమయ్యింది. ఈ పుస్తకంలోని అంశాలు సంఘ విద్రోహాన్ని సూచిస్తాయోమోనన్న భయంతో ప్రచురణ కర్తలు ‘దీన్ని విజ్ఞాన గ్రంథంగా పరిగణించ కూడదు’ అని ముందుగానే చెప్పారు. కానీ ఈ విషయం తెలియకుండానే కోపర్నికస్ 1543 మే 21న కన్నుమూశారు.