పాండ్యా కుటుంబంలోకి కొత్త మెంబర్‌ | Hardik Pandya Introducing New Member To The Family On His Birthday | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 11 2018 2:36 PM | Last Updated on Thu, Oct 11 2018 2:43 PM

Hardik Pandya Introducing New Member To The Family On His Birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ హిమాన్షు పాండ్యా నేడు 25వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పాండ్యాకు సహచర ఆటగాళ్లతో పాటు బీసీసీఐ, ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం బర్త్‌డే విషెస్‌ చెప్పింది. అయితే పాండ్యా సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. ‘ నా బర్త్‌ డే సందర్భంగా మా కుటుంబంలోకి కొత్త మెంబర్‌ కలవబోతున్నారు. స్థిరమైన, పర్యావరణానికి అనుకూలమైన బెంట్లే పాండ్యాకు స్వాగతం. ఇక ప్రతీ సారీ పుట్టిన రోజు వేడుకలు మేం కలిసి జరుపుకుంటాం’అంటూ తను పెంచుకోబోతున్న కుక్కకు సంబంధించిన ఫోటోను షేర్‌ చేశాడు. 

ఇక ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. వెన్నెముక గాయంతో భాదపడుతున్న పాండ్యా చికిత్స తీసుకుంటున్నాడు. త్వరగానే కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించి జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాండ్యాకు విషెస్‌లో కూడా త్వరగా కోలుకోవాలని సహచర ఆటగాళ్లు కోరుకున్నారు.  2016లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సందర్బంగా ఆరంగేట్రం చేసిన పాండ్యా, తక్కువ కాలంలోనే ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. పాండ్యా టీమిండియా తరుపున 35 టీ20లు, 42 వన్డేలు, 11 టెస్టులు ప్రాతినిథ్యం వహించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement