
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా (Team India) మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేసేందుకు దోహదపడిన పాండ్యా.. భారత్ తరఫున డెత్ ఓవర్లలో (16 నుంచి 20) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. పాండ్యా ఈ రికార్డును సాధించే క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ డెత్ ఓవర్లలో 192.54 స్ట్రయిక్‌రేట్‌తో 1032 పరుగులు చేయగా.. పాండ్యా 174.24 స్ట్రయిక్‌రేట్‌తో 1068 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో టీ20లో హార్దిక్ పాండ్యా శివాలెత్తిపోయాడు. చాలాకాలం తర్వాత అతని బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ జాలు వారింది. ఈ మ్యాచ్‌లో తొలి 14 పరుగులు చేసేందుకు 17 బంతులు తీసుకున్న హార్దిక్.. ఆతర్వాత చేసిన 39 పరుగులను కేవలం 13 బంతుల్లో రాబట్టాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి హార్దిక్ స్కోర్ 17 బంతుల్లో 14 పరుగులు కాగా.. 18 ఓవర్ ముగిసే సరికి అతని స్కోర్ 30 బంతుల్లో 53 పరుగులుగా ఉండింది. 15-18 ఓవర్ల మధ్యలో హార్దిక్.. శివమ్ దూబేతో కలిసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. హార్దిక్, శివమ్ దూబే (Shivam Dube) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. 12 పరుగుల వద్ద ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన భారత్‌ను హార్దిక్ పాండ్యా , శివమ్ దూబే (34 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.
వీరికి ముందు అభిషేక్ శర్మ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, సిక్స్), రింకూ సింగ్ (26 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసిన భారత్.. చివరి ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.
చివరి ఓవర్‌ను జేమీ ఓవర్టన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్ (1), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, జేమీ ఓవర్టన్ 2, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు.
182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 23, బెన్ డకెట్ 39, జోస్ బట్లర్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హ్యారీ బ్రూక్ (12), లివింగ్‌స్టోన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 60 బంతుల్లో 96 పరుగులు చేయాలి. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment