శివాలెత్తిపోయిన హార్దిక్‌.. టీమిండియా ఖాతాలో రికార్డు విజయం | IND vs SL 2nd T20: Hardik Pandya Slammed 22 Runs Of Just 9 Balls | Sakshi
Sakshi News home page

శివాలెత్తిపోయిన హార్దిక్‌.. టీమిండియా ఖాతాలో రికార్డు విజయం

Published Mon, Jul 29 2024 8:09 AM | Last Updated on Mon, Jul 29 2024 9:05 AM

IND vs SL 2nd T20: Hardik Pandya Slammed 22 Runs Of Just 9 Balls

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో నిన్న (జులై 29) జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కుశాల్‌ పెరీరా (53) అర్ద సెంచరీతో రాణించగా.. పథుమ్‌ నిస్సంక (32), కమిందు మెండిస్‌ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. శ్రీలంక చివరి ఏడు వికెట్లు 31 పరుగుల వ్యవధిలో కోల్పోయి భారీ స్కోర్‌ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. 

రవి బిష్ణోయ్‌ (4-0-26-3), అర్ష్‌దీప్‌ సింగ్‌ (3-0-24-2), అక్షర్‌ పటేల్‌ (4-0-30-2), హార్దిక్‌ పాండ్యా (2-0-23-2) లంకేయులను భారీగా దెబ్బేశారు. అనంతరం భారత్‌ ఛేదనకు దిగే సమయానికి వర్షం మొదలైంది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన లక్ష్యాన్ని 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు.

శివాలెత్తిపోయిన హార్దిక్‌
ఛేదనలో భారత్‌ ఆదిలోనే సంజూ శాంసన్‌ (0) వికెట్‌ కోల్పోయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ (15 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (12 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) మెరుపులు మెరిపించారు. ఆఖర్లో హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస బౌండరీలు, సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. 

బంతితో (2 వికెట్లు) రాణించిన హార్దిక్‌ బ్యాట్‌తోనూ చెలరేగాడు. ఫలితంగా భారత్‌ 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది (3 వికెట్ల నష్టానికి). ఈ గెలుపుతో భారత్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 రేపు (జులై 30) జరుగనుంది.

టీమిండియా ఖాతాలో రికార్డు విజయం
ఈ మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన భారత్‌ రికార్డు విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో ఓ జట్టుపై అత్యధిక విజయాలు (శ్రీలంకపై 21 విజయాలు) సాధించిన జట్టుగా తమ రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement