మెల్‌బోర్న్: ఈ ఏడాది చివర్లో భారత్‌తో స్వదేశంలో జరగనున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పేస్ ఆల్‌రౌండర్లు కామెరూన్ గ్రీన్, మిషెల్ మార్ష్ కీలకమవుతారని ఆ్రస్టేలియా టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వీరిద్దరూ అందుబాటులో ఉంటే ప్రధాన పేసర్లపై భారం తగ్గడంతో పాటు... బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ‘పేస్ ఆల్‌రౌండర్లు ఉండటం వల్ల అదనపు ప్రయోజనమే.
వేసవిలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో గ్రీన్, మార్ష్ కీలకం అవుతారు. గతంలో వారిని పెద్దగా వినియోగించుకోలేదు. కానీ ఈసారి పరిస్థితి భిన్నం. ఎక్కువ ఓవర్లపాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ బౌలర్‌గానే కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు తగినంత అనుభవం కూడా సాధించాడు. వీరిద్దరి వల్ల జట్టు సమతుల్యం పెరుగుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టమవుతుంది.
నాథన్ లయన్ వంటి సీనియర్ స్పిన్నర్ ఉండటం మా అదృష్టం’ అని కమిన్స్ పేర్కొన్నాడు. ఆ్రస్టేలియా గడ్డపై జరిగిన గత రెండు బోర్డర్–గవాస్కర్ ట్రోఫీల్లో పరాజయం పాలైన ఆసీస్... ఈసారి సిరీస్ ఎలాగైనా సిరీస్ చేజిక్కించుకోవాలని ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment