
ముంబై: సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ మంగళవారం జరిగిన టీ20 ముంబై లీగ్ మ్యాచ్‌లో రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రతిభ(23 పరుగులు, ఒక వికెట్)తో తమ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆరంభ మ్యాచ్‌లో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్ట్రన్, ట్రింఫ్ నైట్ ముంబై నార్త్ ఈస్ట్ జట్లు తలపడ్డాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ట్రింఫ్ నైట్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 56 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో 90 పరుగులు సాధించాడు.
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆకాశ్ టైగర్స్‌కు ఆకర్షిత్ గోమల్(41), కౌస్తుభ్ పవార్(34) శుభారంభాన్ని అందించారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అర్జున్ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఆకాశ్ టైగర్స్ 5 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. ట్రింఫ్ నైట్ జట్టుపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లోనూ రాణించిన అర్జున్ టెండూల్కర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment