
మిచెల్ సాంట్నర్
సాక్షి, స్పోర్ట్స్ : రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టిదెబ్బ తగిలింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తున్న ఈ జట్టుకు న్యూజిలాండ్ స్టార్ ఆలౌరౌండర్ మిచెల్ సాంట్నర్ దూరమయ్యాడు. ఐపీఎల్ వేలంలో సీఎస్‌కే 50 లక్షలు వెచ్చించి మరీ ఈ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసింది. అయితే మిచెల్ సాంట్నర్ గాయంతో ఐపీఎల్‌కు దూరం అయ్యాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సాంట్నర్ మోకాలికి తీవ్ర గాయమైంది. స్కానింగ్‌లో మోకాలి ఎముకలో లోపం ఉన్నట్లు తేలడంతో సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఈ కారణంగా కివీస్ ఆటగాడు ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌తోపాటు, ఐపీఎల్‌కు పూర్తిగా దూరం కానున్నాడు. ఏప్రిల్ 7న ప్రారంభంకానున్న ఐపీఎల్ సీజన్‌లో తొలి మ్యాచ్‌కు ముంబై ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment