పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సురేశ్ రైనా(75 నాటౌట్; 47 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుకు తోడు అంబటి రాయుడు(46;35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు జత కావడంతో చెన్నై గౌరవప్రదమైన స్కోరు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆదిలోనే షేన్ వాట్సన్(12) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో అంబటి రాయుడు-సురేశ్ రైనాల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడి 71 పరుగుల జత చేసిన తర్వాత రాయుడు రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో రైనాకు ధోని జత కలిశాడు. ఒకవైపు రైనా దూకుడుగా ఆడితే, ధోని ఆచితూచి ఆటను కొనసాగించాడు. ఈ క్రమంలోనే రైనా హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికి ధోని(26) పెవిలియన్ చేరాడు.
ప్రధానంగా మెక్లీన్గన్ వేసిన 18 ఓవర్లో ధోని, డ్వేన్ బ్రేవోలు ఔట్ కావడంతో చెన్నై స్కోరు మందగించింది. చివరి ఓవర్లలో పరుగులు రావడం కష్టంగా మారడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్గన్, కృనాల్ పాండ్యాలు చెరో రెండో వికెట్లు సాధించగా, హార్దిక్ పాండ్యాకు వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment