
ముంబై : రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో వికెట్ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌ను టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు.
అంబటి రాయుడు (22) మినహా, వాట్సన్(16), రైనా(4) ధోని(5), జడేజా(12)లు తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో జాదవ్, బ్రావో (68 పరుగులు,30 బంతుల్లో)లు చెలరేగడంతో చెన్నై విజయం సాధించింది. చివర్లో బ్రావో అవుట్ కావడంతో మ్యాచ్ ఉంత్కఠంగా మారింది.చివరి ఓవర్లో కేదార్ జాదవ్ మిగిలిన పరుగుల్ని చేయడంతో చెన్నై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment