పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ శనివారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత చెన్నైను బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరాడు.ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై వికెట్ తేడాతో విజయం సాధించింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ శర్మ అండ్ గ్యాంగ్ భావిస్తోంది. ఇప్పటివరకూ చెన్నై ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మరొకవైపు ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి చివరిస్థానంలో నిలిచింది. ఈ తరుణంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబైకు ప్రతీ మ్యాచ్ కీలకమే. తాజా మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కీరోన్ పొలార్డ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లను రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసింది. వీరిద్దరూ ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పక్కకు పెట్టేశారు. వీరి స్థానాల్లో జేపీ డుమినీ, బెన్ కట్టింగ్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
తుది జట్లు
చెన్నై
ఎంఎస్ ధోని(కెప్టెన్), షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, డ్వేన్ బ్రేవో, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, బిల్లింగ్స్, ఇమ్రాన్ తాహీర్, హర్బజన్ సింగ్
ముంబై
రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్, ఇషాన్ కిషన్, జేపీ డుమినీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, బెన్ కట్టింగ్, మెక్లీన్‌గన్, బూమ్రా, మయాంక మార్కండే
Comments
Please login to add a commentAdd a comment