Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో 2వేల పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా చోటు సంపాదించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పాండ్యా ఈ ఘనత సాధించాడు.
ఓవరాల్‌గా 111 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 2012 పరుగులు సాధించాడు. 29 ఏళ్ల 187 రోజుల్లో 2వేల మార్క్‌తో పాటు 50 వికెట్లు తీసుకున్న పాండ్యా.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఇక పాండ్యా కంటే ముందు షేన్ వాట్సన్(3874 పరుగులు, 92 వికెట్లు, 32 ఏళ్ల 330 రోజులు), కీరన్ పొలార్డ్(3412 పరుగులు, 69 వికెట్లు, 29 ఏళ్ల 332 రోజులు), రవీంద్ర జడేజా(2531 పరుగులు, 138 వికెట్లు, 31 ఏళ్ల 301 రోజులు), జాక్ కలిస్(2427 పరుగులు, 65 వికెట్లు, 37 ఏళ్ల 177 రోజులు), ఆండ్రీ రసెల్(2074 పరుగులు, 92 వికెట్లు, 34 ఏళ్ల 15 రోజులు) ఈ ఫీట్ అందుకున్నారు.
Just another day of Hardik bhai achieving milestones 💪🥳
— Gujarat Titans (@gujarat_titans) April 16, 2023
Congratulations, Captain Pandya 💙#GT - 65/2 (7.4 overs)#AavaDe | #GTvRR | #TATAIPL 2023 pic.twitter.com/NElSiUYt4Y
Comments
Please login to add a commentAdd a comment