గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. హార్డ్ హిట్టర్ షిమ్రోన్ హెట్‌మైర్(26 బంతుల్లో 56 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను గెలిపించగా.. సంజూ శాంసన్ 60 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, నూర్ అహ్మద్, హార్దిక్ పాండ్యా చెరొక వికెట్ తీశారు.
శాంసన్ అర్థసెంచరీ.. రాజస్తాన్ 114/5
అర్థసెంచరీతో మెరిసిన కెప్టెన్ సంజూ శాంసన్(60) నూర్ అహ్మద్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ 114 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
54 పరుగులకే నాలుగు వికెట్లు డౌన్
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. ఐదు పరుగులు చేసిన పరాగ్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
టార్గెట్ 178.. 37 పరుగులకే రెండు వికెట్లు
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. జాస్ బట్లర్ డకౌట్ కాగా, జైశ్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. పడిక్కల్ 25, శాంసన్ 12 పరుగులతో ఆడుతున్నారు.
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ 46 పరుగులతో టాప స్కోరర్‌గా నిలవగా.. గిల్ 45, హార్దిక్ పాండ్యా 28, అభినవ్ మనోహర్ 27, సాయి సుదర్శన్ 20 పరుగులు చేశారు. రాజస్తాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. బౌల్ట్, చహల్, ఆడమ్ జంపా తలా ఒక వికెట్ తీశారు.
గిల్(45) ఔట్.. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
45 పరుగులు చేసిన గిల్ సందీప్ శర్మ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మిల్లర్ 20 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
10 ఓవర్లలో గుజరాత్ స్కోరు 88/2
10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 27 పరుగులు, గిల్ 35 పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సాయి సుదర్శన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.
4 ఓవర్లలో గుజరాత్ స్కోరు 27/1
4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 16 పరుగులు, శుబ్‌మన్ గిల్ ఐదు పరుగులతో ఆడుతున్నారు.
సాహా (4) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సాహా బౌల్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్తాన్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గతేడాది ఐపీఎల్ ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడగా గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. అప్పటి ఫైనల్ మ్యాచ్‌లో ఓటమికి బదులు తీర్చుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సీజన్‌లో ఇరుజట్లు 4 మ్యాచ్‌లాడి మూడు విజయాలు, ఒక ఓటమితో ఉన్నాయి.
.@rajasthanroyals' skipper calls right at the toss and chooses to bowl first in Ahmedabad 🏏
Watch #GTvRR LIVE & FREE on #JioCinema, available across all telecom operators.#TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/TUnVRuCryl
— JioCinema (@JioCinema) April 16, 2023
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
Comments
Please login to add a commentAdd a comment