
Courtesy: IPL Twitter
మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా...
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూను�...
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్ర...
అంబేద్కర్ కోనసీమ జిల్లా, సాక్షి: ఆరుగ...
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: ఎన్నికల హామ�...
మనం ఎవరైనా.. ఏదో సందర్భవశాత్తు.. తప్పన�...
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ విద్యా...
ఎన్టీఆర్, సాక్షి: సవాళ్లు , ప్రతిసవాళ్...
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ �...
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన�...
రాయ్‌గఢ్: ఛత్తీస్‌ఘడ్ మరో భారీ ఎన్�...
కోల్‌కతా: సంచలన ఆర్జీకర్ ఘటనపై కేంద�...
చిత్తూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలన�...
బెంగళూరు: వీడియో కాల్ చేసి.. ఆపై నగ్న�...
Earthquake Live Rescue OP Updates👉మయన్మార్, థాయ్‌లాండ్�...
Published Thu, Apr 14 2022 7:05 PM | Last Updated on Thu, Apr 14 2022 11:29 PM
Courtesy: IPL Twitter
IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ లైవ్ అప్డేట్స్
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. జాస్ బట్లర్ 54 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. హెట్‌మైర్ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో యష్ దయాల్, ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా , మహ్మద్ షమీ చెరొక వికెట్ తీశారు.
17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. నీషమ్ 15, ప్రసిధ్ కృష్ణ ఒక పరుగుతో ఆడుతున్నారు. రాజస్తాన్ గెలవాలంటే 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సి ఉంది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. 6 పరుగులు చేసిన వాండర్ డుసెన్ యష్ దయాల్ బౌలింగ్‌లో కీపర్ డే్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుత రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది
11 పరుగులు చేసిన శాంసన్ హార్దిక్ పాండ్యా సూపర్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. దీంతో నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్ కష్టాల్లో పడింది.
ఫెర్గూసన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి రాజస్తాన్‌ను దెబ్బతీశాడు. 54 పరుగులు చేసిన బట్లర్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరగడంతో మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 5 ఓవర్లలో రెండు
వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. బట్లర్ 22బంతుల్లోనే 48 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. అశ్విన్(8) ఫెర్గూసన్ బౌలింగ్‌లో మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్‌కు రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకముందు దేవదత్ పడిక్కల్ యష్ దయాల్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 87* పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో మిల్లర్ 14 బంతుల్లోనే 31*పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో రియన్ పరాగ్, చహల్, కుల్దీప్ సేన్ తలా ఒక వికెట్ తీశారు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరుసగా రెండో అర్థశతకంతో మెరిశాడు. ప్రస్తుతం గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. హార్దిక్ 75, మిల్లర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
13 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ స్కోరు 101/3గా ఉంది. హార్దిక్ పాండ్యా 42, అభినవ్ మనోహర్ 31 పరుగులతో ఆడుతున్నారు.
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 40, అభినవ్ మనోహర్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 13 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ రియన్ పరాగ్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ ఇచ్చి వెనుదిరిగాడు.
విజయ్ శంకర్(2) రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ నిర్లక్ష్యంగా షాట్ ఆడి శాంసన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మాథ్యూ వేడ్ 12 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో గిల్ కవర్స్ దిశగా ఆడాడు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. దీంతో వేడ్ సగం క్రీజు దాటి వచ్చేశాడు. అప్పటికే డుసెన్ బంతి అందుకొని డైరెక్ట్ త్రో వేశాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయ్స్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా.. లాస్ట్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడి సీజన్లో గుజరాత్ తొలి ఓటమి చూసింది. బలబలాల్లో సమానంగా ఉన్న ఈ జట్లు మధ్య పోరు ఆసక్తికరంగా ఉండడం ఖాయం