ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ నాలుగు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 215 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఆఖరి బంతికి అందుకొని ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. 18వ ఓవర్లో గ్లెన్ పిలిప్స్ 22 పరుగులు పిండుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమైన దశలో అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్‌లు సమయోచితంగా ఆడి ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించారు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్‌లో అబిషేక్ శర్మ 55, రాహుల్ త్రిపాఠి 47, గ్లెన్ పిలిప్స్ 25, క్లాసెన్ 26 పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో చహల్ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ తీశారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్..
చహల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. తొలుత రాహుల్ త్రిపాఠిని వెనక్కి పంపిన చహల్.. మార్క్రమ్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.
క్లాసెన్(26)ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్
26 పరుగులు చేసిన క్లాసెన్ చహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 47, మార్క్రమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
14 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 136/2
14 ఓవర్లు ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్ రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 37, క్లాసెన్ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 55 పరుగులు అభిషేక్ శర్మ అశ్విన్ బౌలింగ్‌లో చహల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
9 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 73/1
ఎస్‌ఆర్‌హెచ్ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 32, రాహుల్ త్రిపాఠి 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టార్గెట్ 215.. ఏడు ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ 58/1
215 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఏడు ఓవర్లలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 20, రాహుల్ త్రిపాఠి 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
బట్లర్, శాంసన్ విధ్వంసం.. ఎస్‌ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. బట్లర్, సంజూ శాంసన్ దూకుడుతో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జాస్ బట్లర్ (59 బంతుల్లో 95 పరుగులు).. ఐదు పరుగులతో సెంచరీ మిస్ అవ్వగా.. కెప్టెన్ సంజూ శాంసన్(38 బంతుల్లో 66 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. జైశ్వాల్ 35 పరుగులు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో భువనేశ్వర్, మార్కో జాన్సెన్ చెరొక వికెట్ తీశారు.
శాంసన్, బట్లర్ దూకుడు.. రాజస్తాన్ 185/1
ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. బట్లర్ 91, శాంసన్ 47 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ వికెట్ నష్టానికి 185 పరుగులు చేసింది.
బట్లర్ అర్థశతకం.. రాజస్తాన్ 12 ఓవర్లలో 125/1
జాస్ బట్లర్ అర్థ శతకంతో మెరవడంతో రాజస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. బట్లర్ 51, శాంసన్ 32 పరుగులతో ఆడుతున్నారు.
జైశ్వాల్(35) ఔట్.. రాజస్తాన్ 8 ఓవర్లలో 74/1
35 పరుగులు చేసిన జైశ్వాల్ మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాజస్తాన్ 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. జాస్ బట్లర్ 20, సంజూ శాంసన్ 13 పరుగులతో ఆడుతున్నాడు.
3 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 35/0
మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ 17, జాస్ బట్లర్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆదివారం జైపూర్ వేదికగా 52వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ కొంటున్నాయి. జైపూర్‌లోని స్లో పిచ్ వేదికగా ఇరుజట్లు పోటీ పడతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Sanju Samson wins the toss and opts for hosts @rajasthanroyals to BAT FIRST tonight!🏏
Watch #RRvSRH, LIVE & FREE on #JioCinema, available on any sim card.#RRvSRH #TATAIPL #IPLonJioCinema #IPL2023pic.twitter.com/OdiLISl766
— JioCinema (@JioCinema) May 7, 2023
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్
వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన సంజూ సేన విజయంపై కన్నేసింది. మరోవైపు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న హైదరాబాద్ బలమైన రాజస్తాన్‌ను ఎలా ఎదుర్కొంటుదనేది ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment