Photo: IPL Twitter
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఐపీఎల్ 16వ సీజన్‌లో తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్ ఒక రికార్డు అందుకున్నాడ. 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
కాగా ఐపీఎల్ చరిత్రలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న రెండో పిన్న వయస్కుడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 130 రోజుల్లో 34 ఇన్నింగ్స్‌ల్లో జైశ్వాల్ ఈ ఫీట్ సాధించాడు. జైశ్వాల్ కంటే ముందు రిషబ్ పంత్(20 ఏళ్ల 218 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు మార్క్ అందుకొని తొలి స్థానంలో నిలిచాడు.
ఇక పంత్, జైశ్వాల్ తర్వాత పృథ్వీ షా(21 ఏళ్ల 169 రోజులు) 44 ఇన్నింగ్స్‌ల్లో, సంజూ శాంసన్(21 ఏళ్ల 183 రోజులు) 44 ఇన్నింగ్స్‌ల్లో, శుబ్‌మన్ గిల్(21 ఏళ్ల 222 రోజులు) 41 ఇన్నింగ్స్‌ల్లో, దేవదత్ పడిక్కల్(21 ఏళ్ల 285 రోజులు) 35 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు.
Yashasvi Jaiswal becomes second fastest Indian, second youngest batter to 1000 IPL runs #IPL2023 #SRHvsRR #RRvsSRH #YashasviJaiswal #RajasthanRoyals #SunrisersHyderabad #worlddais
— Dais World ® (@world_dais) May 7, 2023
source: Sportstar pic.twitter.com/gdfHISnyJK
𝐎𝐔𝐓𝐓𝐀 𝐒𝐈𝐆𝐇𝐓 👋
— JioCinema (@JioCinema) May 7, 2023
The Yashasvi Jaiswal show is on at SMS!#IPLonJioCinema #RRvSRH #TATAIPL #IPL2023 | @ybj_19 pic.twitter.com/xtUzG6uXzx
Comments
Please login to add a commentAdd a comment