Photo: IPL Twitter
ఐపీఎల్‌లో సీజన్లు మారుతున్నాయే తప్ప ఎస్‌ఆర్‌హెచ్ ఆటలో మాత్రం మార్పు రావడం లేదు. జట్టును ఎన్ని రకాలుగా ప్రక్షాళన చేసినా మా ఆట ఇంతే అన్నట్లుగా ఆటతీరు కనబరుస్తూ సీజన్.. సీజన్‌కు మరింత దారుణంగా తయారవుతోంది. అయితే ఎస్‌ఆర్‌హెచ్ పేరు చెప్పగానే ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ మొహం గుర్తుకురాక మానదు. ఎస్‌ఆర్‌హెచ్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతూ వారిని ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కానీ ఆమె చూపించే ఉత్సాహాన్ని ఎస్‌ఆర్‌హెచ్ తమ చెత్త ఆటతీరుతో నీరుగారుస్తుంది.
తాజాగా ఐపీఎల్ 16వ సీజన్‌లోనూ ఎస్‌ఆర్‌హెచ్ ఆటతీరు మారలేదు. కోట్లు పెట్టి కొన్ని హ్యారీ బ్రూక్, గ్లెన్ పిలిప్స్‌లు ఏదో పొడిచేస్తారనుకుంటే ఏం చేయకుండానే ఔటయ్యారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఎప్పుడు ఎక్కువగా బౌలింగ్‌నే నమ్ముకొని బరిలోకి దిగుతుంది. కానీ ఈసారి బౌలర్లు కూడా తేలిపోయారు. హోంగ్రౌండ్‌లో ఒక జట్టు మ్యాచ్ ఆడుతుందంటే ఎంతోకొంత ఫెవరెట్‌గా కనిపిస్తోంది.
కానీ ఎస్‌ఆర్‌హెచ్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఆదివారం రాజస్తాన్ విధించిన 204 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో కనీసం పోరాడాలన్న విషయాన్ని కూడా మరిచిపోయినట్లుంది. ఏదో మొక్కుబడిగా ఆడుతున్నామా అన్నట్లుగా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి వంద పరుగులు చేయడానికి అష్టకష్టాలు పడింది. కావ్యా మారన్ వేలంలో ఏరికోరి ఆటగాళ్లను తీసుకుంటే జట్టును నట్టేట ముంచారు. ఇలాంటి బ్యాటింగ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ కప్ కొట్టడం కూడా కష్టమే.
ఇక ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ చూసి పాపం కావ్యా మారన్ మొహం మాడిపోయింది. అయినా గత రెండు సీజన్లుగా ఎస్‌ఆర్‌హెచ్ ఆటతీరు ఇలానే ఉన్నప్పటికి కావ్యా మారన్ మాత్రం ప్రతీ మ్యాచ్‌కు హాజరై వారిని ఉత్సాహపరుస్తూనే ఉంది. అయినా మన పిచ్చి కానీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది అలవాటే కదా.. పాపం కావ్యా మారన్‌కు ఈ విషయం అర్థమైనా ఏం చేయలేని పరిస్థితి. ఆమెను చూస్తే జాలేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment