IPL 2023: Kaviya Maran Angry-Cameraman-Says Hatt Rey While Dhawan Playing, Video Viral - Sakshi
Sakshi News home page

#KavyaMaran: 'చల్‌ హట్‌ రే'.. నీకు నేనే దొరికానా! 

Published Sun, Apr 9 2023 11:52 PM | Last Updated on Mon, Apr 10 2023 8:28 AM

IPL 2023 Kavya Maran Angry-Cameraman-Says Hat Rey While Dhawan Playing - Sakshi

Photo : IPL Twitter

ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌ జరుగుతుందంటే చాలు ఆటగాళ్ల కంటే ఒకరిమీదే కెమెరాలు ఎక్కువ ఫోకస్‌గా ఉంటాయి. ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటా ఎవరనేది. అవునండీ ఆమె కావ్యా మారన్‌. ప్రతీ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా అ‍క్కడ టక్కున వాలిపోయి వారిని ఉత్సాహపరుస్తుంది. జట్టు ఓడిపోతే తాను బాధపడుతుంది.. గెలిస్తే ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటుంది.

అలాంటి కావ్యా మారన్‌కు ఇవాళ పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఒక కెమెరామన్‌ కోపం తెప్పించాడు. ఆ కోపానికి వేరే కారణం ఉంది లెండి. పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్‌ వంద పరుగులు కూడా చేయదని కావ్యా మారన్‌ తెగ సంతోషపడింది. 

కానీ కాసేపటికే సీన్‌ రివర్స్‌ అయింది. ధావన్‌ తన క్లాస్‌ ఆటతీరుతో ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్‌కు ఫ్రస్టేషన్‌ పీక్స్‌కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్‌లో కూర్చొని సీరియస్‌గా మ్యాచ్‌ చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్‌ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్‌.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో'' చల్‌ ..హట్‌ రే '' అని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

ఇక పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ 99 పరుగులతో అసమాన ఆటతీరు ప్రదర్శించి పంజాబ్‌కు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement