IPL 2023, SRH Vs PBKS: Kavya Maran Beautiful Smile After SRH Win Against Punjab Kings, Video Viral - Sakshi
Sakshi News home page

#KavyaMaran: కావ్య పాప నవ్విందిరోయ్‌..

Published Sun, Apr 9 2023 11:35 PM | Last Updated on Mon, Apr 10 2023 9:49 AM

Kavya Maran Smiles After SRH Win Vs PBKS Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఎస్‌ఆర్‌హెచ్‌కు మధ్యలో ధావన్‌ తన ఇన్నింగ్స్‌తో భయపెట్టినప్పటికి..  బ్యాటింగ్‌లో ఎలాంటి తడబాటుకు లోనవ్వకుండా 144 పరుగుల టార్గెట్‌ను చేధించింది.

అయితే ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన ఓటములతో తెగ బాధపడిపోయిన ఫ్రాంచైజీ కో-ఓనర్‌ కావ్యా మారన్‌ ఎట్టకేలకు నవ్వింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌కు హాజరైన ఆమె ఆద్యంతం జట్టును ఎంకరేజ్‌ చేస్తూ కనిపించింది. తొలుత బౌలర్లు చెలరేగి వికెట్లు తీయడంతో సంతోషంతో ఎగిరి గెంతులేసింది. ఆఖర్లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడుతుంటే మొహం బిక్కముడుచుకు కూర్చొంది. 

144 పరుగుల టార్గెట్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ చేధిస్తుందో లేదో అన్న టెన్షన్‌ ఆమె ముఖంలో క్లియర్‌గా కనిపించింది. అయితే రాహుల్‌ త్రిపాఠి, కెప్టెన్‌ మార్ర్కమ్‌లు జట్టును విజయతీరాలకు చేర్చిన తర్వాత పట్టరాని సంతోషంతో ఆమె మొహంలో నవ్వులు విరపూశాయి.

మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రాహుల్‌ త్రిపాఠి, మార్క్రమ్‌ల వైపు సూపర్‌ అంటూ థంబ్స్‌ అప్‌(బొటనవేలు) చూపిస్తూ నవ్వడం హైలెట్‌గా నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో  ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటములతో డీలా పడిన కావ్యా మారన్‌ ఎట్టకేలకు నవ్వడంతో అభిమానులు ఉప్పొంగిపోయారు. కావ్య పాప నవ్విందిరోయ్‌ అంటూ కామెంట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement