IPL 2023, MI Vs SRH: Last Year We Did A Big Favour To RCB, I Hope We Get The Result What We Are Looking For - Rohit Sharma - Sakshi
Sakshi News home page

#RohitSharma: 'గతేడాది ఆర్‌సీబీకి సాయం చేశాం.. ఈసారి పరిస్థితి వేరు'

Published Sun, May 21 2023 9:34 PM | Last Updated on Mon, May 22 2023 9:25 AM

Rohit Sharma Says-Helped RCB Last Season-Enter Play-offs-Win Vs SRH - Sakshi

2023 సీజన్‌ని కూడా పెద్దగా అంచనాలు లేకుండా ఆరంభించింది ముంబై ఇండియన్స్.  బుమ్రా గాయంతో సీజన్‌ నుంచి దూరం కావడం.. జోఫ్రా ఆర్చర్ సుదీర్ఘ విరామం తర్వాత ఆడినా పెద్దగా ఇంపాక్ట్‌ చూపలేకపోయాడు. దీంతో  ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్‌ ఆరంభంలో వరుసగా పరాజయాలే ఎదురయ్యాయి.  తొలి అంచె పోటీల్లో ఎనిమిది  మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే సాధించింది.

అయితే రెండో అంచె పోటీలు మొదలవ్వగానే ముంబై ఇండియన్స్‌ గేర్‌ మార్చింది. అప్పటివరకు ఫామ్‌లో లేక  తంటాలు పడుతున్న సూర్యకుమార్‌ ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద బలంగా మారింది. దీనికి తోడు ఆకాశ్ మద్వాల్, నేహాల్ వదేరా, కుమార్ కార్తికేయ వంటి బేస్ ప్రైజ్ బౌలర్లతోనే ముంబై వరుస విజయాలు అందుకొని ఏకంగా ప్లేఆఫ్‌ రేసులోకి దూసుకొచ్చింది.
 
ఇక ముంబై తమ చివరి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకున్న ముంబై ఇండియన్స్‌ నాలుగో స్థానానికి చేరుకుంది.  అయినప్పటికి ప్లేఆఫ్స్ చేరాలంటే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఆర్‌సీబీ ఓడిపోవాలి. ఎందుకంటే 16 పాయింట్లతో ఉన్న ముంబై నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ముగిసిన అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఏం జరిగినా నిరుత్సాహపడకూడదనే మైండ్‌సెట్‌తోనే నేటి మ్యాచ్‌ ఆడేందుకు వచ్చాం. మా చేతుల్లో ఉన్నదాంట్లో నియంత్రించగలం, లేనిదాన్ని కంట్రోల్ చేయలేం కదా.. నా ఫామ్‌ గురించి నాకు చింతలేదు, నేనెవరితో మాట్లాడలేదు కూడా...గత ఏడాది మేం ఆర్‌సీబీకి సాయం చేశాం. ఈసారి వాళ్లు మాకు కావాల్సిన రిజల్ట్ ఇస్తారని అనుకుంటున్నాం(నవ్వుతూ).. ఈ సీజన్‌ని సరిగ్గా ప్రారంభించకపోయినా వరుసగా మూడు విజయాలు అందుకున్నాం. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి 3 ఓవర్లలో 34 పరుగులు చేయలేక ఓడిపోయాం.

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌ కూడా ఆఖరి దాకా మా చేతుల్లోనే ఉంది. అయితే గెలవలేకపోయాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద నష్టం చేశాయి. ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచించి అనవసరం. కొన్నిసార్లు ఏం చేసినా వర్కవుట్ కాదు, రోజు మనది కాదని అలా వదిలేయాలంతే.' అంటూ పేర్కొన్నాడు.  2023 సీజన్‌లో ఆఖరి పొజిషన్‌లో నిలిచిన ముంబై ఇండియన్స్, ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించింది. దీంతో నాలుగో స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరిన సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2023: పాపం రాజస్థాన్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement