Photo: IPL Twitter
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ఆరువేల పరుగులు మైలురాయిని చేరుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహత్ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్న నాలుగో ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలిచాడు.
రోహిత్‌కు ఆరువేల పరుగులు చేరుకోవడానికి 226 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లి(186 ఇన్నింగ్స్‌లు), శిఖర్ ధావన్(199 ఇన్నింగ్స్‌లు), డేవిడ్ వార్నర్(165 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు.
తొలి స్థానంలో కోహ్లి 6844 పరుగులు(228 మ్యాచ్‌లు), శిఖర్ ధావన్ 6477 పరుగులు(210 మ్యాచ్‌లు) రెండో స్థానంలో, మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ 6109 పరుగులు(167 మ్యాచ్‌లు), రోహిత్ శర్మ 6014 పరుగులు(232 మ్యాచ్‌లు) ఉన్నారు.
Rohit Sharma is only the third Indian to score 6,000 IPL runs! #IPL2023 pic.twitter.com/F7B7hXacu3
— Wisden India (@WisdenIndia) April 18, 2023
Comments
Please login to add a commentAdd a comment