IPL, 2023, MI Vs GT: Rohit Sharma 252 Sixes-Breaks De-Villiers Record Most Sixes-IPL History - Sakshi
Sakshi News home page

#RohitSharma: సిక్సర్ల విషయంలో రోహిత్‌ అరుదైన రికార్డు

Published Fri, May 12 2023 8:14 PM | Last Updated on Sat, May 13 2023 10:05 AM

Rohit Sharma 252 Sixes-Breaks De-Villiers Record Most Sixes-IPL History - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌ దూకుడుగా ఆరంభించింది. రోహిత్‌ శర్మ సీజన్‌లో తొలిసారి కాన్ఫిడెంట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. పవర్‌ ప్లే ముగిసేసరికి ముంబై ఇండియన్స్‌ స్కోరు 61 పరుగులు దాటింది. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ ఐపీఎల్‌లో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో షమీ వేసిన ఆఖరి బంతిని కవర్స్‌ దిశగా  సిక్సర్‌ కొట్టాడు. రోహిత్‌కు ఇది ఐపీఎల్‌లో 252వ సిక్సర్‌ కావడం విశేషం. ఈ నేపథ్యంలో డివిలియర్స్‌(251 సిక్సర్లు)ను రోహిత్‌ అధిగమించాడు.

ఇక అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్‌ గేల్‌ 357 సిక్సర్లతో టాప్‌లో నిలిచి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. 252 సిక్సర్లతో రోహిత్‌ శర్మ , 251 సిక్సర్లతో ఏబీ డివిలియర్స్‌, 239 సిక్సర్లతో ధోని టాప్‌-5లో కొనసాగుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్‌ తరపున రోహిత్‌ 200 సిక్సర్లు పూర్తి చేసుకొని మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: అడుగు పడింది.. జైశ్వాల్‌ జోరులో గమనించలేదు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement