IPL 2023
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పట్టు బిగించింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ చేధనలో తడబడుతోంది. 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే రివ్యూ విషయంలో ఇషాన్ కిషన్‌ను గుడ్డిగా నమ్మి చేతులు కాల్చుకున్నాడు రోహిత్ శర్మ.
ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్‌లో గ్రీన్ వేసిన మూడో బంతి లెగ్‌సైడ్ వెళ్లింది. క్లియర్‌గా వైడ్ అని తెలుస్తున్నప్పటికి ఇషాన్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ వైడ్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఇషాన్ మాత్రం తనకు సౌండ్ వినిపించిందని.. కచ్చితంగా ఔట్ అంటూ బలంగా పేర్కొన్నాడు. అయితే రోహిత్‌కు వైడ్ అని తెలుస్తున్నప్పటికి ఇషాన్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్ఝ్‌లో బంతి ఎక్కడ బ్యాట్‌కు తగలకపోగా.. దూరంగా వెళుతున్నట్లు క్లియర్‌గా కనిపించింది. దీంతో ముంబై రివ్యూ కోల్పోయింది.
అంతే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను అభిమానులు ట్రోల్ చేశారు. ''ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీకంటూ సొంత నిర్ణయం లేదా''.. ''అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎన్నోసార్లు ఇతరుల మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నావు.. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే పరిస్థితి''.. ''క్లియర్ వైడ్ అని నీకు తెలిసినప్పటికి అనవసరంగా రివ్యూకు వెళ్లావు.. కెప్టెన్‌గా ఇదేనా నీ అనుభవం'' అంటూ కామెంట్లు చేశారు.
#ishankishan wasting DRS since childhood 😂😂😂
— Rahul Batra (@rulebreaker_rb) April 18, 2023
3/3 wrong referrals#MIvsSRH #IPL2023 pic.twitter.com/GPjLBPvPI4
Comments
Please login to add a commentAdd a comment