DRS
-
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. వీడియో వైరల్
చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆటలో శ్రీలంక పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 4 వికెట్లు నష్టానికి 314 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(93), కరుణరత్నే(86), నిషాన్ మదుష్కా(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ రెండు, షకీబ్ ఆల్ హసన్ తలా రెండు వికెట్లు సాధించారు. అయితే తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో తీసుకున్న ఓ రివ్యూ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన స్పిన్నర్ తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో మూడు బంతిని కుశాల్ మెండిస్ ఆఫ్ సైడ్ వైపు డిఫెన్స్ ఆడాడు. కానీ బౌలర్, స్లిప్‌లో ఉన్న బంగ్లా కెప్టెన్ షాంటో బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తగిలిందని భావించి ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తలఊపాడు. ఈ క్రమంలో షాంటో బౌలర్‌తో సంప్రదించి రివ్యూకు వెళ్లాడు. అయితే బంతి బ్యాట్‌కు స్పష్టంగా తాకుతున్నప్పటికి షాంటో రివ్యూకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరిచింది. రిప్లేలో కూడా బంతి బ్యాట్‌కు మధ్యలో తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రివ్యూ అంటూ కామెంట్లు చేస్తున్నారు. What just happened? 👀 . .#BANvSL #FanCode #CricketTwitter pic.twitter.com/sJBR5jMSov — FanCode (@FanCode) March 30, 2024 -
IND VS ENG 2nd Test: బెన్ స్టోక్స్ అసహనం.. టెక్నాలజీది తప్పంటూ..!
విశాఖ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి టెస్ట్‌లో అన్ని విభాగాల్లో రాణించి టీమిండియాను ఓడించిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఓటమిపాలైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు తేలిపోయిన వేల బుమ్రా (9/91), యశస్వి జైస్వాల్ (209), శుభ్‌మన్ గిల్ (104) అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ముఖ్యంగా బుమ్రా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌పై చెలరేగి ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. Technology got it wrong on this occasion: England skipper Ben Stokes on Zak Crawley's lbw dismissal in second innings of second Test #INDvsENGTest — Press Trust of India (@PTI_News) February 5, 2024 మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తమ వైఫల్యాలను అంగీకరించినప్పటికీ, ఓ విషయంలో మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాడు జాక్ క్రాలే ఎల్బీడబ్ల్యూ విషయంలో సాంకేతికతను తప్పుబడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. గేమ్‌లో సాంకేతికత స్పష్టంగా ఉంది. ఇది ఎప్పటికీ 100 శాతం కాకూడదనే అంపైర్ కాల్ అనే ఆప్షన్‌ను ఉంచారు. ఇలాంటి సందర్భంలో పూర్తిగా సాంకేతికతపై ఆధారపడి థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయమని స్టోక్స్ అన్నాడు. Review.....successful! ✅☝️ Kuldeep Yadav picks up the big wicket of Crawley to keep #TeamIndia in the driving seat 👊⚡️#BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports#INDvENG pic.twitter.com/c4hMunPVSP — JioCinema (@JioCinema) February 5, 2024 ఇంతకీ ఏం జరిగిందంటే.. జాక్ క్రాలే (73) మాంచి జోరుమీదున్న సమయంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సందేహాస్పదంగా ఉన్న డీఆర్ఎస్ అప్పీల్‌ను థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, సందర్భం సందేహాస్పదంగా ఉన్నా థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్‌గా ప్రకటించడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో థర్డ్ అంపైర్ అంపైర్స్ కాల్‌తో వెళ్తారు. కానీ ఈ సందర్భంలో థర్డ్ అంపైర్ అలా చేయకుండా సాంకేతికత ఆధారంగా క్రాలేను ఔట్‌గా ప్రకటించాడు. రీప్లేలో బంతి లెగ్ సైడ్ వెళ్తున్నట్లు అనిపించినా, చివరకు లెగ్ స్టంప్‌కు తగులుతున్నట్లు డీఆర్ఎస్ చూపించింది. ఈ సాంకేతికత ఆధారంగానే థర్డ్ అంపైర్ క్రాలేను ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో క్రాలే సహా ఇంగ్లీష్ బృందం మొత్తం ఆశ్యర్యం వ్యక్తం చేసింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సైతం థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. -
#Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది మరో బంతిని
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించే యోచనలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు టీమిండియా ఆలౌట్ కాగా.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి విండీస్ వికెట్ నష్టానికి 86 పరుగులతో ప్రతిఘటిస్తుంది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగులు వెనుకబడి ఉంది. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీతో మెరిస్తే.. అశ్విన్, జడేజా, యశస్వి జైశ్వాల్‌లు అర్థసెంచరీలతో రాణించారు. ఇక కోహ్లితో కలిసి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా ఔటైన తీరు సక్రమమే అయినప్పటికి డీఆర్ఎస్లో ఎంత లోపం మరోసారి బయటపడింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 104వ ఓవర్లో కీమర్ రోచ్ వేసిన ఆఖరి బంతిని జడేజా డ్రైవ్షాట్ ఆడే క్రమంలో మిస్ అయ్యాడు. దీంతో బంతి కీపర్ జోషువా దసిల్వా చేతిలో పడింది. కీపర్ వెంటనే ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో విండీస్ ఆటగాళ్లు రివ్యూకు వెళ్లారు. కాగా రివ్యూను పరిశీలించిన టీవీ అంపైర్ మైకెల్ గాఫ్ తొలుత అన్ని యాంగిల్స్‌లోనూ బంతి బ్యాట్‌కు తాకిందా లేదా అని చూశారు. కాని బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లింది కానీ తాకిందా లేదా అన్నది క్లారిటీ రాలేదు. దీంతో థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్కు రిక్వెస్ట్ చేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ స్పైక్ కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ జడేజాను ఔట్ అని ప్రకటించాడు. అయితే ఇక్కడ ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. తొలుత అల్ట్రాఎడ్జ్‌లో జడ్డూ ఔటైన బంతికి బదులుగా.. జడ్డూ ఆడిన మరో బంతిని డిస్ప్లే చేయడం వైరల్‌గా మారింది. అయితే యాదృశ్చికంగా రెండింటిలోనూ జడ్డూ బ్యాట్‌కు బంతి తగిలివెళ్లినట్లుగా స్పైక్ కనిపించింది. ఇక్కడ విండీస్ ఆటగాళ్లను.. అటు థర్డ్ అంపైర్‌ను తప్పుబట్టలేం. ఎందుకంటే జడేజా ఔట్లో ఎలాంటి పొరపాటు లేదు. కేవలం సాంకేతిక లోపంతో జడ్డూ ఔటైన బంతిని కాకుండా తప్పుడు బంతిని చూపించడండలో తప్పు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. DRS scam 2023. Jadeja's wicket was robbed. @ICC @BCCI @imjadeja @imVkohli pic.twitter.com/FAbXKihW0S — Human_Insaan🇮🇳 (@Alishan_53) July 21, 2023 చదవండి: 352 పరుగుల వెనుకంజలో విండీస్.. భారత్ పట్టు బిగిస్తుందా? -
#TNPL2023: రోజుకో విచిత్రం.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో రోజుకో విచిత్రం చోటుచేసుకుంటుంది. ఒకే బంతికి 18 పరుగులు రావడం మరిచిపోకముందే మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్ తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. ఒకసారి బ్యాటర్ రివ్యూ తీసుకుంటే.. మరోసారి అదే నిర్ణయంపై బౌలర్ రివ్యూ తీసుకున్నాడు. లీగ్‌లో భాగంగా బుధవారం దిండిగుల్ డ్రాగన్స్, బా11 ట్రిచ్చి మధ్య మ్యచ్ జరిగింది. ట్రిచ్చి ఇన్నింగ్స్ 13వ ఓవర్‌ను కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని క్యారమ్ బాల్ వేయగా.. క్రీజులో ఉన్న రాజ్‌కుమార్ షాట్‌కు యత్నించగా బంతి మిస్ అయి కీపర్ చేతుల్లో పడింది. బంతి బ్యాట్‌కు తగిలినట్లు సౌండ్ రావడంతో కీపర్ అప్పీల్ చేయగానే అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో రాజ్‌కుమార్ రివ్యూ కోరాడు. రిప్లేలో స్పైక్ వస్తున్నప్పటికి బంతికి, బ్యాట్‌కు గ్యాప్ క్లియర్‌గా ఉండడంతో టీవీ అంపైర్ ఎస్. నిశాంత్ నాటౌట్ అని ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించగానే అశ్విన్ వెంటనే మళ్లీ డీఆర్ఎస్ కోరాడు. అయితే అశ్విన్ ఎందుకు రివ్యూ కోరాడో ఎవరికి అర్థం కాలేదు. బంతి బ్యాట్‌కు తగిలిందేమోనన్న అనుమానంతోనే అశ్విన్ రివ్యూ కోరినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఇద్దరు ఫీల్డ్ అంపైర్లతో అశ్విన్ చర్చించాడు. కాగా టీవీ అంపైర్ నిశాంత్ మరోసారి స్పష్టంగా పరిశీలించారు. అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ కనిపిస్తున్నప్పటికి.. బంతికి, బ్యాట్‌కు గ్యాప్ క్లియర్‌గా ఉంది. దీంతో బ్యాట్ గ్రౌండ్‌కు తాకడంతోనే స్పైక్ వచ్చిందని.. ఇది నాటౌట్ అంటూ బిగ్స్క్రీన్పై చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బా11 ట్రిచ్చి 19.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ గంగా శ్రీధర్ రాజు 48 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో రాజ్‌కుమార్ 39 పరుగులతో రాణించాడు. దిండిగుల్ డ్రాగన్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, శరవణ కుమార్, సుబోత్ బాటిలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన దిండిగుల్ 14.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ శివమ్ సింగ్ 46, బాబా ఇంద్రజిత్ 22, ఆదిత్య గణేశ్ 20, సుబోత్ బాటి 19 పరుగులు చేశారు. Uno Reverse card in real life! Ashwin reviews a review 🤐 . .#TNPLonFanCode pic.twitter.com/CkC8FOxKd9 — FanCode (@FanCode) June 14, 2023 చదవండి: రెండేళ్లలో ఆరు టెస్టు సిరీస్‌లు; మూడు స్వదేశం.. మూడు విదేశం -
'చెలరేగుతున్నాడన్న కోపం.. రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు'
ఎంఎస్ ధోని రివ్యూ తీసుకున్నాడంటే చాలా సందర్భాల్లో ఫలితం అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే తన మాస్టర్‌మైండ్‌తో ఆలోచించే ధోని రివ్యూ విషయంలో ఫర్ఫెక్ట్గా ఉంటాడు. కానీ ఐపీఎల్ 16వ సీజన్లో తొలిసారి ధోని లెక్క తప్పింది. గురువారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని.. యశస్వి జైశ్వాల్ విషయంలో రివ్యూకు వెళ్లాడు. తీక్షణ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతిని జైశ్వాల్ స్వీప్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. ఈ క్రమంలో బంతి అతని ప్యాడ్లను తాకి కీపర్ ధోని చేతుల్లోకి వెళ్లింది. అంపైర్‌కు అప్పీల్ చేయగా ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోని డీఆర్ఎస్ కోరాడు. అయితే అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకినప్పటికి లెగ్‌స్టంప్ ఔట్‌సైడ్‌లో బంతి పిచ్ అయినట్లు చూపించింది. దీంతో జైశ్వాల్ నాటౌట్ అని తేలగా.. సీఎస్కే ఒక రివ్యూను కోల్పోయింది. అయితే అప్పటికే జైశ్వాల్ 11 బంతుల్లో 31 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. ఒక దశలో సీఎస్కే బౌలర్లపై ధోని అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే దాటిగా ఆడుతున్నాడన్న కోపం అనుకుంటా అందుకే రివ్యూకు పోయాడు.. కానీ ఏం లాభం చేతులు కాల్చుకున్నాడు అంటూ అభిమానులు కామెంట్ చేశారు. DHONI REVIEW SYSTEM 😎😎..#CSKvRR pic.twitter.com/Xzc4kiAuVm — ஒத்த கை உலககோப்பை (@ok_uk_) April 27, 2023 చదవండి: రాజస్తాన్‌తో మ్యాచ్.. ధోని ఉగ్రరూపం గుర్తుందా? -
సమయం ముగిశాకా రివ్యూనా.. అదెలా సాధ్యం?
క్రికెట్లో రూల్ ప్రకారం ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై డీఆర్ఎస్ కోరేందుకు ఏ జట్టుకైనా 15 సెకన్లు సమయం ఉంటుంది. నిర్ణీత సమయంలోగా డీఆర్ఎస్ తీసుకుంటేనే థర్డ్ అంపైర్‌కు వెళ్లుంది. సమయం దాటిపోతే ఆన్‌ఫీల్డ్ అంపైర్ డీఆర్ఎస్కు కాల్అప్ ఇస్తారు. తాజాగా ఐపీఎల్లో మాత్రం ఈ నిబంధనను గాలికొదిలేశారు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని సాహా పుల్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి కీపర్ ఇషాన్ కిషన్ చేతిలో పడింది. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే సాహా వెంటనే రివ్యూకు వెళ్లకుండా గిల్‌తో చర్చించాడు. అప్పటికే 15 సెకన్ల గడువు ముగిసింది. కానీ ఈ విషయం ఫీల్డ్ అంపైర్ గమనించలేదు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత గుజరాత్ బ్యాటర్ వృద్దిమాన్ సాహా రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో ఫలితం అతనికి వ్యతిరేకంగా వచ్చింది. అల్ట్రాఎడ్జ్‌లో బ్యాట్‌కు బంతి తగిలినట్లు స్పైక్ కనిపించింది. దీంతో సాహా ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. అయితే రివ్యూ సమయం ముగిశాకా సాహా డీఆర్ఎస్ కోరడం సరైనదేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/o1jMdNEj5T — Surya Sharma (@SuryaSh54265109) April 25, 2023 How was Wriddhiman Saha even allowed to take the DRS? He signalled post the 15 seconds timer and even though the decision didn’t go in his favour, this shouldn’t have been allowed by the 3rd umpire! On-field umpire cannot track the time but the 3rd umpire surely can#GTvMI — Sports Taaza (@SportsTaaza) April 25, 2023 -
డీఆర్ఎస్ కాస్త వీఆర్ఎస్ అయ్యింది.. గురువును మించిన శిష్యుడు
-
డీఆర్ఎస్ కాస్త వీఆర్ఎస్ అయ్యింది.. రెండు రివ్యూల్లో సక్సెస్ సాధించిన కోహ్లి
మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ తాత్కాలిక సారధి విరాట్ కోహ్లి కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తోనూ చెలరేగిన కింగ్ కోహ్లి (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, సిక్స్).. ఫీల్డింగ్ సమయంలో అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లి (డీఆర్ఎస్) రెండు సార్లు సఫలమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆర్సీబీ నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ రెండో బంతికి పంజాబ్ ఓపెనర్ అథర్వ టైడే (4) వికెట్ కోసం (ఎల్బీ) మహ్మద్ సిరాజ్ అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించడంతో కెప్టెన్ కోహ్లి.. బౌలర్ సిరాజ్, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రోద్భలంతో రివ్యూకి వెళ్లాడు. రిప్లేలో అథర్వ క్లియర్‌గా వికెట్ల ముందు దొరికనట్లు స్పష్టం కావడంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని అథర్వను ఔట్‌గా ప్రకటించాడు. ఆతర్వాత ఇలాంటి సీనే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మళ్లీ రిపీటైంది. అప్పుడు కూడా బౌలర్ సిరాజే కావడం విశేషం. నాలుగో ఓవర్ రెండో బంతికి లివింగ్‌స్టోన్ ఎల్బీడబ్ల్యూ కోసం సిరాజ్ అప్పీల్ చేశాడు. అప్పుడు కూడా అంపైర్ బౌలర్ అప్పీల్‌ను తిరస్కరించాడు. దీంతో కెప్టెన్ కోహ్లి మరోసారి రివ్యూ వెళ్లాడు. మరోసారి సక్సెస్ సాధించాడు. లివింగ్‌స్టోన్ వికెట్ల ముందు దొరికినట్లు రిప్లేల్లో క్లియర్‌గా తేలడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని లివింగ్‌స్టోన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. కోహ్లి బంతుల వ్యవధిలో రివ్యూకి వెళ్లి సక్సెస్ సాధించడంతో అతని అభిమానులు డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్)ను కాస్త వీఆర్ఎస్ (విరాట్ రివ్యూ సిస్టమ్)గా మార్చి సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. 175 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుండటంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదంతా కోహ్లి వల్లే జరిగిందని వారు గప్పాలు కొట్టుకుంటున్నారు. కాగా, క్రికెట్ అభిమానులంతా డీఆర్ఎస్ను ధోని రివ్యూ సిస్టమ్‌గా పిలుచుకునే విషయం అందరికీ తెలిసిందే. రివ్యూల విషయంలో ధోని చాలా కచ్చితంగా ఉంటాడు కాబట్టి ఫ్యాన్స్ అలా పిలుచుకుంటుంటారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. కోహ్లి (59), డుప్లెసిస్ (84) రాణించడంతో నిర్ణీత ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు స్కోర్ చేసింది. మ్యాక్స్‌వెల్ (0), దినేశ్ కార్తీక్ (7) నిరాశపరిచారు. పంజాబ్ బౌలరల్లో హర్‌ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్, ఇల్లిస్ తలో వికెట్ పడగొట్టారు. 175 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. -
ఇది విన్నారా.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి!
క్రికెట్లో ఫీల్డ్ అంపైర్ పనేంటని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరు. బ్యాటర్లు కొట్టే బౌండరీలు, సిక్సర్లకు సిగ్నల్స్ ఇవ్వడం.. బౌలర్లకు ఆదేశాలు ఇవ్వడం.. రనౌట్లు, నోబ్లు, వైడ్లు, లెగ్‌బైలు ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాచ్‌లో ఆటగాళ్ల కన్నా అంపైర్‌కే ఎక్కువ పని ఉంటుంది. అనుక్షణం ఏకాగ్రతతో ఉంటూ మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించడం అతని పాత్ర. ఒకప్పుడు ఫీల్డ్ అంపైర్ ఏది చెబితే అదే శాసనం. ఇప్పుడంటే డీఆర్ఎస్ల రూపంలో అంపైర్ల నిర్ణయాన్ని చాలెంజ్ చేయొచ్చు. కానీ ఒకప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్.. రనౌట్ ఈ రెండు అంశాల్లో తప్ప అంపైర్ ఔట్ ఇచ్చాడంటే బ్యాటర్ మాట మాట్లాడకుండా పెవిలియన్‌కు వెళ్లాల్సిందే. అయితే ఇప్పుడు డీఆర్ఎస్లు అంపైర్లను కన్ఫూజన్‌కు గురిచేస్తున్నాయి. బంతి బంతికి డీఆర్ఎస్ కోరే అవకాశం ఉండడంతో వైడ్ బాల్స్‌ను కూడా సందేహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మంగళవారం ఎస్ఆర్హెచ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అర్జున్ వేసిన నాలుగో బంతి త్రిపాఠి పక్క నుంచి లెగ్‌స్టంప్ అవతల నుంచి వెళ్లింది. అయితే అర్జున్ టెండూల్కర్‌తో పాటు కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్‌ఔట్ అంటూ అప్పీల్ చేశారు. కానీ అంపైర్ వైడ్ ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రివ్యూ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అర్జున్, ఇషాన్‌లు సైలెంట్ అయిపోయారు. కానీ ఇక్కడే అసలు కథ ప్రారంభమయింది. ఏమైందో తెలియదు కానీ నితిన్ మీనన్ తొలిసారి అంపైర్ రివ్యూను ఉపయోగించాడు. అసలు అది వైడ్ బాల్ అవునా కాదా అనే డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో అది క్లియర్ వైడ్ అని తెలిసింది. అంపైర్‌గా ఇన్నేళ్ల అనుభవం ఉండి కూడా నితిన్ మీనన్ రివ్యూ వెళ్లడం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆసక్తి కలిగించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉంటేనే ఈ రివ్యూను అంపైర్ ఉపయోగిస్తారు. ఐపీఎల్లో ఇంతవరకు ఈ రివ్యూ ఏ అంపైర్ వాడుకోలేదు. ఒక రకంగా ఐపీఎల్ చరిత్రలో ఒక అంపైర్ డీఆర్ఎస్ కోరడం ఇదే తొలిసారి. అయితే ఒక వైడ్ బాల్ విషయంలో అయోమయానికి గురవ్వడం ఏంటో.. దీనికోసం థర్డ్ అంపైర్ వరకు వెళ్లడమేంటో అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే రివ్యూ కోరుకోవాల్సింది ఆటగాళ్లని.. అంపైర్లు కాదని కొందరు విమర్శించారు. What's just Nitin Menon has done by taking caught behind decision upstairs on his own... What we can call this..#IPL2O23 #SRHvsMI @cricbuzz pic.twitter.com/4E8tzVXAzg — Amit K Jha (@Amit_sonu_) April 18, 2023 Why the hell did Nitin Menon take the review? Strange. #MIvsSRH — Mihir Gadwalkar (@mihir_gadwalkar) April 18, 2023 Umpire taking review for caught behind🤔 Whats happening??#MIvsSRH — Manish Nonha (@ManishNonha) April 18, 2023 చదవండి: పిచ్చి ప్రవర్తన.. హీరో కాస్త విలన్ అయిపోతున్నాడు! 'ఎగతాళి చేసినోళ్లే మెచ్చుకుంటున్నారు' -
'గుడ్డిగా నమ్మడమేనా.. సొంత నిర్ణయం లేదా!'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పట్టు బిగించింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ చేధనలో తడబడుతోంది. 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే రివ్యూ విషయంలో ఇషాన్ కిషన్‌ను గుడ్డిగా నమ్మి చేతులు కాల్చుకున్నాడు రోహిత్ శర్మ. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్లో గ్రీన్ వేసిన మూడో బంతి లెగ్‌సైడ్ వెళ్లింది. క్లియర్‌గా వైడ్ అని తెలుస్తున్నప్పటికి ఇషాన్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ వైడ్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఇషాన్ మాత్రం తనకు సౌండ్ వినిపించిందని.. కచ్చితంగా ఔట్ అంటూ బలంగా పేర్కొన్నాడు. అయితే రోహిత్‌కు వైడ్ అని తెలుస్తున్నప్పటికి ఇషాన్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్ఝ్లో బంతి ఎక్కడ బ్యాట్‌కు తగలకపోగా.. దూరంగా వెళుతున్నట్లు క్లియర్‌గా కనిపించింది. దీంతో ముంబై రివ్యూ కోల్పోయింది. అంతే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను అభిమానులు ట్రోల్ చేశారు. ''ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీకంటూ సొంత నిర్ణయం లేదా''.. ''అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎన్నోసార్లు ఇతరుల మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నావు.. ఇప్పుడు ఐపీఎల్లో కూడా అదే పరిస్థితి''.. ''క్లియర్ వైడ్ అని నీకు తెలిసినప్పటికి అనవసరంగా రివ్యూకు వెళ్లావు.. కెప్టెన్‌గా ఇదేనా నీ అనుభవం'' అంటూ కామెంట్లు చేశారు. #ishankishan wasting DRS since childhood 😂😂😂 3/3 wrong referrals#MIvsSRH #IPL2023 pic.twitter.com/GPjLBPvPI4 — Rahul Batra (@rulebreaker_rb) April 18, 2023 -
సాహాను గుడ్డిగా నమ్మిన పాండ్యా.. ఫలితం!
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్, పంజాబ్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రివ్యూ విషయంలో క్లారిటీ లేని కెప్టెన్ పాండ్యా కీపర్ సాహాను గుడ్డిగా నమ్మాడు. మరి ఫలితం ఏంటో తెలియాలంటే వార్త చదివాల్సిందే. విషయంలోకి వెళితే.. పంజాబ్ ఇన్నింగ్స్ 13వ ఓవ్ మోహిత్ శర్మ వేశాడు. ఔట్‌సైడ్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే ప్రయత్నంలో జితేశ్ శర్మ బంతిని మిస్ చేశాడు. దీంతో బంతి కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. బంతిని అందుకున్న సాహా ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. అయితే బౌలర్ మోహిత్ సహా కెప్టెన్ పాండ్యాలు తమకు బ్యాట్‌కు బంతి టచ్ అయినట్లుగా ఎలాంటి శబ్దం రాలేదని చెప్పారు. Photo: Jio Cinema Twitter కానీ సాహా మాత్రం..'' లేదు నాకు సౌండ్ వచ్చింది.. బంతి బ్యాట్‌కు తాకింది'' అని బలంగా చెప్పాడు. అప్పటికే డీఆర్ఎస్ సమయం ముగిసిపోవడానికి ఒక్క సెకండ్ మాత్రమే మిగిలింది. అలా చివరి సెకన్లో సాహాను నమ్మిన పాండ్యా రివ్యూ కోరాడు. ఇక రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకినట్లు అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ రావడంతో జితేశ్ శర్మ ఔటైనట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో పాండ్యా నవ్వుతూ సాహా దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని అభినందించాడు. కెప్టెన్, బౌలర్ ఔట్ విషయంలో నమ్మకంతో లేనప్పుడు సాహా మాత్రం తన మాటకే కట్టుబడి రివ్యూ కోరి ఫలితం సాధించడం అందరిని ఆకట్టుకుంది. A brilliant review for Wriddhiman Saha. Jitesh Sharma departs for just 25 runs.#IPL2023 #PBKSvGT #WriddhimanSaha pic.twitter.com/Y3EtuuK67n — CricTelegraph (@CricTelegraph) April 13, 2023 చదవండి: 'అద్బుతం జరిగేది ఒకసారే.. అంతిమంగా బలయ్యింది మేమే' -
కార్తిక్ తెలివికి కెప్టెన్ డుప్లెసిస్ ఫిదా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అనుభంలో మరోసారి మెరిశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ నితీశ్ రాణా ఔట్ విషయంలో దినేశ్ కార్తిక్ చూపించిన స్మార్ట్‌నెస్‌కు అభిమానులు ముగ్దులయ్యారు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మైకెల్ బ్రాస్‌వెల్ వేశాడు. ఓవర్ తొలి బంతిని నితీశ్ రానా రివర్స్‌స్వీప్‌కు యత్నించాడు. అయితే బంతి గ్లోవ్స్‌కు తాకి కీపర్ కార్తిక్ చేతుల్లో పడింది. అయితే బ్రాస్‌వెల్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. ఇక్కడే కార్తిక్ తన తెలివిని ఉపయోగించాడు. ఎల్బీకి కాకుండా క్యాచ్ అప్పీల్ కోసం రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో బంతి గ్లోవ్స్‌ను తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ నితీశ్ రానా ఔటైనట్లు ప్రకటించాడు. రివ్యూ విషయంలో కార్తిక్ స్మార్ట్‌గా వ్యవహరించడంతో సహచరుల చేత అభినందనలు అందుకున్నాడు. అటు అభిమానులు కూడా ''కీపింగ్‌లో అనుభవం.. ఆ మాత్రం ఉంటుందిలే.. నీ కాన్ఫిడెంట్‌కు ఫిదా కార్తిక్'' అంటూ కామెంట్ చేశారు. -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ.. పరువు పోగట్టుకున్న రోహిత్! వీడియో వైరల్
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకు ఆస్ట్రేలియా గట్టి సవాలు విసురుతుంది. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా(180), గ్రీన్(114) అద్భుత సెంచరీలతో అదరగొట్టారు. కాగా 255/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ వికెట్లను పడగొట్టడానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఖవాజా, గ్రీన్ల మధ్య ఏర్పడిన 208 పరుగుల భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు అశ్విన్ బ్రేక్ చేశాడు. అద్భుత శతకంతో చెలరేగిన గ్రీన్‌ను ఔట్ చేసిన అశ్విన్ టీమిండియాను ఊపిరి పీల్చుకోనేలా చేశాడు. అనంతరం అదే ఓవర్లో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ క్యారీని డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. అదే విధంగా డబుల్సెంచరీకి దగ్గరగా వెళ్తున్న ఉస్మాన్ ఖవాజాను మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఆస్ట్రేలియా టాయిలాండర్లు నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ కలిసి 9వ వికెట్‌కి 70 పరుగులు జోడించి భారత బౌలర్లను విసిగించారు. ఆఖరిలో అశ్విన్ మరో రెండు వికెట్లు సాధించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 6 వికెట్లతో రాణించాడు. టీమిండియా చెత్త రివ్యూ.. ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా ఓ చెత్త రివ్యూ తీసుకుని నవ్వుల పాలు అయింది. ఆసీస్ ఇన్నింగ్స్ 128వ వేసిన జడేజా బౌలింగ్‌లో ఆఖరి బంతిని ఉస్మాన్ ఖవాజా ఆఫ్‌సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ప్యాడ్‌కు తాకింది. దీంతో ఖవాజాను ఎలాగైనా ఔట్ చేయాలన్న పట్టుదలతో కనిపించిన జడ్డూ ఎల్బీగా అప్పీల్ చేశాడు. వెంటనే ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో నాటౌట్ అంటూ తల ఊపాడు. అయితే బంతి ఆఫ్ స్టంప్ కు చాలా బయట ఖవాజా ప్యాడ్‌కు తాకినట్లు కన్పించింది. అయినప్పటకీ జడేజా మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మపై ఒత్తడి తెచ్చి డీఆర్ఎస్ తీసుకునేలా చేశాడు. అయితే రీప్లే చూశాక రోహిత్, జడ్డూకు దిమ్మతిరిగింది. రీప్లేల్లో చూస్తే బంతి ఆఫ్ స్టంప్ కు చాలా దూరంగా వెళ్తున్నట్లు తేలింది. దీంతో అంపైర్‌తో సహా భారత ఆటగాళ్లు అంతా ఒక్క సారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ రివ్యూపై కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వ్యంగ్యంగా స్పందించాడు. థర్డ్ అంపైర్ మేల్కొనే ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఈ రివ్యూ భారత జట్టు తీసుకున్నట్లుందని కార్తీక్ చురలకు అంటించాడు. ఇక అభిమానులు అయితే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. pic.twitter.com/eMxKD9khgT — Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 10, 2023 -
క్రికెట్లో కొత్త పంథా.. ఐపీఎల్ 2023 నుంచే మొదలు
ఐపీఎల్ జట్లకు గుడ్‌న్యూస్. తాజాగా మొదలుకానున్న ఐపీఎల్ 16వ సీజన్ నుంచి డీఆర్ఎస్ను మరింత విస్తరించనున్నారు. ఔట్, నాటౌట్‌కే కాకుండా ఇకపై నోబాల్, వైడ్ బాల్‌కు ఆటగాళ్లు సమీక్ష కోరేలా రూల్స్ మార్చారు. అయితే ఈ నిబంధనను ఇప్పటికే వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ఉపయోగిస్తున్నారు. శనివారం ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వైడ్ బాల్ విషయంలో డీఆర్ఎస్ కోరింది. ఈ ఫలితం హర్మన్‌కు అనుకూలంగా వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరులోనూ ఈ రూల్‌ను వాడారు. మేఘన్ షూట్ ఫుల్‌టాస్‌గా వేసిన డెలివరీని అంపైర్ నోబాల్‌గా ప్రకటించలేదు. దాంతో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ సమీక్ష కోరింది. అయితే సఫలం కాలేదు. యూపీ వారియర్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచులోనూ ఇలాంటి సమీక్షే కోరారు. ఒక్కోసారి అంపైర్ తీసుకొనే ఒక తప్పుడు నిర్ణయంతో మ్యాచ్ గమనమే మారిపోతుంది. కొన్నిసార్లు గెలవాల్సిన మ్యాచ్‌లు ఓడిపోవాల్సి వస్తోంది. గతంలో ఇన్నింగ్స్ ఆఖరి బంతులు నోబాల్ అయినా అంపైర్లు ఇవ్వకపోవడంతో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆటగాళ్లు ఔటై పెవిలియన్‌కు చేరారు ఇకపై ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు, ఆటగాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో నోబాల్, వైడ్ బాల్ కోసం సమీక్ష కోరేలా నిబంధనలు సవరించింది. ''మైదానంలోని అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని క్రికెటర్లు కోరొచ్చు. బ్యాటర్ ఔటయ్యారో లేదో తెలుసుకోవచ్చు. వైడ్ బాల్, నోబాల్ విషయంలోనూ ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై సమీక్ష అడగొచ్చు'' అని డబ్ల్యూపీఎల్ నిబంధనల్లో పేర్కొన్నారు. రానున్న ఐపీఎల్ 2023 సీజన్లోనూ ఈ రూల్ వర్తించనుంది. చదవండి: పిచ్‌తో మైండ్‌గేమ్.. కలవరపడుతున్న 'కంగారూలు' -
పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ
బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ల మధ్య శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 48వ ఓవర్ తస్కిన్ అహ్మద్ వేశాడు. ఆ ఓవర్లో తస్కిన్ వేసిన యార్కర్ బంతిని ఆదిల్ రషీద్ సమర్థంగా అడ్డుకున్నాడు. బంతి రషీద్ ప్యాడ్‌కు దూరంగా బ్యాట్ అంచున తాకింది. అయితే బంగ్లా బౌలర్ తస్కిన్ అహ్మద్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ వెంటనే డీఆర్ఎస్ కోరాడు. రిప్లేలో బంతి ఎక్కడా ప్యాడ్‌కు తగిలినట్లు కనిపించలేదు కదా బంతి ప్యాడ్లకు చాలా దూరంగా ఉన్నట్లు చూపించింది. దీంతో అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. వాస్తవానికి బంతి ప్యాడ్లను తాకలేదని క్లియర్‌గా కనిపిస్తుంది. మ్యాచ్ చూసే చిన్న పిల్లాడిని అడిగినా నాటౌట్ అని చెప్పేస్తాడు. బంతి ఎక్కడ పడిందన్న కనీస పరిజ్ఞానం లేకుండా తమీమ్ ఇక్బాల్ డీఆర్ఎస్ కోరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోవడం మాత్రం ఖాయం. ఒక రకంగా ఔట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రివ్యూకు వెళ్లి బంగ్లా పరువు తీసుకుంది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయింది. బంగ్లా క్రికెట్ జట్టుపై అభిమానులు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూకు కాల్ ఇచ్చిన బంగ్లా జట్టుకు ఏ ప్రైజ్ ఇవ్వాలో కాస్త చెప్పండి''.. ''ఏ కోశానా అది ఔట్ చెప్పండి.. బంగ్లా కెప్టెన్‌కు కళ్లు మూసుకుపోయినట్లున్నాయి''.. ''క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లండ్ 132 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. జేసన్ రాయ్ (132 పరుగులు) సెంచరీతో కదం తొక్కడంతో పాటు బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరన్ మెరవడంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 194 పరుగులకే కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తమీమ్ ఇక్బాల్ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్‌లు చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఈ విజయంతో ఇంగ్లండ్ మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డేమ్యాచ్ సోమవారం(మార్చి 6న) చట్టోగ్రామ్ వేదికగా జరగనుంది. What prize do Bangladesh get for making the worst LBW review call in the history of cricket? pic.twitter.com/SfJWRdCpXc — Jon Reeve (@jon_reeve) March 3, 2023 Worst DRS review for LBW ever by Bangladesh! #ecb #BANvsENG pic.twitter.com/kBdX5bvPBs — Ralph Rimmer (@razorr69) March 3, 2023 Bangladesh went for a review! 😭 pic.twitter.com/bF8sHDTQ8e — Faiz Fazel (@theFaizFazel) March 3, 2023 చదవండి: జేసన్ రాయ్ విధ్వంసం; సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం' -
పిచ్చ కొట్టుడు కొట్టారు.. డీఆర్ఎస్ కూడా లేకపాయే!
పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు 17 ఏళ్ల తర్వాత వచ్చిన ఇంగ్లండ్ తొలి టెస్టులోనే అదరగొట్టే ప్రదర్శన ఇస్తుంది. మ్యాచ్ తొలి రోజునే ఇంగ్లండ్ బ్యాటర్లు పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వన్డే తరహాలో రెచ్చిపోయిన ఇంగ్లండ్ జట్టు తొలిరోజు ఆట ముగిసేసమయానికి 75 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 506 పరుగుల భారీస్కోరు చేసింది. ఇక తొలి టెస్టుకు డీఆర్ఎస్ లేకపోవడంతో పాకిస్తాన్‌కు చుక్కలు కనబడుతున్నాయి. ఎల్బీల విషయంలో డీఆర్ఎస్ లేకపోవడంతో పాక్ జట్టు తెగ ఇబ్బంది పడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను నసీమ్ షా వేశాడు. ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత మూడో ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన నసీమ్ షా ఒక మంచి డెలివరీ వేశాడు. బంతి జాక్ క్రాలీ ప్యాడ్లకు తాకింది. అయితే థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేస్తే ఔటయ్యే అవకాశాలున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం డీఆర్ఎస్కు వెళ్లలేకపోయింది. ఏవో సాంకేతిక సమస్యల కారణంగా ఈ మ్యాచ్‌కు డీఆర్ఎస్ అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ డీఆర్ఎస్ కోరుకునే అవకాశం లేకుండా పోయింది. ఇది చూసిన అభిమానులు పీసీబీని ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ తన ఇన్నింగ్స్‌ను ఓవర్‌కు ఆరుకు పైగా రన్‌రేట్‌తో కొనసాగించడం విశేషం. ఇంగ్లండ్ బ్యాటర్లలో నలుగురు బ్యాటర్లు శతకాలతో రెచ్చిపోయారు. తొలుత ఓపెనర్లు జాక్ క్రాలీ(122 పరుగులు), బెన్ డకెట్(107 పరుగులు) చేయగా.. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన ఓలీ పోప్ 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ప్రస్తుతం హ్యారీ బ్రూక్(81 బంతుల్లోనే 101 నాటౌట్) సూపర్ ఫాస్ట్‌తో బ్యాటింగ్ కొనసాగిస్తుండగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ బౌలర్లంతా దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జునైన్ మహమూద్ 23 ఓవర్లు వేసి ఏకంగా 160 పరుగులు ఇచ్చుకోవడం విశేషం. నసీమ్ షా కూడా 15 ఓవర్లలో 96 పరుగులిచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. First ball of a historic series! ☄️#PAKvENG | #UKSePK pic.twitter.com/n442yzcVTE — Pakistan Cricket (@TheRealPCB) December 1, 2022 No DRS available due to a glitch in Pakistan Vs England Test match. #engvspak #PAKvsEng — Dhruv Barot (@dhruv_441) December 1, 2022 No DRS😂🤣🤣🤣, someone please raise funds for Pakistan Cricket... So they can afford these technology in historic series😜 — Anshul (@Anshulkhandal03) December 1, 2022 చదవండి: టెస్ట్ మ్యాచా లేక టీ20నా.. ఇంగ్లండ్ బ్యాటర్ల మహోగ్రరూపం, ఒకే రోజు నలుగురు సెంచరీలు -
థర్డ్ అంపైర్ నిర్ణయం.. బంగ్లా కెప్టెన్‌కు శాపం
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో ఒకపక్క వరుణుడు ఇబ్బంది పడుతుంటే.. మరోపక్క అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో బ్యాటర్లు బలవుతున్నారు. తాజాగా ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో నాలుగో బంతికి షకీబ్ ఎల్బీగా వెనుదిరిగాడు. స్పిన్నర్ షాదాబ్ వేసిన ఈ ఓవర్లో మొదట సౌమ్యా సర్కార్ ఔట్ అవగా తర్వాతి బంతికే షకీబ్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో పాక్ ఆటగాళ్లు అప్పీ్ల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా షకీబ్ రివ్యూకు వెళ్లాడు. అయితే రివ్యూలో బంతికి ముందుగా బ్యాట్ ను తగిలినట్టు అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టంగా స్పైక్ కనిపించింది. ఆ తర్వాతే బంతి షకీబ్ ప్యాడ్లను తాకింది. కానీ, ఇన్ సైడ్ ఎడ్జ్ క్లియర్ గా ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. బ్యాట్ నేలను తాకడం వల్లే అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ వచ్చినట్టు పేర్కొన్నాడు. కానీ, స్పైక్ వచ్చిన సమయంలో బ్యాట్ కు, నేలకు మధ్య ఖాళీ టీవీ రీప్లేల్లో కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఎల్బీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లా కెప్టెన్ షకీబ్ షాకయ్యాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్లతో మాట్లాడాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి ఏం చేయలేక నిరాశతో మైదానం వీడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. దీంతో బంగ్లాదేశ్ పెద్దగా స్కోరు చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో పాకిస్తా్న్ అనూహ్యంగా సెమీస్‌లో అడుగుపెట్టగా.. బంగ్లాదేశ్ ఓటమితో ఇంటిబాట పట్టింది. Shakib’s bat didn’t touch the ground at all. Just focus on bat’s shadow. There was a spike. It couldn’t have been anything else except the ball hitting the bat. Bangladesh at the receiving end of a poor umpiring decision. #PakvBan #T20WorldCup — Aakash Chopra (@cricketaakash) November 6, 2022 Big moment in the match. Looked like Shakib Al Hasan edged it. The umpiring in this tournament hasn't been great#T20WorldCup #PAKvBAN pic.twitter.com/4zoJcVVPkm — Saj Sadiq (@SajSadiqCricket) November 6, 2022 చదవండి: ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.. కానీ నేనైతే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
తెలివిగా వ్యవహరించిన కార్తిక్.. లాస్ట్ మ్యాచ్ హీరో జీరో అయ్యాడు
టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన రొసౌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అతను ఔట్ కావడంలో దినేశ్ కార్తిక్‌ది కీలకపాత్ర అని చెప్పొచ్చు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ రెండో ఓవర్ అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. ఓవర్లో మూడో బంతి ఇన్‌స్వింగ్ అయి రొసౌ ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. దీంతో టీమిండియా అప్పీల్‌కు వెళ్లగా అంపైర్ ఔటివ్వలేదు. అయితే బౌలర్ అర్ష్‌దీప్ ఎల్బీ విషయంలో అంత కాన్ఫిడెంట్‌గా లేకపోవడంతో రోహిత్ కూడా రివ్వూకు మొగ్గుచూపలేదు. కానీ కార్తిక్ మాత్రం మిడిల్ స్టంప్‌ను తాకుతుందని కచ్చితంగా పేర్కొన్నాడు. కార్తిక్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లిన రోహిత్ ఫలితం సాధించాడు. రిప్లేలో బంతి ఇన్‌స్వింగ్ అయి మిడిల్ స్టంప్‌ను ఎగురగొడుతున్నట్లు కనిపించింది. రొసౌ ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. దీంతో కార్తిక్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ సహా మిగతా ఆటగాళ్లంతా అభినందనల్లో ముంచెత్తారు. ఫలితంగా లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో హీరోగా నిలిచిన రొసౌ ఈ మ్యాచ్‌లో జీరోగా నిలిచాడు. Courtesy: CAPTAIN ROHIT SHARMA pic.twitter.com/RWYW6lnJuy — ✨ᕼ𝒾𝕋мάn 𝐌𝐁 ✨ (@satti45_) October 30, 2022 చదవండి: తీరు మారని కేఎల్ రాహుల్.. పక్కనబెట్టాల్సిందే! -
రివ్యూ విషయంలో పంత్ తడబాటు.. రోహిత్ ఆగ్రహం
సౌతాఫ్రికాతో తొలి టి20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం లభించింది. ఆరంభంలోనే దీపక్ చహర్, అర్ష్‌దీప్ సింగ్‌లు బౌలింగ్‌లో చెలరేగడంతో సౌతాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. 47 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక విషయానికి వస్తే టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. రివ్యూ విషయంలో పంత్ తడబాటుకు గురవ్వడం రోహిత్‌కు కోపం తెప్పించింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో మార్ర్కమ్ 8వ ఓవర్ చివరి బంతిని ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ప్యాడ్లను తాకింది. దీంతో హర్షల్ పటేల్ అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటివ్వలేదు. దీంతో రోహిత్ శర్మ హర్షల్ పటేల్‌తో మాట్లాడి పంత్‌ను అడిగాడు. ఎల్బీ విషయంలో కీపర్‌కు ఉన్న స్పష్టత ఎవరికి ఉండదని అందరికి తెలిసిందే. అయితే పంత్ మాత్రం అంత కాన్ఫిడెంట్‌గా లేకపోవడంతో రోహిత్.. ''అరె ఏంటిది?'' అన్నట్లు అసహనం వ్యక్తం చేశాడు. అయితే స్లిప్‌లో ఉన్న కోహ్లి మాత్రం రివ్యూకు వెళ్లు అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. ఇక రిప్లైలో బంతి క్లియర్‌గా మిడిల్ స్టంప్‌ను ఎగురగొడుతున్నట్లు చూపించడంతో మార్ర్కమ్ ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. కాగా బ్రేక్ సమయంలో రోహిత్.. పంత్‌ను బంతిపై కాస్త దృష్టిపెట్టు అన్నట్లుగా పేర్కొన్నాడు. ఇక కోహ్లి మాత్రం తన అంచనా నిజమైందని తెగ సంతోషపడిపోయాడు. చదవండి: టీమిండియా గబ్బర్ను గుర్తుచేసిన అర్ష్‌దీప్ సింగ్.. -
'ఇన్నేళ్ల నీ అనుభవం ఇదేనా స్మిత్.. సిగ్గుచేటు'
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంక రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో తాను చేసిన ఒక పొరపాటు అతని మెడకు చుట్టుకునేలా చేసింది. ఔట్ అని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి అనవరసంగా రివ్యూకు పోయి చేతులు కాల్చుకోవడమే కాదు క్రికెట్ ఫ్యాన్స్ విమర్శలను సైతం అందుకున్నాడు. విషయంలోకి వెళితే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు చూపించాలనుకున్నాడు. కానీ స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రభాత్ జయసూర్య వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఐదో బంతి నేరుగా స్మిత్ ప్యాడ్లను తాకింది. లంక జట్టు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటిచ్చాడు. బంతి కేవలం ప్యాడ్లను మాత్రమే తాకి లెగ్‌స్టంప్‌ను ఎగురగొడతున్నట్లు క్లియర్‌గా తెలిసిపోయింది. దీనికి తోడూ బ్యాట్‌కు బంతి తగల్లేదు. అయినా కూడా స్మిత్ రివ్యూకు వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది. రిప్లేలో అతను క్లియర్ ఔట్ అని తేలింది. అంతే స్మిత్ రివ్యూపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ''క్లియర్ ఔట్ అని తెలిసినప్పటికి రివ్యూ కోరి చేతులు కాల్చుకున్నాడు.. క్రికెట్ చరిత్రలో స్మిత్ తీసుకున్న రివ్యూ అత్యంత చెత్త నిర్ణయం.. ఇన్నేళ్ల అనుభవం ఇదేనా స్మిత్.. సిగ్గుచేటు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలడంతో లంక ఇన్నింగ్స్ విజయాన్ని సాధించింది. అంతకముందు చండీమల్ డబుల్ సెంచరీతో మెరవడంతో లంక 554 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. Steve Smith should be banned from international cricket for two years after that review, — Jon “Semi-Fungible Airships” Kudelka (@jonkudelka) July 11, 2022 Whether it’s his outburst after his First Test run out or this, I remain of the view is that Steve Smith should do a Joe Root and not have any leadership responsibilities - he’s so self-obsessed about his batting as to be a great batter but also a poor leader. #SLvAUS https://t.co/Ex62fgXmt1 — Kevin Yam 任建峰 (@kevinkfyam) July 11, 2022 చదవండి: David Warner:'ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రేమను పంచారు.. థాంక్యూ' -
విలన్‌గా మారిన పంత్.. ఆ రివ్యూ తీసుకొని ఉంటే
ఐపీఎల్ 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కథ లీగ్ దశలోనే ముగిసింది. కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుందని అంతా అనుకున్న వేళ ముంబై ఇండియన్స్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరోక్షంగా ప్రధాన కారణమయ్యాడు. గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్లే చాన్స్ ఉండడంతో పంత్‌పై తీవ్ర ఒత్తిడి ఉండడం సహజం. దానిని తట్టుకొని నిలబెడితేనే ఫలితం వస్తుంది. అప్పటికే ఒత్తిడిలో సింపుల్ క్యాచ్ మిస్ చేసిన అతను రివ్యూ తీసుకోవడంలోనూ విఫలమయ్యాడు. ఇదే మ్యాచ్‌కు ఒక రకంగా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఔట్ విషయంలో పంత రివ్యూ తీసుకోకపోవడం.. ఫలితంగా గోల్డెన్ డక్ అవ్వాల్సిన బ్యాట్స్‌మన్ ఆ తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చకచకా జరిగిపోయాయి. విషయంలోకి వెళితే.. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ శార్దూల్ ఠాకూర్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతికి శార్దూల్.. అప్పటికే కుదురుకున్న డెవాల్డ్ బ్రెవిస్‌ను(25 పరుగులు) ఔట్ చేశాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ క్రీజులోకి వచ్చాడు. శార్దూల్ గుడ్ లెంగ్త్‌తో ఆఫ్‌స్టంప్ అవతల బంతిని విసిరాడు. టిమ్ డేవిడ్ బంతిని కవర్స్ దిశగా పుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ పక్కనుంచి వెళ్లి కీపర్ పంత్ చేతుల్లో పడింది. బ్యాట్‌కు తాకినట్లు శబ్ధం రావడంతో పంత్ ఔట్‌కు అప్పీల్ చేశాడు. కానీ ఫీల్డ్ అంపైర్ తగల్లేదంటూ నాటౌట్ ఇచ్చాడు. అయితే పంత్ తీరు చూసి కచ్చితంగా రివ్యూ తీసుకుంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పంత్ రివ్యూకు వెళ్లలేదు. శార్దూల్‌తో సుధీర్ఘ చర్చ అనంతరం డీఆర్ఎస్ కోరకుండానే వెనక్కి వచ్చేశాడు. డీఆర్ఎస్కు వెళ్లకుండా పంత్ ఎంత పెద్ద తప్పు చేశాడో మరుక్షణంలోనే తెలిసిపోయింది. ఒక బంతి పూర్తైన తర్వాత రిప్లేలో బ్యాట్‌కు బంతి తాకినట్లుగా అల్ట్రాఎడ్జ్‌లో స్పైక్ కనిపించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా గోల్డెన్ డక్ నుంచి బతికిపోయిన టిమ్ డేవిడ్ ఆ తర్వాత 11 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో విధ్వంసం సృష్టించి 34 పరుగులు చేశాడు. ఒక రకంగా మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ చేతిలోకి రావడంలో టిమ్ డేవిడ్‌ది కీలకపాత్ర,. ఆ తర్వాత అతను ఔటైనా రమన్‌దీప్ సింగ్ ముంబైని గెలిపించి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ ఆశలను చిదిమేశాడు. అయితే పంత్ ఆ రివ్యూ తీసుకొని ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది. టిమ్ డేవిడ్ గోల్డెన్ డక్ అయి ఉంటే ముంబై కచ్చితంగా ఓడిపోయేది.. ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ రిషబ్ పంత్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. పనికిమాలిన విషయాల్లో తలదూర్చే పంత్.. అసలు విషయంలో మాత్రం చతికిలపడ్డాడు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్‌కు దూరమవ్వడానికి ప్రధాన కారణం రిషబ్ పంత్.. కెప్టెన్‌గా పంత్ పనికిరాడు.. రివ్యూ తీసుకొని ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ కథ మరోలా ఉండేది అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: పాత గాయాన్ని గుర్తుపెట్టుకొని చావుదెబ్బ తీసింది.. -
మరోసారి చెత్త అంపైరింగ్.. కోపంతో రగిలిపోయిన మాథ్యూ వేడ్
ఐపీఎల్ 2022 సీజన్లో అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. బ్యాట్స్‌మన్ రివ్యూలు తీసుకున్నప్పటికి డీఆర్ఎస్లు సరిగా పనిచేయక ఇబ్బంది కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. 16 పరుగులు చేసిన మాథ్యూ వేడ్ థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలయ్యాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ మ్యాక్స్‌వెల్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నంలో బంతి బ్యాట్‌కు తాకి ప్యాడ్లను తాకింది. దీంతో ఆర్సీబీ అప్పీల్ వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే వేడ్ వెంటనే రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తగిలినట్లు కనిపించినా అల్ట్రాఎడ్జ్‌లో ఎక్కడా స్పైక్ కనిపించలేదు. ఆ తర్వాత బంతి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు చూపించింది. థర్డ్ అంపైర్ మాత్రం ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఔట్ ఇచ్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న వేడ్..ఇదేం నిర్ణయం అంటూ భారంగా పెవిలియన్ చేరాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న వేడ్.. చీటింగ్ అంటూ థర్డ్ అంపైర్‌పై కోపంతో రగిలిపోయాడు. హెల్మెట్‌ను నేలకేసి కొట్టిన వేడ్.. ఆ తర్వాత బ్యాట్‌ను కూడా కోపంతో విసిరేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయం విమర్శలకు దారి తీసింది. బంతి బ్యాట్‌కు తగలడానికి ముందే స్పైక్ కనిపించడం.. ఆ తర్వాత బ్యాట్‌ను బంతి దాటి వెళ్లిన తర్వాత స్పైక్ కనిపించలేదు. అయితే థర్డ్ అంపైర్ మాత్రం రోహిత్ ఔట్ అంటూ ప్రకటించాడు. అంతకముందు కోహ్లి ఔట్ విషయంలోనూ థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీసింది. చదవండి: Asif Ali: రెండేళ్ల క్రితం దూరమైంది.. పాక్ క్రికెటర్ ఇంట్లో వెల్లివిరిసిన సంతోషం Matthew Wade reaction in dressing room!#RCBvGT #mathewwade#Wade pic.twitter.com/iKPxIe2vW2 — Kavya Sharma (@Kavy2507) May 19, 2022 -
రివ్యూకు సిగ్నల్ చేయడం మర్చిపోయాడు.. పాపం రింకూ సింగ్..!
ఐపీఎల్-2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్ 12 ఓవర్లో టి నటరాజన్.. రింకూ సింగ్‌కు అద్భుతమైన యార్కర్ వేశాడు. రింకూ ఢిపెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ ప్యాడ్‌కు తాకింది. అయితే వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. ఈ క్రమంలో అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. అయితే నాన్ స్ట్రెక్‌లో ఉన్న బిల్లింగ్స్, రింకూ చర్చించుకున్న తర్వాత రివ్యూ తీసుకున్నారు. అయితే రివ్యూను ఫీల్డ్ అంపైర్లు తిరష్కరించారు. ఎందుకంటే రివ్యూ సిగ్నల్‌ను రింకూ కాకుండా బిల్లింగ్స్ ఇవ్వడమే దీనికి కారణం. డీఆర్ఎస్ రూల్స్ ప్రకారం.. బ్యాటర్ స్వయంగా రివ్యూకు సిగ్నల్ ఇవ్వాలి. అయితే బిల్లింగ్స్ సిగ్నల్ ఇవ్వడంతో అంపైర్లు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఫీల్డ్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/aVzezTudyo — Varma Fan (@VarmaFan1) May 14, 2022 -
స్టేడియంలో పవర్ కట్.. నో రివ్యూ.. పాపం కాన్వే..!
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. సీఎస్కే ఇన్నింగ్స్ తొలి ఓవర్లో డానియల్ సామ్స్ వేసిన రెండో బంతి.. స్ట్రైక్‌లో ఉన్న డెవాన్ కాన్వే ప్యాడ్‌ను తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకు అప్పీలు చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. అయితే ఆశ్చర్యకరంగా వాంఖడే స్టేడియంలో పవర్ కట్ కారణంగా.. కాన్వేకు రివ్యూ తీసుకునే అవకాశం దక్కలేదు. కాన్వే తన భాగస్వామి రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి అంపైర్లతో మాట్లాడాడు. కానీ అంపైర్లు మాత్రం ఔట్‌గానే నిర్ధారించారు. దీంతో డకౌట్‌గా కాన్వే వెనుదిరిగాడు. అయితే బంతి క్లియర్‌గా లెగ్ స్టంప్‌ను మిస్ అవుతున్నట్లు అన్పించింది. ఇక సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా స్టేడియంలో పవర్ కట్కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. చదవండి: Brendon McCullum: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్.. pic.twitter.com/f5Q751kph4 — Cred Bounty (@credbounty) May 12, 2022 -
థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం.. రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం
ఐపీఎల్ 2022 సీజన్లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం మరోసారి ఒక బ్యాట్స్‌మన్ కొంపముంచింది. ఇప్పటికే ఈ సీజన్లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాలకు ఆటగాళ్లు బలయ్యారు. కోహ్లి ఎల్బీ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా రోహిత్ శర్మ ఔట్ విషయం మరోసారి వివాదానికి తెరలేపింది. సోమవారం ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. టిమ్ సౌతీ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని రోహిత్ శర్మ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్తూ అతడి తొడ భాగాన్ని తాకి కీపర్ కు సమీపంగా వెళ్లింది. కేకేఆర్ కీపర్ షెల్డన్ జాక్సన్ తన కుడివైపుకు అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ ను పూర్తి చేశాడు. కేకేఆర్ ఆటగాళ్లు అవుటంటూ సంబరాలు చేసుకోగా.. అంపైర్ క్రిస్ గఫానీ అవుట్ ఇవ్వలేదు. దాంతో శ్రేయస్ అయ్యర్ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బంతి రోహిత్ బ్యాట్ కు చాలా దగ్గరగా వెళ్లింది. అల్ట్రా ఎడ్జ్ లో చూసినప్పుడు బంతి బ్యాట్ కు దూరంగా ఉన్నా కూడా స్పైక్ కనిపించింది. ఇక బ్యాట్ కు సమీపంగా వచ్చినప్పుడు ఆ స్పైక్ మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ అవుటంటూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. బంతి బ్యాట్ కు చాలా దూరంగా ఉన్న సమయంలో కూడా అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ కనిపించడం ఆసక్తి కలిగించింది. అయితే బంతి బ్యాట్ కు దగ్గరగా వచ్చినప్పుడు అల్ట్రా ఎడ్జ్ లో బిగ్ స్పైక్ కనిపించడంతో థర్డ్ అంపైర్ రోహిత్‌ను అవుట్ గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న రోహిత్ కాసేపు మైదానంలో అలాగే నిల్చుండిపోయాడు. ఇక సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు రెండుగా చీలిపోయారు. కొందరు థర్డ్ అంపైర్‌ను సమర్థిస్తే.. మరికొందరు రోహిత్‌కు మద్దతుగా నిలిచారు.'' ఈ సీజన్లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు అర్థం పర్థం లేకుండా ఉంటున్నాయి. అసలు ఆయన చెక్ చేసే టీవీని ఒకసారి పరిశీలించాలి. బ్యాట్ దూరంగా ఉన్నప్పుడు స్పైక్ రావడం చూస్తుంటే ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తుంది.'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: కోల్‌కథ ముగిసిపోలేదు...ఇంకా ఉంది! pic.twitter.com/NoWbosizkm — Diving Slip (@SlipDiving) May 9, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చెత్త నిర్ణయాలు వద్దు.. మా అంపైర్లను పంపిస్తాం; బీసీసీఐకి చురకలు
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఔటైన విధానం వివాదాస్పదంగా మారింది. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19 ఓవర్లో డెవాల్డ్ బ్రెవిస్ వేసిన తొలి బంతిని ఢిపెన్స్ ఆడటానికి విరాట్ కోహ్లి ప్రయ్నతించాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి కోహ్లి ప్యాడ్‌ను తాకింది. బ్రెవిస్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీ అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. తాను ఔట్ కాదంటూ కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్, ప్యాడ్ రెండింటినీ ఒకే సమయంలో తాకుతున్నట్లు కనిపించింది. కోహ్లితో పాటు అభిమానులు ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోక తప్పదని భావించారు. అయితే బంతి బ్యాట్‌కు ముందు తాకినట్లు సృష్టమైన ఆధారాలు కనిపించడం లేదంటూ థర్డ్ అంపైర్ కోహ్లి ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంతో కోహ్లి షాక్‌కు గురయ్యాడు. తాను ఔట్ కాదంటూ గట్టిగా అరుస్తూ కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ పెవిలియన్ చేరాడు. కాగా కోహ్లి ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీసీసీఐ కలగజేసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల ఆటగాళ్లు బలవుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయమై ఐస్లాండ్ క్రికెట్ అసొసియేషన్ ట్విటర్ వేదికగా బీసీసీఐకి చురకలు అంటించింది. ''మీ అంపైర్లకు సరైన నిర్ణయాలు తీసుకోవడం రావడం లేదు..మా దగ్గర మంచి ట్రెయిన్ అయిన అంపైర్లు ఉన్నారు.. కావాలంటే చెప్పండి పంపిస్తాం అంటూ పేర్కొంది. ఎల్బీ అప్పీల్లో బంతి మొదట బ్యాట్‌ను లేక ప్యాడ్‌ను తాకిందా అని చెప్పడం ఫీల్డ్ అంపైర్లకు కష్టసాధ్యం. కానీ టీవీ అంపైర్లు ఇది సులువుగా తెలుసుకోవచ్చు. అల్ట్రాఎడ్జ్‌లో స్లో మోషన్ రిప్లే టెక్నాలజీ ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. కానీ కోహ్లి ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ అలా చేయలేకపోయారు. బీసీసీఐ.. మా దగ్గర ఇలాంటి వాటిలో ఆరితేరిన అంపైర్లు ఉన్నారు.. మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నారు.. కావాలంటే చెప్పండి'' అంటూ పేర్కొంది. చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం చేశాడంటే..! It's not easy for on field umpires to detect inside edges or whether ball hit bat or pad first. But every TV umpire should be able to make the right call with the benefit of slow motion replays and technology like UltraEdge. @BCCI We have trained umpires ready to fly over. — Iceland Cricket (@icelandcricket) April 9, 2022 -
'ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది పంత్?!'
ఐపీఎల్ 2022లో లక్నోసూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విలువైన రివ్యూను అనవసరంగా వృథా చేసుకుంది. ఏ మ్యాచ్‌లో అయినా రివ్యూకు వెళ్లడానికి ముందు కీపర్‌ను అడుగుతుంటారు. ఎందుకంటే బ్యాట్స్‌మన్ ఔటా కాదా అనేది కీపర్‌కు స్పష్టంగా తెలుస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ పంత్ ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 11వ ఓవర్ లలిత్ యాదవ్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని లలిత్ యాదవ్ ఎవిన్ లుయీస్కు గుడ్‌లెంగ్త్‌తో వేశాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో లూయిస్ బంతిని మిస్ చేయగా.. అది లెగ్ స్టంప్ మీదుగా వెళ్లింది. అంతే పంత్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఔట్ అంటూ గట్టిగా అరిచారు. అయితే అంపైర్ మాత్రం నాటౌట్ అని చెప్పి లెగ్‌బై ఇచ్చాడు. పంత్ ఔటా కాదా చెప్పాల్సింది పోయి వార్నర్ సహా మిగతా ఆటగాళ్లను అడిగాడు. వాళ్లు బంతి క్లోజ్‌గా వెళ్లింది కాబట్టి ఔట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడంతో పంత్ ఏం ఆలోచించకుండా రివ్యూకు వెళ్లిపోయాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి లెగ్ స్టంప్ పక్కనుంచి దూరంగా వెళుతున్నట్లు క్లియర్‌గా కనిపించింది. అలా ఢిల్లీ క్యాపిటల్స్ తమకున్న రెండు రివ్యూలను వృథా చేసుకుంది. దీంతో అభిమానులు పంత్‌ను.. ''ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది'' అంటూ ట్రోల్ చేశారు. చదవండి: David Warner: ముందు అవకాశం లేకుండే.. తర్వాత ఆడతాడనుకుంటే! IPL 2022: షాబాజ్ అహ్మద్.. సివిల్ ఇంజనీర్ నుంచి క్రికెటర్ దాకా -
'నాకు అన్నీ తెలుసు.. అంపైర్‌తో పని లేదు'
ఐపీఎల్ 2022లో భాగంగా ఆర్సీబీ, రాజస్తాన్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని హర్షల్ పటేల్ అద్బుతంగా వేశాడు. స్లో యార్కర్‌గా వచ్చిన ఆ బంతి బట్లర్ ప్యాడ్లను తాకింది. ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగానే అంపైర్ ఔటిచ్చాడు. కానీ బట్లర్ క్రీజు నుంచి ఇంచు కూడా కదల్లేదు. ఎందుకంటే అది ఔట్ కాదని బట్లర్‌కు ముందే తెలుసు. వాస్తవానికి బంతి బట్లర్ ప్యాడ్లను తాకడానికి ముందే బ్యాట్‌ను తాకింది. కానీ అంపైర్ అది గమనించకుండానే ఔట్ ఇచ్చాడు. బట్లర్ రివ్యూకు వెళ్లగా.. అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకడానికి ముందు బ్యాట్‌ను తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ తన తప్పు తెలుసుకొని బట్లర్ నాటౌట్ అని ప్రకటించాడు. ఇది చూసిన అభిమానులు.. బట్లర్, అంపైర్ మధ్య మీమ్స్ క్రియేట్ చేశారు. నాకు అన్ని తెలుసు.. అంపైర్‌తో పని లేదు.. బట్లర్ కాన్ఫిడెంట్‌కు ఫిదా.. ఔట్ అని ప్రకటించినా క్రీజు నుంచి ఇంచు కూడా కదల్లేదు.. అంటూ కామెంట్స్ చేశారు. 37 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బట్లర్ ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో బట్లర్ వరుస సిక్సర్లు సంధించాడు. అలా 47 బంతుల్లోనే 6 సిక్సర్లతో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెట్‌మైర్, బట్లర్ కలిసి చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు పిండుకోవడంతో 18వ ఓవర్ వరకు 127/3గా ఉన్న స్కోరు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 169/3గా మారింది. చదవండి: IPL 2022 RR Vs RCB: కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ pic.twitter.com/hPUlxzVrTp — Sam (@sam1998011) April 5, 2022 -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది
ఐపీఎల్ 2022లో భాగంగా కేకేఆర్,ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే హర్షల్ పటేల్ 2 ఓవర్లు వేసి 2 మెయిడెన్లు సహా 2 వికెట్లు తీసి ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో క్రీజులో ఉన్న వరుణ్ చక్రవర్తికి హర్షల్ 16వ ఓవర్లో ఆఖరి బంతిని ఫుల్‌టాస్‌గా వేశాడు. ఆ బంతి బ్యాట్‌కు తగిలి వన్ స్టప్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అది క్లియర్‌గా ఔట్ కాదని తెలిసినప్పటికి.. బంతి వరుణ్ చక్రవర్తి బూట్లకు తగిలి బ్యాట్‌కు తగిలిందేమోనని హర్షల్ పటేల్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఇంతటితో ఊరుకుంటే అయిపోయేది.. కానీ హర్షల్ పటేల్ కెప్టెన్ డుప్లెసిస్వైపు చూడడం.. అతను రివ్యూ తీసుకోవడం జరిగిపోయింది. ఇక రిప్లేలో బంతి ఎక్కడా కనీసం బ్యాట్స్‌మన్ బూట్లకు తగిలినట్లుగా కూడా కనిపించలేదు. అంతేకాదు బంతి బ్యాట్ మిడిల్లో తగిలినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ''డుప్లెసిస్ తీసుకున్న రివ్యూ.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది.. బౌలర్ కంటే తెలియకపోవచ్చు.. కెప్టెన్‌గా అనుభవం ఉన్న నీకు ఆ రివ్యూ ఎలా తీసుకోవాలనిపించింది డుప్లీ..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. చదవండి: Ravi Shastri: ఉమ్రాన్ మాలిక్‌పై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసల వర్షం IPL 2022: కేకేఆర్‌కు ఆ జట్టు మాజీ ప్లేయర్ వార్నింగ్.. తేడా వస్తే -
ఐపీఎల్లో సరికొత్త రూల్స్.. ఇకపై!
మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ సంగ్రామానికి తెరలేవనుంది.. ఈ క్యాష్ రిచ్ లీగ్ వాంఖడే వేదికగా మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫిండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఇది ఇలా ఉంటే.. ఈ ఏడాది సీజన్ నుంచి ఐపీఎల్లో సరికొత్త నిబంధనలను బీసీసీఐ ప్రవేశపెట్టింది. కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటో ఓ లూక్కేద్దం. రూల్1: ఏదైనా జట్టులోని ఆటగాళ్లు కోవిడ్ బారిన పడి 12 మంది కంటే తక్కువ మంది ఆటగాళ్లు (వీటిలో కనీసం 7 మంది భారత ఆటగాళ్లు ఉండాలి) అందుబాటులో ఉంటే బీసీసీఐ ఆ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తుంది. ఇక వేళ రీషెడ్యూల్ చేయడం సాధ్యం కాకపోతే, ఐపీఎల్ టెక్నికల్ టీం దృష్టికి తీసుకెళతారు. టెక్నికల్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. రూల్2: గత సీజన్లకు భిన్నంగా ఐపీఎల్లో ప్రతి జట్టుకు రెండు రివ్యూలు తీసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ప్రతి జట్టుకు కేవలం ఒక్క రివ్యూ మాత్రమే కోరుకోనే అవకాశం ఉండేది. రూల్3: మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనను కూడా ఐపీఎల్లో కూడా అమలు చేయనున్నారు. బ్యాటర్ క్యాచ్ అవుట్ అయిన తర్వాత.. క్రీజులోకి వచ్చే బ్యాటర్ స్ట్రైక్ తీసుకుంటాడు. ఓవర్ ఆఖరి బంతికి ఔట్ అయితే ఈ నిబంధన వర్తించదు. రూల్4: ప్లేఆఫ్స్ లేదా ఫైనల్ మ్యాచ్‌లో ఏదైనా ఫలితం తేలకుండా టైగా మారితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్‌కు వీలుకాకుంటే లీగ్ స్టేజ్ లో పాయింట్ల ఆధారంగా విజేతగా ప్రకటిస్తారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో తెలుగోళ్లు... తొలి సారిగా అంపైర్! -
వద్దన్నా మాట వినలేదు.. బుమ్రా నీ కాన్ఫిడెన్స్ సూపర్
టీమిండియా, శ్రీలంక మధ్య తొలి టెస్టులో లంక ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లంక బ్యాట్స్‌మన్ అసలంక ఔట్ విషయంలో బుమ్రా చూపించిన కాన్ఫిడెన్స్‌కు అభిమానులు సలాం కొడుతున్నారు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 58వ ఓవర్ ఆఖరి బంతిని బుమ్రా ఆఫ్ కట్టర్ వేశాడు. 124 కిమీ వేగంతో వచ్చిన బంతి అసలంక ప్యాడ్లను తాకింది. బుమ్రా అంపైర్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. ఈ సమయంలో బుమ్రా మినహా ఏ టీమిండియా ఆటగాడు అప్పీల్ చేయకపోవడం విశేషం. అంపైర్ కూడా నాటౌట్ ఇచ్చాడు. దీంతో బుమ్రా రోహిత్‌ను చూస్తూ డీఆర్ఎస్ అంటూ పేర్కొన్నాడు. కానీ రోహిత్ మాత్రం రివ్యూ అవసరమా అన్నట్లుగా చూశాడు. పంత్, కోహ్లిలు కూడా రివ్యూ విషయంలో రోహిత్‌తో ఏం చెప్పలేదు. దీంతో బుమ్రా అది కచ్చితంగా ఔటేనని కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. టీమిండియా ఆటగాళ్లు ఎంత వారించినా బుమ్రా మాట వినకుండా రోహిత్‌ను రివ్యూకు వెళ్లాలంటూ కోరాడు. దీంతో తప్పని పరిస్థితిలో చివరి సెకన్లో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. ఇక అల్ట్రాఎడ్జ్‌లో పిచ్‌పై కరెక్ట్ దిశలో వెళ్తున్న బంతి మిడిల్‌స్టంప్‌ను ఎగురగొట్టినట్లు చూపించింది. దీంతో థర్డ్ అంపైర్ అసలంక ఔట్ అని ప్రకటించాడు అంతే రోహిత్ ఒక్కసారిగా సూపర్ బుమ్రా అంటూ గట్టిగా అరుస్తూ అతనికి అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లంకతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఐదు వికెట్లు తీసి వారి పతనాన్ని శాసించాడు. జడ్డూ దెబ్బకు శ్రీలంక 174 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు భారీ ఆధిక్యం లభించింది. దీంతో లంక ఫాలోఆన్ ఆడడం అనివార్యమైంది. లంక బ్యాటింగ్‌లో నిస్సంకా 61 పరుగులు నాటౌట్‌తో చివరి వరకు నిలిచాడు. మిగతా బ్యాట్స్మెన్లలో అసలంక 29, కరుణరత్నే 28 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో జడేజా ఐదు, అశ్విన్ 2,బుమ్రా 2, షమీ ఒక వికెట్ తీశారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 578 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా 175 పరుగులు నాటౌట్‌గా నిలవగా.. అశ్విన్ 61, విహారి 58, కోహ్లి 45 పరుగులు చేశారు. బుమ్ర-రోహిత్ రివ్యూ వీడియో కోసం క్లిక్ చేయండి -
రోహిత్ శర్మ.. పట్టిందల్లా బంగారమే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పట్టిందల్లా బంగారమే అవుతుందంటూ క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ బంగారం ఏంటో తెలుసా.. డీఆర్ఎస్లు. అవును రోహిత్ నిజంగానే రివ్యూలకు రారాజుగా మారిపోతున్నాడు. మన టీమిండియా కెప్టెన్లకు రివ్యూలు ఎక్కువగా కలిసి రాలేదు. డీఆర్ఎస్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ధోని, కోహ్లిలకు రివ్యూలు పెద్దగా కలిసిరాలేదు. అడపాదడపా కలిసొచ్చాయే తప్ప నష్టమే ఎక్కువసార్లు జరిగింది. కోహ్లి విషయంలో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. అయితే రోహిత్ విషయంలో పూర్తిగా రివర్స్ అయింది. తాను ఎప్పుడు రివ్యూకు వెళ్లినా అనుకూలంగానే వస్తుంది. కోహ్లి గైర్హాజరీలో రోహిత్ పలుమార్లు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోహిత్‌కు రివ్యూలు అనుకూలంగానే వచ్చేవి. ఇక తాజాగా పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత రోహిత్‌కు రివ్యూలు మరింతగా కలిసివస్తున్నాయి. చదవండి: ఫ్యాబ్-ఫోర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం! విండీస్‌తో సిరీస్‌లో తొలి వన్డేలో రివ్యూపై తన నిర్ణయాలతో రోహిత్ అందరిని ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో బ్రూక్స్ విషయంలో పంత్ వద్దన్నా కోహ్లి సలహాతో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. ఫలితం అనుకూలంగా వచ్చింది. తాజాగా రెండో వన్డేలోనూ డారెన్ బ్రావో విషయంలో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. పంత్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లి సక్సెస్ కావడంతో అభిమానులు రోహిత్‌ను రివ్యూల రారాజుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్‌పై అభిమానులు చేస్తున్న మీమ్స్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. మీరు ఒక లుక్కేయండి. చదవండి: Rohit Sharma-Pant: పంత్‌ను గుడ్డిగా నమ్మి రివ్యూకు వెళ్లిన రోహిత్.... ఫలితం Decision by Rohit Sharma 🔥#INDvsWI #RohitSharma #INDvWI pic.twitter.com/SoVBnNPsEw — Asif Ali (@DargaAsifAli) February 9, 2022 4 out of 4 for ROHIT REVIEW SYSTEM in this ODI series. #INDvWI #INDvsWI #RohitSharma — Dr. Cric Point (@drcricpoint) February 9, 2022 4th consecutive successful drs for captain Rohit sharma inside 2 odi's After took permanent Captainship. Rohit review system#INDvWI #INDvsWI — Somnath chakraborty ⚽🏏 (@somnath20094585) February 9, 2022 -
పంత్‌ను గుడ్డిగా నమ్మి రివ్యూకు వెళ్లిన రోహిత్..
టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో వన్డేలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ను ప్రసిధ్ కృష్ణ వేశాడు. క్రీజులో డారెన్ బ్రావో ఉన్నాడు. ఓవర్ తొలి బంతిని బ్రావో టచ్ చేయడంలో విఫలమయ్యాడు. బంతి స్లిక్ అయి కీపర్ పంత్ చేతుల్లో పడింది. అంతే పంత్‌తో పాటు స్లిప్‌లో ఉన్న రోహిత్ కూడా ఔట్ అంటూ అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రోహిత్‌కు ఏ మూలనో బ్యాట్‌కు తగల్లేదేమోనని చిన్న అనుమానం ఉంది. కానీ పంత్ మాత్రం లేదు బంతి బ్యాట్‌కు తాకింది అంటూ కాన్ఫిడెన్స్‌తో చెప్పాడు. దీంతో రోహిత్ పంత్‌ను గుడ్డిగా నమ్మి రివ్య్వూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో బంతి కీపర్ చేతుల్లో పడకముందు స్పైక్ రావడం.. బ్యాట్‌కు బంతి తాకినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ ఔట్ అని సాప్ట్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ క్షమాపణ కోరుతూ బ్రావోను ఔట్‌గా పేర్కొన్నాడు. టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. మొన్న పంత్‌ను కాదని కోహ్లిని అడిగి ఫలితం సాధించిన రోహిత్.. ఈరోజు మాత్రం పంత్‌ను నమ్మి రివ్య్వూకు వెళ్లాడు. మళ్లీ సేమ్ సీన్ రిపీట్ కావడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలా ప్రసిధ్ కృష్ణ రెండు వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. Brilliant review by Team India 😍🔥 pic.twitter.com/OA26ce7jzA — Sports Hustle (@SportsHustle3) February 9, 2022 Brandon King☝️ Darren Bravo☝️ Two wickets for Prasidh Krishna👏 📸: Disney+Hotstar#PrasidhKrishna #INDvsWI pic.twitter.com/6Z7zPVBPXh — CricTracker (@Cricketracker) February 9, 2022 -
ఓడిపోతున్నామనే బాధ.. కోహ్లి అసహనం
Virat Kohli Shows Frustration.. సౌతాఫ్రికాతో మూడో టెస్టులో విరాట్ కోహ్లి అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ప్రొటీస్ ఇన్నింగ్స్ 21వ ఓవర్ అశ్విన్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని డీన్ ఎల్గర్ ఆడగా.. బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్ దిశగా కీపర్ పంత్ చేతుల్లో పడింది. వెంటనే అశ్విన్ అప్పీల్‌కు వెళ్లగా.. ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ ఔట్ ఇచ్చాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు అయితే ఎల్గర్ తాను ఔట్ కాదన్న డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు. రీప్లే చూస్తే బంతి పిచ్‌పై పడటం, లైన్‌పై దాని ప్రభావం అన్నీ బ్యాటర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. బంతి దిశను చూసినా నేరుగా మిడిల్ స్టంప్ వద్ద బ్యాటర్ ప్యాడ్‌కు తగులుతున్నట్లుగా కనిపించింది. ఇక తాను అవుట్ అనుకుంటూ ఎల్గర్ నిష్క్రమించేందుకు కూడా సిద్ధమయ్యాడు. అయితే అనూహ్యంగా ‘బాల్ ట్రాకర్’ బంతి వికెట్ల పైనుంచి వెళుతున్నట్లుగా చూపించింది. దాంతో ఎరాస్మస్ కూడా ‘ఇదెలా సాధ్యం’ అంటూ వ్యాఖ్యానిస్తూ ఎల్గర్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు షాక్ తిన్నారు. ముఖ్యంగా కోహ్లి ఎల్గర్ ఔట్ కాదని తేలడంతో.. కోపంలో గ్రౌండ్ టర్ఫ్‌ను కోపంతో తన్నడం కెమెరాలకు చిక్కింది. అశ్విన్ వేసిన బంతి ఎక్స్ట్రా బౌన్స్ కావడంతో బంతి స్టంప్స్‌ను మిస్ అయినట్లు ట్రాకింగ్‌లో కనిపించింది. దాంతో కెప్టెన్ సహా టీమ్ సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు ‘బాల్ ట్రాకింగ్’ను తప్పుగా చూపించిన ప్రసారకర్తలపై (సూపర్ స్పోర్ట్స్) స్టంప్స్మైక్ ద్వారా తమ మాటలతో విరుచుకు పడ్డారు. ‘సూపర్ స్పోర్ట్స్... మీరు గెలిచేందుకు ఇంతకంటే మెరుగైన పద్ధతులు చూసుకోండి’ అంటూ అశ్విన్ అనగా.. కేఎల్ రాహుల్ కూడా ‘11 మంది ప్రత్యర్థిగా దేశం మొత్తం ఆడుతోంది’ అనేశాడు. మయాంక్ కూడా ‘మీరు ఆటకు చెడ్డ పేరు తెస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇక కోహ్లి సహజంగానే మైదానంలో తన ఆగ్రహావేశాలు ప్రదర్శించాడు. అతని చర్యను కూడా రీప్లేలో చూపడంతో కోపం తెచ్చుకున్న కోహ్లి స్టంప్స్ వద్ద నిలబడి ‘ఎప్పుడూ మాపైనే దృష్టి పెడితే ఎలా. మీ టీమ్‌ను కూడా చూసుకోండి’ అన్నాడు. ఆ తర్వాత మరో సారి ఎల్గర్ అవుట్ కోసం బుమ్రా అప్పీల్ చేయగా...‘వద్దులే. ఈ సారి భుజాలపైనుంచి బంతి పోతోంది అంటారేమో’ అంటూ కోహ్లి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. చివరకు రివ్యూ ద్వారానే భారత్‌కు ఎల్గర్ వికెట్ దక్కడం విశేషం. ఎల్గర్ లెగ్‌సైడ్ వైపు ఆడగా పంత్ క్యాచ్ అందుకొని అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్‌గా ఇచ్చినా రివ్యూలో ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. అయితే గొడవ తర్వాత ఏకాగ్రత కోల్పోయిన టీమిండియా 8.5 ఓవర్లలోనే 41 పరుగులు సమర్పించుకుంది. అయితే ఇదే ఎల్గర్ సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ టెస్టును గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు తేడాతో సెంచరీకి దూరమైనప్పటికి.. 96 నాటౌట్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా విజయానికి 111 పరుగుల దూరంలో ఉంది. నాలుగో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు విజృంభించడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అంతకముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్ 198 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ సెంచరీతో ఆకట్టుకోగా.. కోహ్లి 29 పరుగులు చేశాడు. చదవండి: పంత్ వీరోచిత సెంచరీ.. దక్షిణాఫ్రికా గడ్డపై పలు రికార్డులు pic.twitter.com/00dPXQv8sK — Addicric (@addicric) January 13, 2022 pic.twitter.com/HtZwoo9Lm7 — Bleh (@rishabh2209420) January 13, 2022 pic.twitter.com/6XiQdNSj9X — Bleh (@rishabh2209420) January 13, 2022 -
ఔట్ కాదా.. అంపైర్‌పై కేఎల్ రాహుల్ అసహనం
KL Rahul Frustration On Field Umpire.. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డ్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. బ్యాటర్ క్లియర్ అవుట్ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అంపైర్ ఔటివ్వకపోవడంతో కెఎల్ రాహుల్ వాదనకు దిగాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 8వ ఓవర్ రవి బిష్ణోయి వేశాడు. కాగా ఓవర్ మూడో బంతిని దేవదత్ పడిక్కల్ ఫ్లిక్ చేసే ప్రయత్నంలో అతని చేతిని తాకి బంతి కీపర్ రాహుల్ చేతిలో పడింది. అయితే అంపైర్ నాటౌట్ అని చెప్పడంతో రాహుల్ రివ్యూ కోరాడు. అయితే అల్ట్రాఎడ్జ్‌లో పడిక్కల్ గ్లౌజ్‌ను తాకినట్లు స్పైక్ స్పష్టంగా కనిపించింది. అయినప్పటికి థర్డ్ అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్‌కు వదిలేశాడు. చదవండి: ముంబై ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది: షేన్ బాండ్ Courtesy: IPL Twitter ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పడిక్కల్ నాటౌట్ అని ఇచ్చాడు. ఇది చూసి షాకైన రాహుల్.. ''ఇదేం నిర్ణయం.. బంతి బ్యాటర్ గ్లౌజ్‌కు క్లియర్‌గా తగిలినట్లు అల్ట్రాఎడ్జ్‌లో క్లియర్‌గా కనిపిస్తున్నప్పటికి ఔట్ ఇవ్వకపోవడం ఏంటని'' అసహనం వ్యక్తం చేశాడు. దీంతో పడిక్కల్ బతికిపోగా.. పంజాబ్ రివ్యూ వృధా అయింది. అయితే అంపైర్ నిర్ణయంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. '' అంత క్లియర్‌గా ఔట్ అని కనిపిస్తున్నా అంపైర్ అలా ఎందుకు చేశాడు.. ఈ అంపైర్‌కు డీఆర్ఎస్పై స్పెషల్ క్లాసులు పెట్టాల్సిందే'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే pic.twitter.com/rSpc51vmxM — Maqbool (@im_maqbool) October 3, 2021 -
ఆ సిరీస్‌లో రివ్యూ కోరే అవకాశం లేదు..
కరాచీ: ఆధునిక క్రికెట్లో డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) లేకుండా మ్యాచ్‌లు జరగడం దాదాపుగా అసాధ్యం. ఐసీసీ సభ్య దేశాలన్నీ తమ తమ అంతర్జాతీయ మ్యాచ్‌లకు స్వయంగా డీఆర్ఎస్(ఐసీసీ ఆమోదించిన డీఆర్ఎస్ సర్వీస్ ప్రొవైడర్లతోనే) సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ సదుపాయాన్ని కల్పించుకోలేకపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ బోర్డు ప్రతినిధులే వెల్లడించారు. సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లకు డీఆర్ఎస్ సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పీసీబీ ప్రతనిధి వివరణ ఇచ్చాడు. ఇదే అంశానికి సంబంధించి మరో అధికారి మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లకు సంబంధించి పీసీబీ మీడియా ప్రసార హక్కులను ఆలస్యంగా విక్రయించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు. అయితే, వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో డీఆర్ఎస్ విధానం అమలు చేస్తామని వారు వెల్లడించారు. చదవండి: రీ షెడ్యూల్ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్ -
Ind Vs Sl: మీకు అది కూడా తెలియదా.. మరి నువ్వేంటి సూర్య!
కొలంబో: నామమాత్రపు మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా శ్రీలంకకు 226 పరుగుల లక్ష్యం విధించింది. భారత ఆటగాళ్లలో పృథ్వీ షా(49), సంజూ శాంసన్(46), సూర్యకుమార్ యాదవ్(40) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక లంక బౌలర్లలో అకిల ధనుంజయ, జయ విక్రమ మూడేసి వికెట్లతో రాణించగా.. చమీరా రెండు, కరుణరత్నే, శనక ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఇండియా ఇన్నింగ్స్ సమయంలో 23వ ఓవర్లో చోటుచేసుకున్న సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీలంక క్రికెటర్లకు డెసిషన్ రివ్యూ సిస్టం(డీఆర్ఎస్) గురించి ఏమాత్రం అవగాహన లేనట్లు కనిపిస్తోంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే... సూర్యకుమార్ క్రీజులో ఉన్న సమయంలో జయవిక్రమ బంతిని సంధించాడు. స్వీప్ షాట్ ఆడేందుకు సూర్య చేసిన ప్రయత్నం విఫలమైంది. బంతి ప్యాడ్స్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో.. లంక జట్టు డీఆర్ఎస్కు వెళ్లింది. ఈ క్రమంలో బంతి స్టంప్స్‌ను తాకినట్లు తేలడంతో.. సూర్య అవుట్ అయినట్లు ప్రకటించారు. దీంతో.. లంక ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం ఆరంభించారు. వారి సంతోషం చూసి, సూర్యకుమార్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురై క్రీజు వీడి వెళ్లేలా కనిపించాడు. ఈ క్రమంలో.. మరోసారి, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని అనుసరించి థర్డ్ ఎంపైర్ పరిశీలించగా... అవుట్‌సైడ్ ఇంపాక్ట్‌గా తేలింది. బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ స్టంప్స్ అవుట్‌సైడ్ లైన్లో ఉన్నట్లు కనిపించింది. దీంతో.. ఇంపాక్ట్ బీయింగ్ అవుట్‌సైట్ నిబంధన ప్రకారం.. తన నిర్ణయాన్ని మార్చుకుంటూ సూర్యను నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ ఎంపైర్. దీంతో దసున్ శనక సేన బిక్కముఖం వేసింది. ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్..‘‘డీఆర్ఎస్ సమయంలో థర్డ్ ఎంపైర్ ఇదిలో ఇలాగే చేసి ఉంటాడు. ఇంకా నయం చివర్లో అయినా.. రైట్ కాల్ ఇచ్చాడు. థాంక్స్’’ అంటూ మీమ్‌ను షేర్ చేశాడు. ఇక భారత అభిమానులు సైతం.. ‘‘థర్డ్ అంపైర్ ఎందుకింత ఆలస్యం చేశాడు. ఒకసారి అవుట్, మరోసారి నాటౌట్.. ఏంటిది? వాళ్లకు అసలు రూల్స్ తెలియవా? ఆటగాళ్లకు డీఆర్ఎస్ గురించి తెలియదా. అయినా సూర్య నువ్వు ఎందుకు క్రీజు వదిలి వెళ్లాలనుకున్నావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంపాక్ట్ అవుట్‌సైడ్ నిబంధన ప్రకారం.. లైన్‌కు ఆవల బంతి, బ్యాట్స్‌మెన్‌ను తాకినట్లయితే.. ఎల్బీడబ్ల్యూగా పరిగణించరు. Third umpire during that DRS review 🤦 thankfully right call was made in the end. #SLvIND #SuryakumarYadav pic.twitter.com/bPOfoTJ6NA — Wasim Jaffer (@WasimJaffer14) July 23, 2021 -
వన్డేల్లోనూ..టెస్టుల్లోనూ ‘తొలి’ ఘనత!
టీమిండియా, ఇంగ్లండ్ ఉమెన్ టీమ్స్ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు ద్వారా ఒక అరుదైన ఫీట్ నమోదు అయ్యింది. భారత బౌలర్ దీప్తి శర్మ అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్) ద్వారా ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్ నటాలియా స్కివర్‌ను అవుట్ చేసింది. తద్వారా డీఆర్ఎస్ ద్వారా టెస్ట్ ఫార్మట్‌లో తొలి వికెట్ దక్కించుకున్న మొదటి ఇండియన్ బౌలర్‌గా 23 ఏళ్ల దీప్తి ఘనత సాధించింది. ఇక అరుదైన ఘటన ఏంటంటే.. గతంలో వన్డేల్లోనూ డీఆర్ఎస్ ద్వారా వికెట్ దక్కించుకున్న తొలి ఇండియన్ బౌలర్ కూడా దీప్తి శర్మనే కావడం విశేషం. ఇంకో ఖతర్నాక్ విషయం ఏంటంటే.. ఆ వికెట్ కూడా నాట్ స్కివర్దే కావడం. జూన్ 24, 2017న జరిగినే వన్డే మ్యాచ్‌లో దీప్తి, స్కివర్‌ను అవుట్ చేసి ఈ ఫీట్ దక్కించుకోగా, తాజాగా (జూన్ 16న) టెస్ట్‌ల్లోనూ ఆ ఘనత దక్కించుకుని అరుదైన ఫీట్‌ను తన సొంతం చేసుకుంది దీప్తి శర్మ. ఈ విషయాన్ని ఈఎస్పీఎన్ జర్నలిస్ట్ అన్నెషా ఘోష్ తన ట్విట్టర్ ద్వారా ధృవీకరించింది. ఇక ఈ క్రేజీ కో ఇన్సిడెంట్‌పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. డీ ఫర్ దీప్తి.. డీ ఫర్ డీఆర్ఎస్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ బుధవారం ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) India Women's first wicket in ODIs involving the use of the DRS was Nat Sciver, off Deepti Sharma's bowling (June 24, 2017). India Women's first wicket in Test cricket involving the use of the DRS was Nat Sciver, off Deepti Sharma's bowling (June 16, 2021).#ENGvIND #WWC17 — Annesha Ghosh (@ghosh_annesha) June 16, 2021 చదవండి: స్మృతి మంధాన ఆస్తుల విలువ ఎంతంటే.. -
Umpire’s Call: ‘అంపైర్స్ కాల్’పై ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)లో తరచూ చర్చనీయాంశమవుతున్న ‘అంపైర్స్ కాల్’ను మార్చాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో తేల్చారు. అలాగే కోవిడ్ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ల కోసం 23 మంది సభ్యులతో జట్లను అనుమతించాలని ఐసీసీ నిర్ణయించింది. ‘క్రికెట్ కమిటీ ప్రధానంగా అంపైర్స్ కాల్‌పై చర్చించి విశ్లేషించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అంపైర్ ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకుండానే తప్పులు జరగకుండా చూడటం డీఆర్ఎస్లో ముఖ్య ఉద్దేశం. మైదానంలో ఫీల్డ్ అంపైర్‌దే తుది నిర్ణయం. అంపైర్ కాల్ ఉండాల్సిన అవసరం అందుకే ఉంది’ అని కమిటీ హెడ్, మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే తెలిపారు. ఎల్బీడబ్ల్యూ సమీక్షలో అంపైర్స్ కాల్ తరచూ వివాదాస్పదమవుతోంది. బర్మింగ్‌హామ్‌లో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోదా కల్పించిన ఐసీసీ... మహిళల వన్డే మ్యాచ్‌లు ‘టై’గా ముగిస్తే సూపర్ ఓవర్ నిర్వహించాలని కూడా నిర్ణయించింది. -
అంపైర్స్ కాల్ మార్గదర్శకాలను పునఃపరిశీలించాలి: కోహ్లి
పూణే: డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)లో అంపైర్స్ కాల్ విధానం గందరగోళం సృష్టిస్తోందని, దాని మార్గదర్శకాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అలాగే బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకినట్లు స్పష్టమైతే, ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాలని ఆయన సూచించాడు. త్వరలో ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలు జరగబోతున్న నేపథ్యంలో మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. కాగా, అంపైర్స్ కాల్ నిబంధనను పునః పరిశీలించాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ఐసీసీకి సూచించిన విషయం తెలిసిందే. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం జరుగనున్న తొలి వన్డే నేపథ్యంలో ఈరోజు జరిగిన వర్చువల్ ప్రెస్ మీట్లో కోహ్లి మాట్లాడుతూ.. అంపైర్స్ కాల్ విధానంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. డీఆర్ఎస్ లేనప్పుడు కూడా తాను సుదీర్ఘ క్రికెట్ ఆడానని, బ్యాట్స్‌మెన్‌కు ఇష్టమున్నా లేకున్నా అంపైర్ నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నాడు. అంపైర్స్ కాల్ గంధరగోళం సృష్టిస్తోందని, దాన్ని సవరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యనించాడు. బ్యాట్స్‌మన్ బౌల్డ్ అయిన సందర్భంలో బంతి 50 శాతానికి పైగా వికెట్లను తాకిందా అని చూడరు కదా అని ప్రశ్నించాడు. బంతి ఎంత మేర వికెట్లను తాకిందన్న నిర్ణయం తికమక పెడుతోందని వెల్లడించాడు. కాగా, అంపైర్స్ కాల్‌ను సవాల్ చేస్తే బాల్ ట్రాకింగ్‌లో బంతి 50 శాతం వికెట్లను తాకితేనే అవుట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్‌ది'
సిడ్నీ: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఫీల్డ్ అంపైర్ విల్సన్‌పై అసహనం వ్యక్తం చేశాడు. టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ సమయంలో చతేశ్వర్ పుజారా ఔట్ అంటూ టిమ్ పైన్ డీఆర్ఎస్ కోరాడు. అయితే నిర్ణయం తనకి వ్యతిరేకంగా రావడంతో సహనం కోల్పోయి ఫీల్డ్ అంపైర్ విల్సన్‌తో వాదనకి దిగాడు. తొలుత సర్దిచెప్పే ప్రయత్నం చేసిన విల్సన్.. టిమ్ పైన్ నోరు జారడంతో విల్సన్ కూడా సీరియస్‌గానే బదులిచ్చాడు. (చదవండి: ఒకవేళ అక్కడ సచిన్ ఉంటే పరిస్థితి ఏంటి?) ఇక అసలు విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 56వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజారా.. బంతిని ముందుకు ఫుష్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. అతను ఊహించని విధంగా టర్న్, బౌన్స్ అయిన బంతి బ్యాట్ పక్క నుంచి వెళ్లి పుజారా శరీరాన్ని తాకి.. అనంతరం షార్ట్ లెగ్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూ వెడ్ బంతిని క్యాచ్‌గా అందుకోగా.. ఔట్ కోసం ఆస్ట్రేలియా అప్పీల్ చేసింది. కానీ.. ఫీల్డ్ అంపైర్ విల్సన్ ఆ ఔట్ అప్పీల్‌ని తిరస్కరించాడు. దాంతో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ డీఆర్ఎస్ కోరాడు.(చదవండి: వాటే సెన్సేషనల్ రనౌట్..!) అయితే రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకినట్లు హాట్‌స్పాట్, స్నికో మీటర్లో ఎక్కడా కనిపించలేదు. దాంతో థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫర్ట్ తుది నిర్ణయానికి రాలేక నిర్ణయాధికారం ఫీల్డ్ అంపైర్‌కే వదిలేశాడు. అప్పటికే విల్సన్ నాటౌట్ ఇచ్చి ఉండటంతో.. అతను అదే నిర్ణయానికి కట్టుబడగా సహనం కోల్పోయిన పైన్ అసహనం వ్యక్తం చేస్తూ బూతులందుకున్నాడు. పైన్ మాటలు విన్న అంపైర్ విల్సన్ 'ఆ నిర్ణయం థర్డ్ అంపైర్ తీసుకున్నాడు నేను కాదు' అంటూ కోపంగా బదులిచ్చాడు. -
బాక్సింగ్ డే టెస్టు: అంపైర్స్ కాల్‌పై సచిన్ అసహనం
న్యూఢిల్లీ: డీఆర్ఎస్ విధానంలో ‘అంపైర్స్ కాల్’ నిబంధన పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ‘అంపైర్ నిర్ణయంపై సంతృప్తి లేకనే డీఆర్ఎస్ను ఆశ్రయిస్తారు ఆటగాళ్లు. మరి ఆ నిర్ణయాన్ని సమీక్షించి నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన థర్డ్ అంపైర్.. తను ఎటూ తేల్చలేక మళ్లీ అంపైర్ అభిప్రాయానికే వదిలేస్తే.. లాభం ఏముంటుంది’అని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. డీఆర్ఎస్ విధానంపై ముఖ్యంగా ‘అంపైర్స్ కాల్’ అంశంపై దృష్టి సారించాలని ట్విటర్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కోరాడు. కాగా, బాక్సింగ్ డే టెస్టులో ఎల్బీగా ఔట్ కావాల్సిన లబుషేన్, జో బర్న్స్ ఈ నియమం వల్ల బతికిపోయారు. టీమిండియా ఆటగాళ్ల అప్పీల్‌ను అంపైర్ తోసిపుచ్చడంతో.. కెప్టెన్ రహానే డీఆర్ఎస్కు వెళ్లాడు. అయినా, ఫలితం లేకపోయింది. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: విజయావకాశాలు మనకే!) బంతి వెళ్తున్న దశేమిటో స్పష్టత లేకపోవడంతో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ అంపైర్ అభిప్రాయానికే నిర్ణయాన్ని వదిలేశాడు. దాంతో వారిద్దరూ సేవ్ అయ్యారు. అయితే, బంతి మాత్రం సరైన దిశలోనే వికెట్లపైకి వెళ్లిందని రీప్లేలో తెలుస్తోంది. మరోవైపు డీఆర్ఎస్ ద్వారా సరైన నిర్ణయం రాకపోవడం.. అంపైర్ అభిప్రాయానికే నిర్ణయాలను వదిలేయడంపై టీమిండియా ఆటగాళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజా మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 195 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, రెండో ఇన్సింగ్స్‌లో 326 పరుగులు చేసి 131 ఆదిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను మరోమారు భారత బౌలర్లు బెంలేలెత్తించారు. 133 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 పరుగుల ఆదిక్యంలో ఉంది. టెయిలెండర్లు కామెరూన్ గ్రీన్ (17), పాట్ కమిన్స్ (15) క్రీజులో ఉన్నారు. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: 2 పరుగుల ఆదిక్యంలో ఆసీస్) The reason players opt for a review is because they’re unhappy with the decision taken by the on-field umpire. The DRS system needs to be thoroughly looked into by the @ICC, especially for the ‘Umpires Call’.#AUSvIND — Sachin Tendulkar (@sachin_rt) December 28, 2020 -
పరుగు కౌంట్ కాలేదు..ఇదెక్కడి డీఆర్ఎస్ రూల్?
అబుదాబి: కింగ్స్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబై బ్యాటింగ్‌కు తొలుత పూర్తిగా చేతులెత్తేసిన కింగ్స్ పంజాబ్.. ఆ తర్వాత బౌలింగ్ పంచ్ ముందు తేలిపోయింది. దాంతో ముంబై 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే అంపైర్ల నిర్ణయ సమీక్ష(డీఆర్ఎస్) నిబంధనల్లో ఒక సవరణ అనివార్యమనే డిమాండ్ వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాడి టీ20 ప్రపంచకప్ జరుగుతుందని, అప్పటి వరకైనా ఈ నిబంధనలోని లోపాలను సవరించాలని విశ్లేషకులు కోరుతున్నారు.కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేసర్ మహ్మద్ షమీ వేసిన 17వ ఓవర్ చివరి బంతి కీరన్ పొలార్డ్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. (చదవండి: మరో హిస్టరీ ముంగిట ధోని) ఇది బ్యాట్‌కు తగిలిందనే భావనలో పొలార్డ్ రివ్యూకు వెళ్లాడు. ఇది సక్సెస్ అయ్యింది. బ్యాట్‌ను బంతి తాకుతూ వెళ్లినట్లు రిప్లేలో కనబడింది. దాంతో పొలార్డ్ బతికిపోయాడు. అయితే ఫీల్డ్ అంపైర్ ఎల్బీగా ప్రకటించే క్రమంలో పొలార్డ్ సింగిల్ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ పరుగు కౌంట్ కాలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్ ఔటిచ్చిన తర్వాత ఆ బాల్ డెడ్ అయినట్లే. దాంతో సింగిల్‌ను కౌంట్ చేయలేదు. కానీ పొలార్డ్ రివ్యూ సక్సెస్ అయ్యింది. అయినా ఆ సింగిల్‌ను స్కోరులో కలపరు. ఇది నిన్న మనకు క్లియర్‌గా తెలిసింది. దీన్ని మార్చాలని కోరుతున్నాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. అంపైర్ల తప్పిదానికి పరుగులు ఎందుకు తగ్గించాలని ప్రశ్నిస్తున్నాడు. దీన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇది సరైన రూల్ కాదన్నాడు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఐసీసీ లా మేకర్ అయిన ఎంసీసీ(మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్)కు విన్నవించాడు. -
ధోని, సచిన్‌లు నన్ను నిరాశపరిచారు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిలు తనను ఒక విషయంలో తీవ్రంగా నిరాశపరిచారంటున్నారు కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్. వీరిద్దరూ ఆటపరంగా పక్కన పెడితే, అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతిని ప్రవేశపెట్టిన సమయంలో వ్యతిరేకించడం తనను అసంతృప్తిగా గురి చేసిందన్నారు. టెక్నాలజీకి తాను అతిపెద్ద అభిమానిననే విషయాన్ని ఈ సందర్భంగా శశిథరూర్ పేర్కొన్నారు. ‘ నేను టెక్నాలజీకి ఎప్పుడూ పెద్ద పీట వేస్తా. డీఆర్ఎస్ను ప్రవేశపెట్టిన తొలినాళ్ల నుంచి దానికి అడ్వోకేట్‌గా ఉన్నా. కానీ సచిన్, ధోనిలు డీఆర్ఎస్ను ప్రవేశపెట్టిన ఆరంభంలో వ్యతిరేకించారు. ఇది నన్ను తీవ్రంగా నిరూత్సాహపరిచింది. నేను క్రికెట్‌ను రెగ్యులర్‌గా చూస్తూ ఉంటా. డీఆర్ఎస్ వచ్చిన కొత్తలో మనవాళ్లు అంపైర్ల నిర్ణయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉండేది. (చదవండి: సీఎస్కే వాట్సాప్ గ్రూప్ నుంచి రైనా ఔట్?) వారికి డీఆర్ఎస్ అంటే ఎందుకంత ఎలెర్జీనో నాకైతే ఇప్పటివరకూ తెలీదు. డీఆర్ఎస్ అనేది క్రికెట్లో తీసుకొచ్చిన అతిపెద్ద సవరణ. ఇక డీఆర్ఎస్ లేకుండా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు చూడటం అనేది ఉండదనే అనుకుంటున్నా. డీఆర్ఎస్తో ఫీల్డ్‌లో అంపైర్లు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలకు జవాబు దొరకుతుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. డీఆర్ఎస్ ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది క్రికెట్లో సరికొత్త శకానికి నాంది’ అని స్పోర్ట్స్కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిథరూర్ పేర్కొన్నారు.2008లో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ ద్వారా డీఆర్ఎస్ను ప్రయోగించారు. అయితే దీన్ని అప్పట్లో టీమిండియా బాగా వ్యతిరేకించింది. అందులోని లోటుపాట్లను ధోని, సచిన్‌లు బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లడంతో దాన్ని వ్యతిరేకించకతప్పలేదు. కాగా, 2016లో భారత పర్యటనకు ఇంగ్లండ్ వచ్చిన సమయంలో డీఆర్ఎస్కు ఎట్టకేలకు బీసీసీఐ ఓకే చెప్పింది. (చదవండి: ‘సచిన్‌ను మర్చిపోతారన్నాడు’) -
‘ఆ సమయంలో నిద్రపట్టేది కాదు’
క్రికెట్ ప్రపంచలో దిగ్గజ అంపైర్లలో ఒకరైన స్టీవ్ బక్నర్ మైదానంలో తాను తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. రెండు సార్లు తాను తీసుకున్న పొరపాటు నిర్ణయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. రెండు సందర్భాల్లోనూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బలయ్యాడని చెప్పారు. అయితే, అవన్నీ పొరపాటు నిర్ణయాలేననని వెల్లడించారు. మాన్సన్ అండ్ గెస్ట్స్ అనే రేడియా కార్యక్రమంలో బక్నర్ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. (చదవండి: సానియాతో పెళ్లి.. మాలిక్ ఏమన్నాడంటే) ‘2003 గాబా టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ గిలెస్పీ వేసిన బంతికి సచిన్ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే, ఆ బంతి వికెట్ల పైనుంచి చాలా ఎత్తులో వెళ్తున్నట్టు రిప్లేలో తేలింది. మరోసారి 2005 కోల్‌కతా వన్డేలో పాకిస్తాన్ బౌలర్ అబ్దుల్ రజాక్ వేసిన బంతికి సచిన్‌ను క్యాచ్ ఔట్‌గా ప్రకటించా. కానీ, తర్వాత తెలిసింది, అది బ్యాట్‌కు తాకనే లేదని. మనుషులన్నాక పొరపాట్లు సహజం. అయితే, వాటిని అంగీకరించాలి. ఏ అంపైర్ కూడా తప్పుడు నిర్ణయాలు కావాలని తీసుకోడు. ఈడెన్ గార్డెన్స్‌లో కిక్కిరిసిన అభిమానుల హర్షధ్వానాలే రెండో పొరపాటుకు కారణమని భావిస్తున్నా. లక్ష మంది ఆ మ్యాచ్ వీక్షిస్తుండటంతో బంతి బ్యాట్‌కు తగిలింది లేనిది గ్రహించలేకపోయా. నా నిర్ణయాలకు చింతిస్తున్నా. వాటి వల్లే నా కెరీర్ ప్రమాదంలో పడొచ్చని అనుకుంటున్నా. పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు’ అని బక్నర్ అన్నారు. ఇక క్రికెట్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, డీఆర్ఎస్ పద్ధతి పొరపాటు నిర్ణయాలు సమీక్షించుకునేందుకు చక్కని అవకాశాలు ఇచ్చాయన్నారు. అవి అంపైరింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్పలేను కానీ, నిర్ణయాల్లో కచ్చితత్వం తెస్తాయని మాత్రం చెప్పగలనని బక్నర్ పేర్కొన్నారు. (ప్రపంచకప్‌లో తప్పకుండా ఆడతా) -
జడేజాను ట్రోల్ చేసిన విరాట్ కోహ్లి
హైదరాబాద్: టీమిండియా సారథి విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ సమయంలో సహచర క్రికెటర్లతో లైవ్ సెషన్స్‌లలో పాల్గొని ఫ్యాన్స్‌కు కావాల్సిన వినోదపు విందును అందించాడు. ఇక కొన్ని సరదా సంభాషణల్లోకి పలువురు క్రికెటర్లను లాగి వారిని ఇరకాటంలో పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా తనపై వచ్చే సెటైర్లకు ధీటుగానే బదులిస్తుంటాడు విరాట్ కోహ్లి. తాజాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాలో ఓ ఫోటో షేర్ చేసి కోహ్లికి చిన్న సెటైర్ వేశాడు. (ఆ ఇద్దరిని ఔట్ చేయాలి.. ఎలా అంపైర్?) ఆ ఫోటోలో కోహ్లి రివ్యూ కోసం అంపైర్‌కు అప్పీల్ చేస్తుండగా పక్కనే జడేజా ఉన్నాడు. ఆ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘రివ్యూ తీసుకోమని నేను మిమ్మల్ని అడగలేదు’ అంటూ సరదాగా క్యాప్షన్‌ను జతచేశాడు. దీనికి కోహ్లి కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘రివ్యూకు వెళ్లడానికి ముందు అది తప్పకుండా ఔట్ అని ప్రతీసారి అంటావు. తీరా సమీక్ష కోరాక సందేహంగా ఉందంటావు’ అంటూ జడేజాను కోహ్లి ట్రోల్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక బ్యాట్స్‌మన్‌గా సమీక్ష కోరడంలో కోహ్లి విఫలమవుతాడనే అపవాదు ఉంది. వన్డే ప్రపంచకప్-2019లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి డీఆర్ఎస్ తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. (‘కోహ్లిలా ఆడాలి.. పాక్‌ను గెలిపించాలి’) View this post on Instagram Dekho bhai meine nai bola hai review lene ko🤪@virat.kohli #DRS #skipper A post shared by Ravindra Jadeja (@royalnavghan) on Jun 9, 2020 at 10:17pm PDT -
‘ఇదేందయ్య ఇది.. నేనెప్పుడు చూడలేదు’
చెన్నై: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు చేసిన టిక్‌టాక్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘నవ్వు ఆపుకోలేకపోతున్నాను’ అంటూ కామెంట్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏముందంటే.. కొందరు యువకులు క్రికెట్ ఆడుతూ డీఆర్ఎస్ విధానాన్ని అనుకరిస్తూ ఓ ఫన్నీ స్కిట్ చేస్తారు. అధికారిక క్రికెట్ మ్యాచ్‌లో డీఆర్ఎస్ సమీక్ష కోరినప్పుడు ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయో కళ్లకు కట్టినట్టు తమదైన శైలిలో సరదాగా చూపించారు. ఎంతో ఫన్నీగా ఉన్న ఆ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. (ఇకపై కరోనా సబ్‌స్టిట్యూట్?) ‘దీన్ని అధిగమించలేము .. దీన్ని ఎలా క్యాప్షన్ చేయాలో కూడా తెలియదు’ అంటూ రవిచంద్రన్ అశ్విన్ తను షేర్ చేసిన వీడియోకు మరో కామెంట్‌ను జతచేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో డీఆర్ఎస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ విధానంపై అనేక జోక్స్, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా డీఆర్ఎస్లోని అనేక లోటుపాట్లను ఎత్తిచూపుతూ ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులు విమర్శించడం కూడా వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అశ్విన్ సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడు. సహచర క్రికెటర్లతో ఇన్‌స్టా లైవ్ లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నాడు. (‘ఖేల్‌రత్న’కు రోహిత్ శర్మ పేరు సిఫారసు) -
మరోసారి ‘మూడో కన్ను’ తప్పు చెప్పింది!
మెల్బోర్న్: అంతర్జాతీయ క్రికెట్లో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టి చాలా ఏళ్లే అయినా ఇప్పటికీ అందులో లోపాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. ఫీల్డ్ అంపైర్లకు స్పష్టత లేని సందర్భాల్లో డీఆర్ఎస్ ద్వారా థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించినా నిరాశే మిగులుతుంది. ఇక్కడ థర్డ్ అంపైర్ చేస్తున్న తప్పిదమో, ఆ టెక్నాలజీ మీది పూర్తి అవగాహన లేకపోయిన కారణంగానో తప్పిదాలు జరుగుతున్నాయో అర్థం కాక గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. క్రికెట్లో మూడో కన్నుగా పిలవబడే థర్డ్ అంపైర్ విధానం మరొకసారి వివాదాస్పదమైంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా డీఆర్ఎస్ వివాదం వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా మిచెల్ సాంత్నార్ ఔట్‌కు సంబంధించి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిచెల్ స్టార్క్ వేసిన ఒక బంతి సాంత్నార్ గ్లౌజ్కున్న మణికట్టు బ్యాండ్‌కు తగిలిపైకి లేచింది. దాన్ని ఆసీస్ ఫీల్డర్ అందుకున్నాడు. అయితే అది ఔట్ కాదంటూ ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ ప్రకటించాడు. దీనిపై డీఆర్ఎస్కు వెళ్లగా అక్కడ కూడా ఆసీస్‌కు చుక్కెదురైంది. థర్డ్ అంపైర్‌గా ఉన్న అలీమ్ దార్.. అది ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే కట్టుబట్టాడు. దాంతో సాంత్నార్ నాటౌట్‌గా బతికిపోయాడు. కాగా, హాట్‌స్పాట్‌లో పదే పదే పర్యవేక్షించగా ఆ బంతి మణికట్టుకున్న బ్యాండ్‌కు తాకింది. దీన్ని సరిగా థర్డ్ అంపైర్ గమనించకపోవడంతో మరోసారి డీఆర్ఎస్ డ్రామా చోటు చేసుకుంది. ఈ విషయంపై ఆస్ట్రేలియా క్రికెటర్లు తీవ్ర నిరాశను వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అసలు థర్డ్ అంపైర్ ఒక నిర్ణయాన్ని ప్రకటించలేనప్పుడు ఆ విధానం ఉండి ప్రయోజనం ఏముంటుందని ఆసీస్ బ్యాటింగ్ కోచ్ రికీ పాంటింగ్ మండిపడ్డాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్‌ను సవాల్ చేసినప్పుడు థర్డ్ అంపైర్ అనేవాడు ఎటువంటి అనుమానాలకు తావులేకుండా నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుందని, మరి అటువంటుది తప్పిదం థర్డ్ అంపైర్ చేస్తే ఇక డీఆర్ఎస్కు అర్థం ఏముంటందని ఆసీస్ పేసర్ జేమ్స్ ప్యాటినసన్ లంచ్ బ్రేక్‌లో తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. The third umpire Aleem Dar decided he couldn't overturn the call made by Marais Erasmus - what's your call? #SpecsaversCricket@SpecsaversAU | #AUSvNZ pic.twitter.com/hDWFwtAfu3 — cricket.com.au (@cricketcomau) December 28, 2019 -
‘ఢీ’ఆర్ఎస్.. ‘వంద’లో సున్నా!
స్వదేశంలో ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఆసీస్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో వైట్‌వాస్ అయిన టీమిండియా.. ఐదు వన్డేల సిరీస్‌లో 3-2 తేడాతో ఓటమి చెందింది. తమ దేశంలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ దాన్ని సాధించింది. ముందుగా జరిగిన రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.కేఎల్ రాహుల్(50) హాఫ్ సెంచరీ సాధించగా, కోహ్లి(24), ఎంఎస్ ధోని(29 నాటౌట్)లు మోస్తరుగా ఆడారు. అనంతరం ఆసీస్ చివరి బంతికి విజయం సాధించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్(56) అర్థ శతకం సాధించగా, డీఆర్సీ షార్ట్(37) కూడా ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెండో టీ20లో కూడా భారత్‌కు పరాభవం తప్పలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 190 పరుగులు చేసింది. కోహ్లి(72), రాహుల్ (47), ఎంఎస్ ధోని (40)లు రాణించారు. అనంతరం ఆసీస్ ఇంకా రెండు బంతులు ఉండగానే విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్(113) సెంచరీతో కదం తొక్కగా, డీఆర్సీ షార్ట్(40) రాణించాడు. తొలి భారత క్రికెటర్‌గా ధోని.. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ధోని మూడు సిక్సర్లు బాదాడు. దాంతో 352వ సిక్సర్‌ను ధోని సాధించాడు. ఈ క్రమంలోనే 350 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా ధోని గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సర్ల మార్కును ధోని చేరాడు. అప్పటికి రోహిత్ శర్మ 349 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో క్రిస్ గేల్(534 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉండగ, షాహిద్ ఆఫ్రిది (476 సిక్సర్లు) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ(409) మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్లో ధోని కొట్టిన సిక్సర్లు 359. ‘వంద’లో సున్నా..! తొలి వన్డేలోఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ మూడు బంతులు ఆడిన ఫించ్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు.ఇది ఫించ్‌కు వందో వన్డే. ఈ మ్యాచ్‌లో ఫించ్ డకౌట్‌గా నిష్క్రమించడంతో ఆసీస్ తరఫున ఇలా వందో మ్యాచ్‌లో సున్నాకే ఔటైన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు డీన్ జోన్స్, క్రెయిగ్ మెక్‌డెర్మట్‌లు వందో వన్డేలో డకౌట్‌గా ఔటైన ఆసీస్ క్రికెటర్లు. వారి సరసర ఫించ్ చేరాడు. మరో ‘సెంచరీ’ కొట్టేశారు..! ఆస్ట్రేలియాతో నాల్గో వన్డేలో రోహిత్-ధావన్‌ల జంట సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. దాంతో వన్డే ఫార్మాట్లో 15వ సారి సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించినట్లయ్యింది. అదే సమయంలో వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన ఓపెనింగ్ జోడిల్లో గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ సరసన రోహిత్-ధావన్‌ల జంట నిలిచింది. వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల నమోదు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ(21 సెంచరీ భాగస్వామ్యాలు) తొలిస్థానంలో ఉంది.ప్రస్తుతం రోహిత్-ధావన్‌ల జోడి మరో ఘనత టీమిండియా తరఫున వన్డేల్లో ఓవరాల్‌గా అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జాబితాలో రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ల జోడి రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాతో నాల్గో వన్డేలో ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్-ధావన్‌ల జంట.. సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీల జోడి తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్(4,387 పరుగులు) జోడిని వెనక్కినెట్టింది. డీఆర్ఎస్ వివాదాలు.. ఆసీస్‌తో రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో హాక్ఐ టెక్నాలజీ పని చేసే తీరు వివాదాస్పదంగా మారింది. కుల్దీప్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ఎల్బీగా ఔటయ్యాడు. దానిపై డీఆర్ఎస్కు వెళ్లిన ఫించ్‌కు వ్యతిరేక నిర్ణయమే వచ్చింది. కుల్దీప్ వేసిన ఆ బంతిని ట్రాక్ చేయడానికి ఉపయోగించిన హాక్ఐ టెక్నాలజీ చర్చనీయాంశమైంది. ఆ బంతి పిచ్ అయ్యే క్రమంలో మిడిల్ స్టంప్ నుంచి మిడిల్ వికెట్‌ను గిరాటేస్తుండగా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో మాత్రం అది లెగ్ స్టంప్‌లో పడి మిడిల్ స్టంప్‌కు వెళుతున్నట్లు కనిపించింది. దాంతో డీఆర్ఎస్లో ఇంకా లోపాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. అంతకుముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సైతం ఇదే తరహా వివాదం నెలకొంది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మిచెల్ ఎల్బీగా వెనుదిరిగిన తీరు అనేక సందేహాలకు చోటిచ్చింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. దాంతో బాల్ ట్రాకింగ్ ఆధారంగా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. -
‘పంత్‌ను తప్పు పట్టలేం’
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో టి20 మ్యాచ్‌లో కీలక సమయంలో భారత్ డీఆర్ఎస్ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో విఫలమైంది. చహల్ వేసిన ఒకే ఓవర్లో రెండు సార్లు ఇలా జరగడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. ఒకసారి ఎల్బీకి అవకాశం ఉన్నా అప్పీల్ చేయకపోగా, మరోసారి అనవసరపు అప్పీల్‌తో రివ్యూ కోల్పోయింది. ఇందులో రోహిత్ శర్మ తన కీపర్ రిషభ్ పంత్‌ను నమ్మగా, అతను మాత్రం సరైన విధంగా అంచనా వేయలేకపోయాడు. అయితే ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న పంత్‌ను తప్పు పట్టరాదంటూ రోహిత్ సమర్థించాడు. ‘రిషభ్ ఇంకా కుర్రాడే. డీఆర్ఎస్ను అర్థం చేసుకోవడానికి అతనికి కొంత సమయం పడుతుంది. అతని నిర్ణయాలపై అప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. ఇందులో బౌలర్ల పాత్ర కూడా ఉంటుంది. ఫీల్డర్ నిలబడిన స్థానంనుంచి ఎల్బీ విషయంలో సరైన విధంగా అంచనా వేయలేం కాబట్టి కీపర్, బౌలర్‌ను ఎవరైనా నమ్మాల్సి ఉంటుంది’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. చివర్లో ఖలీల్‌తో బౌలింగ్ చేయించడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం లేదని, ఆఖరి ఓవర్లలో తమ స్పిన్నర్లు బౌలింగ్ చేయాలని తాను కోరుకోనని రోహిత్ స్పష్టం చేశాడు. -
గిల్‌క్రిస్ట్ నీ ఏడుపు ఆపు: భజ్జీ
న్యూఢిల్లీ : ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో డీఆర్ఎస్ విధానం ఎంత కీలకపాత్ర పోషింస్తుందో అందరికి తెలిసిందే. అంపైర్ పొరపాటుగా అవుట్ ఇచ్చినా బ్యాట్సమెన్ వెంటనే డీఆర్ఎస్ను కోరి సత్ఫలితాలు సాధిస్తున్నారు. అటు బౌలింగ్ చేసే జట్లు కూడా డీఆర్ఎస్ ద్వారా అనుకున్న ఫలితాలు సాధిస్తున్నాయి. తాజాగా విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. కాగా, రెండో టెస్టు మ్యాచ్‌లో 44వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని కోహ్లి డీఆర్ఎస్ కోరడంతో బుమ్రా హ్యాట్రిక్ ఘనతను నమోదు చేశాడు. తాజాగా ఆస్ట్రేలియన్ మాజీ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ట్విటర్లో స్పందిస్తూ ' తానూ ఆడే రోజుల్లో డీఆర్ఎస్ లేకపోవడం వల్లే హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ సాధించాడని' పేర్కొన్నాడు. దీనిపై భజ్జీ స్పందిస్తూ 'ఆరోజు నువ్వు మొదటి బంతికే ఔటవ్వకపోతే ఎక్కువసేపు ఆడేవాడివి అనుకుంటున్నావా ? గిల్లీ ! ఇప్పటికైనా నీ ఏడుపు ఆపు.. నువ్వు ఆడిన రోజుల గురించి మాట్లాడడం నీకు సరైనదిగానే కనిపిస్తుంది. కానీ అప్పటి నిర్ణయాలు అయితే మారవు, దానికి నువ్వే ఉదాహరణ, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటావు అంటూ' భజ్జీ చురకలంటించాడు. ఈడెన్‌గార్డెన్ వేదికగా 2001లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 72వ ఓవర్లో వరుసబంతుల్లో రికీ పాంటింగ్, గిల్‌క్రిస్ట్, షేన్‌వార్న్‌లను ఔట్ చేశాడు. No DRS 😩 https://t.co/3XsCqk9ZiR — Adam Gilchrist (@gilly381) August 31, 2019 -
ధోని మళ్లీ లెక్క తప్పాడు!
బర్మింగ్‌హామ్ : డీఆర్ఎస్ విషయంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ విఫలమయ్యాడు. డీఆర్ఎస్ అంటేనే ధోని రివ్యూ సిస్టమ్‌గా మార్చుకున్న ఈ సీనియర్ క్రికెటర్.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రివ్యూను ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా వేసిన 11వ ఓవర్ ఐదో బంతి ఓపెనర్ జేసన్ రాయ్ కుడి చేతి గ్లోవ్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. వెంటనే భారత ఆటగాళ్లు అప్పీల్ చేసినా అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. కోహ్లి, హార్దిక్ క్యాచ్‌గా భావించినప్పటికి ధోని నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో భారత కెప్టెన్ రివ్యూ కోరే సాహసం చేయలేదు. కానీ అనంతరం రిప్లేలో బంతికి రాయ్ గ్లోవ్‌ను తాకినట్లు స్నికోలో కనిపించిన స్పైక్ ద్వారా స్పష్టమైంది. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 49 కాగా.. జేసన్ రాయ్ 20 పరుగులే చేశాడు. ఈ రివ్యూను భారత్ కనుక కోరి ఉంటే రాయ్ ఔటయ్యేవాడు.. తొలి వికెట్‌కు నమోదైన 160 పరుగుల భారీ భాగస్వామ్యానికి 49 పరుగులకే ముగింపు పడి ఇంగ్లండ్‌పై ఒత్తిడి నెలకొనేది. ఈ అవకాశంతో రెచ్చిపోయిన జాసన్ రాయ్ 57 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్‌లతో 66 పరుగులు చేసి 337 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఇదే ప్రస్తావిస్తూ అభిమానులు ధోనిపై మండిపడుతున్నారు. ఇక డీఆర్ఎస్ అంచనా విషయంలో కొన్ని సార్లు లెక్క తప్పడం సహజమేనని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘స్పష్టత లేనప్పుడు డీఆర్ఎస్ అనేది చాలా క్లిష్టమైనది. జాసన్‌రాయ్ విషయంలో కూడా బాల్ తాకినట్లు కొంతమందికి వినబడింది. మరికొంతమందికి వినబడలేదు. దీంతో మా కెప్టెన్ ఒత్తిడికి లోనయ్యాడు. ఇక డీఆర్ఎస్ విషయంలో ధోని అంచనాలు ఎప్పుడూ ఫలితాన్నిచ్చాయి. దీంతో కోహ్లి ధోని నిర్ణయంవైపు మొగ్గు చూపాడు. అయితే జేసన్ రాయ్ ఔట్ విషయంలో సర్కిల్ లోపల ఉన్న ఫీల్డర్లే భిన్న వాదనలు వినిపించడంతో కోహ్లి వెనకడుగు వేసాడు. ఇక డీఆర్ఎస్ విషయంలో అదృష్టం ఉంటేనే ఫలితం వస్తుందనేది నా అభిప్రాయం. బంతి పిచ్ అయిన విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా బౌలర్లు రివ్యూ తీసుకుంటామని అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఈ సందర్భంలో కెప్టెన్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అదృష్టం ఉంటే ఫలితం అనుకూలంగా ఉంటుంది. లేకుంటే ప్రతికూలంగా ఉంటుంది. అయితే డీఆర్ఎస్ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. -
టీమిండియాను డీఆర్ఎస్ కొంపముంచిందా?
-
టీమిండియాను డీఆర్ఎస్ కొంపముంచిందా?
మొహాలి: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాల్గో వన్డేలో సైతం అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్దతి(డీఆర్ఎస్)లో వైఫల్యం కొట్టిచ్చినట్లు కనబడింది. గత మ్యాచ్‌లో బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో లోపం కనిపించగా, నాల్గో వన్డేలో ఆస్టన్ టర్నర్ ‘ఔట్’కు సంబంధించి డీఆర్ఎస్ చర్చనీయాంశమైంది. 44 ఓవర్లో చహల్ బౌలింగ్‌లో టర్నర్ కీపర్ రిషభ్ క్యాచ్‌కు చిక్కాడు. అయితే దీనిపై టీమిండియా అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అది గట్టిగా ఔట్ అని నమ్మిన రిషభ్ పంత్.. రివ్యూకు వెళదామని కోహ్లికి సూచించాడు. దాంతో టీమిండియా డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రిప్లేలో చూసిన థర్డ్ అంపైర్ తనకు కూడా స్పష్టత లేదనే సంకేతాలిచ్చాడు. అది ఔటా.. కాదా అనే నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్‌కే వదిలేశాడు. ఈ క్రమంలోనే తాను తొలుత ప్రకటించిన నిర్ణయానికే ఫీల్డ్ అంపైర్ కట్టుబడటంతో భారత్‌కు నిరాశే ఎదురైంది. దీనిపై బహిరంగంగానే కోహ్లి ఆవేదన వ్యక్తం చేశాడు. స్నికో మీటర్లో బంతి ఎడ్జ్ తీసుకున్నట్లు కనబడుతున్నా ఇంకా స్పష్టత లేకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ తర్వాత కూడా డీఆర్ఎస్పై పెదవి విరిచాడు కోహ్లి. డీఆర్ఎస్ను మళ్లీ సందేహించాల్సిన పరిస్థితి వచ్చిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. (ఇక్కడ చదవండి: డీఆర్ఎస్పై మరో వివాదం) భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆటగాడు ఆస్టన్ టర్నర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు సాధించాడు. దాంతో ఆసీస్ ఇంకా 13 బంతులుండగానే విజయాన్ని అందుకుంది. అయితే ఆస్టన్ టర్నర్ ‘క్యాచ్ ఔట్’పై భారత్ రివ్యూకు వెళ్లేసరికి అతని స్కోరు 41. అక్కడే టర్నర్ ఔటై ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే క్రమంలో రిప్లేలో చాలా స్పష్టంగా స్పైక్ కనిపించింది. స్నికో మీటర్లో బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లో పడింది. కాగా, దీన్నే పూర్తిస్థాయి ప్రామాణికంగా తీసుకోని థర్డ్ అంపైర్.. ఔట్‌పై నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్‌కు వదిలేశాడు. ఇక్కడ ఫీల్డ్ అంపైర్ తాను తొలుత ప్రకటించిన నిర్ణయానికి కట్టుబడటంతో టీమిండియా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇక అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం లేకపోవడంతో కోహ్లి అసంతృప్తితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే డీఆర్ఎస్ పని తీరుపై సందేహాలు రావడం ఇది మూడోసారి. గత నెల 8వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో డీఆర్ఎస్పై అనేక అనుమానాలు తలెత్తాయి. కివీస్ ఆటగాడు డార్లీ మిచెల్ ఎల్బీగా మైదానం వీడిన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చింది. అక్కడ హాట్‌స్పాట్‌లో బంతి బ్యాట్‌కు తగిలినట్లు చూపించగా, స్నికో మీటర్లో దీనికి విరుద్ధంగా కనిపించింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. దాంతో బాల్ ట్రాకింగ్ ఆధారంగా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే తాజా సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కుల్దీప్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ఎల్బీగా ఔటయ్యాడు. దానిపై డీఆర్ఎస్కు వెళ్లిన ఫించ్‌కు వ్యతిరేక నిర్ణయమే వచ్చింది. దాంతో 93 పరుగులు చేసిన ఫించ్ పెవిలియన్ బాట పట్టాడు. (ఇక్కడ చదవండి: టర్నర్ విన్నర్) థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరీక్షించి ఫించ్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఆ బంతి పిచ్ అయ్యే క్రమంలో మిడిల్ స్టంప్ నుంచి మిడిల్ వికెట్‌ను గిరాటేస్తుండగా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో మాత్రం అది లెగ్ స్టంప్‌లో పడి మిడిల్ స్టంప్‌కు వెళుతున్నట్లు కనిపించింది. దాంతో డీఆర్ఎస్లో ఇంకా లోపాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. గతంలో ఒకానొక సందర్భంలో డీఆర్ఎస్ సరిగా లేదనే వాదనను భారత్ బలంగా వినిపించింది. అయితే ఈ టెక్నాలజీని పలుమార్లు పరీక్షించిన తర్వాత అందుకు బీసీసీఐ ఓకే చెప్పింది. ఇప్పుడు డీఆర్ఎస్లో వరుస వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనబడుతుండటం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. డీఆర్ఎస్తో కచ్చితత్వం వస్తుందనే నమ్మకంతోనే దీన్ని ప్రవేశపెడితే ఈ టెక్నాలజీ మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో డీఆర్ఎస్లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడటం ఐసీసీకి మరింత తలనొప్పిని తెచ్చే పెట్టే అవకాశం ఉంది. -
డీఆర్ఎస్పై మరో వివాదం
-
డీఆర్ఎస్పై మరో వివాదం
రాంచీ: నెల రోజుల వ్యవధిలోనే డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి)లో మరో వివాదం చోటు చేసుకుంది. గత నెల 8వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో డీఆర్ఎస్పై అనేక అనుమానాలు తలెత్తాయి. కివీస్ ఆటగాడు డార్లీ మిచెల్ ఎల్బీగా మైదానం వీడిన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మిచెల్ ఎల్బీగా వెనుదిరిగిన తీరు అనేక సందేహాలకు చోటిచ్చింది. హాట్ స్పాట్లో మాత్రం బ్యాట్ తగిలినట్లు చూపించగా, స్నికో మీటర్లో దీనికి విరుద్ధంగా కనిపించింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. దాంతో బాల్ ట్రాకింగ్ ఆధారంగా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. తాజాగా డీఆర్ఎస్లోని బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ అనేక ప్రశ్నలకు తావిచ్చింది. ఆసీస్‌తో రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో హాక్ఐ టెక్నాలజీ పని చేసే తీరు వివాదాస్పదంగా మారింది. కుల్దీప్ బౌలింగ్‌లో ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ ఎల్బీగా ఔటయ్యాడు. దానిపై డీఆర్ఎస్కు వెళ్లిన ఫించ్‌కు వ్యతిరేక నిర్ణయమే వచ్చింది. దాంతో 93 పరుగులు చేసిన ఫించ్ పెవిలియన్ బాట పట్టాడు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరీక్షించి ఫించ్‌ను ఔట్‌గా ప్రకటించాడు. కాగా, కుల్దీప్ వేసిన ఆ బంతిని ట్రాక్ చేయడానికి ఉపయోగించిన హాక్ఐ టెక్నాలజీ చర్చనీయాంశమైంది. (ఇక్కడ చదవండి: టీమిండియా బ్యాటింగ్ ‘విచిత్రం’ చూశారా?) ఆ బంతి పిచ్ అయ్యే క్రమంలో మిడిల్ స్టంప్ నుంచి మిడిల్ వికెట్‌ను గిరాటేస్తుండగా, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో మాత్రం అది లెగ్ స్టంప్‌లో పడి మిడిల్ స్టంప్‌కు వెళుతున్నట్లు కనిపించింది. దాంతో డీఆర్ఎస్లో ఇంకా లోపాలు ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. గతంలో ఒకానొక సందర్భంలో డీఆర్ఎస్ సరిగా లేదనే వాదనను భారత్ బలంగా వినిపించింది. అయితే ఈ టెక్నాలజీని పలుమార్లు పరీక్షించిన తర్వాత అందుకు బీసీసీఐ ఓకే చెప్పింది. ఇప్పుడు డీఆర్ఎస్లో వరుస వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనబడుతుండటంతో అది ఏ జట్టును కొ్ంపముంచుతుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఇక్కడ చదవండి: ఇక చాలు.. మళ్లీ చూడదల్చుకోలేదు : కోహ్లి) -
థర్డ్ అంపైర్ నిర్ణయంపై విమర్శల వర్షం
ఆక్లాండ్: తాజాగా అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) వివాదాస్పదమైంది. భారత్‌తో జరిగిన రెండో టీ20లో డార్లీ మిచెల్ ఎల్బీగా మైదానం వీడిన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చింది. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో ఆరో ఓవర్లో మిచెల్ (1) ఎల్బీగా వెనుదిరిగాడు. మొదట అంపైర్ క్రిస్ బ్రౌన్.. మిచెల్ ఔట్ అని ప్రకటించాడు. ఆపై అవతలి ఎండ్‌లో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంప్రదించిన తర్వాత మిచెల్ డీఆర్ఎస్కు వెళ్లాడు. కానీ హాట్ స్పాట్లో మాత్రం బ్యాట్ తగిలిందని చూపించడంతో న్యూజిలాండ్ శిబిరంలో ఆనందం వ్యక్తమైంది. కానీ స్నికో మీటర్లో దీనికి విరుద్ధంగా కనిపించింది. బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. దాంతో బాల్ ట్రాకింగ్ ఆధారంగా థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో విమర్శల వర్షం కురుస్తోంది. ‘ఇది హాస్యాస్పదం’ అని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అసహనం వ్యక్తం చేయగా, బంతి క్లియర్‌గా ఇన్సైడ్ ఎడ్జ్ అయినట్లు హాట్‌స్పాట్‌లో కనిపిస్తున్నా, స్నికో ఆధారంగా నిర్ణయాన్ని ప్రకటించడాన్ని పాకిస్తాన్‌కు చెందిన ఫరాజ్ హైదర్ ప్రశ్నించాడు. అసలు స్నికో గురించి కాస్త వివరణ ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా థర్డ్ అంపైర్ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. స్నికోను వదిలేసి హాట్‌స్పాట్ ఆధారంగా నిర్ణయాన్ని ప్రకటించడంతో మిచెల్ భారంగా పెవిలియన్‌ను వీడాల్సి వచ్చిందన్నాడు. ఒకసారి డీఆర్ఎస్లో బ్యాట్స్‌మన్‌కు వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిందంటే ఇక్కడ వేరే మార్గమే లేదన్నాడు. గతంలో ఈ తరహా ఒక బ్యాట్స్‌మన్ ఔట్ కావడాన్ని వినలేదంటూ సెటైర్ వేశాడు. ఇదొక చెత్త నిర్ణయంగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం వల్ల న్యూజిలాండ్ వికెట్‌ను నష్టపోవడమే కాదు.. రివ్యూను కూడా కోల్పోయిందని విమర్శించాడు. ఇక్కడ చదవండి: రోహిత్ వెనక్కి పిలిచి ఉంటే... -
‘ధోనిని ఔట్ చేసింది రాహులే’
దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం అఫ్గానిస్తాన్- టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ టై గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే విజయం టీమిండియాదే అనుకున్న తరుణంలో అనూహ్యంగా ఓటమి అంచులదాకా వెళ్లి స్కోర్ సమంచేసి ‘టై’ తో సంతృప్తి పడింది. అయితే మ్యాచ్ టై కావడానికి, ధోని ఔట్ కావడానికి ఓపెనర్ కేఎల్ రాహులే కారణమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు కదా, మరి ఫ్యాన్స్ ఎందుకు విమర్శిస్తున్నారనుకుంటున్నారా.. రివ్యూను వృథా చేయడమే రాహుల్ చేసిన పొరపాటు. అఫ్గాన్ సంచలన బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి రాహుల్ ఎల్బీగా ఔటయ్యాడు. అయితే దీనిపై అనుమానంగానే రివ్యూకి వెళ్లాడు. కానీ క్లియర్‌గా రాహుల్ ఔటైనట్లు థర్డ్ అంపైర్ ప్రకటించడంతో భారత్ ఉన్న ఒక్క రివ్యూ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అహ్మదీ బౌలింగ్‌లో అంపైర్ తప్పిద నిర్ణయానికి బలయ్యాడు. అయితే అంపైర్ నిర్ణయంపట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికి రివ్యూ లేకపోవడంతో ధోని మైదానాన్ని వీడాల్సివచ్చింది. అయితే రివ్యూ మిగిలివుంటే ధోని అవుటయ్యేవాడు కాదని, మ్యాచ్ టై గా ముగిసేది కాదని అభిమానుల వాదన. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లోనూ రివ్యూ సరిగ్గా ఉపయోగించకుండా వృథా చేశాడని నెటిజన్లు గుర్తుచేశారు. రాహుల్ డీఆర్ఎస్ ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నాడని, దీనిపై అతడికి ధోనితో ప్రత్యేక క్లాస్‌లు చెప్పించాలని కామెంట్ చేస్తున్నారు. ఎంఎస్ ధోని 200వ వన్డేకు నాయకత్వం వహిస్తున్న మ్యాచ్ గెలవకుండా అడ్డుకుంది రాహులే అని మరికొంతమంది ఘాటుగా విమర్శిస్తున్నారు. ఒక్క రివ్యూ తప్పిదంతో ఇద్దరు ఔటయ్యారంటూ చురకలు అంటిస్తున్నారు. చదవండి: ఊరించి... ఉత్కం‘టై’ -
మరొకసారి ధోని రివ్య్యూ సిస్టమ్..
-
ఎంఎస్ ధోని మరొకసారి..
దుబాయ్: డీఆర్ఎస్(డెసిషన్ రివ్యూ సిస్టమ్) గురించి అందరికీ తెలిసిందే. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని పునః సమీక్షించే పద్దతినే డీఆర్ఎస్ అంటారు. కాగా, డీఆర్ఎస్ అంటే ధోని రివ్య్యూ సిస్టమ్ అని తరచు వినిపిస్తుండటం మనం చూస్తునే ఉన్నాం. డీఆర్ఎస్ను ఇలా ధోనికి ఎందుకు ఆపాదించారంటే ఇందులో అతను ఎక్కువగా సక్సెస్ సాధించడమే. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో ధోని మరోసారి డీఆర్ఎస్ విషయంలో విజయం సాధించాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో ఓవర్‌ను చాహల్ వేశాడు. ఆ ఓవర్ ఆఖరి బంతి పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్‌ను ప్యాడ్లను ముద్దాడింది. ఫ్రంట్ ఫుట్ ఆడే క్రమంలో ఆ బంతి ఇమామ్ ప్యాడ్‌ను తాకుతూ ఆఫ్ స్టంప్ మీదకు వెళుతున్నట్లు కనబడింది. దీనిలో భాగంగా భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ నిరాకరించాడు. దాంతో రోహిత్‌ను రివ్యూకు వెళదామంటూ ధోని తలతో సైగ చేశాడు. ఇక్కడ రోహిత్ రెండో ఆలోచన లేకుండా రివ్యూ కోరడంతో ఇమాముల్ హక్ ఔటయ్యాడు. ఆ బంతి మిడిల్ స్టంప్ వికెట్లను తాకుతున్నట్లు రివ్యూలో తేలడంలో ఇమాముల్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో 24 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఎంతో నిశిత దృష్టి ఉంటే కానీ అటువంటి ఔట్ల విషయాలను సవాల్ చేయలేం. కానీ ధోని మరోసారి డీఆర్ఎస్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అందుచేత ధోనిపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మాజీ క్రికెటర్లు, అభిమానులు. డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అని కొనియాడుతున్నారు. ‘అంతటి సూక్ష్మ బుద్ధితో రోహిత్‌ను రివ్యూకు వెళ్లమని చెప్పడం ధోనికే చెల్లింది. నిజంగా ధోని జీనియస్’ అని గావస్కర్ కొనియాడాడు. మరొకవైపు ట్వీటర్ వేదికగా ‘ధోని రివ్యూ సిస్టమ్’పై ప్రశంసలు కురుస్తున్నాయి. -
ఏ చహల్ అది లేదబ్బా! : ధోని
డబ్లిన్ : ఇంగ్లండ్‌తో ప్రధాన సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే తమ ఆధిపత్యాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. పసికూనలపై విరుచుకుపడి భారీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. డెసిషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)ను ధోని రివ్యూ సిస్టమ్‌గా.. ఈ నిర్ణయంలో ధోని కింగ్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో సైతం ఇది నిరూపితమైంది. అయితే ఈ విషయంలోనే చహల్‌ను ఇబ్బందులకు గురికాకుండా ధోని రక్షించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్లో చహల్ వేసిన బంతి ఆ జట్టు ఓపెనర్ షెనాన్ ప్లంబ్ ప్యాడ్స్‌కు తగిలింది. వెంటనే చహల్, భారత ఆటగాళ్లంతా అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే అలవాటులో భాగంగా అత్యుత్సాహంతో చహల్ రివ్యూ కోరే ప్రయత్నం చేశాడు. వెంటనే ధోని తన చేతులతో డీఆర్ఎస్ లేదబ్బా అని సైగ చేశాడు. దీంతో అతను సైలెంట్ అయిపోయాడు. అయితే ఐర్లాండ్‌తో జరిగే ఈ రెండు టీ20ల సిరీస్‌లో డీఆర్ఎస్ లేదనే విషయాన్ని చహల్ మరిచిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. గతంలో ఓ మ్యాచ్‌లో ధోని సరదాగా రివ్యూ కోరినట్లు సైగ చేయడంతో మ్యాచ్ రిఫరీ మందలించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లి సేన శుక్రవారం చివరిదైన రెండో టీ20 ఆడనుంది. Dhoni is available, DRS is not! pic.twitter.com/bNfCviFJeI — Anshul kothari (@cricketvideo18) June 27, 2018 -
ఐపీఎల్లో తొలిసారి..
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితమైన అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి(డీఆర్ఎస్)ను ఇక నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చూడబోతున్నాం. దీనిపై గత కొంతకాలంగా జరుగుతున్న చర్చకు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఎట్టకేలకు ముగింపు పలికారు. వచ్చే సీజన్ ఐపీఎల్లో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టబోతున్న విషయాన్ని శుక్లా ధృవీకరించారు. ఫలితంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో డీఆర్ఎస్ విధానం తొలిసారి ప్రవేశపెట్టబోతున్నట్లయ్యింది. 'ఐపీఎల్లో డీఆర్ఎస్ ప్రవేశపెట్టే ఆలోచన ఎప్పటినుంచో ఉంది. దాన్ని ఈసారి అమలుచేయబోతున్నాం' అని శుక్లా తెలిపారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ-చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రమే ఐపీఎల్ ఆరంభ వేడుకులకు రావడంపై శుక్లా వివరణ ఇచ్చారు. అందరు కెప్టెన్లు వేడుకలకు రావడం వల్ల మరుసటి రోజు మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అందుకే మొదటి మ్యాచ్ కెప్టెన్లు మినహా మిగతా జట్ల కెప్టెన్లను ప్రారంభ వేడుకలకు దూరం పెట్టామన్నారు. గతేడాది పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా ప్లే ఆఫ్ స్టేజ్ మ్యాచ్‌లకు డీఆర్ఎస్ను ఉపయోగించారు. తద్వారా టీ 20 టోర్నమెంట్లలో తొలిసారి డీఆర్ఎస్ను ఉపయోగించిన ఘనత పీఎస్ఎల్ దక్కించుకుంది. ఇక 2017 అక్టోబర్‌లో అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల్లో డీఆర్ఎస్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
ఐపీఎల్లో డీఆర్ఎస్
న్యూఢిల్లీ: అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్లో దానికి ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌లో ప్రారంభంకానున్న ఐపీఎల్–11తో ఈ లీగ్‌లో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టనుంది. కచ్చితమైన నిర్ణయాల విషయంలో లోపాలున్న కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే డీఆర్ఎస్ను వ్యతిరేకించిన బీసీసీఐ తమ సొంత లీగ్‌లో దీనికి పచ్చజెండా ఊపడం గమనార్హం. ‘బీసీసీఐ గత కొంత కాలం నుంచి డీఆర్ఎస్ను పరిశీలిస్తోంది. ఐపీఎల్లో ప్రవేశ పెట్టాలని మాత్రం ఈ ఏడాదే నిర్ణయించింది. మిగతా అన్నింట్లో అత్యుత్తమ పద్ధతులను అవలంభిస్తున్నప్పుడు డీఆర్ఎస్ విషయంలో ఎందుకు అమలు చేయకూడదు?’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అంపైర్‌గా మారిన ఆస్ట్రేలియా పేసర్ పాల్ రైఫిల్ ఆధ్వర్యంలో గతేడాది విశాఖపట్నంలో 10 మంది భారత దేశవాళీ అంపైర్లకు డీఆర్ఎస్పై శిక్షణ తరగతులు నిర్వహించారు. -
ఐపీఎల్లో డీఆర్ఎస్..?
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి డీఆర్ఎస్(డిసిషన్ రివ్యూ సిస్టమ్)ను తీసుకురావాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ విస్తరిస్తున్న సమయంలో క్రికెట్లో కీలకంగా మారిన అంపైర్ తుది సమీక్ష నిర్ణయం రాను రాను అన్ని ఫార్మట్లకు విస్తరించనుంది. దీంతో ఐపీఎల్-2018 సీజన్లో డీఆర్ఎస్ ప్రేశపెట్టాలని బీసీసీఐ భావిస్తున్నదని, దీనికి కసరత్తులు మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే విశాఖపట్టణంలో ఐసీసీ ప్యానెల్‌కు బయట ఉన్నభారత టాప్ పది మంది అంపైర్లతో బీసీసీఐ వర్క్‌షాప్ నిర్ణయించినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. ఆ సదరు ఛానెల్‌తో ఓ బీసీసీఐ అధికారి మాట్లాడారు. డీఆర్ఎస్ విషయంలో బీసీసీఐ వర్క్‌షాప్ నిర్వహించటం ఇదే తొలిసారని, ఇక భవిష్యత్తులో అంపైర్ తుది నిర్ణయంలో టెక్నాలజీ కీలక మారునుందన్నారు. ఈ నేపథ్యంలో డీఆర్ఎస్పై అంపైర్లకు అవగాహన కల్పించేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహించినట్లు తెలిపారు. ఇక ఐపీఎల్లో డీఆర్ఎస్ ప్రవేశ పెట్టడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ వర్క్‌షాప్ ఐసీసీ అంపైర్ల కోచ్ డెనిస్ బర్న్స్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాల్ రిఫ్ఫిల్ల నేతృత్వంలో జరిగినట్లు తెలుస్తోంది. పాల్ రిఫ్పిల్ 2004-05 లో అంపైర్‌గా మారారు. -
క్రికెట్ చరిత్రలోనే తొలి సారి..!
అడిలైడ్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో స్మిత్ సేన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది. కేవలం మూడు బంతుల తేడాలోనే రెండు రివ్యూలను కోల్పోయింది. దీంతో ఈ విపత్కర పరిస్థితి ఎదుర్కొన్న తొలి జట్టుగా నిలిచింది. కమిన్స్ వేసిన 42 ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ విషయంలో తొలి రివ్యూను కోల్పోయిన ఆసీస్, డేవిడ్ మాలన్ విషయంలో రెండోసారి తప్పులో కాలేసి రివ్యూను కోల్పోయింది. ఒకటి క్యాచ్ అవుట్ కోసం.. మరొకటి ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ కోరగా అంపైర్ అలీమ్‌దార్ నౌటౌట్‌గా ప్రకటించడంతో రెండు రివ్యూల అవకాశం కోల్పోయింది. గతంలో ప్రతీ 80 ఓవర్లకు రెండు రివ్యూలును అదనంగా ఇచ్చేలా నిబంధనలు ఉండగా, ప్రస్తుతం ఇన్నింగ్స్ మొత్తం రెండే రివ్యూలు ఉండడం ఆసీస్‌ను దెబ్బతీసింది. కేవలం మూడు బంతుల్లోనూ రెండింటినీ కోల్పోయింది. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. -
స్మిత్ లాగే... పెరీరా!
ఇటీవలే భారత్ పర్యటనలో ఆసీస్ కెప్టెన్ స్మిత్ మాదిరిగానే శ్రీలంక బ్యాట్స్‌మన్ దిల్రువాన్ పెరీరా కూడా డీఆర్ఎస్ కోసం పెవిలియన్‌ను ఆశ్రయించాడు. అయితే కోహ్లి సేన నుంచి అభ్యంతరం లేకపోవడంతో మొత్తానికి ఇదేమంత వివాదం కాలేదు. షమీ వేసిన 57వ ఓవర్ చివరి బంతికి పెరీరా ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో హెరాత్‌ను సంప్రదిస్తూనే వెనుదిరిగాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూసి ఉన్నపళంగా ఆగి... రివ్యూ కోరడం చర్చనీయాంశమైంది. రీప్లేలో నాటౌట్‌గా తేలడంతో అతను ఓ 5 పరుగులు చేసేశాడు. ఈ ఘటనతో డీఆర్ఎస్ మళ్లీ డ్రెస్సింగ్ రూమ్ సమీక్షా పద్ధతైంది! చూశాడేమో కానీ... తమ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూశాడేమో కానీ... రివ్యూపై సాయం కోరలేదని, సంజ్ఞలేవీ చేయలేదని లంక బోర్డు (ఎస్ఎల్సీ) వివరణ ఇచ్చింది. ఆసీస్ కెప్టెన్ స్మిత్ -
ఐసీసీ కొత్త రూల్స్.. క్రికెట్ లో కీలక మార్పులు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల్లో మార్పులు చేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పలు నిబంధనల్లో కీలక మార్పులు చేయడంతో పాటు కొత్త రూల్స్ కు తెరలేపింది. ఇప్పటివరకూ టెస్టులు, వన్డేల్లో మాత్రమే ఉన్న అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ను ట్వంటీ 20ల్లో కూడా ప్రవేశపెడుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో 80 ఓవర్ల తరువాత అదనపు రివ్యూలు అమలుకు ఐసీసీ ముగింపు పలికింది. అంటే ఒక ఇన్నింగ్స్ లో 80 ఓవర్లు ముగిసిన పక్షంలో అదనపు రివ్య్యూలు కోరే అవకాశం ఉండదు. ఇక్కడ ప్రతీ ఇన్నింగ్స్ లో రెండు అన్ సక్సెస్ ఫుల్ రివ్యూలను మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. మరొకవైపు రనౌట్ అవుట్ విషయంలో కీలక మార్పుకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఒక బ్యాట్స్ మన్ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్ ను ముందుగా ఒకసారి గ్రౌండ్ ను తాకి ఉంచి ఆ తరువాత అదే బ్యాట్ గాల్లో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. అంటే అదే సమయంలో వికెట్ల పడ్డప్పటికీ బ్యాట్స్ మన్ ముందుగా ఒకసారి క్రీజ్ లో బ్యాట్ ను ఉంచడం వల్ల నాటౌట్ గా సేఫ్ అవుతాడు. ఇదిలా ఉంచితే, మ్యాచ్ జరిగే సమయంలో ఒక ఆటగాడు ఏ విధమైన చెడు ప్రవర్తనకు పాల్పడినా లెవెల్ 4 నిబంధనను అమలు చేయనున్నారు. ఫీల్డ్ లో ఒక క్రికెటర్ తో తారా స్థాయిలో వాగ్వాదం చేసినా, అంపైర్ తో చెడుగా ప్రవర్తించినా ఇవన్నీ లెవెల్ 4 నిబంధనకి కిందకి వస్తాయి. అంటే అతిగా ప్రవర్తించిన సదరు ఆటగాడ్ని ఫీల్డ్ నుంచి బయటకు పంపిచడమే లెవెల్ 4 నిబంధన సారాంశం. కాగా, అంతకుముందున్న ఐసీసీ లెవెల్ 1 నుంచి 3 వరకూ ఉన్న నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి. మరొకవైపు గత కొంతకాలంగా బ్యాట్ మన్లు రకరకాల సైజుల్లో బ్యాట్లు వాడటంపై విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ బ్యాట్ పొడవు, వెడల్పు విషయంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా, తాజా నిబంధన ప్రకారం బ్యాట్ ఓవరాల్ మందం మాత్రం 67 ఎమ్ ఎమ్ కు మించకూడదు. అదే సమయంలో బ్యాట్ అంచు మందం మాత్రం 40 ఎమ్ ఎమ్ ను దాటి ఉండకూడదనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు గురువారం(సెప్టెంబర్ 28) నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
ధోని రివ్యూ సిస్టమ్..!
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోనిని పరిమిత ఓవర్ల క్రికెట్ కు ఎంపిక చేసిన అనంతరం అతనే పేరే ఎక్కువగా వినబడుతోంది. అటు లంక పర్యటనలో అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ తొలుత విమర్శకుల నోళ్లకు తాళం వేసిన ధోని అదే క్రమంలో తరచు వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. సాధారణంగా ధోని అంటే బ్యాటింగ్, కీపింగ్ గురించే మనకు తెలుసు. బ్యాటింగ్ లో హెలికాప్టర్ షాట్లకు మారుపేరైన ధోని.. కీపింగ్ లో అద్భుతమైన క్యాచ్ లతో పాటు స్టంపింగ్ లకు అతనికి అతనే సాటి. ఇదిలా ఉంచితే, డీఆర్ఎస్(డెసిషన్ రివ్య్యూ సిస్టమ్) గురించి అందరికీ తెలిసిందే. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని పునః సమీక్షించే పద్దతినే డీఆర్ఎస్ అంటారు. కాగా, డీఆర్ఎస్ అంటే ధోని రివ్య్యూ సిస్టమ్ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానం పోటెత్తింది. శ్రీలంకతో జరిగిన నాల్గో వన్డేనే ఇందుకు ఉదాహరణ. డీఆర్ఎస్ ను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన ధోని..మరొకసారి ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసి సక్సెస్ కావడంతో అతని పేరు మార్మోగుతోంది. నాల్గో వన్డేల్లో లంక కీలక ఆటగాడు డిక్ వెల్లా డీఆర్ఎస్ ద్వారా పెవిలియన్ కు పంపిన ధోని.. కింగ్ ఆఫ్ డీఆర్ఎస్ గా మన్ననలు అందుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. లంకేయులతో నాల్గో వన్డేలో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 375 పరుగులు చేసింది. ఆపై భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన లంక జట్టు 22 పరుగుల వద్ద తొలి వికెట్ గా డిక్ వెల్లా వికెట్ ను నష్టపోయింది. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో డిక్ వెల్లా ధోనికి క్యాచ్ ఇచ్చాడు. అయితే దీనిపై ధోని అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ మాత్రం నాటౌట్ అని తేల్చిచెప్పాడు. కాగా, ధోని మాత్రం తన అప్పీల్ పై పూర్తి నమ్మకం ఉంచాడు. ఆ క్రమంలోనే కెప్టెన్ కోహ్లికి డీఆర్ఎస్ కు వెళదామని ధోని సూచించాడు. అంతే కోహ్లి డీఆర్ఎస్ కు వెళ్లడం డిక్ వెల్లా పెవిలియన్ కు వెళ్లడం చకచకా జరిగిపోయాయి. దాంతో ధోనిపై అభిమానం వర్షం కురుస్తోంది. ఎంతో నిశిత దృష్టి ఉంటే కానీ అటువంటి అవుట్ల విషయాల్లో సవాల్ చేయలేం. కానీ ధోని చేశాడు.. సక్సెస్ అయ్యాడు. అందుచేత ధోనిపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు అభిమానులు. డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అని కొనియాడుతున్నారు. అంతటి సూక్ష్మ బుద్ధి ధోనికి దేవుడిచ్చిన వరంగా ఒకరు పేర్కొనగా, డీఆర్ఎస్ ను ధోని రివ్యూ సిస్టమ్ గా మార్చి అతన్ని గౌరవించాలని మరొక అభిమాని అభిప్రాయపడ్డాడు. 300 వన్డే మ్యాచ్ ఆడిన ధోని అజేయంగా 49 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. #IndvsSL #Dhoni300 #MSDhoni - DRS-- Dhoni Review System pic.twitter.com/CuDBTNrN3X — SURAJ kr.SINGH (@surajbirni40) 31 August 2017 DRS should be officially renamed as Dhoni Review System Retweet if you agree! #SLvIND #Dhoni300 pic.twitter.com/6aKamqOlDf — MS Dhoni Fans #Dhoni (@msdfansofficial) 31 August 2017 DRS means Dhoni review system.. God gifted talent... pic.twitter.com/0Siue5XkR4 — satender (@satender18) 31 August 2017 -
డీఆర్ఎస్ ఉంది.. టీవీ అంపైర్లు లేరు!
టాన్‌టాన్: ప్రపంచ మహిళా క్రికెట్ లో సమస్యలు ఉన్నాయనడానికి తాజాగా ఘటనే అద్దం పడుతోంది. మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ లేకుండానే మ్యాచ్ జరిగింది. అది కూడా మహిళల క్రికెట్ లో అంపైర్ నిర్ణయ సమీక్ష(డీఆర్ఎస్)ను ప్రవేశపెట్టిన తరువాత థర్డ్ అంపైర్ లేకపోవడం అభిమానుల్ని ఆశ్చర్యానికి లోనుచేసింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో మొదటి వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 14 ఓవర్లో చెడియన్ నేషన్ స్క్వేర్ లెగ్ వైపు ఆడారు. దానిలో భాగంగానే తొలి పరుగును విజయవంతంగా ప్రయోగించి రెండో పరుగు కోసం యత్నించారు. ఈ క్రమంలోనే ఆమె పరుగు పూర్తి చేయకుండానే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెయిల్స్ పడగొట్టి అవుట్ కోసం అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ క్యాథీ క్రాస్ తిరస్కరించారు. అయితే అది అవుటా?కాదా నిర్దారించడానికి టీవీ అంపైర్(థర్డ్ అంపైర్) లేరు. దాంతో చెడియన్ కు లైఫ్ లభించినట్లయ్యింది. ఈ అవుట్ ను తరువాత రిప్లేలో చూస్తే ఆమె క్రీజ్‌లోకి వచ్చేలోపే బెయిల్స్ పడినట్లు తేలింది. కాగా, ఇక్కడ థర్డ్ అంపైర్ అనేవారు ఎవరూ లేకపోవడం వల్లే ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చింది. ఇందుకు కారణం ఏమిటంటే.. ఆ మ్యాచ్ కేవలం ఆన్ లైన్లో మాత్రమే ప్రసారమయ్యింది కానీ టీవీలో కాదు. కేవలం టీవీల్లో ప్రసారమయ్యే మ్యాచ్ లకు మాత్రమే థర్డ్ అంపైర్లను ఐసీసీ నియమించింది. ఇలా ఆన్ లైన్ వచ్చే మ్యాచ్‌లకు థర్డ్ అంపైర్ అవసరం లేదనేది ఐసీసీ అభిప్రాయంగా ఉంది. మహిళల ప్రపంచకప్ లో దాదాపు ఎక్కువ శాతం మ్యాచ్‌లు ఆన్ లైన్ ప్రసారమవుతుండగా, టెలివిజన్ లో పది మ్యాచ్‌లు మాత్రమే టెలికాస్ట్ అవుతున్నాయి. అంటే మరి మహిళల క్రికెట్ లో డీఆర్ఎస్ను ఐసీసీ ప్రవేశపెట్టి ఉపయోగం ఏమిటో ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్న. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో ఇలా జరగడంపై క్రికెట్ విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక టీ20ల్లోనూ డీఆర్ఎస్
లండన్: ఇప్పటిదాకా టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) ఇక నుంచి ట్వంటీ 20ల్లోనూ కనిపించనుంది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి టీ 20ల్లో డీఆర్ఎస్ను అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు నెల క్రితం ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనకు తాజాగా ఆమోద ముద్రవేసింది. ఒక్క తప్పుడు నిర్ణయం పూర్తి మ్యాచ్‌నే మార్చేసే పరిస్థితి ఈ పొట్టి ఫార్మాట్లో కూడా ఉంటుందనేది క్రికెటర్ల అభిప్రాయం. వన్డేలకు, టెస్టులకు మాత్రమే డీఆర్ఎస్ ను పరిమితం చేయడమే కాకుండా, ఈ విధానాన్ని టీ 20ల్లోనూ అమలు చేయాలనే డిమాండ్ ఎక్కువైంది. దీనిలో భాగంగానే మే నెలలో ఐసీసీ క్రికెట్ కమిటీ.. టీ 20ల్లో డీఆర్ఎస్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకు ఐసీసీ నుంచి అంగీకారం లభించడంతో అన్ని ఫార్మాట్లలో ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం ఏర్పడనుంది. -
టి20ల్లోనూ డీఆర్ఎస్!
ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదన లండన్: ఇప్పటిదాకా టెస్టుల్లో, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్) ఇక టి20ల్లోనూ కనిపించే అవకాశాలున్నాయి. బుధ, గురువారాల్లో అనిల్ కుంబ్లే నేతృత్వంలో సమావేశమైన ఐసీసీ క్రికెట్ కమిటీ కొన్ని విప్లవాత్మకమైన మార్పులను ప్రతిపాదించింది. వీటిని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదిస్తే అక్టోబర్ 1 నుంచి అమలవుతాయి. కమిటీ సూచించిన ప్రతిపాదనల ప్రకారం... ఇప్పటిదాకా టి20ల్లో డీఆర్ఎస్ అమలు లేదు. ఒక్క తప్పుడు నిర్ణయం పూర్తి మ్యాచ్‌నే మార్చేసే పరిస్థితి ఈ పొట్టి ఫార్మాట్లో ఉంటుందని గతంలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ గట్టిగా వాదించాడు. దీంతో డీఆర్ఎస్ అమలుకు కమిటీ మొగ్గు చూపింది. అలాగే మైదానంలో అనుచితంగా ప్రవర్తించే ఆటగాళ్లను బయటకు పంపే అధికారం అంపైర్లకు ఉండనుంది. ఎల్బీ నిర్ణయంపై ఆటగాడు అప్పీల్‌కు వెళ్లినప్పుడు రివ్యూలో స్పష్టంగా తేలని సమయంలో అంపైర్ నిర్ణయానికే వదిలేసి అవుట్‌గా ప్రకటించడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఇకనుంచి జట్టు రివ్యూ కోల్పోదు. ఇక టెస్టుల్లో మరిం త పోటీతత్వం తెచ్చేందుకు టెస్టు చాంపియన్‌షిప్‌ను తేవాల్సిందే అని ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. -
స్టీవ్ స్మిత్‌కు మళ్లీ ఏమైంది?
రాంచీ: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదం అతన్ని ఇప్పుడే విడిచిపెట్టేలా కనబడుటల్లేదు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో డీఆర్ఎస్ నిర్ణయంపై డ్రెస్సింగ్ రూమ్ సహాయం కోరి అడ్డంగా దొరికిపోయిన స్మిత్ పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భాగంగా చివరిరోజు ఆటలో జడేజా బౌలింగ్ లో స్మిత్ బౌల్డ్ అయ్యాడు. జడేజా వేసిన ఒక పదునైన బంతిని బ్యాట్ తో అడ్డుకోకుండా అలానే చూస్తుండిపోయి స్మిత్ తన వికెట్ ను సమర్పించుకున్నాడు. దీనిపై బ్రెయిన్ ఫేడ్ ట్యాగ్‌తో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అటు మాజీ క్రికెటర్ల దగ్గర్నుంచి, ఇటు అభిమానులు సైతం ట్విట్టర్ వేదికగా స్మిత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్ తో సిరీస్ లో స్మిత్ కు అసలు ఏమైందంటూ ఛలోక్తులు విసురుతున్నారు. దీనిలో భాగంగా జడేజా బౌలింగ్ లో స్మిత్ బౌల్డ్ అయిన తీరు చూస్తుంటే మళ్లీ అతనికి బుర్ర పనిచేయలేనట్లు ఉందంటూ ఒకరు చమత్కరించగా, ఇక స్మిత్ కు విమాన టికెట్ తీసి స్వదేశానికి పంపడానికి క్రికెట్ ఆస్ట్రేలియా సాయం చేయాలంటూ మరొక అభిమాని చురకలంటించాడు. మరొకవైపు ఈ సిరీస్ లో కచ్చితమైన 'బ్రెయిన్ ఫేడ్' ఏదైనా ఉందంటే అది స్మిత్ అవుటేనని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. -
కోహ్లి కసిగా...
భుజం గాయంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ భాగం పెవిలియన్‌కే పరిమితమైన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే జట్టును నడిపించాడు. అతను మైదానంలో ఉంటే జట్టులో ఉండే ఉత్సాహమే వేరు. జడేజా బౌలింగ్‌లో వార్నర్ బౌల్డ్ కాగానే విరాట్ తన కసినంతా ప్రదర్శించాడు. గాయమైన తన కుడి భుజంపై చేయి వేసి చూపిస్తూ ఆవేశంగా అరిచాడు. మూడో రోజు తనను వ్యంగ్యంగా అనుకరించిన మ్యాక్స్‌వెల్‌కు ఈ రకంగా అతను బదులిచ్చాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో భారత్ దూసుకుపోతుండటంతో ఒక దశలో హాజల్‌వుడ్ స్లెడ్జింగ్‌కు కూడా దిగాడు. అయితే పుజారా చాలా ప్రశాంతంగా ‘వెళ్లి స్కోరు బోర్డు చూసుకో’ అని ఒకే మాటలో జవాబిచ్చేశాడు. భారత్ 4, ఆసీస్ 0 సిరీస్ ఆరంభం నుంచి భారత్‌కు కలిసిరాని డీఆర్ఎస్ నాలుగో రోజు మాత్రం బాగా అచ్చివచ్చింది. ఏకంగా నాలుగు సార్లు రివ్యూ భారత్‌కు అనుకూలంగా రావడం విశేషం. ఇందులో రెండు సార్లు భారత్ రివ్యూ చేసి సానుకూల ఫలితం పొందగా, మరో రెండు సార్లు ఆసీస్ రివ్యూ చేసి భంగపడింది. ఆటలో మరో ఆసక్తికర ఘటన కూడా జరిగింది. పుజారా 142 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ క్యాచ్ కోసం హాజల్‌వుడ్ అప్పీల్ చేశాడు. అవుట్‌గా ప్రకటిస్తున్నట్లు అంపైర్ క్రిస్ గఫానీ తన వేలు చాలా వరకు పైకెత్తారు. అయితే ఆసీస్ ఆటగాళ్ల అప్పీల్లో పెద్దగా బలం లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. దాంతో ఒక్కసారిగా ఆలోచన మార్చుకొని చేతిని తన నెత్తి మీదికి పోనిచ్చి హ్యాట్‌ను సవరించుకోవడం విశేషం! -
వివాదాన్ని ముగించడం సంతోషంగా ఉంది: క్లార్క్
బెంగళూరు టెస్టులో చోటు చేసుకున్న డీఆర్ఎస్ వివాదాన్ని ఇరు దేశాల బోర్డులు త్వరగా ముగించి మంచి పని చేశాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ సంతోషం వ్యక్తం చేశాడు. 2007–08 ఆస్ట్రేలియా పర్యటనలో ‘మంకీగేట్’ వివాదాన్ని ఆండ్రూ సైమండ్స్ అంతగా సాగదీయాల్సింది కాదని అతను అభిప్రాయపడ్డాడు. క్లార్క్ ఆటోబయోగ్రఫీ ‘మై స్టోరీ’ని భారత మాజీ కెప్టెన్ గంగూలీ కోల్‌కతాలో మంగళవారం విడుదల చేశాడు. -
బౌల్డ్ పై డీఆర్ఎస్ కు వెళ్లాడు..
-
బౌల్డ్ పై డీఆర్ఎస్ కు వెళ్లాడు..
గాలె: సాధారణంగా ఎల్బీలు, క్యాచ్‌లు వంటి అనుమానాస్పద నిర్ణయాల్లో మాత్రమే అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని క్రికెటర్లు కోరుతుంటారు. అయితే శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ ను సవాల్ చేసిన విధానం ప్రేక్షకులకు విపరీతమైన నవ్వులు తెప్పించింది. శనివారం చివరి రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ ఆటగాడు సౌమ్య సర్కార్ బౌల్డ్ అయ్యాడు. శ్రీలంక మీడియం ఫాస్ట్ బౌలర్ గుణరత్నే బౌలింగ్ లో్ సౌమ్య సర్కార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే బౌల్డ్ అయిన విషయాన్ని పూర్తిగా చూడని సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ కు వెళ్లాడు. సౌమ్య సర్కార్ బౌల్డ్ అయ్యే క్రమంలో ఫీల్డ్ అంపైర్ కాస్త ఆలస్యంగా నిర్ణయం ప్రకటించడంతో అసలు వికెట్ల వద్ద ఏమి జరిగిందో అనే విషయాన్ని అతను పట్టించుకోలేదు. తన అవుట్ ను సవాల్ చేసే ముందు తాను ఎందుకు డీఆర్ఎస్ కు వెళ్లాల్సివచ్చిందో కనీసం తెలియకపోవడం అభిమానుల్లో నవ్వులు పూయించింది. ఆ మ్యాచ్ లో శ్రీలంక 259 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
స్మిత్‌ది కాదు.. తప్పునాదే : హ్యాండ్స్కాంబ్
బెంగళూరు: రెండో టెస్టులో తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అవుటైన తీరు.. అనంతరం చెలరేగిన వివాదంలో తప్పంతా తనదేనని ఆస్ట్రేలియా క్రికెటర్ పీటర్ హ్యాండ్స్ కాంబ్ అన్నాడు. స్మిత్ రివ్యూ కోసం సలహా అడిగినప్పుడు తనే డ్రెస్సింగ్ గది వైపు చూడాలని చెప్పానన్నాడు. డీఆర్ఎస్ నిబందనలు తెలియకపోవడం వల్లే అలా చేశానని, మంచి ఆటకు పెడర్ధాలు తీయవద్దని ఈ వివాదంపై ట్వీట్ చేశాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్మిత్ ఎల్బీగా అవుటయ్యాడు. అయితే మైదానం నుంచి వెళ్లకుండా హ్యాండ్స్ కాంబ్తో చర్చించిన తర్వాత డ్రెస్సింగ్ గది వైపు చేతులతో సైగ చేశాడు. ఈ విషయంలో స్మిత్ పై సర్వత్రా విమర్శలు రావడంతో తన వల్ల తప్పిదం జరిగిందని హ్యాండ్స్ కాంబ్ వెల్లడించాడు. స్మిత్ హద్దులు దాటాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ రిఫరీకి, అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఈ విషయంపై స్మిత్ తన తప్పును అంగీకరించిన విషయం తెలిసిందే. I referred smudga to look at the box... my fault and was unaware of the rule. Shouldn't take anything away from what was an amazing game! — Peter Handscomb (@phandscomb54) 7 March 2017 -
కోహ్లి అవుటా... నాటౌటా!
చాలా రోజుల తర్వాత కోహ్లికి కోపం వచ్చింది! సిరీస్‌లో వరుస వైఫల్యాల తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో బరిలోకి దిగిన అతడి వికెట్‌ను డీఆర్ఎస్ బలి తీసుకోవడమే అందుకు కారణం. హాజల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 35వ ఓవర్లో నేరుగా వచ్చిన బంతి కోహ్లి ప్యాడ్లకు తగలగానే అర క్షణంలో అంపైర్ నైజేల్ లాంగ్ అవుట్‌గా ప్రకటించారు. నిజానికి బౌలర్ హాజల్‌వుడ్ కూడా బంతి ముందు బ్యాట్‌కు తగిలిందనే అనుకొని నిరాశతో అప్పీల్ చేస్తూ ఆగిపోయాడు. అదే నమ్మకంతో ఉన్న కోహ్లి కూడా వెంటనే రివ్యూ కోరాడు. ఆ సమయంలో కూడా అతను బ్యాట్‌కే బంతి తగిలిందన్నట్లుగా ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే మూడో అంపైర్ కెటిల్‌బరో సూపర్ స్లో మోషన్, అల్ట్రా ఎడ్జ్ కెమెరా టెక్నాలజీ ద్వారా సుదీర్ఘ సమయం పాటు పదే పదే రీప్లేలు చూసినా స్పష్టత రాలేదు. ‘ముందుగా బ్యాట్‌కు బంతి తగిలినట్లు ఎలాంటి కచ్చితమైన రుజువు లేదు’ అని కెటిల్‌బరో, ఫీల్డ్ అంపైర్‌కు వెల్లడించారు. డీఆర్ఎస్ నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్ ఇచ్చేదే తుది నిర్ణయం కాబట్టి కోహ్లి అవుట్ కాక తప్పలేదు. దాంతో భారత కెప్టెన్ తిరిగి వెళుతూ తీవ్ర అసంతృప్తిని ప్రదర్శించాడు. ఇదేంటి అన్నట్లుగా తన బ్యాట్‌ను చూపిస్తూ ఆగ్రహంతో మైదానం వీడాడు. కోహ్లి వికెట్‌పై మాట్లాడుతూ హాజల్‌వుడ్... హాట్‌స్పాట్ ఉంటే సరైన ఫలితం వచ్చేదని అభిప్రాయపడ్డాడు. టెక్నాలజీలో మరో భాగం, ఇన్ఫ్రారెడ్ కిరణాలతో పని చేసే హాట్‌స్పాట్‌ను మాత్రం భారత్‌లో ఇంకా వాడటం లేదు. -
డీఆర్ఎస్ కోచ్ కావలెను!
పుణే టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత జట్టు నాలుగు సార్లు ‘రివ్యూ’ను ఉపయోగించుకుంది. నాలుగు సార్లూ ఫలితం మనకు ప్రతికూలంగానే వచ్చింది. అదే ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఒకే ఒక్కసారి రివ్యూ కోరింది. దానికి ఫలితం పొందడంలో సఫలమైంది. భారత్ బ్యాటింగ్ సమయంలో మూడింటిలో ఒకదాంట్లో మాత్రం విజయవంతమైంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో జయంత్ బౌలింగ్‌లో మూడు బంతుల వ్యవధిలో రెండు సార్లు విఫల రివ్యూ కోరి భారత్ వాటిని కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత జడేజా బౌలింగ్‌లో స్మిత్ కచ్చితంగా అవుటయ్యే అవకాశం ఉన్నా... రివ్యూలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. భారీ లక్ష్య ఛేదన... సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో రివ్యూ అవసరం మున్ముందు కూడా రావచ్చని భారత ఓపెనర్లు భావించలేదు. రివ్యూ జట్టు కోసం కాదు తమ కోసం అన్నట్లుగా విజయ్, రాహుల్ ప్రవర్తించారు. అవుట్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతున్నా అంపైర్ ఎల్బీ అని ప్రకటించగానే వీరిద్దరు నిర్లక్ష్యంగా రివ్యూ కోరారు. ఉన్న రెండు రివ్యూలు కూడా ఐదు బంతుల వ్యవధిలో వృథా అయిపోవడంతో ఆ తర్వాత సాహా, పుజారా అవుట్ల సమయంలో కనీసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేకపోయింది. మన బ్యాటింగ్ వైఫల్యంతో ఇది పెద్దగా కనపడలేదు కానీ డీఆర్ఎస్ కోరడంలో మనం ఇంకా ఎంత వెనుకబడి ఉన్నామనేది మాత్రం అర్థమైపోయింది. సాక్షి క్రీడా విభాగం : దాదాపు ఎనిమిదేళ్ల పాటు భారత్ అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టకేలకు గత ఇంగ్లండ్ సిరీస్ నుంచే దీనిని వాడేందుకు అంగీకారం తెలిపింది. ఇంగ్లండ్ సిరీస్‌లోనే మన డీఆర్ఎస్ సమస్యలు బయటపడినా... ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా కనిపించింది. తుది ఫలితం చూస్తే ఇంతకంటే డీఆర్ఎస్ లేని రోజులే బాగున్నాయి అన్నట్లుగా టీమిండియాకు అనిపిస్తూ ఉంటుంది. టెస్టు క్రికెటర్ అయి ఉండీ కనీస అవగాహన, అంచనా లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు మనోళ్లు సమీక్ష కోరడం జట్టు పరంగా చూస్తే పెద్ద తప్పే. చివరి ఇన్నింగ్స్‌లో కోహ్లి తొందరగానే నిష్క్రమించాడు గానీ నిజంగానే అతను సమీక్షలో బయటపడగలిగే పరిస్థితి వచ్చి రివ్యూ అందుబాటులో లేకపోతే నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ‘ఏమో మన అదృష్టం పరీక్షించుకుందాం అని ప్రయత్నం చేయడం జట్టు ప్రయోజనాలను పణంగా పెట్టడమే. భారత్ డీఆర్ఎస్ వాడటంలో చాలా మెరుగుపడాలి’ అని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. ‘రివ్యూల విషయంలో భారత్ నన్ను షాక్‌కు గురి చేసింది. చివరి ఇన్నింగ్స్‌లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు రాహుల్ దానికి ఎలా రివ్యూ కోరాడు’ అని రవిశాస్త్రి విమర్శించారు. ఇక రివ్యూ లేకపోవడంతో బతికిపోయిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్య కూడా పుండు మీద కారం చల్లేలా ఉంది. ‘భారత జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్ అంత తొందరగా రివ్యూ వాడుకోవడం మా అదృష్టం. ఇలాంటి వికెట్‌పై కచ్చితంగా రివ్యూ అవసరం పడుతుంది. కనీసం ఒకదానిని భద్రంగా దాచుకుంటేనే మంచిది’ అని స్మిత్ అన్నాడు. నేర్చుకోవాల్సిన సమయం... టెస్టు కెప్టెన్‌గా ఇప్పటికే ఘనమైన రికార్డుతో ఉన్న కోహ్లి డీఆర్ఎస్ విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా బౌలింగ్/ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి పూర్తిగా అంచనాలు తప్పుతున్నాడు. ఫీల్డింగ్ కెప్టెన్‌గా అతను ఇప్పటి వరకు 39 సార్లు రివ్యూ కోరగా 30 సార్లు ఫలితం భారత్‌కు ప్రతికూలంగా రావడం ఈ విషయాన్ని సూచిస్తోంది. తన స్పిన్నర్లు, కీపర్ సాహా మీద అతను చూపిస్తున్న అపార నమ్మకం ఫలితాన్నివ్వడం లేదు. ఎందుకంటే అశ్విన్, జడేజాల బౌలింగ్‌లో 24 సార్లు రివ్యూ కోరితే 18 సార్లు మనదే తప్పని తేలింది! సమీక్ష కోరితే కచ్చితంగా మన వైపే వస్తుందనే హామీ అయితే ఎవరూ ఇవ్వలేరు కానీ మ్యాచ్ గమనాన్ని బట్టి దానిని సమర్థంగా వాడుకోవడం కూడా కీలకం. విజయ్, రాహుల్ నిర్ణయం పట్ల కోహ్లి కచ్చితంగా తీవ్ర కోపానికి గురయ్యే ఉంటాడని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సాధ్యమైనంతగా అంపైర్ పొరపాట్లను తగ్గించి సరైన నిర్ణయం వెలువరించడమే డీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం. కానీ ఆటగాళ్లకు రివ్యూ కోరే అవకాశం ఇవ్వడంతో అంతా గందరగోళంగా మారుతోంది. ఇంతకంటే మెరుగైన పద్ధతి గురించి ఐసీసీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇది ఇలాగే కొనసాగితే భారత జట్టుకు ప్రాక్టీస్‌తో పాటు ప్రత్యేకంగా డీఆర్ఎస్ అవగాహనా తరగతులు కూడా నిర్వహించాల్సిన అవసరం వస్తుందేమో! -
98.5 శాతం సరైన నిర్ణయాలే!
అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ను ఉపయోగించడం వల్ల అంపైర్లు 98.5 శాతం వరకు సరైన నిర్ణయాలు వెలువరిస్తున్నారని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. 94 శాతం వరకు సరైన ఫలితాలు రావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నా... అది మరింత మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. డోపింగ్ ఫలితాలను మరింత పక్కాగా తేల్చేందుకు ఈ ఏడాది నుంచి రక్త పరీక్షలు కూడా ప్రవేశ పెడుతున్నామన్న రిచర్డ్సన్ ... క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చే విషయంపై మరోసారి త్వరలోనే చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
ఇక అన్ని ఫార్మాట్లలోనూ డీఆర్ఎస్
దుబాయ్: ఇప్పటిదాకా టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని ఇకపై అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. దుబాయ్‌లో రెండు రోజుల పాటు జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. మేలో జరిగే క్రికెట్ కమిటీ మీటింగ్‌లో ఈ ప్రతిపాదనలపై మరోసారి చర్చ జరిగి జూన్‌లో జరిగే వార్షిక సమావేశంలో లాంఛనంగా ఆమోదించనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌లో తొలిసారిగా డీఆర్ఎస్ను ఉపయోగించబోతున్నారు. ఇందులో ప్రతీ జట్టుకు ఒక రివ్యూ అవకాశం ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఇక నుంచి డీఆర్ఎస్ అమలుకు అయ్యే ఖర్చును కూడా ఐసీసీయే భరించనుంది. ఇప్పటిదాకా ద్వైపాక్షిక సిరీస్ జరుగుతున్నప్పుడు ఆతిథ్య జట్టు బ్రాడ్‌కాస్టర్‌పై ఈ భారం పడేది. కొన్ని సందర్భాల్లో ఆతిథ్య జట్టు కూడా కొంత మేర భరించేది. వాస్తవానికి ఇటీవలి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టి20 సిరీస్‌లో పలు అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదం కావడంతో డీఆర్ఎస్ చర్చకు వచ్చింది. ఇదిలావుండగా డీఆర్ఎస్ను మ్యాచ్‌ల్లో ఉపయోగించడానికి ముందు దీంట్లో ఉపయోగించే హాక్ఐ, హాట్‌స్పాట్, అల్ట్రా ఎడ్జ్, రియల్ టైమ్ స్నికో ప్రదర్శనపై మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)తో ఆమోద ముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. -
అంతు పట్టడం లేదా!
భారత్, ఇంగ్లండ్లను గందరగోళంలో పడేస్తున్న డీఆర్ఎస్ ♦ ఇరు జట్ల తప్పుడు నిర్ణయాలు ♦ ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితి ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో తొలిసారి భారత్ అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)లో భాగమైంది. కానీ దానిని ఉపయోగించుకోవడంలో శ్రీలంక 11 సార్లు సఫలం కాగా భారత్‌కు అనుకూలంగా ఒకే ఒక్కసారి ఫలితం వచ్చింది! దాంతో దెబ్బకు మళ్లీ ఆ వైపు వెళ్లని టీమిండియా జట్టు... కెప్టెన్, కోచ్ మారాక ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ‘రివ్యూ’కు అంగీకారం తెలిపింది. మరోవైపు ఇంగ్లండ్ చాలా కాలంగా డీఆర్ఎస్ను వాడుతూ వస్తోంది. అయితే తాజా టెస్టు సిరీస్‌లో ఇరు జట్లూ సమీక్ష కోరడంలో అంచనా తప్పుతున్నాయి. రెండు టీమ్‌లకూ ఇదో అర్థం కాని బ్రహ్మ పదార్థంలా మారిపోయింది. ఇటీవల మారిన డీఆర్ఎస్ నిబంధనలు కూడా ఇందుకు ఒక కారణం. సాక్షి క్రీడా విభాగం విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో భారత్, ఇంగ్లండ్ కలిపి 21 సార్లు అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేశారుు. ఇందులో 12 సార్లు ఇంగ్లండ్ డీఆర్ఎస్ వాడగా, మరో 9 సార్లు భారత్ దీనిని ఉపయోగించుకుంది. వీటిలో ఇరు జట్లు మూడేసి సార్లు మాత్రమే తమ అప్పీల్‌కు అనుకూల ఫలితం రాబట్టగలిగాయి. అంటే 15 సార్లు ఆటగాళ్లు విఫల ప్రయత్నం చేసినట్లే లెక్క! సిరీస్‌లోని మిగతా రెండు టెస్టుల్లో కలిపి మరో 18 సార్లు డీఆర్ఎస్ సమీక్ష ముందుకు వచ్చింది. అయితే ఓవరాల్‌గా చూస్తే రెండు టీమ్‌లు కూడా చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే పక్కాగా విశ్వాసంతో రివ్యూను కోరాయి. చాలా వరకు 50-50 తరహాలోనే కొంత ఆశతో, ఒక రారుు వేసి చూస్తే తప్పేమిటనే తరహాలోనే అప్పీల్ చేశారుు. మరికొన్ని సందర్భాల్లో చివరి వరుస బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఉన్నప్పుడు ‘రివ్యూ’ మిగిలి ఉంది కాబట్టి నమ్మకం లేకపోయినా రివ్యూను వాడుకున్నారు. చివరకు నాలుగు ఇన్నింగ్సలలో కలిపి ఐదు పరుగులు చేసిన ఇంగ్లండ్ బౌలర్ బ్యాటీ కూడా తన ఎల్బీ నిర్ణయంపై సమీక్ష కోరడం చిత్రంగా అనిపిస్తుంది. మారిన నిబంధనలు... ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి డీఆర్ఎస్లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం బ్యాట్స్‌మెన్ అవుట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉండగా, బౌలర్లకు ఇది అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ట్రాకింగ్ చేసినప్పుడు గతంలో బంతి సగంకంటే ఎక్కువ భాగం స్టంప్‌ను తాకాలన్నట్లుగా నిబంధనలు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఆ జోన్ పరిధి తగ్గించడంతో అలా తాకీ తాకకుండా (టచ్ అండ్ గో) వెళుతున్న బంతులకు కూడా బ్యాట్స్‌మన్ అవుట్ కావచ్చు. బహుశా దీనిని అంచనా వేయడంలోనే ఆటగాళ్లు పొరబడుతున్నారు. పైగా ఇలాంటి సందేహాస్పద ఎల్బీడబ్ల్యూ రివ్యూల సమయంలో మొత్తం సమీక్షించిన తర్వాత కూడా ‘అంపైర్స్ కాల్’ అంటూ తుది నిర్ణయం తీసుకునే హక్కు ఫీల్డ్ అంపైర్‌కే ఉంటుంది తప్ప థర్డ్ అంపైర్‌కు కాదు. అంపైర్లు మరీ బొమ్మల్లా మిగిలిపోకుండా ఈ నిబంధనను చేర్చారు. అరుుతే పాపం... డీఆర్ఎస్ కొన్ని సార్లు అంపైర్లను పూర్తిగా తప్పు పడుతుండటం వారికి ఇబ్బందికరంగా మారింది. భారత్‌తో సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్, ఇంగ్లండ్ మధ్య చిట్టగాంగ్‌లో జరిగిన టెస్టులో ధర్మసేన ఇచ్చిన 16 నిర్ణయాల్లో ఏకంగా 8 తప్పుగా తేలారుు! పొరపాట్లు, దిద్దుబాట్లు... వైజాగ్ టెస్టులో నాలుగో రోజు జట్టును ఓటమి నుంచి తప్పించేందుకు కుక్ పోరాడుతున్న సమయంలో వికెట్‌ను ఆశిస్తున్న భారత్ ఐదు బంతుల వ్యవధిలో రెండు సార్లు ‘రివ్యూ’ కోరి భంగపడింది. ఈ సందర్భాల్లో బౌలర్లు పట్టుదలగా కనిపించడంతో కోహ్లి వెంటనే రివ్యూ కోరినా లాభం లేకపోయింది. అదే మొహాలీ టెస్టులో రెండో ఇన్నింగ్సలో స్టోక్స్ విషయంలో ఇది బ్రహ్మాండంగా పని చేసింది. రెండో టెస్టులో జయంత్ బౌలింగ్‌లో మొరుున్ అలీ ముందుకు దూసుకొచ్చి షాట్ ఆడటంతో అంపైర్ నాటౌట్ ఇవ్వగా, ఫీల్డర్లు ముందు అదే నమ్మారు. కానీ కీపర్ సాహా ఒత్తిడితో సమీక్ష కోరగా అది అవుట్‌గా తేలింది. మరోవైపు ఎంతో అనుభవం ఉన్నా... ఇంగ్లండ్ కూడా ఇలాంటి పొరపాట్లు చాలా చేసింది. రాజ్‌కోట్ టెస్టులో 135 మ్యాచ్‌ల అనుభవం ఉన్న కుక్, తొలి మ్యాచ్ ఆడుతున్న హమీద్‌ను అడిగి రివ్యూకు వెళ్లకుండా నిష్క్రమించాడు. అయితే రీప్లే చూస్తే అతను నాటౌట్ అని తేలింది. ఆ వెంటనే కచ్చితంగా అవుట్‌గా కనిపిస్తున్నా హమీద్ తన కోసం రివ్యూ కోరి దానిని వృథా చేశాడు. వైజాగ్ టెస్టులో సాహా విషయంలో కుక్ సేన రివ్యూను సమర్థంగా ఉపయోగించుకోగలిగింది. అంచనా వేయడమెలా... మ్యాచ్‌లో ఒక్కో రివ్యూ ఎంతో కీలకం కావడంతో దానిని సమర్థంగా వాడుకోవడం కూడా ముఖ్యం. అంపైర్ నిర్ణయం ప్రకటించిన 15 సెకన్లలోపే రివ్యూను కోరాల్సి ఉంటుంది. అందుకే ఆ హడావిడిలో ఎక్కువగా ఆలోంచించుకోకుండానే కెప్టెన్లు రివ్యూలకు వెళ్లాల్సి రావడం కూడా లెక్క తప్పడానికి కారణమవుతోంది. కాబట్టి బౌలర్, తన అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించినప్పుడు వికెట్ కీపర్, క్లోజ్ ఇన్ ఫీల్డర్ సూచనలను బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటున్నాడు. అదే బ్యాట్స్‌మన్ అయితే పూర్తిగా నాన్ స్ట్రరుుకర్పైనే ఆధారపడుతున్నాడు. ఇది ఎంత ప్రధానాంశంగా మారిందనేదానికి మొహాలీ టెస్టు రెండో ఇన్నింగ్సలో జరిగిన ఒక ఘటన సూచిస్తుంది. ఓపెనర్ కుక్ బ్యాటింగ్ చేస్తుండగా నాన్స్ట్రయికింగ్లో రూట్ ఉన్నాడు. డీఆర్ఎస్ సమస్యను అధిగమించేందుకు రూట్ స్టంప్స్‌కు మరీ దగ్గరగా నిలబడ్డాడు. అక్కడినుంచి అరుుతే బంతి గమనం మరింత స్పష్టంగా కనిపిస్తుందని అతని ఆలోచన. దాంతో బౌలింగ్ చేయడంలో అశ్విన్‌కు తీవ్ర ఇబ్బంది కలిగింది. దీనిపై స్వల్ప వాదన అనంతరం కల్పించుకున్న అంపైర్లు... బ్యాట్స్‌మెన్ ఎక్కడైనా నిలబడవచ్చని రూట్‌ను సమర్థించారు. డీఆర్ఎస్పై అంచనా ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. మున్ముందు సిరీస్‌లో ఇరు జట్లు దీనిని మరింత సమర్థంగా ఎలా వాడుకుంటాయనేది ఆసక్తికరం. మా రివ్యూలు కొన్ని సందర్భాల్లో తప్పుగా తేలాయనే విషయాన్ని అంగీకరిస్తాను. అరుుతే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తున్నామంటే మనం మరో రకంగా ఆలోచిస్తున్నట్లు అర్థం. నా అభిప్రాయాన్ని ఒకసారి పరీక్షించుకునే అవకాశం డీఆర్ఎస్ నాకు ఇస్తోంది. కాబట్టి అది సరిగ్గా తేలినా, తప్పయినా నేను అప్పీల్‌కు వెళతాను. ఎల్బీడబ్ల్యూ నిర్ణయాలు సరిగ్గా తీసుకునేందుకు ఫీల్డ్ అంపైర్లకే ఎక్కువ అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. ‘అంపైర్స్ కాల్’ అంటూ తుది నిర్ణయం వారి చేతుల్లో పెట్టడంపై నాకెలాంటి అభ్యంతరం లేదు. అయినా ఇంత తక్కువ సమయంలో మేం దానిని సమర్థంగా ఉపయోగిస్తున్నామా లేదా తేల్చేయడం తప్పు. దానికి కనీసం 12 నెలల సమయం అయినా కావాలి. ఆ తర్వాతే విశ్లేషించి ఒక అభిప్రాయానికి రావచ్చు. -విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
విరాట్ సేన విఫలమైందా?
రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో సుదీర్ఘ ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతి(డీఆర్ఎస్)కు భారత క్రికెట్ కంట్రోలో బోర్డు(బీసీసీఐ) సుముఖత వ్యక్తం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మన జట్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుందా?అంటే కాదనే వాదన వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు చేసిన రెండు తప్పిదాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆడేటప్పుడు అలెస్టర్ కుక్ ఆడిన ఒక బంతి బ్యాట్ ను తాకి చేతులో పడినట్లు భావించిన భారత వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహా అప్లై చేశాడు. అయితే ఈ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. దీనిపై డీఆర్ఎస్కు వెళ్లాలని భావించిన సాహా.. ఆ విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లికి చెప్పాడు. సాహా సూచనను పాటించిన కోహ్లి డీఆర్ఎస్కు వెళ్లాడు. ఆ బంతి అసలు బ్యాట్ కు తాకకపోవడం ఒకటైతే, చాలా దూరం నుంచి వెళ్లుతున్నట్లు రిప్లేలో కనిపించింది. దాంతో భారత్ ఆ రివ్యూలో విఫలమైంది. ఇక్కడ ప్రధానంగా డీఆర్ఎస్కు వెళ్లాలా?లేదా?అనేది వికెట్ కీపర్, బౌలర్, అవతలి ఎండ్ లో ఉన్న బ్యాట్స్‌మన్‌పై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. బంతి పిచ్ అయిన మరుక్షణమే ఆ గమనాన్ని అంచనా వేసేది ఈ ముగ్గురే. మరి బ్యాట్ నే తాకని బంతిని క్యాచ్ కోసం వికెట్ కీపర్ ఎలా అప్లై చేశాడనేది తొలి ప్రశ్న. అంటే ఆ బంతిని పూర్తిగా చూడకుండానే మన సాహా రివ్యూకు సిద్ధమైన విషయం బోధపడుతుంది. ఇదిలా ఉంచితే, 310 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు చేసిన మరొక తప్పిదం కూడా డీఆర్ఎస్ వినియోగంపై విమర్శలకు దారి తీస్తుంది. భారత ఆటగాడు చటేశ్వర పూజారా అవుటైన సందర్బంలో డీఆర్ఎస్ను మన జట్టు కోరలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్ రషీద్ వేసిన బౌలింగ్‌లో పూజారా ఎల్బీగా వెనుదిరిగాడు. పూజారా ఎల్బీ విషయంలో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో కట్టుబడి పెవిలియన్ చేరాడు. అయితే క్రీజ్‌ను విడిచే వెళ్లే సమయంలో డీఆర్ఎస్ను పూజారా మరచినట్లు కనిపించాడు. అవతలి ఎండ్ లో ఉన్న మురళీ విజయ్ను కనీసం సంప్రదించలేదు. ఈ విషయంపై విజయ్ కూడా రివ్యూకు వెళ్లమని పూజారాకు చెప్పలేదు. అయితే పూజారా ఎల్బీగా అవుటైన బంతి పిచ్ అయిన తరువాత లెగ్ స్టంప్ బయటకు వెళుతున్నట్లు స్పష్టంగా కనబడింది. అంటే పూజారా అవుట్ కాలేదని విషయం రిప్లేలో కనబడింది. కాగా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జట్టులో ఒక కీలక ఆటగాడు ఉన్న అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోపోతే ఫలితం ఇలానే ఉంటుందనేది తరువాత టీమిండియాకు అర్ధమైంది. ఒకవేళ మ్యాచ్ భారత్ ఓడిపోయి ఉంటే విమర్శల దాడి తీవ్రంగానే ఉండేది. పూజారా రెండో వికెట్ గా అవుటైన తరువాత భారత్ తడబడింది. వరుసగా కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. అయితే విరాట్ కోహ్లి, రవి చంద్రన్ అశ్విన్, జడేజాలు రాణించడంతో భారత జట్టు ఓటమి నుంచి తృటిలో తప్పించుకుని బయటపడింది. అడగాల్సిన చోట అడగకుండా, అవసరం లేని చోట డీఆర్ఎస్పై విరాట్ సేన ముందుకు వెళ్లడం ద్వారా అనుభవలేమి కనబడింది. ఇంకా మెరుగుపడాలి:కోహ్లి డీఆర్ఎస్పై తాము ఇంకా మెరుగపడాలని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. నాన్-స్ట్రైకర్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ దీనిపై ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నాడు. అసలు బంతి ఎంతవరకూ స్టంప్స్ పైకి వెళుతుందనేది నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్న ఆటగాడు దాదాపు అంచానా వేయాల్సి ఉందన్నాడు. అయితేస్టంప్స్ కు కాస్త దూరంగా వెళుతున్న బంతిని అంచనా వేయడం చాలా కష్టమన్నాడు. ప్రత్యేకంగా ఎల్బీల విషయంలో క్రీజ్ ను ముందుగానే వదిలి వెళ్లకుండా అవతలి ఆటగాడి సాయం తీసుకోవాలని కోహ్లి పేర్కొన్నాడు. -
ఇంగ్లండ్‌కు డీఆర్ఎస్ భయం!
రాజ్‌కోట్: భారత్ తో జరిగే సుదీర్ఘ ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో తాము పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్నామని ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. రేపట్నుంచి తొలి టెస్టు ఆరంభమవుతున్న నేపథ్యంలో తమ జట్టు అండర్ డాగ్స్‌గా పోరుకు సిద్ధమవుతుందన్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకులో ఉన్న భారత్.. ఇటీవల కాలంలో అద్భుతమైన క్రికెట్ ఆడుతుందని కొనియాడాడు. ఈ సిరీస్‌లో తమకు అది పెద్ద ఛాలెంజ్ ఎదురుకాబోతుందని అండర్సన్ పేర్కొన్నాడు. తమ ప్రణాళికలు ఇక్కడ అంతగా పని చేయకపోవచ్చని బ్రాడ్ స్పష్టం చేశాడు. మరోవైపు భారత్ క్రికెట్ జట్టు డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయ పద్ధతి)అమలుకు సిద్ధమైన నేపథ్యంలో ఈ అంశంపై తాము అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. తాము గతంలో డీఆర్ఎస్తో చాలా మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. ఇక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయన్నాడు. డీఆర్ఎస్పై ముందుకు వెళ్లే క్రమంలో జట్టు కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమన్నాడు. ప్రధానంగా వికెట్ కీపర్, బౌలర్‌కు ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతిపై ముందడుగు వేయాలన్నాడు. 'ఇంగ్లండ్‌లో డీఆర్ఎస్ అనేది చాలా పాపులర్. ఇటీవల బంగ్లాదేశ్ తో కూడా డీఆర్ఎస్ తో మ్యాచ్ లు ఆడాం. అయితే ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల కంటే భారత్ లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ డీఆర్ఎస్ కు వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండాలి. భారత్ లో పిచ్ లు చాలా భిన్నంగా ఉండే క్రమంలో కొన్ని ఫలితాలు మనం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. దాంతో డేంజర్ జోన్లో పడే అవకాశం ఉంది. ఒకసారి ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే ముందు అటు కెప్టెన్, వికెట్ కీపర్‌తో పాటు కెప్టెన్ తో సమీక్షించి ముందడుగు వేయాల్సి ఉంది'అని బ్రాడ్ తెలిపాడు. -
డీఆర్ఎస్ కంటే ఆట ముఖ్యం: రహానే
రాజ్‌కోట్: ఎనిమిదేళ్ల అనంతరం భారత జట్టు అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతి (డీఆర్ఎస్) అమలుతో టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. అయితే దీని గురించి ఎక్కువ చర్చ అనవసరమని... డీఆర్ఎస్ కంటే ఆట గురించి ఆలోచించడం ముఖ్యమని భారత బ్యాట్స్‌మన్ రహానే అన్నాడు. ‘డీఆర్ఎస్ గురించి గత సిరీస్ నుంచే మాట్లాడుకుంటున్నాం. దీని గురించి మా దగ్గర ప్రణాళికలు ఉన్నారుు. ఇది అమలు ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఎలాంటి నిర్ణయాలను సమీక్షించమని అడగాలి లాంటి అంశాలపై చర్చించుకున్నాం. అరుుతే దీని కంటే నాణ్యమైన క్రికెట్ ఆడటంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి’ అని రహానే చెప్పాడు. డీఆర్ఎస్ను ఉపయోగించుకోవడంలో వికెట్ కీపర్, స్లిప్‌లో ఫీల్డర్ పాత్ర కీలకమని అన్నాడు. రివ్యూకు వెళ్లడంపై ప్రతీసారీ స్పష్టత ఉండాల్సిందేనని అన్నాడు. మరోవైపు మూడు దశాబ్దాల అనంతరం భారత క్రికెట్ జట్టు సొంత గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. దీంతో సిరీస్ ముగింపు వరకు ఆటగాళ్లు తాజాగా ఉండడంతో పాటు ఆసక్తి కోల్పోకుండా ఉండడం ముఖ్యమని రహానే అభిప్రాయపడ్డాడు. అరుుతే ఇంగ్లండ్ పర్యటన (2014)లో తాము ఐదు టెస్టుల సిరీస్ ఆడామని, ఎలా పోరాడాలో తమకు అవగాహన ఉందని చెప్పాడు. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ లైనప్ అనుభవంతో కూడుకుందని, వారి స్పిన్నర్లు కొత్తవారే అరుునా అలసత్వం తగదని సూచించాడు. ‘గత ఏడాదిన్నర కాలం నుంచి మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. నిలకడగా ఆడడం చాలా ముఖ్యం. రాజ్‌కోట్‌లో ఆధిక్యం ప్రదర్శించి సిరీస్ మొత్తం అదే ఆటను చూపాలనే ఆలోచనలో ఉన్నాం. విరాట్ కెప్టెన్సీలో ఆడడాన్ని ఆస్వాదిస్తున్నాం. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది’ అని 28 ఏళ్ల రహానే తెలిపాడు. డీఆర్ఎస్ కీలకం: బ్రాడ్ ఇంగ్లండ్ జట్టుకు డీఆర్ఎస్ కొత్త కాకపోరుునా భారత గడ్డపై విభిన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హెచ్చరించాడు. ‘ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్ కాస్త భిన్నంగా ఉంటుంది. మా దగ్గర బంతి సీమ్, స్వింగ్ అయ్యే విధానంతో పోలిస్తే ఇక్కడ స్పిన్ చాలా తేడాగా ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకోవడం కష్టం. ఈ సిరీస్‌లో డీఆర్ఎస్ పాత్ర చాలా కీలకంగా ఉండనుంది’ అని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. -
బీసీసీఐ నిర్ణయం భేష్..
న్యూఢిల్లీ:అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సుముఖత వ్యక్తం చేయడంపై మాజీ ఆటగాళ్లు హర్హం వ్యక్తం చేశారు. డీఆర్ఎస్ పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉన్నట్లు భారత మాజీ కెప్టెన్లు మొహ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీలు స్పష్టం చేశారు. 'నేను ఆడుతున్న రోజుల నుంచి డీఆర్ఎస్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం డీఆర్ఎస్ విధానం అప్పటికంటే చాలా మెరుగ్గా ఉంది. దాంతో బీసీసీఐ ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి వెనకడుగు వేయలేదు. అందుకు కారణం కూడా లేదనే అనుకుంటున్నా. ఇంగ్లండ్ తో డీఆర్ఎస్ను పరీక్షించాలనే నిర్ణయం నిజంగా ఆహ్వానించదగిందే' అని గంగూలీ తెలిపాడు. 'భారత జట్టు ఇప్పటికే డీఆర్ఎస్ టెక్నాలజీని వాడుకోవాల్సింది. ఈ టెక్నాలజీకి అప్పట్లో బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అనేక మ్యాచ్‌లను దగ్గరగా వచ్చి కోల్పోయాం. కాస్త ఆలస్యమైనా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఇది ఒక మంచి ఆలోచన'అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ప్రయోగాత్మకంగా డీఆర్ఎస్ ను అమలు చేయాలని నిర్ణయించింది. గతంతో పోలిస్తే డీఆర్ఎస్లో పలు మార్పులు చోటు చేసుకోవడంతో బీసీసీఐలో అంతర్గతంగా చర్చ జరిగింది. తాజాగా డీఆర్ఎస్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసీసీ) భారత క్రికెట్ బోర్డుకు వీడియో ప్రదర్శన ద్వారా చూపింది.దీనిపై బీసీసీఐ అంగీకారం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. -
డీఆర్ఎస్కు బీసీసీఐ ఓకే
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అమలు న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా అంపైర్ నిర్ణయ సమీక్షా పద్దతి (డీఆర్ఎస్)ని వ్యతిరేకిస్తున్న బీసీసీఐ ఎట్టకేలకు తమ వైఖరిని మార్చుకుంది. ఈ పద్ధతిపై సానుకూలత వ్యక్తం చేస్తూ ఇంగ్లండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణరుుంచింది. గతంతో పోలిస్తే డీఆర్ఎస్లో పలు మార్పులు చోటు చేసుకోవడంతో బీసీసీఐలో అంతర్గతంగా చర్చ జరిగింది. తాజాగా డీఆర్ఎస్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌మండలి (ఐసీసీ) భారత క్రికెట్ బోర్డుకు వీడియో ప్రదర్శన ద్వారా చూపింది. ‘బీసీసీఐ సూచించినట్టుగానే హాక్ ఐ పద్ధతిలో పలు మార్పులను చేశారు. అందుకే అప్డేట్ చేసిన ఈ డీఆర్ఎస్ను అమలు చేయాలని నిర్ణరుుంచుకున్నాం. నవంబర్ 9 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తాం. ఇందులో నెలకొన్న నూతన పద్ధతులు ఎంతవరకు సరిగ్గా ఉన్నాయో ఈ సమయంలో తెలుస్తుంది. ముఖ్యంగా డీఆర్ఎస్ అనేది ఎల్బీ నిర్ణయాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంటుంది. అందుకే బంతి ఎంతవరకు బ్యాట్స్‌మన్ ప్యాడ్‌ను తాకిందనే విషయాన్ని నిశితంగా పరిశీలిస్తాం. అలాగే బాల్ ట్రాకింగ్ సాంకేతికతలో అల్ట్రామోషన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి కచ్చితత్వ నిర్ణయాలు వచ్చే అవకాశాలుంటారుు’ అని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గతంలో డీఆర్ఎస్ను బోర్డుతో పాటు కెప్టెన్ ఎంఎస్ ధోని తీవ్రంగా వ్యతిరేకించారు. అరుుతే కోచ్‌గా కుంబ్లే, కెప్టెన్‌గా కోహ్లి రాకతో పరిస్థితుల్లో మార్పు కనిపించింది. వీరిద్దరు ఈ పద్ధతికి సానుకూలత వ్యక్తం చేశారు. ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కుంబ్లే గతేడాది ఎంఐటీ లాబొరేటరీని సందర్శించి బాల్ ట్రాకింగ్ సాంకేతికతతో పాటు హాట్ స్పాట్‌ను ఆధునీకరించిన విధానాన్ని పరిశీలించారు. భారత్ చివరిసారిగా 2008లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో డీఆర్ఎస్ను ఉపయోగించింది. -
డీఆర్ఎస్కు బీసీసీఐ ఓకే!
న్యూఢిల్లీ:అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని పరీక్షించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో డీఆర్ఎస్ను పరీక్షించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా డీఆర్ఎస్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన వీడియో ప్రజెంటేషన్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు చూపించింది. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన తరువాత బీసీసీఐ అందుకు ఆమోదం తెలిపింది. 'మెరుగుపరిచిన డీఆర్ఎస్పై సంతోషంగా ఉన్నాం. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో డీఆర్ఎస్ను పరీక్షిస్తాం. దాని పనితీరు ఎలా ఉంది. ఆ పద్ధతి ఎంతవరకూ సఫలీకృతం కానుంది అనేది రాబోవు టెస్టు సిరీస్‌లో పర్యవేక్షిస్తాం. ప్రత్యేకంగా ఎల్బీ డబ్యూ నిర్ణయాల్లో డీఆర్ఎస్ పాత్ర పెద్దది. ఎల్బీని నిర్దారించే విషయంలో బంతి ఎంతవరకూ బ్యాట్స్‌మన్ ప్యాడ్ ను తాకింది అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. బాల్ ట్రాకింగ్ టెక్నాలజీలో భాగంగా అల్ట్రా మోషన్ కెమెరాలను ఉపయోగించనున్నారు' అని బీసీసీఐ అధ్యక్షడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
20న బీసీసీఐ ముందు డీఆర్ఎస్ ప్రజెంటేషన్
ధర్మశాల: అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దిన వీడియో ప్రజెంటేషన్‌ను భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)కు చూపించేం దుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. ఈ నెల 20న న్యూఢిల్లీలో బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ముందు ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డిస్ ఈ ప్రజెంటేషన్‌ను చూపించనున్నారు. అక్కడ వన్డే ఆడేందుకు వెళ్లే భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఈ ప్రజెంటేషన్‌ను తిలకించే అవకాశముంది. కుంబ్లే ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఇందులో పాల్గొననున్నాడు. భారత్ ఎప్పుడు డీఆర్ఎస్ను వద్దనలేదని దాని పనితీరుపైనే అనుమానాలు వ్యక్తం చేసిందని ఠాకూర్ పేర్కొన్నారు. -
తేడా లేకపోతే డీఆర్ఎస్ ఎందుకు?
కోల్ కతా:కొన్ని క్రికెట్ దేశాలకే పరిమితమైన అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మరోసారి పెదవి విప్పింది. గతంలో ఈ పద్ధతిని వ్యతిరేకించిన బీసీసీఐ.. ఈ విధానంపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కోచ్ అనిల్ కుంబ్లేలు డీఆర్ఎస్పై స్పందించారు. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో దాదాపు 13 టెస్టుల ఆడనున్న నేపథ్యంలో డీఆర్ఎస్ పై యోచించే అవకాశం ఉందని అనురాగ్ తెలిపారు. ఈ విధానంపై తాము సంతృప్తి చెందిన పక్షంలో అందుకు ఎటువంటి అభ్యంతరం ఉండబోదన్నారు. కాకపోతే తాజాగా డీఆర్ఎస్ ఎలా అమలవుతుంది అనే విషయంపై సమాచారం తీసుకున్న తరువాతే ఆ విధానం అమలుపై ఒక నిర్ణయానికి వస్తామని అనురాగ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కోచ్ కుంబ్లే మాత్రం డీఆర్ఎస్ అమలు కావాలంటే కచ్చితంగా ఫీల్డ్ అంపైర్ల నిర్ణయంలో ఎంతో కొంత వ్యత్యాసం అనేది ఉండాలన్నాడు. దాదాపు 95 నుంచి 97 వరకూ అంపైర్లు నిర్ణయం ప్రకటించిన తరువాత డీఆర్ఎస్ ద్వారా కూడా అదే ఫలితం వస్తే ఆ రెండింటిలో మనం చూసిన తేడా ఏమిటని ప్రశ్నించాడు. ఫీల్డ్ అంపైర్లు ఇచ్చే నిర్ణయం కంటే డీఆర్ఎస్ తో వచ్చే నిర్ణయం మరింత మెరుగ్గా ఉన్నప్పుడే దానివల్ల ఉపయోగం ఉంటుందని కుంబ్లే పేర్కొన్నాడు. -
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మార్పులు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కోడ్ ఆఫ్ కండక్ట్, అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్దతి (డీఆర్ఎస్)లో పలు మార్పులు చేసింది. ఇవి వెంటనే అమల్లోకి రానున్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా పదేపదే నిబంధనలను అతిక్రమించే ఆటగాళ్లు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వారికోసం డీమెరిట్ పాయింట్లను పరిగణలోకి తీసుకుంటారు. వీటిని రెండేళ్ల పాటు లెక్కేస్తారు. ప్రతీ ఆటగాడి ఖాతా కూడా సున్నా పాయింట్లతో ఆరంభం కానుంది. నిర్ణీత సమయానికి ఎక్కువ పాయింట్లు సాధించిన ఆటగాడు సస్పెండ్ అవకాశాలుంటాయి. కాగా, నియమావళి జాబితాలో కానీ, వాటి జరిమానాలోనూ మార్పు చేయలేదు. మరోవైపు అంపైర్ ఇచ్చిన ఎల్బీడబ్ల్యు నిర్ణయం నాటౌట్‌గా తేలాలంటే బంతి సగ భాగం కంటే ఎక్కువగా ప్యాడ్‌కు ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ కానీ లెగ్ స్టంప్ అవుట్ సైడ్ ను పరిశీలిస్తారు. గతంలో ఇది సెంటర్ ఆఫ్ ఆఫ్ స్టంప్ గా, సెంటర్ ఆఫ్ లెగ్స్టంప్గా ఉండేది. తాజా నిబంధన ద్వారా బ్యాట్స్ మన్ ప్యాడ్ ను అడ్డుపెట్టకుండా ఉంటే అది బెయిల్ ను తాకుతుందా?లేదా అనే అంశాన్ని డీఆర్ఎస్ ద్వారా పరిశీలించిన తరువాత థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. -
ఎల్బీడబ్ల్యు నిబంధనల్లో మార్పులు!
ఐసీసీ ఆమోదం ఎడిన్బర్గ్: డీఆర్ఎస్ (అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి)లో అంపైర్లు ఇచ్చే ఎల్బీడబ్ల్యు నిర్ణయాలకు సంబంధించిన నిబంధనలు మార్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమోదం తెలిపింది. దీనివల్ల బౌలర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. అయితే కొత్త వన్డే లీగ్‌తో పాటు టెస్టు క్రికెట్‌ను రెండు డివిజన్లుగా చేయాలన్న ప్రతిపాదనను మాత్రం వాయిదా వేసింది. ఎడిన్బర్గ్లో శనివారం రాత్రి ముగిసిన ఐసీసీ వార్షిక సమావేశంలో పలు అంశాలపై చర్చించిన చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని బోర్డు కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. డీఆర్ఎస్ ఎల్బీకి సంబంధించిన కొత్త నిబంధన ప్రకారం... ఆఫ్, లెగ్ స్టంప్ మధ్య ఉండే జోన్‌తో పాటు బార్డర్స్‌కు సగం బంతి తగిలినా ఎల్బీ ఇవ్వనున్నారు. గతంలో బంతి జోన్ మధ్యలో తగిలితేనే అవుట్‌గా ప్రకటించేవారు. ఈ నిబంధన అక్టోబర్ 1 నుంచి లేదా అంతకంటే ముందు డీఆర్ఎస్తో కూడిన సిరీస్ జరిగితే అప్పట్నించి అమల్లోకి వస్తుంది. ఇక కొత్తగా ‘నోబాల్స్’ను గుర్తించేందు థర్డ్ అంపైర్‌కు కూడా అవకాశం ఇచ్చారు. బంతి పడిన కొన్ని సెకన్లలోనే అతను ఫీల్డ్ అంపైర్లకు ఈ విషయాన్ని తెలియజేయవచ్చు. ఐసీసీ పాలన, పునర్నిర్మాణంపై చేపడుతున్న చర్యలపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. డర్బన్ (2022)లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టేందుకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన దరఖాస్తును గేమ్స్ సమాఖ్యకు అందజేయనుంది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ)తో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. -
'డీఆర్ఎస్' లో స్వల్ప మార్పు!
ఎడిన్బర్గ్: ప్రస్తుతం క్రికెట్లో అమల్లో ఉన్న డీఆర్ఎస్( నిర్ణయ సమీక్ష పద్ధతి)లో స్వల్ప మార్పుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆమోద ముద్ర వేసింది. డీఆర్ఎస్లో వందశాతం కచ్చితత్వం లేదని అటు బీసీసీఐతో పాటు, పలు క్రికెట్ బోర్డులు గత కొంతకాలంగా వాదిస్తున్నసంగతి తెలిసిందే. అయితే డీఆర్ఎస్లోని ఎల్బీడబ్యూ నిర్ణయంపై మాత్రమే కొద్దిపాటి మార్పుకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఆటగాడు ఎల్బీగా అవుటైనప్పుడు బౌలింగ్ జట్టు కెప్టెన్ థర్థ్ అంపైర్ పరిశీలనకు వెళుతుంటాడు. ఇక్కడ ఆఫ్, లెగ్ స్టంప్‌ల లోపలి భాగాన్ని మాత్రమే ప్రధానంగా పరిశీలిస్తారు. బ్యాట్స్‌మెన్ బంతిని అడ్డుకున్న క్రమంలో ఆ బంతి వికెట్లను తాకిందా లేదా అనేది గమనిస్తారు. అయితే ఈ డేంజర్ జోన్ పరిధిని ఆఫ్, లెగ్ స్టంప్‌ల బయటకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే డీఆర్ఎస్లో ప్రవేశపెట్టనున్న ఈ మార్పు బౌలర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. తాజాగా నిర్ణయం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు శనివారం రాత్రి ఇక్కడ ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఐడీఐ(ఐసీసీ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్) సభ్యులతో సుదీర్ఘ సమావేశం అనంతరం డీఆర్ఎస్ ఎల్బీడబ్యూల నిర్ణయంపై స్వల్ప మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో 2022లో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళా క్రికెట్‌ను ప్రవేశపెట్టడంపై కూడా ఈ భేటీలో చర్చించారు. డీఆర్ఎస్ గురించి ఒకసారి చూద్దాం.. ప్రస్తుతం మూడు రకాల వేర్వేరు టెక్నాలజీల సహాయంతో డీఆర్ఎస్ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అటు ఎల్బీలను నిర్ధారించేందుకు హాక్ ఐ(బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ), హాట్ స్పాట్, స్నికో మీటర్ టెక్నాలజీలను డీఆర్ఎస్ లో వాడుతున్నారు. బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని బంతి దిశను సూచిండానికి వినియోగిస్తున్నారు. బ్యాట్స్‌మన్ బంతిని అడ్డుకోకపోతే అది వికెట్లను తాకేదా లేదా అనే విషయం తెలుస్తుంది. పిచ్ అయిన తర్వాత బంతి ప్రయాణించిన దూరం, వేగం ఇలాంటివన్నీ ఇందులో కలిసి ఉండటంతో చాలా గందరగోళం కనిపిస్తుంది.బంతి గమనం మారితే దానిని గుర్తించలేకపోవడం పెద్ద లోపం. పిచ్‌పై పడ్డ తర్వాత బంతి ఎలా వెళ్లవచ్చనేది నేరుగా నిలబడ్డ అంపైర్‌కు కనిపించినంత స్పష్టత ఇందులో సాధ్యం కాదనేది ఒక వాదన. అందరూ కాస్త విశ్వసించిన రెండో అంశం హాట్‌స్పాట్. బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకుందా లేదా అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి క్యాచ్‌ల విషయంలో 90 శాతం వరకు సరైన ఫలితాలే వచ్చినా ఇది కూడా కొంత గందరగోళంగానే ఉంది. బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా శబ్దం సాయంతో గుర్తించేందుకు స్నికో మీటర్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే నెమ్మదిగా వచ్చే స్పిన్నర్ల బంతులతో పాటు బ్యాట్స్‌మన్ ముందుకు వచ్చి ఆడితే మైక్‌లు ఈ శబ్దాన్ని గుర్తించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్ఎస్ పై పూర్తి భరోసా ఏర్పడలేదు. తాజాగా ఐసీసీ తీసుకున్న నిర్ణయం కూడా బంతి దిశపైనే కాబట్టి, డీఆర్ఎస్పై నెలకొన్న అనేక సందేహాలు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయే అవకాశం ఉంది. -
టెస్టు పిచ్‌లపై క్రికెట్ కమిటీ ఆందోళన
లండన్: సాధారణంగా స్వదేశీ జట్లకు అనుకూలంగా ఉండే టెస్టు పిచ్‌ల నాణ్యతపై అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టు మ్యాచ్‌ల్లో పిచ్‌ల రూపకల్పన సరిగా జరగడం లేదంటూ పేర్కొంది. ఈ మేరకు అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ శుక్రవారం లండన్‌లో సమావేశమైంది. దీంతో పాటు ఐసీసీకి తలనొప్పిగా మారిన డీఆర్ఎస్(నిర్ణయ సమీక్ష పద్ధతి)పై కూడా క్రికెట్ కమిటీ చర్చించింది. ప్రస్తుతం డీఆర్ఎస్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నుంచి వ్యతిరేక నేపథ్యంలో క్రికెట్ కమిటీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. అయితే డీఆర్ఎస్పై ఎమ్ఐటీ ఇంజనీర్లు సమర్పించిన ప్రజెంటేషన్‌ను క్రికెట్ కమిటీ పరిశీలించనుంది. అందులో పేర్కొన్న కొన్ని ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే తుది నివేదిక విడుదల చేస్తామని క్రికెట్ కమిటీ స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, బ్రిటీష్ సేఫ్టీ స్టాండర్డ్(బీఎస్ఎస్)ప్రమాణాలు కల్గిన హెల్మెట్లనే క్రికెటర్లు వాడాలని కమిటీ ప్రతిపాదించింది. -
ఢీఆర్ఎస్...
ప్రస్తుతం అమల్లో ఉన్న డీఆర్ఎస్ పద్ధతిపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి. అది 100 శాతం సరైందని తేలే దాకా దానిని అంగీకరించేది లేదు... చాలా ఏళ్లుగా బీసీసీఐ వినిపిస్తున్న వాదన ఇది. బీసీసీఐ తమ ఆధిపత్యం కోసమే ఇలాంటి వాదన వినిపిస్తోంది. సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడే ఈ పద్ధతిని అమలు చేయడం ఎంతో అవసరం... భారత్ మినహా దీనిని వాడుతున్న మిగతా దేశాల మాట ఇది. డీఆర్ఎస్ అంటేనే లోపాల పుట్ట. ఒక్క తప్పుడు నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది... అడిలైడ్ డేనైట్ టెస్టు తర్వాత ప్రపంచం మొత్తం ఏకమై పలుకుతున్న మాట ఇది. ఒక్క దెబ్బతో అంతా భారత్ బాటలోకే వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి మనగలుగుతుందా... ప్రస్తుత తరహాలోనే కొనసాగిస్తారా లేక ఐసీసీ మార్పులు చేస్తుందా? * టెక్నాలజీపై కొత్త సందేహం * అడిలైడ్ టెస్టులో బయటపడ్డ లోపాలు * భారత్‌ను ఒప్పించడం కష్టమే! సాక్షి క్రీడా విభాగం: అడిలైడ్ టెస్టులో లయోన్ అవుట్ గురించి రివ్యూ చేస్తున్న సమయంలో హాట్‌స్పాట్ మార్క్ ‘మరే కారణంగానైనా’ వచ్చి ఉండవచ్చు. బంతి లయోన్ బ్యాట్‌కు తగిలిందని కచ్చితంగా చెప్పలేము అంటూ థర్డ్ అంపైర్ నెజైల్ లాంగ్, ఫీల్డ్ అంపైర్ రవికి చెప్పడం అందరికీ వినిపించింది. ఈ మరే కారణం ఏమిటో అంపైర్ సెలవిస్తారా అంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. హాట్‌స్పాట్ పని తీరు ఎంత నాసిరకంగా ఉందో అనేదానికి ఇది చక్కటి ఉదాహరణ. అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)కి సంబంధించి ఇప్పటి వరకు ఎల్బీడబ్ల్యూ నిర్ణయాల విషయంలోనే సందేహాలు ఉండేవి. ఇప్పుడు బ్యాట్ క్యాచ్ అవుట్లను కూడా గుర్తించలేని స్థితిలో టెక్నాలజీ ఉందంటే దానిని వాడటం అవసరమా అనే కొత్త వాదన తెరపైకి వచ్చింది. దెబ్బ తిన్న భారత్ డీఆర్ఎస్ను మొదటిసారి 2008లో భారత్, శ్రీలంక మధ్య సిరీస్‌లో వాడినప్పుడు దాదాపు అన్ని నిర్ణయాలు టీమిండియాకు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ పద్ధతిలో ఎల్బీగా అవుటైన తొలి బ్యాట్స్‌మన్ సెహ్వాగ్. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టె స్టు సిరీస్‌లో ‘ద్రవిడ్ రిమూవల్ సిస్టం’గా దీనిపై విమర్శలు వచ్చాయి. అంతకు ముందు వరల్డ్ కప్‌లో కూడా ఇలాంటి నిర్ణయం ధోనిని తీవ్ర అసహనానికి గురి చేసింది. దాంతో డీఆర్ఎస్కు రాంరాం పలికిన బీసీసీఐ ఇప్పటికీ దాని ఊసెత్తలేదు. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కెప్టెన్ కోహ్లితో పాటు బోర్డు కూడా కాస్త మెత్తబడింది. అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా ఎల్బీలకు మినహా మిగతావాటికి అభ్యంతరం లేదన్నట్లుగా మాట్లాడారు. కానీ తాజా ఉదంతం భారత్ తమ వాదనకే కట్టుబడేట్లుగా చేసింది. పని తీరు-అభ్యంతరాలు మూడు రకాల వేర్వేరు టెక్నాలజీల సహాయంతో డీఆర్ఎస్ను అమలు చేస్తున్నారు. ఎల్బీలను నిర్ధారించేందుకు హాక్ ఐ (బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ)ని వాడుతున్నారు. ఇది బంతి దిశను సూచిస్తుంది. బ్యాట్స్‌మన్ బంతిని అడ్డుకోకపోతే అది వికెట్లను తాకేదా లేదా అనే విషయం తెలుస్తుంది. వివాదానికి ఇది పెద్దన్నలాంటిది. పిచ్ అయిన తర్వాత బంతి ప్రయాణించిన దూరం, వేగం ఇలాంటివన్నీ ఇందులో కలిసి ఉండటంతో చాలా గందరగోళం కనిపిస్తుంది. బంతి గమనం మారితే (డీవియేషన్) దానిని గుర్తించలేకపోవడం పెద్ద లోపం. పిచ్‌పై పడ్డ తర్వాత బంతి ఎలా వెళ్లవచ్చనేది నేరుగా నిలబడ్డ అంపైర్‌కు కనిపించినంత స్పష్టత ఇందులో సాధ్యం కాదనేది ఒక వాదన. దీనిపైన భారత్‌తో సహా ఎవరికీ పూర్తి విశ్వాసం లేదు. కానీ అలాగే కొనసాగిస్తున్నారు. అందరూ కాస్త విశ్వసించిన రెండో అంశం హాట్‌స్పాట్. బ్యాట్‌కు బంతి ఎడ్జ్ తీసుకుందా లేదా అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి క్యాచ్‌ల విషయంలో 90 శాతం వరకు సరైన ఫలితాలే వచ్చాయి. అయితే అడిలైడ్‌లో లయోన్ ఎడ్జ్ హాట్‌స్పాట్‌లో కనిపించినా...అది బ్యాట్ కాకపోవచ్చంటూ థర్డ్ అంపైర్ నిర్ణయించడమే కొత్త వివాదానికి కారణమైంది. అంటే ఎడ్జ్ కాకపోయినా హాట్ స్పాట్ చూపిస్తోందంటే అందులో లోపాలున్నట్లే. పైగా ఇది భారీ ఖర్చుతో కూడుకుంది కావడంతో బోర్డులు ఆసక్తి చూపించడం లేదు. బంతి బ్యాట్‌కు లేదా ప్యాడ్‌కు తగిలిందా శబ్దం సాయంతో గుర్తించేందుకు స్నికో మీటర్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే నెమ్మదిగా వచ్చే స్పిన్నర్ల బంతులతో పాటు బ్యాట్స్‌మన్ ముందుకు వచ్చి ఆడితే మైక్‌లు ఈ శబ్దాన్ని గుర్తించలేకపోతున్నాయి. ఆశ్చర్యకరంగా లయోన్ భుజానికి బంతి తగిలినా కూడా మీటర్లో అది ఏ మాత్రం కనిపించలేదు. మొత్తానికి డీఆర్ఎస్ పూర్తి భరోసానిచ్చేది కాదని మాత్రం అర్థమవుతోంది. మార్పులు చేస్తారా... అంపైర్లు మానవ మాత్రులే కాబట్టి తప్పులు చేస్తారు. దానిని తగ్గించేందుకు టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నాం అని ఐసీసీ చెబుతూ వస్తోంది. * అన్నీ కాకపోయినా...చాలా వరకు సరైన నిర్ణయాలే వస్తున్నాయని మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయ పడుతున్నారు. తాజా ఘటనతో ఇందులో లోపాలు ఉన్నాయనే భారత్ వాదనకు బలం చేకూరింది. అయితే ఏదీ 100 శాతం పర్ఫెక్ట్గా ఉండదని, మెరుగ్గా ఉన్నదానిని వాడాలని సూచనలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఏకపక్షంగా డీఆర్ఎస్కు ఎర్రజెండా చూపించకపోయినా.... హాక్ ఐ నిబంధనల్లో మార్పులు, హాట్ స్పాట్, స్నికోలలో లోపాలు సవరిస్తూ మరి కాస్త మెరుగైన టెక్నాలజీ వాడి అడిలైడ్లాంటి ఘటన పునరావృతం కాకుండా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. తప్పు అంగీకరించిన ఐసీసీ అడిలైడ్ టెస్టులో నాథన్ లయోన్ను మూడో అంపైర్ నెజైల్ లాంగ్ నాటౌట్‌గా ప్రకటించడం తప్పుడు నిర్ణయమని ఐసీసీ అంగీకరించింది. లాంగ్ నిబంధనల ప్రకారమే వ్యవహరించినా... సరైన నిర్ణయం మాత్రం ఇవ్వలేకపోయారని అభిప్రాయపడింది. ఈ మ్యాచ్‌లో శాన్‌ట్నర్ బౌలింగ్‌లో స్వీప్ చేయబోయిన లయోన్ బ్యాట్‌కు తగిలిన బంతి అతని భుజం మీదుగా గల్లీలో ఫీల్డర్ చేతిలో పడింది. ఆ వెంటనే అవుట్‌గా భావించిన లయోన్ క్రీజ్ వదిలినా... ఫీల్డ్ అంపైర్ రవి నాటౌట్‌గా ప్రకటించాడు. న్యూజిలాండ్ రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ లాంగ్ సుదీర్ఘ సమయం తీసుకొని హాట్ స్పాట్, స్నికోల ద్వారా ఏమీ తేలడం లేదని బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ నాటౌట్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపించింది. -
మరోసారి డీఆర్ఎస్ రగడ!
అడిలైడ్: క్రికెట్ లో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతి(డీఆర్ఎస్)పై మరోసారి రగడ చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య అడిలైడ్ లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ సందర్భంగా డీఆర్ఎస్ విధానం సరిగా లేదంటూ న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సెన్ బహిరంగంగా రచ్చకెక్కాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ కీలకంగా మారినప్పుడు ఫీల్డ్ అంపైర్లు పదే పదే డీఆర్ఎస్ కు వెళ్లడం.. ఆ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా రావడంపై హెస్సెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు డీఆర్ఎస్ విధానం అమలుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పష్టత ఇవ్వాలని హెస్సెన్ కోరాడు. శనివారం మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాడు లాథన్ లయన్ అవుటైనా.. టీవీ అంపైర్ నిగెల్ లాంగ్ నాటౌల్ గా ప్రకటించడంతో లాథన్ తిరిగి బ్యాటింగ్ చేయించడాన్ని హెస్సెన్ తప్పుపట్టాడు. హాట్ స్పాట్ లో నాథన్ అవుటైనట్లు స్పష్టంగా కనిపించినట్లు హెస్సెన్ తెలిపాడు. అడిలైడ్ మ్యాచ్ లో తక్కువ స్కోర్లు నమోదు కావడం.. ఆపై తమకు డీఆర్ఎస్ ఇబ్బందికరంగా మారడంతోనే ఓటమి పాలైనట్లు తెలిపాడు. తాను అవుటైనట్లు భావించి నాథల్ పెవిలియన్ కు చేరే క్రమంలో ఆ నిర్ణయం డీఆర్ఎస్ కు వెళ్లడం.. మళ్లీ నాథన్ తిరిగి క్రీజ్ లో రావడంతో పరిస్థితి మొదటికొచ్చిందన్నాడు. దీంతో నాథన్-పీటర్ నావిల్ జోడి తొమ్మిది వికెట్ కు 74 పరుగులు భాగస్వామ్యాన్నినమోదు చేయడంతో ఫలితం తమకు వ్యతిరేకంగా వచ్చిందన్నాడు. ఆ మ్యాచ్ లో డీఆర్ఎస్ విధానంపై న్యూజిలాండ్ క్రికెట్ మేనేజ్ మెంట్ అసంతృప్తిగా ఉన్నట్లు హెస్సెన్ తెలిపాడు. దీనిపై మ్యాచ్ రిఫరీ రోషన్ మహనామాను సంప్రదించినట్లు పేర్కొన్నాడు. కాగా, తమ జట్టు యాజమాన్యం డిమాండ్ పై ఎటువంటి స్పష్టత రాలేదన్నాడు. డీఆర్ఎస్ విధానం అమలుపై ఐసీసీ ఇచ్చే స్పష్టత కోసం తాము నిరీక్షిస్తున్నట్లు హెస్సెన్ తెలిపాడు. ఆ మ్యాచ్ లో కివీస్ విసిరిన 187 పరుగుల విజయలక్ష్యాన్ని చేరేక్రమంలో ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను ఆసీస్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. -
ఎల్బీడబ్ల్యూలు మినహా...
డీఆర్ఎస్పై చర్చకు బీసీసీఐ సిద్ధం: అనురాగ్ ఠాకూర్ ముంబై: సుదీర్ఘ కాలంగా అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ని వ్యతిరేకిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు ఈ అంశంపై కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. డీఆర్ఎస్ టెక్నాలజీపై మరో సారి చర్చించేందుకు తాము సిద్ధమని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. గతంలోలాగే తాము టెక్నాలజీ 100 శాతం సరిగ్గా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అయితే డీఆర్ఎస్లో ఎల్బీని చేర్చరాదని ఠాకూర్ స్పష్టం చేశారు. ‘డీఆర్ఎస్ వాడేందుకు ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాం. అయితే ఎల్బీడబ్ల్యూల విషయంలో మాత్రం దానిని ఉపయోగించవద్దని మేం కోరుతున్నాం. కొన్ని మార్పులతో బ్యాట్-ప్యాడ్, కీపర్ క్యాచ్లాంటి అంశాల విషయంలో సమీక్ష పద్ధతికి మేం సిద్ధం’ అని ఆయన వెల్లడించారు. బీసీసీఐని అవినీతిరహితంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్న ఠాకూర్... లోధా కమిటీ ప్రతిపాదనలపై వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికను ఈ నెల 28న బోర్డు వర్కింగ్ కమిటీ ముందు పెడతామన్నారు. -
డీఆర్ఎస్పై చర్చకు సిద్ధం
జగ్మోహన్ దాల్మియా కోల్‌కతా: అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)పై తమ పాత అభిప్రాయానికే బీసీసీఐ కట్టుబడి ఉందని, అయితే దీనిపై చర్చకు అవకాశం ఉందని బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా వెల్లడించారు. ‘డీఆర్ఎస్పై బోర్డు గతంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు. అయితే దీనర్థం ఇకపై చర్చించమని కాదు. ప్రస్తుత పద్ధతిలో లోపాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఇందులో సాంకేతికాంశాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఏర్పడిన బోర్డు సలహా సంఘం అభిప్రాయం కూడా తీసుకుంటాం’ అని దాల్మియా స్పష్టం చేశారు. -
డీఆర్ఎస్పై చర్చకు సిద్ధం
టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య ఫతుల్లా: అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్దతి (డీఆర్ఎస్)ని బీసీసీఐ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నా.. దీని గురించి జట్టు సభ్యులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. గతంలో కెప్టెన్‌గా ఉన్న ధోని ఈ పద్దతిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. డీఆర్ఎస్ వల్ల నిర్ణయాలు వంద శాతం సరిగా రావని, ఇంకా నవీకరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడేవాడు. అయితే కోహ్లి మాత్రం కనీసం ఆ పద్దతిపై చర్చ జరగాలని అంటున్నాడు. ‘డీఆర్ఎస్ గురించి మనమంతా కూర్చుని విశ్లేషించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా దీనిపై బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఈ చర్చ మాత్రం కచ్చితంగా మా మధ్య ఉంటుందనే అనుకుంటున్నాను’ అని కోహ్లి అన్నాడు. ఇప్పటిదాకా భారత్ మినహా అన్ని టెస్టు దేశాలు ఈ డీఆర్ఎస్ను అమలు చేస్తున్నాయి. అయితే నిర్భందంగా కాకుండా ద్వైపాక్షిక సిరీస్ జరిగినప్పుడు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అంగీకరిస్తేనే ఈ పద్దతి అమలవుతోంది. కాబట్టి భారత్ ఆడే ఏ టెస్టు సిరీస్‌లోనూ డీఆర్ఎస్ ఉండడం లేదు. మరోవైపు డీఆర్ఎస్ను ఇష్టానుసారం కాకుండా ప్రతీ జట్టు కచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ గతంలో వ్యాఖ్యానించారు. -
పరిస్థితుల్లో మార్పు రావచ్చు:విరాట్
ఫతుల్లా(బంగ్లాదేశ్):బంగ్లాదేశ్ తో జరుగుతున్న క్రికెట్ సిరీస్ లో అంపైర్ నిర్ణయ పునఃసమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) లేకపోవడంపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్త భిన్నంగా స్పందించాడు. గతంలో తమ క్రికెట్ బోర్డు(బీసీసీఐ) వ్యతిరేకించిన డీఆర్ఎస్ పద్ధతి నిర్ణయంలో మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదన్నాడు. అయితే దీనిపై త్వరలో టీమ్ సభ్యులతో కలిసి చర్చిస్తామన్నాడు. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్ మెన్ ల ఈ నిర్ణయంపై ఏమి అనుకుంటున్నారో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. 'నేను ఒక విషయంగా చెప్పగలను. డీఆర్ఎస్ నిర్ణయంపై టీమ్ సభ్యులం సమావేశం అవుతాం. గత సంవత్సరం మహేంద్ర సింగ్ ధోనీ కూడా డీఆర్ఎస్ నిర్ణయం అమలుపై సానుకూల ధోరణి వ్యక్తం చేశాడు. అయితే ఇందులో ఫీల్డ్ అంపైర్ల పాత్ర ఎంతవరకు ఉండాలి అనేది కూడా ప్రధానాంశం. ఆటగాళ్ల అప్పీళ్లతోనే డీఆర్ఎస్ కు వెళితే బాగుంటుందని అప్పట్లో ధోనీ అభిప్రాయంగా చెప్పాడు. దీనిపై టీమ్ సభ్యులు కూర్చుని ఒక నిర్ణయానికి రావాలి. డీఆర్ఎస్ పై బీసీసీఐ నిర్ణయంలో మార్పు రావచ్చు' అని కోహ్లీ తెలిపాడు. ఇదిలా ఉండగా బంగ్లాతో జరిగిన ఏకైక టెస్ట్ డ్రా కావడంపై కోహ్లీ తనదైన శైలిలో జవాబిచ్చాడు.ఆ టెస్టు మ్యాచ్ టీమిండియా చేతుల్లో చాలా తక్కువ సమయం ఉందన్నాడు. వరుణడు అడ్డుకోవడంతో మ్యాచ్ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయని కోహ్లీ పేర్కొన్నాడు. -
డీఆర్ఎస్ కు వెంగసర్కార్ మద్దతు
ముంబై:నిర్ణయ సమీక్ష పద్దతి(డీఆర్ఎస్)ను బీసీసీఐ వ్యతిరేకించగా.. భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగసర్కార్ మాత్రం ఆ పద్దతిని వెనకేసుకొచ్చాడు. టెస్టుల్లో ఆ విధానాన్ని అవలంభించడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నాడు. డీఆర్ఎస్ విధానం 100 శాతం కరెక్టు అని చెప్పకపోయినా.. ఈ సిరీస్ లో అంపైర్లు తీసుకునే తప్పుడు నిర్ణయాల కంటే ఇదే నయయన్నాడు. దీంతో మనం అంతా డీఆర్ఎస్ ను అంగీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. శుక్రవారం రచయిత మకరంద వాయింగన్ కర్ పుస్తక విడుదల కార్యక్రమానికి హాజరైన వెంగీ.. పై విధంగా స్పందించాడు. తొలి రెండు టెస్టుల్లో భారత ఆటగాళ్లు అజ్యింకా రహానే, చటేశ్వర పూజారాలు అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు అవుట్ కావడంతో డీఆర్ఎస్ విధానాన్ని వెంగీ తాజాగా తెరపైకి తీసుకొచ్చాడు. -
టీఆర్ఎస్ కాదు.. డీఆర్ఎస్ పార్టీ.. : జైరాం రమేశ్
సాక్షి, మంచిర్యాల : కేసీఆర్ స్థాపించింది తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ కాదని అది దొరల రాష్ట్ర సమితి(డీఆర్ఎస్) పార్టీ అని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం జిల్లాలో పర్యటించా రు. బోథ్ రోడ్‌షోలో, ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లి గ్రామంలో, మంచిర్యాల మండలంలోని శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన సభల్లో.. మంచిర్యాలలో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏదో ఒక్క కుటుంబానికి న్యాయం చేసేందుకు లేదా ఎవరినో సీఎం చేసేందుకు తాము తెలంగాణకు మద్దతివ్వలేదని స్పష్టం చేశారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్టీని విలీనం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని అన్నారు. కేసీఆర్‌ది అడుగడుగునా వంచన గుణం. కేసీఆర్‌లోని కే అంటే వంద, సీఆర్ కోట్లు అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ వల్లే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందనే వాదనలో ఏమాత్రం నిజం లేదు. మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో, నిరంతరం చేసిన పోరువల్లే రాష్ట్రం సాధ్యమైంది. టీఆర్ఎస్కు రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేకున్నా, బీజేపీ అడ్డుకున్నా తాము తెలంగాణ ఇప్పించాం. టీఆర్ఎస్ ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధ్యమయ్యేదా? తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను గుర్తించిన సోనియాగాంధీ తెలంగాణ మాత. సామాజిక న్యాయంతో కూడిన తెలంగాణ నిర్మాణం జరగాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యం. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉంది. రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్‌వే ఉండాలి’అని అన్నారు. కేసీఆర్ బీజేపీతో కలుస్తాడు.. సమయం వచ్చినప్పుడు కే సీఆర్ బీజేపీతో కలుస్తారని జైరాం రమేశ్ విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ సమాజాన్ని చీలిస్తే కాంగ్రెస్ కలుపుతుందన్నారు. ఉద్యోగుల్లో కేసీఆర్ అనవసర సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపిం చారు. హైదరాబాద్‌పై, అక్కడ నివసించే వారిపై కేసీఆర్ సృష్టించిన అనవసర భయాందోళనల వల్లే గవర్నర్ చేతిలో శాంతిభద్రతలు పెట్టాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా పంచర్ అయింది. టీడీపీ, బీజేపీ పార్టీలు ఒకే నాణెంకు ఉన్న రెండు ముఖాలు రాజకీయ లబ్ధి కోసం జత కట్టిన ఆ పార్టీలకు ఇక్కడ మనుగడ లేకుండా చెయ్యాలి’అని సూచించారు. చంద్రబాబు ఇంటి పేరు నారా కాదని ఆయన ఇంటి పేరు నరేంద్ర చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌కు సిద్ధంగా ఉంటే ఇంతమంది బలి అయ్యే వరకు ఎందుకు ఆగిపోయారని ప్రశ్నించగా.. తమ మిత్రపక్షాలతో చర్చించడం, ఇతర ప్రక్రియలు పూర్తి చేసేందుకు సమయం తీసుకొందని అన్నారు. హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నందునే సీమాంధ్రకు ప్యాకేజీ ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా దకే ్కం దుకు కావాల్సిన సాంకేతిక అనుమతులను సాధిస్తామని చెప్పారు. మంచిర్యాల కొత్త జిల్లా చేస్తామన్నారు. 8 ఏళ్ల సర్వీసుకు పైబడ్డ కాంట్ట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. జైపూర్ విద్యుత్ ప్లాంటును 2015 చివరికల్లా పూర్తిచేస్తామని చెప్పారు. సింగరేణి, డిస్మిస్డ్ కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థు లు జి.వివేక్, జాదవ్ నరేశ్, ఎమ్మెల్యే అభ్యర్థులు గుండా మల్లేశ్, జి.అరవింద్‌రెడ్డి, జి.వినోద్, ఎ.హరినాయక్, ఎమ్మెల్సీ బి.వెంక ట్రావు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గూటికి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే ఆజ్మీరా గోవింద్ నాయక్ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే అభివృద్ధి సాధ్యం అన్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్ల ప్రజల అర్థికాభివృద్ధి సాధ్యం అయ్యిందన్నారు. -
డీఆర్ఎస్ స్థానంలో ఓఆర్ఎస్!
అబుదాబి: ఇటీవలి కాలంలో తరచూ విమర్శలనెదుర్కొంటున్న అంపైర్ నిర్ణయ పునస్సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)ని మరింత మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నడుం బిగించింది. ప్రస్తుతం మైదానంలో అంపైర్ నిర్ణయాలను ఆటగాడు అప్పీల్ చేసుకుంటే థర్డ్ అంపైర్ రీప్లే ద్వారా సమీక్షించి నిర్ణయం ప్రకటిస్తున్నారు. అయితే ఈ పద్ధతిని మార్చి మ్యాచ్ ప్రసారమవుతున్న అన్ని కెమెరాలను ఉపయోగించుకుని ఓ స్వతంత్ర వ్యక్తి చేత నిర్ణయాలను వెలువరించే పద్ధతిని ఐసీసీ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. దీన్ని అఫీసియేట్ రివ్యూ పద్ధతి (ఓఆర్ ఎస్)గా పిలుస్తున్నారు.