టెస్టు పిచ్లపై క్రికెట్ కమిటీ ఆందోళన | ICC committee concerned over quality of Test match pitches | Sakshi
Sakshi News home page

టెస్టు పిచ్లపై క్రికెట్ కమిటీ ఆందోళన

Published Fri, Jun 3 2016 4:26 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

టెస్టు పిచ్లపై క్రికెట్ కమిటీ ఆందోళన

టెస్టు పిచ్లపై క్రికెట్ కమిటీ ఆందోళన

సాధారణంగా స్వదేశీ జట్లకు అనుకూలంగా ఉండే టెస్టు పిచ్ల నాణ్యతపై అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

లండన్: సాధారణంగా స్వదేశీ జట్లకు అనుకూలంగా ఉండే టెస్టు పిచ్ల నాణ్యతపై అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టు మ్యాచ్ల్లో  పిచ్ల రూపకల్పన సరిగా జరగడం లేదంటూ  పేర్కొంది.  ఈ మేరకు అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ శుక్రవారం లండన్లో సమావేశమైంది.  దీంతో పాటు ఐసీసీకి తలనొప్పిగా మారిన డీఆర్ఎస్(నిర్ణయ సమీక్ష పద్ధతి)పై కూడా క్రికెట్  కమిటీ చర్చించింది.  ప్రస్తుతం డీఆర్ఎస్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నుంచి వ్యతిరేక నేపథ్యంలో క్రికెట్ కమిటీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు.

 

అయితే డీఆర్ఎస్పై ఎమ్ఐటీ ఇంజనీర్లు సమర్పించిన ప్రజెంటేషన్ను క్రికెట్ కమిటీ పరిశీలించనుంది. అందులో పేర్కొన్న కొన్ని ప్రతిపాదనల ఆధారంగా త్వరలోనే తుది నివేదిక విడుదల చేస్తామని క్రికెట్ కమిటీ స్పష్టం చేసింది.  ఇదిలాఉండగా, బ్రిటీష్ సేఫ్టీ స్టాండర్డ్(బీఎస్ఎస్)ప్రమాణాలు కల్గిన హెల్మెట్లనే క్రికెటర్లు వాడాలని కమిటీ ప్రతిపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement