anil kumble
-
బుమ్రా సరికొత్త చరిత్ర.. కుంబ్లే రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసి.. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన కంగారూలను కట్టడి చేశాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో భారత్ విజయం సాధించగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ గెలుపొందింది. ఇక బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల ‘డ్రా’ కావడంతో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి.టాపార్డర్ హిట్ఈ నేపథ్యంలో ఎంసీజీ వేదికగా గురువారం నాలుగో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టాపార్డర్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంది. ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57).. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(72) అర్ధ శతకాలతో మెరిశారు.బుమ్రా మ్యాజిక్ వల్లమిడిలార్డర్లో స్టీవ్ స్మిత్(68 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ చేయడంతో ఆసీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే, డేంజరస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(0), ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(4)లను బుమ్రా త్వరత్వరగా పెవిలియన్‌కు పంపడంతో కనీసం తొలి రోజు ఆఖరి సెషన్‌లోనైనా భారత జట్టుకు కాస్త ఊరట దక్కింది. వీరిద్దరితో పాటు ఉస్మాన్ ఖవాజా వికెట్‌ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక మెల్బోర్న్ టెస్టులో మొదటి రోజు ఆట సందర్భంగా మొత్తంగా మూడు వికెట్లు తీసిన బుమ్రా.. ఎంసీజీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ ప్రసిద్ధ మైదానంలో బుమ్రా మూడు మ్యాచ్‌లు(ఐదు ఇన్నింగ్స్) ఆడి మొత్తంగా 18 వికెట్లు తీశాడు. అంతకు ముందు అనిల్ కుంబ్లే మూడు మ్యాచ్‌లు(ఆరు ఇన్నింగ్స్) ఆడి పదిహేను వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.మెల్బోర్న్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు1. జస్ప్రీత్ బుమ్రా(పేసర్)- మూడు మ్యాచ్‌లు- ఐదు ఇన్నింగ్స్- 18 వికెట్లు2. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్- 15 వికెట్లు3. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్- 14 వికెట్లు4. కపిల్ దేవ్(పేసర్)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్- 14 వికెట్లు5. ఉమేశ్ యాదవ్(పేసర్)- మూడు మ్యాచ్‌లు- ఆరు ఇన్నింగ్స్- 13 వికెట్లుతొలిరోజు ఆసీస్దేబాక్సింగ్ డే టెస్టు((Boxing Day Test))లో గురువారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: #Virat Kohli: యువ క్రికెటర్‌తో గొడవ.. విరాట్ కోహ్లికి ఐసీసీ భారీ షాక్ BUMRAH SEED TO GET HEAD FOR A DUCK!#AUSvIND | #DeliveredWithSpeed | @nbn_australia pic.twitter.com/ZlpIVFca5O— cricket.com.au (@cricketcomau) December 26, 2024 -
WTC: బుమ్రా అరుదైన రికార్డు.. భారత తొలి బౌలర్‌గా
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో మెరిశాడు. బ్రిస్బేన్‌లో పేస్ దళాన్ని ముందుకు నడిపించిన ఈ స్పీడ్‌స్టర్.. ఆదివారం నాటి ఆటలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(21)ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ(9)ని కూడా తానే పెవిలియన్‌కు పంపాడు.ఆ ఇద్దరి సెంచరీలుఈ క్రమంలో బుమ్రా స్ఫూర్తితో యువ పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మార్నస్ లబుషేన్(12) ఆట కట్టించాడు. ఫలితంగా 75 పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. దీంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొంది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు తోడైన ట్రవిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 115 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టెస్టుల్లో తన తొమ్మిదవ సెంచరీ నమోదు చేసిన అనంతరం హెడ్.. కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలో.. ఫామ్‌లోలేని స్మిత్ సైతం హెడ్ ఇచ్చిన జోష్‌లో శతక్కొట్టేశాడు.బుమ్రా విడగొట్టేశాడుఈ మిడిలార్డర్ బ్యాటర్లను విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే, మరోసారి బుమ్రానే తన అనుభవాన్ని ఉపయోగించి స్మిత్(101)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్(5) వికెట్‌ను కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.అనంతరం.. శతకవీరుడు ట్రవిస్ హెడ్(152)ను కూడా అవుట్ చేశాడు బుమ్రా. దీంతో టీమిండియాలో తిరిగి ఉత్సాహం నిండింది. ఇక హెడ్ రూపంలో ఈ ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్ దక్కించుకున్న బుమ్రా. తన కెరీర్లో ఓవరాల్‌గా పన్నెండోసారి(Five Wicket Haul) ఈ ఘనత సాధించాడు.Jasprit Bumrah gets Travis Head to bring up his fifth wicket! #AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/2QGUazarZP— cricket.com.au (@cricketcomau) December 15, 2024అదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)లో అతడికి ఇది తొమ్మిదో ఫైవ్ వికెట్ హాల్. అంతేకాదు.. ఆస్ట్రేలియా గడ్డ మీద నాలుగోసారి బుమ్రా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో బుమ్రా రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.కమిన్స్ సరసన.. భారత తొలి బౌలర్‌గా రికార్డుడబ్ల్యూటీసీలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన క్రికెటర్‌గా ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటికి తొమ్మిదిసార్లు ఈ ఘనత సాధించాడు. తాజా టెస్టుతో బుమ్రా కూడా కమిన్స్ సరసన చేరాడు. ఈ జాబితాలో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడ(7), ఆసీస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్(6), న్యూజిలాండ్ ఫాస్ట్‌బౌలర్ టిమ్ సౌథీ(6) వీరి తర్వాతి స్థానాలో ఉన్నారు.కుంబ్లే రికార్డును సమం చేసిన బుమ్రాఇక ఆస్ట్రేలియా గడ్డపై నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్‌గా అనిల్ కుంబ్లే కొనసాగుతున్నాడు. బ్రిస్బేన్ టెస్టుతో బుమ్రా కూడా కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఇదిలా ఉంటే.. ఓవరాల్‌గా 23సార్లు కపిల్ దేవ్ ఫైవ్ వికెట్ల హాల్ సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఆసీస్‌దే పైచేయిబ్రిస్బేన్లో గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై పైచేయి సాధించింది. ఆదివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. హెడ్, స్మిత్ సెంచరీలకు తోడు వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(45 నాటౌట్) రాణించడం వల్ల ఇది సాధ్యమైంది. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఐదు, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో పెర్త్ టెస్టులో భారత్, అడిలైడ్ పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ విజయం సాధించాయి. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
అశ్విన్, భజ్జీ కాదు!.. టీమిండియా ఆల్‌టైమ్ అత్యుత్తమ స్పిన్నర్లు వీరే!
టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు. భారత్- ఆసీస్ మధ్య జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో రవిశాస్త్రికి ఓ ప్రశ్న ఎదురైంది. భారత క్రికెట్ జట్టులోని ముగ్గురు అత్యుత్తమ స్పిన్నర్ల పేర్లు చెప్పాలని కోరగా.. రవిశాస్త్రి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.కాగా ప్రస్తుతం టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. మరోవైపు.. మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం 103 టెస్టుల్లో 417 వికెట్లు పడగొట్టి లెజెండరీ బౌలర్‌గా పేరు సంపాదించాడు.ఇక అశ్విన్‌తో పాటు జట్టులో కొనసాగుతున్న మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా 319(77 టెస్టుల్లో) వికెట్లు పడగొట్టి సత్తా చాటుతున్నాడు.అనిల్ కుంబ్లే ప్రమాదకారిఅయితే, రవిశాస్త్రి ఈ ముగ్గురిలో ఒక్కరి పేరు కూడా చెప్పకపోవడం విశేషం. తన దృష్టిలో బిషన్ సింగ్ బేడి, ఎర్రాపల్లి ప్రసన్న, అనిల్ కుంబ్లే టీమిండియా అత్యుత్తమ స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫాక్స్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఉపఖండ పిచ్‌లపై అనిల్ కుంబ్లే ప్రమాదకారి. అత్యంత దూకుడుగా ఉంటాడు. అయితే, కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన స్పిన్నర్. 600కు పైగా టెస్టు వికెట్లు తీయడం అంటే మాటలు కాదు.అతడు బంతితో అద్భుతాలు చేయగలడుఇక ప్రసన్న. అతడి కెరీర్ చరమాంకంలో ఉన్నపటి పరిస్థితులను పరిశీలిస్తే.. అతడు జట్టు మేనేజర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చాడు. నెట్స్‌లో బౌలింగ్ కూడా చేశాడు. అతడు బంతితో అద్భుతాలు చేయగలడు. బాల్‌ను రిలీజ్ చేసే విషయంలో ఎప్పుడు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు.ఆయన బౌలింగ్ యాక్షన్ సూపర్వీరిద్దరు నా లిస్టులో టాప్-3లో ఉంటే.. టాప్-1లో బిషన్ సింగ్ బేడి ఉంటాడు. ఆయన బౌలింగ్ యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తన అభిప్రాయం ప్రకారం బిషన్ బేడి, ప్రసన్న, కుంబ్లే అత్యుత్తమ భారత స్పిన్నర్లు అని పేర్కొన్నాడు. కాగా బిషన్ బేడీ తన కెరీర్లో 67 టెస్టుల్లో 266 వికెట్లు పడగొట్టగా.. ప్రసన్న 49 టెస్టుల్లో 189 వికెట్లు తీశాడు. మరోవైపు.. కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు కూల్చి టెస్టుల్లో భారత లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక 536 వికెట్లతో అశూ రెండోస్థానంలో ఉన్నాడుచదవండి: IPL 2025: ఆర్సీబీ కెప్టెన్ అతడే! -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఆధిపత్యం కొనసాగించిన కివీస్ దూకుడుకు భారత జట్టు కళ్లెం వేసింది. ముంబై టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. పర్యాటక జట్టు ప్రస్తుతం కేవలం 143 పరుగుల ఆధిక్యంలో మాత్రమే ఉంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ తమ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించారు. కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జడేజా ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3 కీలక వికెట్లు సాధించారు.అశ్విన్ అరుదైన రికార్డు..ఇక 3 వికెట్లతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో 6 టెస్టులు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. వాంఖడేలో 7 టెస్టులు ఆడిన కుంబ్లే 38 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును అశూ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో అశ్విన్, కుంబ్లే తర్వాత స్ధానాల్లో కపిల్ దేవ్(28) ఉన్నారు.చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్? -
చరిత్రకెక్కిన జడేజా.. జహీర్ రికార్డు బ్రేక్.. అరుదైన జాబితాలో చోటు
న్యూజిలాండ్‌తో మూడో టెస్టు సందర్భంగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్‌ను జడ్డూ అధిగమించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా మూడు మ్యాచ్‌లు ఆడేందుకు కివీస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.ముంబై వేదికగా మూడో టెస్టు ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెంగళూరు, పుణె వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య టీమిండియాను న్యూజిలాండ్ ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ముంబై వేదికగా శుక్రవారం నామమాత్రపు మూడో టెస్టు మొదలైంది.వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. మరోవైపు.. సొంతగడ్డపై ఇప్పటికే భారత్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన టామ్ లాథమ్ బృందం విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో మూడో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఆకాశ్ దీప్ శుభారంభం.. అదరగొట్టిన వాషీస్పిన్కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ప్రభావం చూపుతున్నారు. ఆట తొలిరోజు భోజన విరామ సమయానికి ముందు వాషీ.. కివీస్ కెప్టెన్, ఓపెనర్ టామ్ లాథమ్(28), మిడిలార్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర(5) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు. మరోవైపు.. పేసర్ ఆకాశ్ దీప్ డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(4)ను అవుట్ చేసి శుభారంభం అందించాడు.లంచ్ తర్వాత వికెట్ల వేట మొదలుపెట్టిన జడ్డూఈ క్రమంలో లంచ్ బ్రేక్‌కు ముందు న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అయితే, భోజన విరామం తర్వాత జడ్డూ తన బౌలింగ్ పదునుపెంచాడు. క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఇబ్బంది పెడుతున్న విల్ యంగ్(71)ను తొలుత పెవిలియన్‌కు పంపిన జడేజా.. అనంతరం టామ్ బ్లండెల్(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(17)ను అవుట్ చేశాడు. తద్వారా జడ్డూ టెస్టుల్లో 312 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.టీ బ్రేక్ సమయానికి కివీస్స్కోరు ఎంతంటే?ఈ నేపథ్యంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311)లను జడ్డూ అధిగమించాడు. వీరిద్దరి రికార్డును బ్రేక్ చేస్తూ టాప్-5లో చోటు సంపాదించాడు. ఇదిలా ఉంటే.. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు1. అనిల్ కుంబ్లే(స్పిన్నర్)- 619 వికెట్లు2. రవిచంద్రన్ అశ్విన్(స్పిన్నర్)- 533 వికెట్లు3. కపిల్ దేవ్(పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్)- 434 వికెట్లు4. హర్భజన్ సింగ్(స్పిన్నర్)- 417 వికెట్లు5. రవీంద్ర జడేజా(స్పిన్నర్)- 312 వికెట్లు.చదవండి: IPL 2025 Retentions: జాక్‌పాట్ కొట్టిన ఆటగాళ్లు వీరే..! -
కివీస్‌తో మూడో టెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన అశ్విన్
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్‌లో అశ్విన్ మరో ఐదు వికెట్ల ఘనత సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అశ్విన్, అనిల్ కుంబ్లే ఇప్పటివరకు టీమిండియా తరఫున 37 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించారు. అశ్విన్ ఒక్క టెస్ట్‌ల్లోనే ఈ ఘనత సాధించగా.. కుంబ్లే 35 సార్లు టెస్ట్‌ల్లో, రెండు సార్లు వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అశ్విన్, కుంబ్లే చెరి ఎనిమిది సార్లు 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన ఘనత ముత్తయ్య మురళీథరన్‌కు దక్కుతుంది. మురళీ శ్రీలంక తరఫున 77 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 22 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత ఈ లిస్ట్‌లో రిచర్డ్ హ్యాడ్లీ, షేన్ వార్న్ ఉన్నారు. హ్యాడ్లీ 41 ఐదు వికెట్ల ప్రదర్శనలు, తొమ్మిది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. షేన్ వార్న్ 38 ఐదు వికెట్ల ప్రదర్శనలు, పది 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఈ జాబితాలో మురళీథరన్, హ్యాడ్లీ, వార్న్ తర్వాత అశ్విన్, కుంబ్లే ఉన్నారు.కాగా, ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..? -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధిక టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా యాష్ రికార్డులకెక్కాడు.తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటోను ఔట్ చేసిన అశ్విన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్ ఇప్పటివరకు ఆసియాలో 420 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే తన కెరీర్లో ఆసియాలో 419 వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 612 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానంలో అశ్విన్(420) ఉన్నాడు. అశ్విన్ తర్వాత స్ధానాల్లో కుంబ్లే, రంగనా హెరత్(354), హార్భజన్ సింగ్(300) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో 101 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 2.82 ఏకానమీతో 522 వికెట్లు పడగొట్టాడు.చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
ఓటు హక్కు వినియోగించుకున్న ద్రవిడ్, కుంబ్లే
దేశంలో ఇవాళ (ఏప్రిల్ 26) సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ఈ విడతలో మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కేరళలోని 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, ఉత్తర్‌ప్రదేశ్ 8, మహారాష్ట్ర 8, మధ్యప్రదేశ్ 7, అస్సాం 5, బీహార్ 5, పశ్చిమ బెంగాల్ 3, చత్తీస్ఘడ్ 3, జమ్మూ కశ్మీర్ 1, మణిపూర్ 1, త్రిపురలో ఒక లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగతుంది. #WATCH | Rahul Dravid casts his vote in Karnataka's Bengaluru.#LokSabhaElections2024 pic.twitter.com/gZ6Ybairc1— ANI (@ANI) April 26, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాల్టి ఉదయం నుంది వివిధ రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రీడారంగానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇవాళ ఉదయం బెంగళూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య, కొడుకుతో సహా పోలింగ్ కేంద్రం వద్దకు చేరిన ద్రవిడ్ అతి సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి ఓటు వేశారు. #Vote #Indiaelections2024 #Karnataka #bengaluru pic.twitter.com/JDi9VYpIA6— Anil Kumble (@anilkumble1074) April 26, 2024 ఓటు వేసిన అనంతరం ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు. ఓటు అనేది ప్రజాస్వామ్యం మనకు కల్పించిన హక్కు అని ద్రవిడ్ తెలిపాడు. ద్రవిడ్ సహచరుడు, టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఇవాళ బెంగళూరులో ఓటు వేశారు. ఓటు వినియోగించుకున్న విషయాన్ని కుంబ్లే సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. కుంబ్లే తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. -
ధోని, సచిన్ ఒకేలా.. నేను హెడ్‌కోచ్‌గా ఉన్నపుడు: భారత మాజీ స్పిన్నర్
‘‘ఐపీఎల్లో నేను ఎంఎస్ ధోనితో కలిసి ఎన్నడూ ఆడలేదు. అయితే, టీమిండియాలో ఉన్నపుడు మాత్రం మేము సహచర ఆటగాళ్లం. సెలబ్రేషన్స్ సమయంలో నన్ను ఎత్తుకోగల ఆటగాళ్లలో ధోని ముందు వరుసలో ఉండే వాడు. ఎంత బరువైనా సరే అతడు అలవోకగా ఎత్తగలడు. ఇక నేను హెడ్‌కోచ్‌గా ఉన్నపుడు ధోని కెప్టెన్‌గా ఉండేవాడు. ఓసారి మేము వన్డే మ్యాచ్ కోసం రాంచికి వెళ్లాము. అక్కడ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యాను. నిజానికి రాంచి అతడి స్వస్థలం. ఆప్షనల్ ప్రాక్టీస్‌కు రాకుండా తను ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ.. అతడు గ్రౌండ్‌కు వచ్చేశాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించి.. ‘ఇక్కడేం చేస్తున్నావు? తదుపరి మ్యాచ్‌కు మనకు ఇంకా రెండ్రోజుల సమయం ఉంది. ఎందుకు వచ్చావు?’ అని అడిగాను. అందుకు బదులుగా.. ‘లేదు.. లేదు.. నేను తప్పకుండా ఇక్కడ ఉండాల్సిందే’ అని ధోని జవాబు ఇచ్చాడు. సచిన్ కూడా అచ్చం ఇలాగే! నేను ముంబై ఇండియన్స్‌తో ఉన్నపుడు.. సచిన్ కూడా ఆన్షనల్ ప్రాక్టీస్ సెషన్ సమయంలో సచినే ముందు బస్సెక్కడం గమనించా. 25 నుంచి 26 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న సమయంలోనూ అదే అంకితభావం. ఈ విషయంలో వీరిద్దరూ వాళ్లకు వాళ్లే సాటి. వాళ్లకు బ్రేక్ అవసరం లేదనుకుంటారు. ఇంకొన్ని ఏళ్లపాటు ఎంఎస్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆటగాడిగా కొనసాగినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆట పట్ల అతడికి ఉన్న ప్రేమ అలాంటిది. అందుకే ఎప్పుడూ జట్టుకు అందుబాటులో ఉండాలనే ఆలోచిస్తూ ఉంటాడు’’ అని టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. సీఎస్కేను ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అన్న వార్తల నడుమ.. కుంబ్లే జియో సినిమా షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ విషయంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్, ధోని ఆలోచనలు, అంకితభావం ఒకే విధంగా ఉంటాయని వారితో తనకున్న అనుభవాలు పంచుకున్నాడు. ధోనికి ఐపీఎల్-2024 చివరి సీజన్ కాబోదని.. మరికొన్నేళ్లపాటు అతడికి లీగ్‌లో కొనసాగే సత్తా ఉందని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పట్లో అలసిపోడంటూ 42 ఏళ్ల ధోనిని ఉద్దేశించి ప్రశంసలు కురిపించాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 సీజన్ ఆరంభం కానుంది. సీఎస్కే- ఆర్సీబీ మధ్య చెపాక్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: అతడితో పోలికా?.. బుమ్రానే బెస్ట్ బౌలర్: పాక్ మాజీ పేసర్ -
ప్రపంచంలో మొట్ట మొదటి బౌలర్‌గా అశ్విన్ అరుదైన ఘనత
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. క్రికెట్ ప్రపంచంలో ఏ బౌలర్‌కూ ఇంత వరకు సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా 2011లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు ఈ చెన్నై ఆటగాడు. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన ఈ రైటార్మ్ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో చెలరేగాడు. అలా తన కెరీర్లో తొలి ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. తాజాగా తన వందో టెస్టులోనూ ఈ ఘనత సాధించాడు అశ్విన్. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకే పరిమితమైన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో దుమ్ములేపాడు. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) ఈ నేపథ్యంలో.. అరంగేట్రంలో, వందో టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్‌గా అశ్విన్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. కాగా అశ్విన్ తన కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 36 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించడం విశేషం. తద్వారా టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు(35 సార్లు) బద్దలు కొట్టాడు. అంతేకాదు ఒకే ప్రత్యర్థి జట్టుపైన అత్యధిక టెస్టు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గానూ నిలిచాడు. ఇప్పటి వరకు అశ్విన్.. ఆస్ట్రేలియా మీద 114, ఇంగ్లండ్ మీద 114 వికెట్లు తీశాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగానే 500 వికెట్లు క్లబ్లో చేరాడు. అతడి ఖాతాలో ప్రస్తుతం 516 వికెట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరిగిన నామమాత్రపు ఆఖరి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏 Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy — BCCI (@BCCI) March 9, 2024 చదవండి: #Sarfaraz: తెగ మిడిసిపడుతున్నాడు.. గిల్- బెయిర్‌స్టో గొడవలో సర్ఫరాజ్.. వైరల్ -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత క్రికెటర్‌గా
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు.కెరీర్లో వందో టెస్టు ఆడిన అశ్విన్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి జట్టుకు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన అశూ.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో సత్తాచాటాడు. జాక్ క్రాలీ, డకెట్, పోప్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టును దెబ్బతీశాడు. ఓవరాల్‌గా అశ్విన్ తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో చెలరేగిన అశ్విన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్ర అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులెక్కాడు. అశ్విన్ ఇప్పటివరకు తన టెస్టు కెరీర్లో 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 132 మ్యాచ్‌ల్లో 35 సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. తాజా మ్యాచ్‌లో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టీమిండియా ఘన విజయం.. ఇక ధర్మశాల టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ను ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో చెలరేగగా.. జడేజా, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో సైతం 218 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రోహిత్ శర్మ(103), గిల్(110) సెంచరీలతో మెరిశారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక వరుసగా నాలుగు టెస్టుల్లో విజయం సాధించిన భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు ►టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 218 ►భారత్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు: 477 (ఓవరాల్‌గా 259 పరుగుల ఆధిక్యం) ►ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195 ►విజేత: టీమిండియా.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపు ►ఐదు మ్యాచ్‌ల సిరీస్ 4-1తో టీమిండియా కైవసం View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
IND VS ENG 4th Test: కుంబ్లే రికార్డును సమం చేసిన అశ్విన్
రాంచీ టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ రికార్డులను కొల్లగొడుతున్నాడు. తొలుత భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల (351) రికార్డును బద్దలుకొట్టిన అశ్విన్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల (5/51) ప్రదర్శన అనంతరం కుంబ్లే పేరిట ఉండిన అత్యధిక ఐదు వికెట్ల ఘనతల రికార్డును (భారత్ తరఫున) సమం చేశాడు. కుంబ్లే 132 టెస్ట్‌ల్లో 35 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేస్తే.. అశ్విన్ కేవలం 99 టెస్ట్‌ల్లోనే ఈ ఘనతను (35 ఐదు వికెట్ల ఘనతలు) సమం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేసిన రికార్డు స్పిన్ దిగ్గజం మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్‌ల్లో ఏకంగా 67 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. మురళీ తర్వాత అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనల రికార్డు స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 37 సార్లు) పేరిట ఉంది. వార్న్ తర్వాతి స్థానంలో రిచర్డ్ హ్యాడ్లీ (86 మ్యాచ్‌ల్లో 36 సార్లు) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ తొలుత బద్దలుకొట్టిన రికార్డు (భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డు) కూడా కుంబ్లే పేరిట ఉండినదే కావడం విశేషం. భారత్‌లో కుంబ్లే 350 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ విషయానికొస్తే.. అశ్విన్ ఐదేయడంతో (5/51) ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలి భారత్ ముందు 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అశ్విన్‌తో పాటు కుల్దీప్ (4/22) కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసి లక్ష్యానికి మరో 152 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్‌లో ఉండగా.. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
చెత్త రికార్డు.. అనిల్ కుంబ్లేను అధిగమించిన ఆండర్సన్
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అనవరమైన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అవతరించాడు. ఈ చెత్త రికార్డును ఆండర్సన్.. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఖాతాలో నుంచి లాగేసుకున్నాడు. 2008లో రిటైరైన కుంబ్లే 132 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 18, 355 పరుగులు సమర్పించుకోగా.. ఆండర్సన్ తన 185వ టెస్ట్‌లో కుంబ్లే రికార్డును అధిగమించాడు (18, 371). ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ మూడో స్థానంలో (133 టెస్ట్‌ల్లో 18180 పరుగులు) ఉండగా.. ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (17995), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (16719) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 41 ఏళ్ల ఆండర్సన్ ప్రస్తుతం 696 వికెట్లతో టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇదే మ్యాచ్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు వేసిన ఆండర్సన్ 61 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) అనంతరం ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనితో పాటు జో రూట్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్‌కు దక్కగా.. పోప్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిశారు. -
చరిత్రకు అడుగు దూరంలో అశ్విన్.. తొలి బౌలర్‌గా!?
రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. ఇప్పటికే రాజ్‌కోట్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రాజ్‌కోట్ టెస్టులో అశ్విన్ మరో 4 వికెట్లు పడగొడితే.. స్వదేశంలో టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. అశ్విన్ ఇప్పటివరకు భారత్‌లో 346 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో 350 వికెట్లతో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అగ్రస్ధానంలో ఉన్నాడు. అయితే అశ్విన్ మరో నాలుగు వికెట్లు పడగొడితే కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అదేవిధంగా అశ్విన్ మరో ఒక్క వికెట్ సాధిస్తే.. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా, రెండో భారత బౌలర్‌గా అశ్విన్ నిలుస్తాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. అరుదైన రికార్డులపై కన్నేసిన అశ్విన్
విశాఖ వేదికగా రేపటి నుంచి (ఫిబ్రవరి 2) ప్రారంభంకాబోయే (ఇంగ్లండ్‌తో) రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో యాష్ మరో 4 వికెట్లు తీస్తే టెస్ట్‌ల్లో 500 వికెట్ల మైలురాయిని తాకిన తొమ్మిదో పురుష క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 496 వికెట్లు (96 మ్యాచ్‌లు) ఉన్నాయి. ఈ రికార్డుతో పాటు రెండో టెస్ట్‌లో అశ్విన్ మరిన్ని రికార్డులు కూడా సాధించే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా.. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ల్లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా.. భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్‌గా పలు రికార్డులు నెలకొల్పుతాడు. ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా.. టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ రికార్డు భగవత్ చంద్రశేఖర్ పేరిట ఉంది. చంద్రశేఖర్ ఇంగ్లండ్‌తో 23 మ్యాచ్‌లు ఆడి 95 వికెట్లు పడగొట్టాడు. రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌లో అశ్విన్ (20 టెస్ట్‌ల్లో 93 వికెట్లు) మరో 3 వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా.. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్‌ల్లో ఇప్పటివరకు ఏ భారత బౌలర్ కూడా 100 వికెట్లు తీయలేదు. రేపటి నుంచి మొదలయ్యే రెండో టెస్ట్‌లో అశ్విన్ మరో 7 వికెట్లు తీస్తే.. ఇంగ్లండ్‌పై 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ఇరు జట్ల మధ్య టెస్ట్‌ల్లో ఇప్పటివరకు జేమ్స్ ఆండర్సన్ (139 వికెట్లు) మాత్రమే 100 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. అశ్విన్ భారత గడ్డపై ఇప్పటివరకు 56 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 343 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ రెండో టెస్ట్‌లో మరో 8 వికెట్లు తీస్తే భారతగడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే (350) రికార్డును బద్దలు కొడతాడు. అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు సాధించిన భారత బౌలర్‌గా.. కెరీర్లో ఇప్పటివరకు 34 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించిన అశ్విన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ఘనతలు సాధిస్తే, అనిల్ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు (భారత్ తరఫున అత్యధిక ఐదు వికెట్ల ఘనతలు) బద్దలవుతుంది. వైజాగ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో అశ్విన్ పై పేర్కొన్న రికార్డులన్నీ ఇదే మ్యాచ్‌లో సాధించినా అశ్చర్యపోనక్కర్లేదు. -
Ind vs Eng: ఎలా ఆడాలో నేర్చుకో గిల్: కుంబ్లే విమర్శలు
India vs England, 1st Test: ఇంగ్లండ్‌తో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ఆట తీరుపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పెదవి విరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో నిలదొక్కుకోవాలంటే గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మరింత మెరుగుపరచుకోవాలని సూచించాడు. రాహుల్ ద్రవిడ్, ఛతేశ్వర్ పుజారాల మాదిరి ఆడితే ఈ యువ ప్లేయర్‌కు టెస్టుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో శుబ్‌మన్ గిల్ ఇబ్బంది పడుతున్నాడని... బలహీనతలు అధిగమించడంపై దృష్టి సారించాలని హితవు పలికాడు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం తొలి టెస్టు ఆరంభమైంది. ఉప్పల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన గిల్.. 66 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకో ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లే బౌలింగ్‌లో బెన్ డకెట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే స్పోర్ట్స్ 18తో మాట్లాడుతూ గిల్ బ్యాటింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ.. గిల్ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో గిల్ నేర్చుకోవాలి. ఒకవేళ తను నంబర్ 3లోనే కొనసాగాలని కోరుకుంటే.. ముఖ్యంగా భారత పిచ్‌లపై వన్‌డౌన్‌లో నెగ్గుకురావాలనే సంకల్పంతో ఉంటే.. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలు రచించాలి. ద్రవిడ్, పుజారాలా రాణించాలనుకుంటే లేదంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ పోవాలి. గురువారం అతడు బాగానే బ్యాటింగ్ చేశాడు. కానీ శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో చెత్త షాట్‌తో వికెట్ సమర్పించుకున్నాడు. నేను మళ్లీ చెప్తున్నా... పుజారా, ద్రవిడ్‌లా వన్‌డౌన్‌లో రాణించాలనుకుంటే కచ్చితంగా గిల్ స్ట్రైక్ రొటేట్ చేయాల్సిందే. స్పిన్ బౌలింగ్ ఆడేటపుడు మణికట్టును ఎక్కువగా ఉపయోగించాలి. షాట్ల ఎంపికలోనూ జాగ్రత్త వహించాలి’’ అని కుంబ్లే.. గిల్ ఆట తీరును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. చదవండి: ICC: అవార్డుల విజేతలు, జట్ల పూర్తి జాబితా! జింబాబ్వేకే ఆ పురస్కారం -
Ind vs Eng: చరిత్ర సృష్టించిన అశూ- జడ్డూ.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
India vs England, 1st Test Day 1: ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన భారత బౌలింగ్ జోడీగా ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజ జంట అనిల్ కుంబ్లే- హర్భజన్ సింగ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను 246 పరుగులకు ఆలౌట్ చేసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ మూడు, రవీంద్ర జడేజా మూడు, అక్షర్ పటేల్ రెండు, జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీశారు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆటలో అశూ- జడ్డూ మొదటి రోజు ఆటలో మొత్తం కలిపి ఆరు వికెట్లు తీశారు. దీంతో ఇప్పటి వరకు టెస్టుల్లో ఇద్దరూ కలిపి 505 వికెట్లు సంయుక్తంగా తమ ఖాతాలో వేసుకున్నారు. కుంబ్లే- భజ్జీ రికార్డు బద్దలు తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలింగ్ జోడీగా నిలిచారు. అంతకు ముందు ఈ రికార్డు కుంబ్లే- హర్భజన్ (501) పేరిట ఉండేది. ఇక ఈ జాబితాలో హర్భజన్ సింగ్- జహీర్ ఖాన్ జోడీ(474), ఉమేశ్ యాదవ్- అశ్విన్ జంట(431) నాలుగో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓపెనర్లు జాక్ క్రాలే(20), బెన్ డకెట్(35), మార్క్‌వుడ్(11) వికెట్లను అశూ పడగొట్టగా.. ఒలీ పోప్(1), జో రూట్(29), టామ్ హార్ట్లే వికెట్లను జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్ జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్. -
సౌతాఫ్రికా వెన్ను విరిచిన బుమ్రా.. టెస్టుల్లో 4 అరుదైన రికార్డులు
Ind vs SA 2nd Test Day 2: Jasprit Bumrah Records: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు వికెట్లకే పరిమితమైన ఈ స్పీడ్‌స్టర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. న్యూలాండ్స్ పిచ్ మీద 63/3 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆతిథ్య ప్రొటిస్ జట్టుకు బుమ్రా ఆరంభం నుంచే చుక్కలు చూపించాడు. ముందు రోజు ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో వికెట్ దక్కించుకున్న బుమ్రా.. రెండో రోజు ఆట మొదలైన తొలి ఓవర్లో(17.6వ ఓవర్)నే డేవిడ్ బెడింగ్‌హామ్‌ను అవుట్ చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు ఓవర్ల అనంతరం కైలీ వెరెనెను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం మార్కో జాన్సెన్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసిన ఈ రైటార్మ్ పేసర్.. కేశవ్ మహరాజ్ వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుని ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ క్రమంలో లుంగి ఎంగిడీని అవుట్ చేసిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగించిన బుమ్రా ఖాతాలో ఆరో వికెట్ జమైంది. ఈ నేపథ్యంలో.. సౌతాఫ్రికాతో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా నాలుగు అరుదైన రికార్డులు సాధించాడు. అవేంటంటే.. 1. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ 2. SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్. 3. సౌతాఫ్రికాలో అత్యధికసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో భారత బౌలర్. 4. న్యూలాండ్స్ పిచ్ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్(ఏకైక భారత బౌలర్). బుమ్రా కంటే ముందు ఈ ఘనతలు సాధించిన బౌలర్లు 1. సౌతాఫ్రికాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు 45 - అనిల్ కుంబ్లే 43 - జవగళ్ శ్రీనాథ్ 38* - జస్ప్రీత్ బుమ్రా 35 - మహ్మద్ షమీ 30 - జహీర్ ఖాన్. ⭐⭐⭐⭐⭐ A 5-star performance from #JaspritBumrah in the 2nd innings, as he picks up his 4th witcket of the morning! Will his 9th Test 5-fer lead to a historic win for #TeamIndia? Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/hjDyvSAJc3 — Star Sports (@StarSportsIndia) January 4, 2024 2. SENA దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన భారత బౌలర్లు 7 - కపిల్ దేవ్ 6 - భగవత్ చంద్రశేఖర్ 6 - జహీర్ ఖాన్ 6 - జస్ప్రీత్ బుమ్రా. 3. సౌతాఫ్రికాలో టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ తీసిన భారత బౌలర్లు 3 - జవగళ్ శ్రీనాథ్ 3 - జస్ప్రీత్ బుమ్రా 2 - వెంకటేష్ ప్రసాద్ 2 - ఎస్ శ్రీశాంత్ 2 - మహ్మద్ షమీ. 4. న్యూలాండ్స్ పిచ్(కేప్‌టౌన్) మీద అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లు 25 - కొలిన్ బ్లైత్ (ఇంగ్లండ్) 18 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)(న్యూలాండ్స్ పిచ్ మీద ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్) 17 - షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 16 - జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) 15 - జానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్) బుమ్రా ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఆరు వికెట్లు దక్కగా.. ముకేశ్ కుమార్ రెండు, ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు. -
ద్రవిడ్‌ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్‌కప్ 2023 ఫైనల్‌తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్‌కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్‌ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు స్టాండ్ ఇన్ కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్‌గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్‌తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్‌తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్‌నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్‌లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
మెకానికల్ ఇంజనీర్! పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. టీమిండియా పరువు కాపాడి
‘‘మంచి, చెడులను అర్థం చేసుకోవడానికి చదువు ఉపయోగపడుతుంది. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే కచ్చితంగా విజయవంతమవుతామనే నమ్మకం లేదు. ఒకవేళ అనుకున్నది సాధించలేక నిరాశలో కూరుకుపోతే.. దానిని ఎలా అధిగమించాలో, భవిష్యత్ పరిణామాలకు ఎలా సంసిద్ధం కావాలో కూడా చదువు మనకు నేర్పిస్తుంది’’- అనిల్ కుంబ్లే టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పుట్టినరోజు నేడు(అక్టోబరు 17). ఈ సందర్భంగా సచిన్ టెండుల్కర్, హర్భజన్ సింగ్ వంటి టీమిండియా మాజీ క్రికెటర్లు సహా అభిమానుల నుంచి ‘జంబో’కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెకానికల్ ఇంజనీర్! ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. కర్ణాటకలోని బెంగళూరులో 1970లో జన్మించాడు కుంబ్లే. చదువు, క్రికెట్.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాడు. ముందు టీమిండియాకు ఆడి.. తర్వాత పట్టా పుచ్చుకున్నాడు టీమిండియా తరఫున 1991- 92లో రాష్ట్రీయ విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ డిగ్రీ అందుకున్న కుంబ్లే.. అంతకంటే ఓ ఏడాది ముందే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జంబో ఖాతాలో ఎన్ని వంద వికెట్లంటే? షార్జాలో శ్రీలంకతో వన్డే మ్యాచ్ సందర్భంగా అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2008లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన కుంబ్లే.. తన కెరీర్లో మొత్తంగా 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 619, 337 వికెట్లు పడగొట్టి అరుదైన ఘనతలు సాధించాడు ఈ రైట్ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్. కాగా టీమిండియా కెప్టెన్‌గానూ అనిల్ కుంబ్లే సేవలు అందించిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క వన్డేకు కెప్టెన్‌గా 2007లో భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కుంబ్లే 14 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. కానీ, వన్డే ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా మాత్రం కుంబ్లేకు అవకాశం రాలేదు. అయితే, టెస్టు సారథి కావడానికి ముందే అంటే 2002లో ఇంగ్లండ్‌తో వన్డేలో జట్టును మందుండి నడిపించాడు. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో నో ఎంట్రీ టీమిండియా తరఫున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేకపోయిన కుంబ్లే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్లో హవా మొత్తంగా 42 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి.. 45 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు 4- వికెట్ హాల్స్, ఒక 5-వికెట్ హాల్ ఉంది. కాగా మొట్టమొదటిసారిగా 2007లో ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో కుంబ్లేకు సెలక్టర్లు చోటివ్వలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో కుంబ్లేకు ఛాన్స్ దక్కలేదు. చివరిగా బెర్ముడాతో వెస్టిండీస్‌లో... బెర్ముడాతో 2007 వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా అనిల్ కుంబ్లే తన చివరి అంతర్జాతీయ వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో కుంబ్లే.. త్రీ- వికెట్ హాల్‌తో మెరిశాడు. మొత్తంగా 38 పరుగులిచ్చి.. బెర్ముడా కెప్టెన్ ఇర్విన్ రొమేనీ, మిడిలార్డర్ బ్యాటర్ జెనీరో టకర్, టెయిలెండర్ మలాచి జోన్స్ వికెట్లు పడగొట్టాడు. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రదర్శన ఇక అనిల్ కుంబ్లే కెరీర్‌తో పాటు టీమిండియా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతం 1999, ఫిబ్రవరి 7న జరిగింది. వసీం అక్రం సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. సొంతగడ్డపై పరువు నిలబెట్టేందుకు తొలి టెస్టులో 12 పరుగుల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచి టీమిండియాకు సవాల్ విసిరింది. ఈ క్రమంలో సొంతగడ్డపై దాయాదితో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో భారత జట్టు ఢిల్లీలో రెండో టెస్టుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో 252 పరుగుల వద్ద భారత్ తమ తొలి ఇన్నింగ్స్ ముగించగా.. పాక్ కథ 172 పరుగులకే ముగిసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మహ్మద్ అజారుద్దీన్ సారథ్యంలోని టీమిండియా 339 పరుగులు చేసి భారీ ఆధిక్యంలో నిలిచింది. పాక్‌ను ఒంటిచేత్తో ఓడించి.. ఈ క్రమంలో 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ అనిల్ కుంబ్లే చావుదెబ్బ కొట్టాడు. పది వికెట్లు తానే తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. తొలుత ఓపెనర్ షాహిద్ ఆఫ్రిదితో మొదలుపెట్టిన కుంబ్లే.. అందరినీ తానే పెవిలియన్‌కు పంపాడు. ఆ పది మంది వీరే ఆఫ్రిదితో పాటు సయీద్ అన్వర్, ఇయాజ్అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ యూసఫ్, మొయిన్ ఖాన్, సలీం మాలిక్, వసీం అక్రం, ముస్తాక్ అహ్మద్, సక్లెయిన్ ముస్తాక్, వకార్ యూనిస్ వికెట్లు పడగొట్టి.. 10- వికెట్ హాల్ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియా విజయంలో, సిరీస్ సమం కావడంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కుంబ్లే పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం (అక్టోబరు 17) బీసీసీఐ ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసింది. చదవండి: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. పాకిస్తాన్ ఆటగాళ్లకు వైరల్ ఫీవర్! On his birthday, let's relive @anilkumble1074's brilliant 🔟-wicket haul against Pakistan 🎥🔽#TeamIndia pic.twitter.com/BFrxNqLxil — BCCI (@BCCI) October 17, 2023 -
చరిత్ర సృష్టించిన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్(105), శుబ్‌మన్ గిల్ అద్భుత సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్( 72 నాటౌట్), కేఎల్ రాహుల్(52) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత ఇన్నింగ్స్‌లలో ఏకంగా 31 ఫోర్లు, 18 సిక్సర్లు ఉండటం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటరల్లో సీన్ అబాట్(54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు. రవి చంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత.. ఇక తొలి వన్డేలో పెద్దగా అకట్టుకోపోయిన భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. రెండో వన్డేలో మాత్రం అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో ఆశూ సత్తాచాటాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్.. 41 పరుగులిచ్చి 3వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అశ్విన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఓ ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక అంతర్జాతీయ వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఆసీస్‌పై అశ్విన్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలపి 144 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే కూడా కంగారూలపైనే ఈ ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియాపై 142 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. అశ్విన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. కుంబ్లే తర్వాత భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(141) ఉన్నాడు. చదవండి: IND VS AUS 2nd ODI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. అరుదైన రికార్డుకు చేరువలో అశ్విన్!
మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30లకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్ వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా జరగనుంది. అయితే తొలి రెండు వన్డేలకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సెలక్టర్లు అనుహ్యంగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ మరో మూడు వికెట్లు పడగొడితే.. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్ల్లో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(142 వికెట్లు) పేరిట ఉంది. అశ్విన్ 140 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్ధానంలో ఉన్నాడు. తుది జట్లు (అంచనా).. భారత్: ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, మహ్మద్ షమీ, సిరాజ్, బుమ్రా ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, అలెక్స్ కేరీ, గ్రీన్, మార్కస్ స్టాయినిస్, ప్యాట్ కమిన్స్, స్పెన్సర్ జాన్సన్, అడమ్ జంపా, హేజిల్‌వుడ్ చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే? -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్ ప్రశ్న.. జవాబుకు 12 లక్షల 50 వేలు
నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ప్రముఖ టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్న భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేకు సంబంధించింది. ఈ ప్రశ్న నిన్న (సెప్టెంబర్ 19) ప్రసారమైన ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఎదుర్కొన్నాడు. ప్రశ్న ఏమిటంటే..? భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు (పాక్‌పై) తీసినప్పుడు బౌలర్ ఎండ్‌లో ఉన్న అంపైర్ ఎవరు..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా పిలూ రిపోర్టర్, ఎస్ వెంకట్రాఘవన్, డేవిడ్ షెపర్డ్, ఏవీ జయప్రకాశ్ పేర్లు ఇచ్చారు. 12 లక్షల 50 వేల రూపాయల ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. #OnThisDay in 1999, #TeamIndia spin legend @anilkumble1074 became the first Indian bowler and second overall to scalp all the 10 wickets in a Test innings. 👏👏 Watch that fantastic bowling display 🎥👇 pic.twitter.com/OvanaqP4nU — BCCI (@BCCI) February 7, 2021 కాగా, 1999 ఫిబ్రవరిలో పాక్‌తో జరిగిన ఢిల్లీ టెస్ట్‌లో కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీశాడు. యాదృచ్చికంగా ఆ 10 మంది ఔటైన సమయంలో బౌలర్ ఎండ్‌లో ఏవీ జయప్రకాశ్ అంపైర్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్‌ను టీమిండియా 212 పరుగుల తేడాతో గెలుపొంది, 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకుంది. టెస్ట్‌ల్లో కుంబ్లే కాకుండా మరో ఇద్దరు మాత్రమే ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు పడగొట్టారు. కుంబ్లేకు ముందు జిమ్ లేకర్ (ఇంగ్లండ్), ఇటీవలికాలంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ ఈ ఘనత సాధించారు. ఇదిలా ఉంటే, కుంబ్లే భారత తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా కెరీర్‌ను ముగించిన విషయం తెలిసిందే. అతను భారత్ తరఫున 132 టెస్ట్‌లు ఆడి 619 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 35 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు. అతనికి ముందు జేమ్స్ ఆండర్సన్ (690), షేన్ వార్న్ (708), ముత్తయ్య మురళీథరన్ (800) మాత్రమే ఉన్నారు. -
కుంబ్లేకు సాధ్యం కాలేదు.. కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర!
Asia Cup 2023- India vs Sri Lanka- Kuldeep Yadav Records: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా సూపర్-4 దశలో తొలుత పాకిస్తాన్‌పై.. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో అదరగొట్టాడు. కొలంబోలో దాయాదితో పోరులో 8 ఓవర్ల బౌలింగ్‌లో ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 25 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఇక మంగళవారం అదే వేదికపై మరోసారి మెరిశాడు కుల్దీప్. టీమిండియా 213 పరుగుల లో స్కోరును కాపాడుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 9.3 ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. లంక టెయిలెండర్ మతీశ పతిరణను బౌల్డ్ చేసి.. టీమిండియా గెలుపును ఖరారు చేశాడు. 150 వికెట్ల క్లబ్లో అత్యంత వేగంగా ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. తద్వారా బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్.. తొలి భారత స్పిన్నర్‌గా చరిత్ర అదే విధంగా.. టీమిండియా దిగ్గజ బౌలర్లు అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్‌లను అధిగమించాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన తొలి భారత స్పిన్నర్‌గానూ కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లేకు సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంకపై 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లో ప్రవేశించింది. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్లు ►మహ్మద్ షమీ- 80 మ్యాచ్‌లలో.. ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో.. ►అజిత్ అగార్కర్- 97 మ్యాచ్‌లలో.. ►జహీర్ ఖాన్- 103 మ్యాచ్‌లలో.. ►అనిల్ కుంబ్లే- 106 మ్యాచ్‌లలో.. ►ఇర్ఫాన్ పఠాన్- 106 మ్యాచ్‌లలో.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల క్లబ్లో చేరిన స్పిన్నర్లు ►సక్లెయిన్ ముస్తాక్- 78 మ్యాచ్‌లలో ►రషీద్ ఖాన్- 80 మ్యాచ్‌లలో ►అజంత మెండిస్- 84 మ్యాచ్‌లలో ►కుల్దీప్ యాదవ్- 88 మ్యాచ్‌లలో ►ఇమ్రాన్ తాహిర్- 89 మ్యాచ్‌లలో. చదవండి: Ind Vs SL: ప్రతి బంతికి వికెట్ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్ Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్ As 'KUL' as it gets! 🧊@imkuldeep18 continues his sensational form as he rips one through the batter, while @klrahul pulls off a sharp stumping. 💥 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/NZccClhhRW — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
అరుదైన రికార్డు ముంగిట జడ్డూ! అదే జరిగితే కపిల్‌ను వెనక్కి నెట్టి.. ఏకంగా
Ravindra Jadeja Eyes On Kapil Dev Record: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన సాధించే అవకాశం ఉంది. బార్బడోస్‌లో జడ్డూ గనుక మూడు వికెట్లు పడగొడితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. కాగా టెస్టు సిరీస్‌తో వెస్టిండీస్ పర్యటన ఆరంభించిన భారత జట్టు.. 1-0తో ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అరుదైన ఘనతకు మూడడుగుల దూరంలో ఈ క్రమంలో గురువారం (జూలై 27) నుంచి వన్డే సిరీస్ ఆరంభించనుంది. బార్బడోస్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలకంగా మారిన జడ్డూకు తుది జట్టులో చోటు దక్కడం లాంఛనమే. కుంబ్లేతో సంయుక్తంగా ఈ క్రమంలో అతడు అరుదైన ముంగిట నిలిచాడు. అదేంటంటే.. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై కపిల్ దేవ్ 43 వికెట్లు తీశాడు. తద్వారా ఇప్పటి వరకు విండీస్‌తో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 41 వికెట్లతో అనిల్ కుంబ్లేతో కలిసి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఒకవేళ తాజా సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో జడ్డూ మూడు వికెట్లు తీశాడంటే.. కపిల్ దేవ్‌ను అధిగమించడం ఖాయం. ప్రస్తుతం జడ్డూ ఫామ్ చూస్తుంటే ఇదేమీ కష్టంకాదనిపిస్తోంది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. జూలై 27, 29 నాటి మ్యాచ్‌లు బార్బడోస్‌లో జరుగనున్నాయి. ఆగష్టు 1 నాటి ఆఖరి వన్డేకు ట్రినిడాడ్ వేదిక కానుంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్. చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే! రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా..