కుంబ్లేకు మాజీ కెప్టెన్ మద్దతు | Mohammad Azharuddin supports anil kumble decision | Sakshi
Sakshi News home page

కుంబ్లేకు మాజీ కెప్టెన్ మద్దతు

Published Fri, Aug 11 2017 1:02 PM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM

కుంబ్లేకు మాజీ కెప్టెన్ మద్దతు

కుంబ్లేకు మాజీ కెప్టెన్ మద్దతు

న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగిన అనిల్ కుంబ్లేకు భారత మాజీ కెప్టెన్ మొహ్మద్ అజహరుద్దీన్ మద్దతుగా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి గుడ్ బై చెప్పి కుంబ్లే సరైన నిర్ణయం తీసుకున్నాడని అజహర్ అభిప్రాయపడ్డాడు. ఈ పదవి నుంచి కుంబ్లే అర్థాంతరంగా వైదొలగడానికి అతను ఆత్మభిమానాన్ని చంపుకుని పని చేయడం ఇష్టలేకపోవడమే ప్రధాన కారణం కావొచ్చన్నాడు. ఇక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వైఖరిని పరోక్షంగా అజహర్ తప్పుబట్టాడు.

'అనిల్ కుంబ్లే ఆత్మాభిమానం చంపుకోకుండా పదవి నుంచి వైదొలిగాడు. కుంబ్లే అలా తప్పుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఉన్నతమైన వ్యక్తిత్వం కల్గిన అతనికి ఈ విధంగా జరిగి ఉండకూడదు. కుంబ్లేది ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. బహుశా.. ఆత్మాభిమానం వదులుకోవడం కంటే కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడమే మంచిదని కుంబ్లే భావించి ఉంటాడు. ఏది ఏమైనా కుంబ్లే తీసుకున్న నిర్ణయం సరైనదే'అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement