Ind vs Aus: R Ashwin becomes fastest India bowler to pick 450 Test wickets - Sakshi
Sakshi News home page

IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్‌..18 ఏళ్ల కుంబ్లే రికార్డు బద్దలు

Published Thu, Feb 9 2023 2:37 PM | Last Updated on Thu, Feb 9 2023 3:16 PM

R Ashwin becomes fastest India bowler to pick 450 Test wickets - Sakshi

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో 450 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో అలెక్స్‌ క్యారీని ఔట్‌ చేసిన అశ్విన్‌.. ఈ ఘనత సాధించాడు. ఇక 450 టెస్టు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.

అశ్విన్‌ సాధించిన రికార్డులు ఇవే
టెస్టుల్లో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు. 89 టెస్టు మ్యాచ్‌లోనే అశ్విన్‌ ఈ ఘనతను సాధించాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే పేరిట ఉండేది.

కుంబ్లే 93 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును సాధించాడు. 2005లో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో కుంబ్లే తన 450వ వికెట్‌ను పడగొట్టాడు. ఇక తాజా మ్యాచ్‌తో 18 ఏళ్ల కుంబ్లే రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు. 

 ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్(80 మ్యాచ్‌లు) ఉన్నాడు.

 ఇక ఓ‍వరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో 450 వికెట్ల మైలురాయిని చేరుకున్న 9వ బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు.

► బంతుల పరంగా ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. తొలి స్థానంలో ఆస్ట్రేలియా గ్రేట్‌ మెక్‌గ్రాత్(23635) ఉండగా.. అశ్విన్‌(23474) రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండిIND vs AUS: వారెవ్వా భరత్‌.. ధోనిని గుర్తుచేశాలా స్టంపౌట్‌! వీడియో వైరల్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement