మొహాలీ వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శుక్రవారం మధ్యాహ్నం 1:30లకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్ వరల్డ్‌కప్ సన్నాహకాల్లో భాగంగా జరగనుంది.
అయితే తొలి రెండు వన్డేలకు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సెలక్టర్లు అనుహ్యంగా పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ మరో మూడు వికెట్లు పడగొడితే.. ఆసీస్‌పై అన్ని ఫార్మాట్‌ల్లో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(142 వికెట్లు) పేరిట ఉంది. అశ్విన్ 140 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్ధానంలో ఉన్నాడు.
తుది జట్లు (అంచనా)..
భారత్: ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, మహ్మద్ షమీ, సిరాజ్, బుమ్రా
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, అలెక్స్ కేరీ, గ్రీన్, మార్కస్ స్టాయినిస్, ప్యాట్ కమిన్స్, స్పెన్సర్ జాన్సన్, అడమ్ జంపా, హేజిల్‌వుడ్
చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment