Ashwin's legacy grows as he rockets past Anil Kumble's record - Sakshi
Sakshi News home page

IND vs AUS: చరిత్ర సృష్టించిన అశ్విన్‌.. తొలి భారత బౌలర్‌గా! దరిదాపుల్లో ఎవరూ లేరు

Published Fri, Mar 10 2023 4:35 PM | Last Updated on Fri, Mar 10 2023 4:51 PM

Ravichandran Ashwins legacy grows as he rockets past Anil Kumbles record - Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియాతో జరగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(180), కామెరాన్ గ్రీన్(114) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. వారితో పాటు టెయిలాండర్‌ టాడ్‌ మర్ఫీ(41) పరుగులతో ఆకట్టుకున్నాడు.

ఇక భారత బౌలర్లలో వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో సారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో అశ్విన్‌ సత్తాచాటాడు. కాగా అతడిపాటు షమీ రెండు వికెట్లు, అక్షర్‌, జడేజా తలా వికెట్‌ సాధించారు.
కుంబ్లే రికార్డు బ్రేక్‌ చేసిన అశ్విన్‌
ఇక  6 వికెట్లతో చెలరేగిన అశ్విన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్‌ సాధించిన బౌలర్‌గా అశూ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే పేరిట ఉండేది.

భారత్‌ గడ్డపై టెస్టుల్లో కుంబ్లే 25 సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో 26వ ఐదు వికెట్‌ హాల్‌ నమోదు చేసిన అశ్విన్‌.. కుంబ్లేను అధిగమించాడు. కాగా అశ్విన్‌ దారిదాపుల్లో కూడా ఏ భారత బౌలర్‌ లేడు.  ఇక ఓవరాల్‌గా అశ్విన్ ఇది అశ్విన్‌కు 32వ ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. అదే విధంగా మరో అరుదైన రికార్డును కూడా అశ్విన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్‌(113) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో అనిల్‌ కుంబ్లే(111) రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేశాడు.  వీరిద్దరూ మినహా మరే భారత బౌలర్ ఈ జట్టుపై 100 వికెట్లకు మించి తీయలేదు. మరోవైపు  బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌(113) రికార్డును అశ్విన్‌ సమం చేశాడు.
చదవండిInd Vs Aus: కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు! రోహిత్‌ సారథ్యంలో 24 గంటల్లోనే రెండుసార్లు! ఇంత ఘోరమా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement