
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ సెమీస్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక సూచన చేశాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశమివ్వాలని అశ్విన్ సూచించాడు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తన కెరీర్‌లో రెండో వన్డే ఆడిన వరుణ్.. 5 వికెట్లు పడగొట్టి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు.
"ట్రావిస్ హెడ్‌ను అడ్డుకోవాలంటే పవర్‌ప్లేలో బౌలింగ్ వరుణ్ చక్రవర్తితో చేయించాలి. హెడ్‌కు స్టంప్స్ దిశగా బౌలింగ్ చేయమని వరుణ్‌కు చెప్పండి. అప్పుడు హెడ్ స్టంప్స్‌ను విడిచిపెట్టి ఓవర్ ది ఫీల్డ్ షాట్ ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి స్టంప్స్‌ను తాకే అవకాశముంది.
అంతేకాకుండా బౌలింగ్ తగ్గట్టు ఫీల్డ్ సెట్ చేస్తే హెడ్ దొరికిపోయే ఛాన్స్ ఉంది. వరుణ్ చక్రవర్తి కొత్త బంతితో భారత్‌కు మంచి అరంభాన్ని అందించగలడు. వరుణ్ బౌలింగ్‌లో హెడ్ నెమ్మదిగా ఆడుతాడని నేను అనుకోను. అతడు కచ్చితంగా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు.
వరుణ్ బౌలింగ్‌లో షాట్లు ఆడటం అంత సులువు కాదు. కాబట్టి వరుణ్ బౌలింగ్‌లో హెడ్ ఔటయ్యే అవకాశముంది. ఏదేమైనప్పటికి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి,
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ ద్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్
చదవండి: మాపై ఒత్తడి లేదు.. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే: శ్రేయస్ అయ్యర్
Comments
Please login to add a commentAdd a comment