స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెలక్టర్లు అనుహ్యంగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 20 నెలల తర్వాత తొలిసారి వన్డే జట్టులో అశ్విన్ చోటు దక్కించుకున్నాడు. అశ్విన్ ఎంపిక చేస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గాయంతో బాధపడుతున్న అక్షర్ పటేల్ స్ధానంలో అశ్విన్ వరల్డ్‌కప్ జట్టులోకి కూడా వస్తాడని చాలా మంది అభిప్రాయపడతున్నారు.
తాజగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. సెలక్టర్లు, మేనెజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని పఠాన్ తప్పుబట్టాడు. "ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.
అతడు చాలా కాలంగా వన్డే ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. సీనియర్ ప్లేయర్ అయినంత మాత్రాన నేరుగా వచ్చేసి ఈ ఫార్మాట్‌లో సాధారణంగా ఆడేస్తాడని భావించడం సరికాదు. సరైన ప్లానింగ్‌తో అతడిని ఎంపిక చేయలేదు. అతడు మీ వరల్డ్‌కప్ ప్రణాళికలలో ఉండి ఉంటే ముందే అవకాశం ఇవ్వాల్సింది.
ఆసీస్‌తో ఆడినంత మాత్రన సరిపోతుందా? పది ఓవర్ల బౌలింగ్ వేయించాలి. అలాగే ఫలితం భారత్‌కు అనుకూలంగా రావాలి. ఇది అంత సులభం కాదు. ప్లానింగ్ మెరుగ్గా ఉండాలి" అంటూ ఇర్ఫాన్ స్టార్‌స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.
చదవండి: #Mohammed Shami: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్ షమీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు
Comments
Please login to add a commentAdd a comment